Man Attack On Wife And Daughter With Scissors In Hyderabad, Details Inside - Sakshi
Sakshi News home page

Hyderabad Crime: కిచెన్‌ రూమ్‌ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి

Published Tue, Dec 20 2022 5:03 PM | Last Updated on Tue, Dec 20 2022 7:19 PM

Man Attack On Wife And Daughter With Scissors In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కిచెన్‌ రూమ్‌ తాళం చెవి ఇవ్వలేదనే అక్కసుతో భార్యపై భర్త దాడి చేసిన సంఘటన నారాయణగూడ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. హిమాయత్‌నగర్‌ రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ సమీపంలో నివాసం ఉండే వినయ్‌ తన భార్య సీతల్‌ ఆగర్వాల్‌ కిచెన్‌రూమ్‌ తాళం చెవి ఇవ్వాలని అడిగాడు. ఆమె తాళం చెవి ఇవ్వకపోవడంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

క్షణికావేశంలో సమీపంలో ఉన్న కత్తెరతో సీతల్‌పై దాడి చేస్తుండగా ఇంట్లోనే ఉన్న కుమార్తె అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై సైతం దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన తల్లి, కుమార్తె స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అకారణంగా తమపై దాడికి పాల్పడిన తన భర్త వినయ్‌పై చర్యలు తీసుకోవాలని సీతల్‌ అగర్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్‌ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement