చెప్పులు కరుస్తుంటే..!
ఇంటిప్స్
ఇల్లు తుడవడానికి వాడే నీళ్లలో కాస్త ఉప్పు వేస్తే... ఇంట్లో ఈగలు, దోమలు చేరకుండా ఉంటాయి. చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే... కరుస్తున్నచోట పెరుగు రాసి రాత్రంతా ఉంచి, పొద్దున్న తొడుక్కోవాలి. స్క్రూలు తుప్పు పట్టి బిగిసిపోతే... వాటి మీద కాస్త వెనిగర్ వేస్తే తేలికగా ఊడి వస్తాయి. టాల్కం పౌడర్ సువాసనను కోల్పోయినట్టు అనిపిస్తే... డబ్బాను కాసేపు ఎండలో ఉంచాలి. ప్లాస్టిక్ కంటెయినర్లకు అంటిన పసుపు మరకలు వదలాలంటే శెనగపిండితో తోమాలి.