Intips
-
ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్మ్యాట్ని మారుస్తుండాలి. అందుబాటులో ఉంచుకోవడం..– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.బూజు దులపటం..– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.– ముఖ్యంగా బాత్రూమ్లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.సీలింగ్ ΄్యాన్స్..– సీలింగ్ ΄్యాన్లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్‌పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్‌ను మొదట శుభ్రం చేయాలి. కంప్యూటర్..– కంప్యూటర్, లాప్టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.టీవీ..– టీవీ స్క్రీన్‌ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.అద్దాలు..– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.పక్కబట్టలు మడతపెట్టడం..– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్‌షీట్‌ను నీట్‌గా సర్దాలి.దుస్తుల శుభ్రం..– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.చెత్తను వదిలించుకోవడం..– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.నిద్రించే ముందే..– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.పరిసరాల పరిశుభ్రత..మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా? -
కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!
కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.2. ఒక టేబుల్ స్పూన్ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.6. రూటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.7. ఇది బూడిద తెగులును అరికడుతుంది. గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందంఇవి చదవండి: ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే! -
కిచెన్‌లోని ఈ వస్తువులతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
ఇంట్లో ఉన్నటువంటి వస్తువులుగానీ, తిను పదార్థాలు గానీ చాలారోజులు నిలువలేకుండా పాడవుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోతుంది. కానీ మనకు తెలియకుండానే కొన్నిరకాల టిప్స్‌తో చాలాకాలం మన్నికగా ఉండేట్లు చేయవచ్చు. మరవేంటో చూద్దాం!ఇలా చేయండి..అరకిలో వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. కప్పు సూజీ రవ్వను బాణలిలో వేసి, వేడెక్కిన తరువాత రవ్వలో వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. రవ్వ, వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి దించే యాలి. వెల్లుల్లి ముక్కలను రవ్వ నుంచి వేరుచేసి మిక్సీజార్‌లో వేసి పొడిచేసుకోవాలి. దీనిని పిండి జల్లెడతో జల్లించుకుని మెత్తని పొడిని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఇది ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లి పేస్టుకు బదులు ఈ పొడిని కావాల్సిన కూరల్లో వేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే తరచూ వెల్లుల్లి పొట్టు తీసి దంచే పని ఉండదు.అన్నం కొద్దిగా మాడినా, అడుగున మొత్తం మాడిపోయినా మిగతా అన్నం కూడా మాడు వాసన వస్తుంది. ఆ వాసనకు అన్నం తినబుద్ది కాదు. ఒక ఉల్లిపాయను తీసుకుని నాలుగు ముక్కలుగా తరగాలి. మాడిన అన్నం గిన్నె మధ్యలో నాలుగు ముక్కలను నాలుగు చోట్ల పెట్టి పదిహేను నిమిషాలపాటు మూతపెట్టి ఉంచాలి. పావు గంట తరువాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల మాడు వాసనపోతుంది. అన్నం ఉల్లిపాయ వాసన కూడా రాకుండా చక్కగా ఉంటుంది.ఇంట్లో అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు... తొక్క తీసి కొద్దిగా నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఐస్ ట్రేలో వేసుకుని ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ అల్లం క్యూబ్స్ ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీస్పూను డిష్‌వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లుపోసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములు దరిచేరవు.సాల్ట్ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యం వేసి తరువాత సాల్ట్ వేయాలి. సాల్ట్‌లోని తేమను బియ్యం పీల్చుకుని సాల్ట్‌ను పొడిగా ఉంచుతుంది.ప్లాస్టిక్ రోల్ అతుక్కుని త్వరగా ఊడి రాదు. ఇటువంటప్పుడు అరగంటపాటు రోల్‌ని రిఫ్రిజిరేటర్లో పెట్టి తరువాత ఓపెన్ చేస్తే అతుక్కోకుండా సులభంగా వచ్చేస్తుంది. -
ఇంటిప్స్: కిచెన్‌లో బొద్దింకల సమస్యా?
రోజురోజుకి వంటగది అంటేనే భయంగా మారుతున్న పరిస్థితి అని కొందరు వాపోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం బొద్దింకల బెడద అంటుంటారు. కానీ ఈ బొద్దింకల సమస్యను సులువుగా తొలగించడానకి పరిష్కార మార్గం మనచేతిలోనే ఉన్నదని మీకు తెలుసా! మరవేంటో తెలుసుకుందాం. పరిష్కార మార్గాలు.. కాసిని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి. బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. మూలల్లో బోరిక్ ΄ûడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి. బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇవి చదవండి: హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో? -
ఇంటిప్స్: మురికిని ఇకపై సులభంగా వదిలించండి..
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఇలా చేయండి.. వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లుపోయాలి. మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి. ఇలా పది నిమిషాలు చేసిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధానంలో బాటిల్ కడగడం వల్ల బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి. టీస్పూను వంటసోడా, రెండు టీస్పూన్ల వెనిగర్‌ను బాటిల్లో వేసి మూతపెట్టాలి. ఇరవై నిమిషాల తరువాత బాటిల్‌ను బాగా షేక్ చేసి కడగాలి. ఇలా కడిగిన బాటిల్‌ను మూతతీసి పూర్తిగా ఆరిన తరువాత వాడుకోవాలి. వంటసోడా, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె, ఫ్రైపాన్పై రాసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగి పోతుంది. గోరువెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారు గంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. ఇవి చదవండి: బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు! -
ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి!
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఈ విధానాలు.. కూరలో నీరు ఎక్కువైతే కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత కూడా కూర చిక్కబడదు. అలాంటప్పుడు వేయించిన వేరుశనగపప్పులు పొడి కలిపితే చిక్కదనంతోపాటు రుచి కూడా ఇనుమడిస్తుంది. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఈ చిట్కా మంచి ఫలితాన్నిస్తుంది. బంగాళాదుంపలు వాడిపోయినట్లయితే.. ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని పోసి ఓ అరగంట ఉంచితే తాజాగా మారుతాయి. అల్లంవెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అందులో చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్‌ను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెడితే రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లిపొట్టు త్వరగా వదలాలంటే.. రేకలను ఒక పాత్రలో వేసి కొద్దిగా నూనె వేసి అన్నింటికీ పట్టేటట్లు వేళ్లతో రుద్ది ఇరవై నిమిషాల సేపు ఎండలో పెట్టాలి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టేముందు తొడిమలు ఒలిచి న్యూస్ పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టాలి. మార్కెట్లో కొన్న పనీర్‌ని వండే ముందు పది నిమిషాల సేపు గోరువెచ్చటి నీటిలో నానబెడితే, పనీర్ ముక్కలు మృదువుగా మారుతాయి. ఇవి చదవండి: చెట్టినాడు ఘుమఘుమలు! -
'జంక్ ఫుడ్' ఎంత ప్రమాదకరమో..! మాన్పించాలంటే ఇలా చేయండి!
పీజా, బర్గర్, శాండ్విచ్, కూల్ డ్రింక్స్ లాంటి జంక్ ఫుడ్స్‌కు అలవాటుపడిన పిల్లలు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరు. రోజూ జంక్‌ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఇది పట్టని పిల్లలు అదే కావాలని మొండికేస్తుంటారు. ఇటువంటి వారిని జంక్ఫుడ్ని దూరంగా ఉంచాలంటే ఇలా చేయండి చాలు.. ఇష్టమైనవి వండండి.. జంక్‌ఫుడ్ పూర్తిగా మాన్పించాలంటే.. ముందుగా పిల్లలు బాగా ఇష్టపడే వంటకాలను వండాలి. పిల్లలు ఏది తినడానికి ఆసక్తి చూపుతున్నారో అవి మాత్రమే వారికి చేసిపెట్టాలి. పెద్దలు తినేదే రోజు పెడితే అది నచ్చక బయట ఫుడ్‌కి అలవాటు పడతారు. ఇంట్లో ఫుడ్ మొహం మొత్తకుండా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు ఉపయోగించి బర్గర్స్, పిజ్జాలను ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి. అలవాట్లు.. వీలైనంత త్వరగా పిల్లల ఆహారపు అలవాట్లు మార్చాలి. అలవాట్లు మార్చుకోకపోతే జంక్‌ఫుడ్ మానరు. మీరు చేసే ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో వివరిస్తూ, బుజ్జగిస్తూ చెబితే బయట తినే అలవాటును మానుకుంటారు. పోషకాల గురించి వివరించాలి.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పిల్లలకు పెట్టే రకరకాల డిష్‌లను వేటితో తయారు చేశారు, వాటిలో పోషకాలు ఏం ఉంటాయి? అవి శరీరానికి చేసే మేలుని చక్కగా వివరిస్తే ఇంటి ఫుడ్‌ని తినడానికి ఆసక్తి చూపి జంక్ ఫుడ్‌ని అస్సలు ముట్టరు. ఈ పద్ధతులను అనుసరిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా మారడం ఖాయం. ఇవి చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి.. -
కిచెన్‌లో తుప్పు సమస్యలతో ఇబ్బందా? ఇలా ట్రై చేయండి..
'ప్రతీ ఇంట్లో ఎదుర్కునే సమస్యలలో వంట గది ఒకటి. వంట గది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యమంటారు. అయితే వంట ఇంటిని అందంగా, హెల్దీగా ఉంచుకోవడం అంత ఈజీకాదు. ఇందుకోసం చాలామంది మహిళలు తెగ ఖంగారుపడుతూ ఉంటారు కూడా. అయితే 24 గంటలూ కిచెన్ అద్దంలా మెరుస్తూ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..' ముఖ్యంగా తిండి పదార్థాలతో పాటు కొన్ని రకాలైన స్టీల్ బౌల్స్ కూడా తుప్పు పడుతూంటాయి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికిగా మారటం. మరో ప్రధాన సమస్య బల్లులతో పంతం పట్టడం.., లేదంటే దూరంగా పారిపోవటంలాంటిది చేస్తుంటారు.' మరి ఇలాంటి సమస్యలను తేలికగా దూరం చేయడానికి ఈ టిప్స్‌ని ఉపయోగించండి. స్టీల్ పాత్రలు వెలిసిపోయి పాతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్‌ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీల్ పాత్రకు రాసి టూత్ బ్రష్‌తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి అంతా పోయి కొత్తవాటిలా కనిపిస్తాయి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్‌పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలను సమపాళల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్ల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. ఇవి చదవండి: ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్! -
చిట్కా తెలియడమే ఆలస్యం..
ఇంటిప్స్ * ఇంట్లో ఉండే మెడ గొలుసులన్నింటినీ ఒకే చోట దాచుకున్నప్పుడు అవి ఒకదానికొకటి మెలిక పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక్కో గొలుసును ఒక్కో స్ట్రాలోకి దూర్చి హుక్ పెట్టేయాలి. అలా ఎన్ని చెయిన్స్నైనా ఒక బాక్స్‌లో పెట్టుకొని ప్రయాణాలు చేయొచ్చు. అలాగే గొలుసులకు పడిన చిక్కును విడదీయడానికి బేబీ పౌడర్ వాడాలి. ఆ చిక్కుముడికి పౌడర్ రాస్తే సులువుగా విడిపోతుంది. * బంగారం ఆభరణాలను మినహా మిగతా అలంకరణ వస్తువులను జాగ్రత్తగా దాచుకోరు చాలామంది. ముఖ్యంగా చిన్ని చిన్ని చెవి దుద్దులు. ఫంక్షన్‌కు రెడీ అవుతున్నప్పుడు చూసుకుంటే ప్రతి జతలో ఒక్కో దుద్దు కనిపించకుండా పోవడం అందరికీ తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటిని పెద్దసైజు బటన్లకు అమర్చితే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రకం కావాలంటే అవి సులువుగా కనిపిస్తాయి, ఎప్పటికీ భద్రంగా ఉంటాయి కూడా. * తలుపులకు, కిటికీలకు పెయింట్ వేయడానికి పెద్ద సైజు బ్రష్‌లను ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి అనుకోకుండా మోతాదుకంటే ఎక్కువగా పెయింట్ వచ్చేస్తుంది ఆ బ్రష్‌కు. దాన్ని తీసేయడానికి ఆ డబ్బా అంచులకు రాస్తుంటాం. అలా కాకుండా ఆ డబ్బా చుట్టూ ఓ రబ్బర్ బ్యాండును పెట్టి, దాని సాయంతో ఎక్కువగా ఉన్న పెయింట్‌ను తొలగించొచ్చు. అలా చేస్తే డబ్బాకు ఎలాంటి రంగు మరకలు ఉండవు. * షర్టు బటన్లు తరచూ ఊడిపోతూ ఉంటాయి. లేదా దారాలు ఒదులుగా ఉండి వేలాడుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే బటన్లు కుట్టిన వెంటనే వాటి మధ్యలో కొద్దిగా నెయిల్ పాలిష్ రుద్దాలి. అది ఆరే వరకు కదిలించకూడదు. అలా చేస్తే ఆ దారాలు తొందరగా లూజ్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో కలర్‌లెస్ నెయిల్ పాలిషులు అందుబాటులో ఉంటున్నాయి. అది ఉపయోగిస్తే ఏ కలర్ బటన్స్కైనా పాలిష్ వేసినట్టు కనిపించదు. * ఫ్లవర్ వాజుల్లో పెట్టిన పూలు త్వరగా వాడిపోకుండా ఉండాలంటే కాస్త వాటిపై శ్రద్ధ పెడితే చాలు. రోజూ రోజూ ఖరీదైన పూలను మార్చి కొత్తవి పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. కాబట్టి వాజులోని నీళ్లలో ఒక రాగి నాణెంతో పాటు కొద్దిగా చక్కెర వేయాలి. రోజూ ఆ నీటిని మార్చి చక్కెర వేస్తుండాలి. అలా చేస్తే ఆ పూలు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఆ పూల సువాసనకు మార్కెట్లో దొరికే ఏ సెంటూ సాటి రాదు. -
చిటికెడు ఇంగువతో చీడ దూరం!
ఇంటిప్స్ ⇒ పూల మొక్కలకు పురుగు పడితే... నీటిలో కొంచెం ఇంగువ కలిపి మొక్క మొదలులో పోస్తే చీడ వదిలిపోతుంది. పూలు కూడా బాగా పూస్తాయి. ⇒ బట్టల షెల్ఫుల్లో చిన్న చిన్న పురుగులు చేరి కొట్టేస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే షెల్ఫులో ఓ మూల రెండు ఎండు మిరపకాయలు పెట్టాలి. ⇒ గాజు సామాన్లపై మరకలు పడినప్పుడు.. నిమ్మనూనెలో ముంచిన స్పాంజి ముక్కతో తుడిస్తే వదిలిపోతాయి. ⇒ కర్పూరాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కొద్దికొద్దిగా హరించుకుపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కర్పూరం డబ్బాలో నాలుగు మిరియపు గింజలు వేయాలి. ⇒ పాతబడిన ఫర్నిచర్ కొత్తగా మెరవాలంటే... ఆలివ్ నూనెలో కొంచెం వెనిగర్ కలిపి తుడవాలి. ⇒ పప్పు దినుసును నిల్వ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లి రేకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. ⇒ పాతబడ్డ ఉడెన్ ఫర్నీచర్ కొత్తగా మెరవాలంటే.. వేడినీళ్లలో రెండు టీబ్యాగ్‌లను ఉంచండి. పదినిమిషాలయ్యాక వాటిని తీసేసి... మెత్తటి బట్ట తీసుకొని ఆ డికాషన్‌తో ఫర్నీచర్‌ను తుడవండి. -
చెప్పులు కరుస్తుంటే..!
ఇంటిప్స్ ఇల్లు తుడవడానికి వాడే నీళ్లలో కాస్త ఉప్పు వేస్తే... ఇంట్లో ఈగలు, దోమలు చేరకుండా ఉంటాయి. చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే... కరుస్తున్నచోట పెరుగు రాసి రాత్రంతా ఉంచి, పొద్దున్న తొడుక్కోవాలి. స్క్రూలు తుప్పు పట్టి బిగిసిపోతే... వాటి మీద కాస్త వెనిగర్ వేస్తే తేలికగా ఊడి వస్తాయి. టాల్కం పౌడర్ సువాసనను కోల్పోయినట్టు అనిపిస్తే... డబ్బాను కాసేపు ఎండలో ఉంచాలి. ప్లాస్టిక్ కంటెయినర్లకు అంటిన పసుపు మరకలు వదలాలంటే శెనగపిండితో తోమాలి.