వావ్‌ కిచెన్‌.. | modular kitchen designs india | Sakshi
Sakshi News home page

వావ్‌ కిచెన్‌..

Published Tue, Jun 18 2024 7:42 AM | Last Updated on Tue, Jun 18 2024 7:42 AM

modular kitchen designs india

- అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు 
- బ్రాండ్స్‌కి పెరుగుతున్న ప్రాధాన్యత 
- జర్మన్, కొరియా, ఇటలీ, ఇండియన్‌ మాడ్యుల్స్‌ పట్ల ఆసక్తి 
- సెన్సార్‌ వైపు వినియోగదారుల ఆసక్తి 

పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు.. ఇప్పుడు వంట గది విషయంలోనూ ఇదే తరహా ఒరవడి నడుస్తోంది. అత్యాధునిక కిచెన్‌ మాడ్యుల్స్‌ కోసం రూ.లక్షలు వెచి్చస్తున్నారు. లగ్జరీ విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలో ఇళ్లు, అపార్ట్‌మెంట్, గ్రూప్‌ హౌస్, ఇండిపెండెంట్‌ హౌస్‌.. ఎలాంటి ఇల్లైనా... అందులో ఏర్పాటు చేసే కిచెన్‌ విషయంలో కొనుగోలుదారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నవాటి కంటే అత్యాధునిక సదుపాయాలున్న కిచెన్‌ కావాలి. అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలి. బ్రాండ్‌ విషయంలో అసలే రాజీ పడొద్దు. విశాలమైన గదికి ఇంద్రభవనం లాంటి అలంకరణ తోడవ్వాలి. అందుకోసం ఎల్లలు దాటి మాడ్యుల్స్‌ను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఇటలీ, జర్మనీ, కొరియా, ఇండియన్‌ మేడ్‌ కిచెన్‌ మాడ్యుల్స్‌ పట్ల ఆకర్షితులవుతున్నారు.

  సౌకర్యాలు, సదుపాయాల విషయంలో వినియోగదారుల ఆలోచనా విధానం మారుతోంది. ఇంటి నిర్మాణంతో మొదలై.. కిచెన్‌ వరకూ ప్రతిదీ కొత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా చూస్తున్నారు. దీని కోసం ఎంత ఖరీదైనా చెల్లించేందుకు వెనుకాడటంలేదు. ముఖ్యంగా కిచెన్‌లో అల్మరాలు, చిమ్నీల విషయంలో సరికొత్తవే ఎంచుకుంటున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా కొనుగోలదారుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. 
 
ఖర్చుకు వెనుకాడం.. 
నగరం నలుదిక్కుల నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. సాధారణంగా అపార్ట్‌మెంట్‌లో 3 పడక గదుల ఇల్లు రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటోంది. అదే సమయంలో విల్లాలు రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ పలుకుతున్నాయి. అంత మొత్తం వెచి్చంచి ఇల్లు కొనుగోలు చేసిన యజమానులు ఇంటీరియర్‌ డెకరేషన్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులోనూ కిచెన్‌ విషయంలో మరింత ఆధునికత కోరుకుంటున్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా అడుగులేస్తున్నారు. 

మాడ్యులర్‌ కిచెన్‌ విషయంలో ఆర్కిటెక్ట్‌లను సంప్రదిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇంటర్నెట్‌లో వెతుకుతు న్నారు. ప్రధానంగా ఇటలీ, కొరియన్, జర్మన్, భారతదేశంలో తయారయ్యే మోడల్స్‌ పట్ల వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రధాన బ్రాండెడ్‌ కిచెన్‌లకు డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో కిచెన్‌ గదిని ఆధునికీకరించడానికి రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. 

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో నిర్మాణ సంస్థలు నివాస సముదాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం తమ కార్యకలాపాలను నడిపిస్తున్నాయి. విల్లా, అపార్ట్‌మెంట్, ఇండిపెండెంట్‌ హౌస్‌ ఇలా ఏదైనా నిర్మా ణ ప్రాంతాన్ని బట్టి, సంస్థకున్న గుర్తింపు, వినియోగదారులకు ఇస్తున్న వసతులు, మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలు నిర్ణయిస్తున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే కిచెన్‌కు ప్రత్యేక ఆకృతిని తెస్తున్నారు. 

డిజైన్, లుక్, టెక్నాలజీ.. 
ఇన్నాళ్లు హాల్, పడక గదికి మాత్రమే ప్రత్యేక అలంకరణలు చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. వంట గదిలో అత్యాధునిక డిజైన్లు కోరుకుంటున్నారు. కిచెన్‌ చూడగానే అదిరిపోయే అనుభూతి కావాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో అద్భుతమైన టెక్నాలజీతో మాడ్యులర్‌ కిచెన్‌ తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్‌లను ఆశ్రయిస్తున్నారు.

సెన్సార్‌ సిస్టం..
కిచెన్‌ గదిలోకి వ్యక్తి అడుగు పెట్టగానే గోడలకున్న సెన్సార్‌ వ్యవస్థ విద్యుత్తు దీపాలను వెలిగిస్తుంది. గ్యాస్‌ స్టవ్‌ దగ్గర సైతం ఇలాంటి వ్యవస్థే అందుబాటులోకి వచి్చంది. గదిలో ఎక్కడా నీటి లీకేజీలు లేకుండా, చెదలు పట్టే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫ్రీ మెయింటెనెన్స్‌ కోసం గ్రనైట్‌ వాడకుండా క్వాడ్జ్, కొరియన్‌ మెటీరియల్స్‌ వినియోగిస్తున్నారు. ఫ్రిజ్, మైక్రో ఒవెన్, నీటి శుద్ధి యంత్రం, ఇతర వస్తువులు బయటకు కనిపించకుండా ఉడ్‌ వర్క్‌ చేయిస్తున్నారు. వంట సమయంలో వచ్చే ఆవిర్లు, పొగను బయటకు పంపే చిమ్నీలు, గ్యాస్‌ స్టవ్‌ వద్ద పొగ రాకుండా కింది భాగంలోనే ఏర్పాటు చేసే మైక్రో ఫ్యాన్లు, వంట, తినేందుకు ఉపయోగించే సామాన్లు భద్రపరచుకోవడానికి ర్యాక్‌లు, బియ్యం, పప్పులు, ఉప్పులు, ఇతర ఆహార వస్తువులు నిల్వ చేసుకోవడానికి విడివిడిగా ప్రత్యేక గ్యాలరీల కోసం ప్రత్యేకంగా జర్మన్‌ టెక్నాలజీ హార్డ్‌వేర్‌ వాడుతున్నారు.

ఐలాండ్‌ కిచెన్‌ ఎంపిక చేసుకున్నాం 
బిల్డర్‌ ఇల్లు అప్పగించిన తరువాత కిచెన్‌ కోసం ప్రత్యేకంగా రూ.8 లక్షలు వెచి్చంచాను. ఐలాండ్‌ కిచెన్‌ కావాలని పెట్టించుకున్నాం. అక్రిలిక్‌ ఫినిష్‌ మెటీరియల్, చిమ్ని జర్మన్‌ హార్డ్‌వేర్‌ వినియోగించాం. ఆర్కిటెక్ట్‌ సూచించిన డిజైన్, ఫంక్షనాలిటీ నచ్చింది. 
– అఖిల్, సాన్సియా విల్లాస్‌

ఇంపోర్టెడ్‌పై ఆసక్తి 
ఇల్లు కొనుగోలు చేసే వ్యక్తి కిచెన్‌ మోడ్రన్‌గా ఉండాలని ఆలోచిస్తున్నారు. మార్కెట్‌లో కొత్త మోడల్స్‌ను కోరుకుంటున్నారు. ఇతర దేశాల         నుంచి మోడల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఖర్చు కోసం ఎవరూ వెనుకాడటం లేదు. మోడల్‌ నచ్చితే చాలని అంటున్నారు. వారి అభిరుచికి అనువైన మోడల్స్‌  కోరుతున్నారు.  
– రాకేష్‌ వర్మ, మికాసా, ఇంటీరియర్స్, ఆర్కిటెక్ట్స్, మాదాపూర్‌.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement