
బతుకు చక్రంలో జానెడు పొట్టకోసం ఎవరి తిప్పలు వారివి. పండుగ అందరికీ ఒక్కటే.. కానీ అందరికీ ఒకేలా ఉండదు. పండుగ అంటే కడుపు నిండాలి.. అందరూ కలవాలి. కానీ వీరికి ఒక పండుగ రోజే కడుపు నిండేది. దాని కోసం ఏడాదిపాటు ఎదురు చూస్తారు. ప్రార్థనలకోసం వచ్చేవారి పాదరక్షలకు కాపలాగా ఉంటే తోచినంత సాయం చేస్తారని వాళ్ల ఆశ. ఉదయాన్నే కుటుంబమంతా సైకిల్‌పై వచ్చి ఈద్గా వద్ద ఎవరికి వారుగా చెప్పులకు కాపలాగా ఉండి యాచిస్తారు.

ఇలా సైకిల్‌పై ముందు, వెనక చక్రాలు.. ఏమాత్రం వదలకుండా యజమాని చెప్పులకు కాపలాగా సైకిల్‌ను వినియోగించడం ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. పెద్దపల్లిలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల సమయంలో యాచకుల కడుపు తిప్పలకు అద్దం పట్టేలా సైకిల్ చక్రం బతుకు చక్రాన్ని తలపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీరు మారడం లేదు. ఆస్పత్రికి వచ్చిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన అభి షేక్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడు తున్నాడు. దీంతో అతడిని తండ్రి 108 వాహ నంలో ఆస్పత్రికి తీసుకొచ్చాడు. దారిలోనే 108 సిబ్బంది అభిషేక్‌కు సెలైన్ పెట్టారు.
ఆస్పత్రి వద్ద వైద్యులు స్పందించి కుర్చీనో.. స్టెచ్చరో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. పట్టింపులేనితనంతో వ్యవహరించారు. కాసేపు వేచిచూసిన ఆ తండ్రి కొడుకు చేతికి ఉన్న సెలైన్ పట్టుకుని ఆస్పత్రిలోకి వెళ్లాడు. తండ్రీకొడుకును చూసిన వారు వైద్యుల తీరుపై మండిపడ్డారు.
చదవండి: సింగరేణి.. సూపర్ ప్లాన్