kitchen rooms
-
వావ్ కిచెన్..
- అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు - బ్రాండ్స్‌కి పెరుగుతున్న ప్రాధాన్యత - జర్మన్, కొరియా, ఇటలీ, ఇండియన్ మాడ్యుల్స్ పట్ల ఆసక్తి - సెన్సార్ వైపు వినియోగదారుల ఆసక్తి పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు.. ఇప్పుడు వంట గది విషయంలోనూ ఇదే తరహా ఒరవడి నడుస్తోంది. అత్యాధునిక కిచెన్ మాడ్యుల్స్ కోసం రూ.లక్షలు వెచి్చస్తున్నారు. లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు, అపార్ట్మెంట్, గ్రూప్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్.. ఎలాంటి ఇల్లైనా... అందులో ఏర్పాటు చేసే కిచెన్ విషయంలో కొనుగోలుదారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటి కంటే అత్యాధునిక సదుపాయాలున్న కిచెన్ కావాలి. అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలి. బ్రాండ్ విషయంలో అసలే రాజీ పడొద్దు. విశాలమైన గదికి ఇంద్రభవనం లాంటి అలంకరణ తోడవ్వాలి. అందుకోసం ఎల్లలు దాటి మాడ్యుల్స్‌ను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఇటలీ, జర్మనీ, కొరియా, ఇండియన్ మేడ్ కిచెన్ మాడ్యుల్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సౌకర్యాలు, సదుపాయాల విషయంలో వినియోగదారుల ఆలోచనా విధానం మారుతోంది. ఇంటి నిర్మాణంతో మొదలై.. కిచెన్ వరకూ ప్రతిదీ కొత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా చూస్తున్నారు. దీని కోసం ఎంత ఖరీదైనా చెల్లించేందుకు వెనుకాడటంలేదు. ముఖ్యంగా కిచెన్‌లో అల్మరాలు, చిమ్నీల విషయంలో సరికొత్తవే ఎంచుకుంటున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా కొనుగోలదారుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఖర్చుకు వెనుకాడం.. నగరం నలుదిక్కుల నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. సాధారణంగా అపార్ట్మెంట్లో 3 పడక గదుల ఇల్లు రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటోంది. అదే సమయంలో విల్లాలు రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ పలుకుతున్నాయి. అంత మొత్తం వెచి్చంచి ఇల్లు కొనుగోలు చేసిన యజమానులు ఇంటీరియర్ డెకరేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులోనూ కిచెన్ విషయంలో మరింత ఆధునికత కోరుకుంటున్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా అడుగులేస్తున్నారు. మాడ్యులర్ కిచెన్ విషయంలో ఆర్కిటెక్ట్‌లను సంప్రదిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయో ఇంటర్నెట్లో వెతుకుతు న్నారు. ప్రధానంగా ఇటలీ, కొరియన్, జర్మన్, భారతదేశంలో తయారయ్యే మోడల్స్ పట్ల వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రధాన బ్రాండెడ్ కిచెన్లకు డిమాండ్ ఏర్పడింది. ఒక్కో కిచెన్ గదిని ఆధునికీకరించడానికి రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో నిర్మాణ సంస్థలు నివాస సముదాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం తమ కార్యకలాపాలను నడిపిస్తున్నాయి. విల్లా, అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ ఇలా ఏదైనా నిర్మా ణ ప్రాంతాన్ని బట్టి, సంస్థకున్న గుర్తింపు, వినియోగదారులకు ఇస్తున్న వసతులు, మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలు నిర్ణయిస్తున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే కిచెన్‌కు ప్రత్యేక ఆకృతిని తెస్తున్నారు. డిజైన్, లుక్, టెక్నాలజీ.. ఇన్నాళ్లు హాల్, పడక గదికి మాత్రమే ప్రత్యేక అలంకరణలు చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. వంట గదిలో అత్యాధునిక డిజైన్లు కోరుకుంటున్నారు. కిచెన్ చూడగానే అదిరిపోయే అనుభూతి కావాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో అద్భుతమైన టెక్నాలజీతో మాడ్యులర్ కిచెన్ తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్‌లను ఆశ్రయిస్తున్నారు.సెన్సార్ సిస్టం..కిచెన్ గదిలోకి వ్యక్తి అడుగు పెట్టగానే గోడలకున్న సెన్సార్ వ్యవస్థ విద్యుత్తు దీపాలను వెలిగిస్తుంది. గ్యాస్ స్టవ్ దగ్గర సైతం ఇలాంటి వ్యవస్థే అందుబాటులోకి వచి్చంది. గదిలో ఎక్కడా నీటి లీకేజీలు లేకుండా, చెదలు పట్టే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫ్రీ మెయింటెనెన్స్ కోసం గ్రనైట్ వాడకుండా క్వాడ్జ్, కొరియన్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఫ్రిజ్, మైక్రో ఒవెన్, నీటి శుద్ధి యంత్రం, ఇతర వస్తువులు బయటకు కనిపించకుండా ఉడ్ వర్క్ చేయిస్తున్నారు. వంట సమయంలో వచ్చే ఆవిర్లు, పొగను బయటకు పంపే చిమ్నీలు, గ్యాస్ స్టవ్ వద్ద పొగ రాకుండా కింది భాగంలోనే ఏర్పాటు చేసే మైక్రో ఫ్యాన్లు, వంట, తినేందుకు ఉపయోగించే సామాన్లు భద్రపరచుకోవడానికి ర్యాక్‌లు, బియ్యం, పప్పులు, ఉప్పులు, ఇతర ఆహార వస్తువులు నిల్వ చేసుకోవడానికి విడివిడిగా ప్రత్యేక గ్యాలరీల కోసం ప్రత్యేకంగా జర్మన్ టెక్నాలజీ హార్డ్‌వేర్ వాడుతున్నారు.ఐలాండ్ కిచెన్ ఎంపిక చేసుకున్నాం బిల్డర్ ఇల్లు అప్పగించిన తరువాత కిచెన్ కోసం ప్రత్యేకంగా రూ.8 లక్షలు వెచి్చంచాను. ఐలాండ్ కిచెన్ కావాలని పెట్టించుకున్నాం. అక్రిలిక్ ఫినిష్ మెటీరియల్, చిమ్ని జర్మన్ హార్డ్‌వేర్ వినియోగించాం. ఆర్కిటెక్ట్ సూచించిన డిజైన్, ఫంక్షనాలిటీ నచ్చింది. – అఖిల్, సాన్సియా విల్లాస్ఇంపోర్టెడ్పై ఆసక్తి ఇల్లు కొనుగోలు చేసే వ్యక్తి కిచెన్ మోడ్రన్‌గా ఉండాలని ఆలోచిస్తున్నారు. మార్కెట్లో కొత్త మోడల్స్‌ను కోరుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి మోడల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఖర్చు కోసం ఎవరూ వెనుకాడటం లేదు. మోడల్ నచ్చితే చాలని అంటున్నారు. వారి అభిరుచికి అనువైన మోడల్స్ కోరుతున్నారు. – రాకేష్ వర్మ, మికాసా, ఇంటీరియర్స్, ఆర్కిటెక్ట్స్, మాదాపూర్. -
కిచెన్‌లో తుప్పు సమస్యలతో ఇబ్బందా? ఇలా ట్రై చేయండి..
'ప్రతీ ఇంట్లో ఎదుర్కునే సమస్యలలో వంట గది ఒకటి. వంట గది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యమంటారు. అయితే వంట ఇంటిని అందంగా, హెల్దీగా ఉంచుకోవడం అంత ఈజీకాదు. ఇందుకోసం చాలామంది మహిళలు తెగ ఖంగారుపడుతూ ఉంటారు కూడా. అయితే 24 గంటలూ కిచెన్ అద్దంలా మెరుస్తూ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..' ముఖ్యంగా తిండి పదార్థాలతో పాటు కొన్ని రకాలైన స్టీల్ బౌల్స్ కూడా తుప్పు పడుతూంటాయి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికిగా మారటం. మరో ప్రధాన సమస్య బల్లులతో పంతం పట్టడం.., లేదంటే దూరంగా పారిపోవటంలాంటిది చేస్తుంటారు.' మరి ఇలాంటి సమస్యలను తేలికగా దూరం చేయడానికి ఈ టిప్స్‌ని ఉపయోగించండి. స్టీల్ పాత్రలు వెలిసిపోయి పాతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్‌ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీల్ పాత్రకు రాసి టూత్ బ్రష్‌తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి అంతా పోయి కొత్తవాటిలా కనిపిస్తాయి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్‌పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలను సమపాళల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్ల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. ఇవి చదవండి: ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్! -
కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి
సాక్షి, హైదరాబాద్: కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదనే అక్కసుతో భార్యపై భర్త దాడి చేసిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. హిమాయత్‌నగర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో నివాసం ఉండే వినయ్ తన భార్య సీతల్ ఆగర్వాల్ కిచెన్‌రూమ్ తాళం చెవి ఇవ్వాలని అడిగాడు. ఆమె తాళం చెవి ఇవ్వకపోవడంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో సమీపంలో ఉన్న కత్తెరతో సీతల్‌పై దాడి చేస్తుండగా ఇంట్లోనే ఉన్న కుమార్తె అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన తల్లి, కుమార్తె స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అకారణంగా తమపై దాడికి పాల్పడిన తన భర్త వినయ్‌పై చర్యలు తీసుకోవాలని సీతల్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
వర్షంతో ‘మధ్యాహ్న’ కలుషితం
వికారాబాద్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక మధ్యాహ్న భోజనం కలుషితమవుతోంది. జిల్లాలోని సగానికిపైగా పాఠశాలల్లో వంట గదుల్లేవు. ఉన్న చోట ఇరుకుగా ఉండటంతో ఎజెన్సీలు ఆరుబయటే వంట చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో చాలా పాఠశాలల్లో రేకులతో చిన్న షెడ్లు వేసుకుని వంటలు చేస్తున్నారు. కొన్ని చోట్ల చెట్ల కింద, ఆరుబయటనే వంటలు చేస్తున్నారు. దీంతో వర్షపునీరు వంటల్లో పడి కలుషితమవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. తరుచుగా ఇదే రకమైన ఆహారాన్ని ఏజెన్సీలు పెడుతుండడంతో విద్యార్థులు అనారోగ్యంబారినపడే అవకాశం ఉంది. వంట గదులు లేక పోవడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు కలుషిత ఆహారమే దిక్కవుతోంది. జిల్లాలో 778 ప్రాథమిక, 192 ప్రాథమికోన్నత, 290 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 96 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తోంది. జిల్లాలో సుమారు 1,330 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తున్నాయి.గతేడాది నుంచి అక్షయ పాత్ర సంస్థ మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తుండడంతో 262 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండడం మానేశారు. ఆరు బయట వంట.. జిల్లా వ్యాప్తంగా 140 పాఠశాలల్లో ఆరుబయటే వంట చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ అధికారులు జిల్లాలో సుమారు 140 పాఠశాలల్లో తక్షణం వంట గదులు నిర్మించేందుకు గతేడాది ప్రతిపాదనలు పెట్టారు. అయితే ఈ గదుల నిర్మాణానికి మాత్రం ఈజీఎస్నుంచి నిధులు మంజూరు చేస్తుందని, పనుల బాధ్యత కూడా ఆ సంస్థే చూస్తోందని ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ అధికారులు చూపించిన 140 పాఠశాలల్లో వంట గదులు నిర్మించేందుకు ముందుకొచ్చిన ఈజీఎస్ 300 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న చోట రూ.2లక్షలు, 300 మంది విద్యార్థులు దాటిన చోట రూ.2.5లక్షలు కేటాయించింది. ఈ మేరకు గత సంవత్సరం జూన్ మొదటి వారంలోనే సుమారు 140 పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం పనులు చేట్టింది. కాని ఇప్పటివరకు కేవలం 3 వంట గదుల నిర్మా ణం పనులే వందశాతం పూర్తైత ఉపయోగంలోకి వచ్చాయి. 118 వంట గదుల నిర్మాణం పనులు ఆయా దశల్లో కొనసాగుతున్నాయి. ఈజీఎస్‌లో చేపట్టే పనులకు సకాలంలో డబ్బులు రావనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదు. ఈ కారణంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు రేకుల షెడ్డుల్లో, చెట్ల కింద వంటలు చేస్తున్నారు. మిగతావన్నీ ఇరుకుగదులే జిల్లా వ్యాప్తంగా ఉన్న 1120 వంట గదులు ఇరుకుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గదులు సుమారు పదేళ్ల కిందట నిర్మించినవి కావడంతో గదులు చిన్నగా ఉన్నాయి. దీంతో ఏజెన్సీలు ఈ గదులను ఉపయోగించడం లేదు. ఆగదులకు తలుపులు, కిటికీలు సక్రమంగా లేకపోవడంతో వాటిలో కనీసం సామగ్రి భద్రపర్చేందుకు కూడా ఉపయోగించడంలేదు. కేవలం కట్టెలు, పాత సామగ్రిని దాచిపెడుతున్నారు. ముందుగా గుర్తించిన 140 పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం తరువాత ఇరుకు గదులపై దృష్టి సారించాలని అధికారులు భావించారు. కాని మొదటి విడతనే ముందుకు సాగకపోవడంతో మిగతా వాటి నిర్మాణంపై ఉత్తిదే అనిపిస్తోంది. -
నిధులున్నా.. నిర్లక్ష్యమే!
నారాయణపేట రూరల్ : దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వలేదన్న చందంగా తయారైంది పాఠశాల వంటగది పరిస్థితి. ఒక పక్క సౌకర్యాల కల్పనకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం అనుమతి వచ్చి డబ్బులు మంజూరైనా పనులు చేపట్టడంలేదు. స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేసి ఏడు నెలలు కావొస్తున్నా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉంది. మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా ఉన్న ఎంపీపీ మణెమ్మ స్వగ్రామం అప్పిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 8వ తరగతి వరకు 170మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజనం వండటానికి ప్రత్యేక గదిలేక ఆరుబయటనే ఏజెన్సీ నిర్వహకులు వంటలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దష్టికి తీసుకుని వెళ్లగా గది నిర్మాణానికి రూ.2లక్షల నిధులు మంజూరు చేయించి హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి గది నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పనులు మొదులు కాలేదు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష నాయకులు మేమంటే మేము యేస్తాం అంటూ పోటీ పడటంతో పనులు ప్రారంభం కానట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడి బంధువు, ఎంపీపీ భర్త, ఎస్ఎంసీ చైర్మన్ల మధ్య ఏర్పడిన రాజకీయ విబేధాలతో పనులు కేటాయించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
వంటగదులకు భారీగా నిధులు
నిర్మాణానికి రూ. 1.70 కోట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక: మధ్యాహ్న భోజన కార్మికుల బాధలను తీర్చడానికి వంట గదుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండనక, వాననక ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు చేసే మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు ఇక నుంచి తప్పనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మిరుదొడ్డి, చేగుంట, తొగుట, దౌల్తాబాద్, దుబ్బాక మండలాల్లోని 95 ప్రభుత్వ పాఠశాలలకు రూ. 1.70 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వంటగదుల్లేక ఆరుబయటనే మధ్యాహ్న భోజనాన్ని కార్మికులు విద్యార్థులకు వడ్డించాల్సి వస్తోందన్నారు. మధ్నాహ్న భోజన కార్మికులు పడుతున్న కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోనే వంట గదుల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయించిందన్నారు. దుబ్బాక మండలంలో 11 పాఠశాలలు, మిరుదొడ్డిలో 17, తొగుటలో 29, దౌల్తాబాద్‌లో 13, చేగుంట మండలంలోని 25 పాఠశాలల్లో వంట గదులను నిర్మించడానికి నిధులను కేటాయించిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. వంట గదులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోనే నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఇన్చార్జి మంత్రి తన్నీరు హరీశ్‌రావులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు తౌడ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ర్యాకం శ్రీరాములు, పేరుడి దయాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.