'ప్రతీ ఇంట్లో ఎదుర్కునే సమస్యలలో వంట గది ఒకటి. వంట గది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యమంటారు. అయితే వంట ఇంటిని అందంగా, హెల్దీగా ఉంచుకోవడం అంత ఈజీకాదు. ఇందుకోసం చాలామంది మహిళలు తెగ ఖంగారుపడుతూ ఉంటారు కూడా. అయితే 24 గంటలూ కిచెన్ అద్దంలా మెరుస్తూ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..'
ముఖ్యంగా తిండి పదార్థాలతో పాటు కొన్ని రకాలైన స్టీల్ బౌల్స్ కూడా తుప్పు పడుతూంటాయి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికిగా మారటం. మరో ప్రధాన సమస్య బల్లులతో పంతం పట్టడం.., లేదంటే దూరంగా పారిపోవటంలాంటిది చేస్తుంటారు.' మరి ఇలాంటి సమస్యలను తేలికగా దూరం చేయడానికి ఈ టిప్స్‌ని ఉపయోగించండి.
- స్టీల్ పాత్రలు వెలిసిపోయి పాతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్‌ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీల్ పాత్రకు రాసి టూత్ బ్రష్‌తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి అంతా పోయి కొత్తవాటిలా కనిపిస్తాయి.
- డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్‌పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది.
- మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలను సమపాళల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్‌ల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment