bicycle
-
తల్లి ఊపిరి ఆగిందని తెలియక..
సేలం(తమిళనాడు): తల్లి మరణించిందని తెలియని మానసిక రోగి అయిన కుమారుడు ఆస్పత్రి నుంచి ఆమెను సైకిల్‌పై తన నడుముకు కట్టుకుని 15 కిలోమీటర్లు పయనించాడు. ఈ ఘటన తమిళనాడులోని నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లై జిల్లా నాంగునేరి సమీపంలో వడక్కు మీన్వన్కుళం, మాతాకోవిల్ వీధికి చెందిన బాలన్ (38) మానసిక రోగి. ఇతని తల్లి శివగామి అమ్మాల్ (60) కూడా మానసిక రోగి. వీరు నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య విభాగంలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ స్థితిలో వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను నాంగునేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి బాలన్ వైద్యం చేయిస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా శివకామి అమ్మాల్ కింద పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దీంతో ఆమెను నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో బాలన్ చేర్చాడు. ఈ స్థితిలో గురువారం నెల్లై ఆస్పత్రిలో ఉన్న తల్లిని బాలన్ బయటకు తీసుకొచ్చాడు. తర్వాత తన సైకిల్‌పై కూర్చోబెట్టుకున్నాడు. కిందకు వాలిపోతున్న ఆమెను తాడుతో తన నడుముకు కట్టుకుని సైకిల్‌పై బయలుదేరాడు. అక్కడి నుంచి 15 కిలో మీటర్ల దూరం నెల్లై–కన్యాకుమారి జాతీయ రహదారిపై వెళ్లాడు. రాత్రి మూండ్రైపాళయం వద్ద బాలన్ సైకిల్‌పై నిలిచి ఉండగా, అక్కడ ఉన్న వారు బాలన్ వెనుక కూర్చుని ఉన్న తల్లి మృతిచెందినట్టు గుర్తించారు. తర్వాత మానసిక రుగ్మతతో ఉన్న కుమారుడు తల్లి మరణించిన విషయం కూడా తెలియకుండా సైకిల్‌పై వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న కీల్కడంలో ఉన్న బాలన్ సోదరుడు సవరిముత్తు (43)ను రప్పించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. video credit to : Dinamalar -
Lael Wilcox: 4 ఖండాలు 21 దేశాలు ...ఓ సైకిల్!
విల్కాక్స్ ‘సైకిల్ సెటప్’పై ఒక లుక్కు వేస్తే... ‘ఈ సైకిల్‌పై కొన్ని ఊళ్లు చుట్టి రావచ్చు’ అనిపిస్తుంది. ఇంకాస్త ఉత్సాహ పడితే... ‘జిల్లాలు చుట్టి రావచ్చు’ అనిపించవచ్చు. ‘ఈ సైకిల్‌తో ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు’ అని మాత్రం అనిపించదు. మనం అనుకోవడం, అనుకోక పోవడం మాట ఎలా ఉన్నా ఈ సైకిల్ పైనే విల్కాక్స్ ఎన్నో దేశాలు చుట్టి వచ్చి ప్రపంచ రికార్డును సృష్టించింది.మే 26న షికాగోలోని గ్రాంట్ ΄ార్క్ నుండి బయలుదేరిన లాయెల్ విల్కాక్స్ నాలుగు ఖండాలు, 21 దేశాల మీదుగా 29,169 కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేసింది. యాత్ర పూర్తి చేయడానికి పట్టిన కాలం... 108 రోజులు, 12 గంటల 12 నిమిషాలు.ఎన్నో దేశాలు చుట్టి వచ్చి తిరిగి షికాగోకు వచ్చిన విల్కాక్స్కు కుటుంబసభ్యులు, స్నేహితులు, షికాగో సైకిల్ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు.తన లేటెస్ట్ రికార్డ్‌తో స్కాట్లాండ్కు చెందిన జెన్నీ గ్రాహం గత రికార్ట్ (124 రోజుల 10 గంటల 50 నిమిషాలు)ను విల్కాక్స్ బ్రేక్ చేసింది.‘ఇదొక అద్భుత రికార్డ్’ అనడంతో΄ాటు ‘ఇప్పుడు నేను విల్కాక్స్ కు అభిమానిగా మారి΄ోయాను’ అంటుంది జెన్నీ గ్రాహం.విల్కాక్స్ ‘ప్రపంచ సైకిల్ యాత్ర’ విషయానికి వస్తే...రోజుకు 14 గంటల ΄ాటు రైడ్ చేసేది. ప్రయాణానికి ముందు రకరకాల జాగ్రత్తలు తీసుకుంది. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి. ‘ఈ యాత్రలో ఆహ్లాదమే తప్ప కష్టమని ఎప్పుడూ అనిపించలేదు’ అంటుంది విల్కాక్స్. ‘ఆహ్లాదంగా అనిపించింది’ అనేది ఆమె మనసు మాట అయినప్పటికీ భౌతిక పరిస్థితులు వేరు. ఎన్నోసార్లు ప్రతికూల వాతావరణం వల్ల విల్కాక్స్ ఇబ్బంది పడింది. ప్రయాణం మొదలు పెట్టిన 4వ రోజే వర్షంలో చిక్కుకు΄ోయింది. సైకిల్ టైర్ ఎన్నోసార్లు పంక్చర్ అయింది. కొన్నిసార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ అంతలోనే కోలుకొని సైకిల్ చేతిలోకి తీసుకునేది. తాను ఏ రోజు ఎక్కడ ప్రయాణిస్తున్నాను అనేది సోషల్ మీడియా ద్వారా ప్రకటించేది. దీనివల్ల వందలాది మంది ఆమెను అనుసరిస్తూ ఉత్సాహపరిచేవారు. ఇది తనని ఒంటరితనం నుంచి దూరం చేసేది.‘అద్భుతమైన శారీరక, మానసిక దృఢత్వం ఆమె సొంతం’ అంటూ సైక్లింగ్ వీక్లి మ్యాగజైన్ ఎడిటర్ మారిజ్ రూక్ విల్కాక్స్ను ప్రశంసించారు.ఒక లక్ష్యం నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడే మరో కల కనడం విల్కాక్స్ అలవాటు. మరి నెక్ట్స్ ఏమిటి? అనే విషయానికి వస్తే... ఆమె ట్రాక్ రికార్డ్‌ను బట్టి చూస్తే అది పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఎవరీ వేదంగి కులకర్ణి?విల్కాక్స్ తాజా రికార్డ్ సందర్భంగా బాగా వినిపిస్తున్న పేరు వేదంగి కులకర్ణి. మన దేశానికి చెందిన ఆల్ట్రా సైకిలిస్ట్ వేదంగి కులకర్ణి ఇరవై ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. పుణెకు చెందిన కులకర్ణీ యూకేలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుకుంది. దాదాపు ఆరేళ్ల తరువాత కులకర్ణీ మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి కారణం...ఆమె ప్రపంచ సైకిల్ యాత్ర. కులకర్ణీ కూడా తన రైడ్‌ను 108 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె గత రికార్డ్ చూస్తే అదేమీ అసాధ్యం కాదు అనిపిస్తుంది. అందుకే విల్కాక్స్ తాజా రికార్డ్‌కు వేదంగి కులకర్ణీ నుంచి గట్టి ΄ోటీ ఉందని విశ్లేషకులు అంటున్నారు. -
‘సైకిల్’ దొంగ దొరికాడోచ్!
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తాయిలాల ఎరవేసి ఓట్లు దక్కించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నింది. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి తల్లిదండ్రుల మెప్పుపొందేందుకు భారీ సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసింది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్‌మిల్లులో నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేశారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల అధికారులకు ఫోన్ చేశారు. మండలంలోని చింతలపూడి గ్రామంలోని ఓ రైస్‌మిల్‌లో టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో, సైకిల్ గుర్తుతో ఉన్న నూతన సైకిళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే అధికారులు హుటాహుటిన రైస్‌మిల్‌కు చేరుకుని వందల సంఖ్యలో ఉన్న సైకిళ్లను చూసి అవాక్కయ్యారు. అన్ని సైకిళ్లకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ రంగు, గుర్తులు, అభ్యర్థి ఫొటో ఉండటంతో అన్ని సైకిళ్లను సీజ్ చేశారు. సంఘటనా స్థలానికి ఓ వ్యక్తి చేరుకుని తాను కోర్టు ద్వారా ఆక్షన్‌లో సైకిళ్లను దక్కించుకున్నానని, అధికారులకు తెలిపాడు. అయితే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సైకిళ్లు ఉన్నాయని, ఒకేచోట పార్టీ సింబల్స్‌తో ఇన్ని సైకిళ్లు ఉండరాదని తేల్చిచెప్పారు. కోడ్ ఉల్లంఘించిన కారణంగా 567 సైకిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి వరదరాజులు, ఏంపీడీవో రత్నజ్యోతి తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల తాయిలాల పంపకంతోనే విజయం సాధించే ప్రక్రియకు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇవి చదవండి: ‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర -
బై‘స్కిల్’లుడు
సైకిల్‌ను మధ్యలోకి మడిచి కారు డిక్కీలో పెట్టుకోవచ్చా? ‘బేషుగ్గా’ అంటున్నాడు ఆనంద్ మహీంద్రా. ఎక్కడ ‘స్కిల్’ కనిపించినా ఆ విశేషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా సైకిల్ తొక్కుతున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇది మామూలు సైకిల్ కాదు. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ–బైసికిల్. ఐఐటీ బాంబే స్టూడెంట్స్ ఈ బైసికిల్‌ను తయారు చేశారు. ‘మరోసారి మనం గర్వించేలా ఐఐటీ బాంబే స్టూడెంట్స్ సృష్టించిన వాహనం ఇది’ అని కాప్షన్ పెట్టాడు మహీంద్రా. ‘ఇంప్రెసివ్ ఇనోవేషన్... రివల్యూషన్ ఆన్ వీల్స్’ అంటూ యూజర్లు స్పందించారు. -
ఏపీ సీఎం జగన్ పై అభిమానాన్ని చాటుకున్న తెలంగాణ యువకుడు
-
గుర్రం మీద రావాల్సిన వరుడు అలా వచ్చేసరికి...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక విచిత్ర వివాహం సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. వరుడు కల్యాణమండపానికి ప్రత్యేక రీతిలో వచ్చిన విధానం అందరినీ ఆకర్షించింది. దీనిని చూసినవారంతా పెళ్లికొడుకును అభినందించలేకుండా ఉండలేకపోయారు. చక్కగా అలంకరించిన కారులోనే లేదా గుర్రం మీదనో నూతన వరుడు కల్యాణమండపానికి చేరుకోవడాన్ని చూసేవుంటాం. వీటికి భిన్నంగా ఏ వరుడైనా ప్రవర్తిస్తే అందరూ అతనిని వింతగా చూస్తారు. ఇటువంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వరుడు తనదైన ప్రత్యేక రీతిలో వధువు ఇంటికి తన బంధుబలగంతో సహా చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటాలని భావిస్తూ వాధ్వానీ కుటుంబం ఈ వినూత్న ప్రయోగం చేసింది. ఇందుకోసం వారు సైకిళ్లను వినియోగించారు. కుటుంబ సభ్యులు కూడా.. వరునితో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులంతా సైకిళ్లపై ఊరేగింపుగా కల్యాణమండపానికి చేరుకున్నారు. ఈ ఊరేగింపు ఇండోర్‌లోని లాల్బాగ్ గార్డెన్ నుంచి ఖాల్సా గార్డెన్ ఖాతీవాలా ట్యాంక్ వరకూ సాగింది. దీనికి వారు ‘మినీ బారాత్’ అనే పేరుపెట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజాజీ నగర్ పరిధిలోని లింబూదీలో ఉంటున్న అన్మోల్ వాద్వానీకి ఇండోర్‌లోని డింపుల్‌తో జూన్ 11న వివాహం నిశ్చయమయ్యింది. తన వివాహ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలని, అందరికీ స్ఫూర్తినివ్వాలనే తన ఉద్దేశాన్ని వరుడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీనికి వారు సమ్మతించడంతో వారంతా సైకిళ్లపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నారు. పర్యావరణ హితం కోరుతూ వారంతా ఈ నిర్ణయానికి మద్దతు పలికారు. వీరిని చూసిన స్థానికులు నూతన వరుడిని అభినందనలతో ముంచెత్తారు. కాగా వరునితోపాటు అతని తరపువారంతా సైకిళ్లపై ఊరేగింపుగా రావడంతో ఆడపెళ్లివారు మొదట ఆశ్చర్యపోయినా, తరువాత వారి సదుద్దేశాన్ని తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్! -
ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
-
అబ్బో క్రియేటివిటి.. సైకిల్ టైర్లు ఇలా కూడా ఉంటాయా!
-
కెనడాలో రోడ్డు ప్రమాదం.. హరియాణా విద్యార్థి మృతి
టొరంటో: కెనడా రాజధాని టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరియాణా విద్యార్థి ఒకరు దుర్మరణం చెందారు. శుక్రవారం మధ్యాహ్నం సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్కు ఢీకొట్టి, అతడిని లాక్కెళ్లింది. ఎమర్జెన్సీ సిబ్బంది ట్రక్కు నుంచి అతికష్టమ్మీద అతడిని వేరు చేశారు. అప్పటికే అతడు చనిపోయాడు. మృతుడిని హరియాణాలోని కర్నాల్‌కు చెందిన కార్తీక్ సైని(20)గా గుర్తించారు. టొరంటోలోని షెరిడాన్ కాలేజీలో జాయినయ్యేందుకు 2021 ఆగస్ట్‌లో అతడు కెనడా వెళ్లినట్లు అతడి సోదరుడు పర్వీన్ సైని చెప్పారు. -
వైరల్ వీడియో: తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
-
తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
భోపాల్: తన చాక్లెట్లు దొంగిలించి దొరక్కుండా దాచి పెడుతోందంటూ తల్లిపై ఓ మూడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మాటలు సైతం సరిగా రాని వయసులోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేసిన ఆ బుడ్డోడికి దీపావళి ముందే వచ్చేసింది. ఏకంగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ పిల్లాడికి సైకిల్ గిఫ్ట్‌గా పంపించారు. పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన ఆ సైకిల్‌పై చిన్నోడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తల్లిపై ఫిర్యాదు చేస్తున్న మూడేళ్ల హమ్జా వీడియో చూసిన తర్వాత.. అతడి ధైర్యానికి మెచ్చిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. దివాళి గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ మరుసటిరోజునే చిట్టి సైకిల్‌ను బాలుడికి పంపించారు. పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం హమ్జా ఇంటికి వెళ్లి సైకిల్‌తో పాటు చాక్లెట్లు అందించారు. వాటిని చూసిన ఆ చిన్నోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్టు చేయండి.. పోలీస్ స్టేషన్లో బుడ్డోడి వీడియో వైరల్ -
ఒక్క చార్జింగ్‌తో గంటకు 40 కి.మీ: హొంమేడ్ ఎలక్ట్రిక్ సైకిల్ మేకింగ్ వీడియో
సాక్షి,హైదరాబాద్: మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కార్బన ఉద్గారాలను తగ్గించే లక్క్ష్యంతోపాటు, ఇంధన భారాని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు రానురాను ఆదరణ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ వేవ్ టూవీలర్, త్రీవీలర్ సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సైకిళ్లు ఎలక్ట్రిక్ మోడ్‌లో వచ్చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు హై రేంజ్లోఉండటంతో, కార్లు , బైక్స్‌తో సహా అన్ని రకాల ఆటోమొబైల్స్ కోసం ఇటువంటి కన్వర్షన్ కిట్లను చూశాం. దీంతో ప్యాసింజర్ కార్ సెగ్మెంట్, టూవీలర్ సెగ్మెంట్లో ఈ-వాహనాల భారాన్నిమోయలేని వారు కన్వర్షన్ కిట్వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగానే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ విశేషంగా నిలుస్తోంది. ఇంట్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ప్రముఖ యూట్యూబర్ ఇలాంటి వీడియోనొకదాన్ని అప్లోడ్ చేశారు. కన్వర్షన్ కిట్ సహాయంతో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వీడియోను పబ్లిష్ చేశాడు. ఎలక్ట్రిక్ మోటారు, 36 V 7.5 Ah లిథియం-అయాన్ బ్యాటరీ, కంట్రోలర్, పెడల్ అసిస్ట్, కొత్త థొరెటల్, బ్రేక్ లివర్లు ఇలా ప్రతి భాగం ఎలా మరియు ఎక్కడ అమర్చాడో యూట్యూబర్ వివరించాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జింగ్‌తో గంటకు 40 కిమీ వేగంతో దూసుకుపోవచ్చట. మరి ఈ ఇంట్రస్టింగ్ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి. అయితే దీనికి నిపుణుల పరిశీలన అవసరమని గుర్తించండి. కేవలం సమాచారం కోసమే ఈ వీడియోను అందిన్నామని గమనించగలరు. -
తొక్కకున్నా వెళ్లిపోయే సైకిల్ ట్రాఫిక్‌లో ఎగిరే వాహనం!
►మెట్రోరైలు దిగి స్టేషన్ పక్కనే ఉన్న సైకిల్ స్టాండ్ నుంచి ఓ సైకిల్ తీసుకుని ఇంటికి చేరుకోవడం, తర్వాత ఆ సైకిల్ ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే తిరిగి మెట్రోస్టేషన్ చేరుకోవడం.. వింతగా ఉంది కదా. ►ట్రాఫిక్‌లో ఇరుక్కున్న మన వాహనం ఉన్న ఫళంగా గాలిలోకి ఎగిరి ముందున్న వాహనాలను దాటుకుంటూ గాలిలో అలాఅలా తేలిపోతూ గమ్యస్థానానికి చేరుకుంటే ఎంత బాగుంటుంది.. ►గమ్యస్థానం ఫీడ్ చేస్తే చాలు.. డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు దానంతట అదే మనల్ని మనం చేరుకోవాల్సిన చోటుకు తీసుకెళుతుంది. ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదా.. కానీ ఈ ఊహలన్నీ హైదరాబాద్ ఐఐటీకి చెందిన ప్రత్యేక పరిశోధన విభాగం.. టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)) నిజం చేస్తోంది. కలలు సాకారం చేస్తోంది. మానవ ప్రమేయం లేకుండా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లే సైకిల్‌ను రూపొందించింది. రోడ్డుపై వెళుతూ అవసరమైతే గాల్లోకి ఎగిరిపోయే ప్యాసింజర్ కార్గో డ్రోన్ (కారు లాంటి వాహన)పై కూడా పరిశోధనలు చేస్తోంది. రోడ్డు సౌకర్యం ఉండని కొండ ప్రాంతాలకు సరుకులు, అత్యవసరమైన మందులు చేరవేయడం వంటి అవసరాలకు వినియోగించే అటానమస్ డ్రోన్లపై పరిశోధన కొనసాగిస్తోంది. దీనికి రిమోట్ గానీ, ఆపరేటర్ గానీ అవసరం లేదు. గమ్యస్థానాన్ని ఫీడ్ చేస్తే అదే తీసుకెళుతుంది. అలాగే డ్రైవర్ అవసరం లేని అటానమస్ వాహనంపై కూడా ప్రయోగాలు చేస్తోంది. ఇలాంటి వాటికెన్నిటికో కేంద్రంగా మారిన హైదరాబాద్ ఐఐటీలో మానవ రహిత వాహనాలపై పరిశోధనల్లో భాగంగా టిహాన్ ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌ను (డ్రైవర్ రహిత వాహనాలు ప్రయోగాత్మకంగా నడిపే రోడ్డు) కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్ రహిత వాహనాల్లో ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నూతన ఆవిష్కరణలకు వేదిక భవిష్యత్ సాంకేతిక ఆవిష్కరణలకు భారత్‌ను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్రసింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్‌డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’పథకం కింద 25 టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్‌లను (సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో నాలుగో తరం నూతన ఆవిష్కరణలకు భారత్ వేదిౖకైందన్నారు. వ్యవసాయం, అత్యవసర రంగాల్లో ఇప్పటికే డ్రోన్లు వాడుతున్నారని, డ్రైవర్ లేకుండా అటానమస్ నావిగేషన్ ద్వారా వాటంతట అవే తమ గమ్యస్థానాలకు చేరుకునేలా పరిశోధనలు జరిపిన హైదరాబాద్ ఐఐటీని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ పరిశోధనల్లో ముందు వరుసలో ఉందని చెప్పారు. దేశంలోనే తొలి అటానమస్ వెహికల్ టెస్ట్‌బెడ్ హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ (ఏరియల్ అండ్ టెరస్ట్రియల్) దేశంలోనే మొదటిదని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ టెస్ట్‌బెడ్‌పై మానవ రహిత వాహనాల పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. భారత దేశంలో ఉన్న పరిస్థితులు అంటే.. గ్రామీణ ప్రాంత రోడ్లు, మల్టీ లేన్లు, వర్షం పడుతున్నప్పుడు.. ఇలా రకరకాల పరిస్థితుల్లో ఈ డ్రైవర్ రహిత వాహనాల పనితీరుపై పరీక్షలు చేస్తున్నామన్నారు. మానవ రహిత ప్యాసింజర్ డ్రోన్లు సుమారు 1.50 క్వింటాళ్ల బరువున్న సరుకులను మోసుకెళ్లగలవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, ఐఐటీ పాలకమండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీఐహెచ్‌ఏఎన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్ చేసుకోలేక పోవడంతో దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ తదుపరి తనంతట తానే లేచిన బైడెన్.. బాగానే ఉన్నానని, తనకేం కాలేదని చెప్పారు. ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతోంది. Biden just beefed it on his bike in Delaware pic.twitter.com/eYj2oG0tHJ — Quoth the Raven (@QTRResearch) June 18, 2022 (చదవండి: పార్క్ చేసిని కారులో ఏకంగా 47 పిల్లులు ! ఫోటో వైరల్) -
ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!
కొత్తకొత్త ఆవిష్కరణలను ఆవిష్కరించి ఔరా! అనిపించుకుంటారు కొంతమంది. ఎవరు చేయని సాహసకృత్యాలు చేసిన వార్తల్లోకి ఎక్కుతారు. ఇక్కడొక వ్యక్తి అందరూ నడిపే మాములు సైకిల్ని అతి పొడవైన సైకిల్‌గా రూపొందించి రైడ్ చేయాలనుకున్నాడు. అతని ఆలోచనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సలో స్థానం దక్కేలా చేసింది. అసలు విషయంలోకెళ్తే.. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి అతి పొడవైన సైకిల్ని రూపోందించాడు. ఈ సైకిల్‌ను రీసైకిలింగ్ వస్తువులతో రూపొందిచడటం విశేషం. పైగా అతనికి ఈ సైకిల్ తయారు చేయడానికి దాదాపు ఒక నెల పట్టింది. సైకిల్ పనితీరు కోసం ఇంకొన్ని వారాలు పట్టిందని ఆడమ్ తెలిపారు. ఈ మేరకు ఆడమ్ మాట్లాడుతూ.. ‘తనకెప్పడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని, తన ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయి’ అని చెబుతున్నాడు. అయితే ఈ సైకిల్ 24 అడుగుల 3 అంగుళాలు ఉంటుందట. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ బుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడమ్ అతి పొడవైన సైకిల్ని రైడింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆడమ్‌ని గొప్ప ఆవిష్కర్త అంటూ నెటిజన్ల ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఇదేందయ్యా ఇది నేను చూడలా.. ‘ఫన్నీ’ స్నానం వీడియో వైరల్) -
పాత సైకిల్ ఇస్తే కొత్త ఈ-బైక్‌ను సొంతం చేసుకోవచ్చును..!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఊపందుకుంది. అధిక ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలే కాకుండా భారత్‌లో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా కొనుగోలుదారులకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కాగా వెస్ట్‌బెంగాల్‌కు చెందిన గోజీరో మొబిలిటీ(GoZero Mobility) సరికొత్త ఆఫర్‌ను అందించనుంది. పాత సైకిల్‌ను ఇస్తే..! ఈ-బైక్స్‌పై అమ్మకాలను మరింత పెంచేందుకుగాను గోజీరో మొబిలిటీ "స్విచ్" అనే ఒక ఎక్సేచేంజ్ ప్రమోషన్‌ను మొదలు పెట్టింది. ఈ ప్రచారంలో భాగంగా కస్టమర్స్ ఏదైనా సంప్రదాయ సైకిల్‌తో కంపెనీకి చెందని ఎలక్ట్రిక్ ఈ-బైక్‌తో ఎక్సేచేంజ్ చేసుకోవచ్చునని గోజీరో పేర్కొంది. "స్విచ్" ప్రమోషన్స్‌లో భాగంగా...రూ. 7,000 నుంచి రూ. 25 వేల విలువైన ఏదైనా బ్రాండ్‌కు చెందిన సైకిల్‌తో కొత్త ఈ-బైక్‌ను సొంతం చేసుకోవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ 2022 జనవరి 10 నుంచి 2022 ఏప్రిల్ 9 వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఎక్సేచేంజ్‌తో సేకరించిన సైకిళ్లను తిరిగి ఈ-బైక్స్‌గా మార్చుతామని కంపెనీ సహావ్యవస్థాపకుడు సుమిత్ రంజన్ అన్నారు. గోజీరో స్విచ్ ప్రచారంలో ఎలక్ట్రిక్ వన్, సారధి ట్రేడర్స్, గ్రీవ్స్ ఈవీ ఆటోమార్ట్,ఆర్యేంద్ర మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. వీరి భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా గోజీరో ఈ-బైక్ అమ్మకాలను జరుపుతోంది. GoZero X-సిరీస్ ఈ-బైక్స్ ధర రూ. 34,999 నుంచి రూ. 45,999గా ఉండనున్నాయి. చదవండి: టయోటా హైబ్రిడ్ కార్ సరికొత్తగా..! పెట్రోల్‌తోనే కాదు కరెంటుతో కూడా నడుస్తోంది..! ఈ కారు..! -
Viral Video: స్టంట్ అదరగొట్టిన అమ్మాయి.. కానీ సచ్చినోడు చెడగొట్టేశాడుగా..
బైక్ స్టంట్స్ చేయడం నేరమని, ప్రాణానికి ప్రమాదం అని అందరికీ తెలిసిందే. అయినా కూడా యువతకు స్టంట్స్ అంటే విపరీతమైన మోజు.. ఎన్ని దెబ్బలు తగిలినా రకరకాలుగా విన్యాసాలు చేస్తూ అదో ఫ్యాషన్‌గా ఫీల్ అవుతుంటారు. స్టంట్స్అంటే గుర్తొచ్చేది ఎక్కువగా అబ్బాయిలే. అమ్మాయిలు చేయడం చాలా అరుదు. తాజాగా ఓ యువతి సైకిల్‌పై స్టంట్ చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూస్తే యువతికి ఓ యువకుడు అడ్డురావడంతో ఆమె అద్భుతమైన ఫెయిల్ అయ్యింది. దీంతో ఇద్దరు బొక్కబోర్లా పడ్డారు. రోడ్డుపై ఓ అమ్మాయి వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి.. సడన్‌గా బ్రేకులు వేసి విన్యాసాలు చేస్తుంది. సడన్ బ్రేక్ వేయడంతో ఆమె సైకిల్ వెనుక చక్రం పైకి లేచింది. కానీ అప్పుడే వెనుక నుంచి మరో సైకిల్ పై వేగంగా వచ్చిన యువకుడు.. ఆమె విన్యానాన్ని చెడగొట్టాడు. అబ్బాయి సైకిల్‌తో వచ్చి అమ్మాయి సైకిల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోయారు. వీళ్లిద్దరూ కూడా స్టంట్స్ చేసేవారని తెలుస్తుంది. చదవండి: Viral Video: పెళ్లిలో అమ్మాయిల తీన్మార్ స్టెప్పులు, చేతిలో డ్రింక్ బాటిల్ పట్టుకొని.. అయితే అబ్బాయి కూడా యువతి లాగే వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి బ్రేక్‌లు వేయాలి. కానీ అది మర్చిపోవడంతో ఎదురుగా ఉన్న యువతి సైకిల్‌ను ఢీకొట్టడంతో.. ఇద్దరూ పడిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఇద్దరూ వెంటనే లేచి నిలబడ్డారు. కాగా ఈ వీడియో చూసిన వారంతా ఇది చూసినవారంతా..‘ అమ్మాయి మంచి స్టంట్‌ను అబ్బాయి చెడగొట్టేశాడు. పాపం ఒకరి వల్ల ఇద్దరు బలి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ View this post on Instagram A post shared by Best Fails (@best.failsever) -
పోలీసులకు రోజూ రెండు గంటలు సైకిల్ గస్తీ తప్పనిసరి: కమిషనర్
సాక్షి, చెన్నై: జీపులు, మోటారు సైకిళ్లను పక్కన పెట్టి సైకిల్‌పై గస్తీ వెళ్లేందుకు నగర పోలీసులు రెడీ అయ్యారు. ఇందుకోసం ఒక్కో స్టేషన్‌కు 4 చొప్పున సైకిళ్లను పంపిణీ చేశారు. రోజుకు 2 గంటలు సైకిల్ గస్తీ తప్పనిసరి చేస్తూ కమిషనర్ శంకర్‌జివ్వాల్ ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు గంటల పాటు తమ పరిధిలో సైకిల్ టీం గస్తీ నిర్వహించనున్నారు. తద్వారా నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. చదవండి: (ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..) -
సైకిల్‌పై సీఎం సందడి: కొత్త స్కీం
చండీగఢ్: వరల్డ్ కార్ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్‌పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్‌యాత్ర చేపట్టారు. తన అధికారిక నివాసం నుండి సెక్రటేరియట్ వరకు సైకిల్‌పై వచ్చి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ మంత్రి జేపీ దలాల్, రవాణా శాఖ మంత్రి మూల్‌చంద్ శర్మ సైకిల్‌పై పౌర సచివాలయానికి చేరుకోవడం విశేషం. (World Car Free Day: ఎంచక్కా సైకిల్‌పై షికారు చేద్దాం!) ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ.2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఖట్టర్ చండీగఢ్ నుండి కర్నాల్ వరకు రైలులో ప్రయాణించారు. అలాగే సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. #WATCH | Haryana Chief Minister Manohar Lal Khattar* rides a bicycle along with his cabinet colleagues and MLAs from his residence to the secretariat in Chandigarh to observe #Worldcarfreeday pic.twitter.com/ME0dt31MJl — ANI (@ANI) September 22, 2021 -
ఒకసారి ఛార్జింగ్‌తో 60 కిలోమీటర్ల ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం సైకిల్ బ్రాండ్ స్ట్రయిడర్ సైకిల్స్ అర్బన్ కమ్యూటర్ విభాగంలో కొత్త ఈ–బైక్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.29,995 ధరలో వోల్టిక్ 1.7, రూ.37,999 ధరలో కాంటినో ఈటీబీ 100 మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ వీటిలో పొందుపరిచారు. వోల్టిక్ 1.7 ఒకసారి చార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కాంటినో ఈటీబీ 100 మోడల్‌కు బయటకు తీయగలిగే బ్యాటరీ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. టాటా ఇంటర్నేషనల్ అనుబంధ కంపెనీయే స్ట్రయిడర్ సైకిల్స్. చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి.. -
బాలుడి దవడలోకి దిగిన సైకిల్ బ్రేక్ పెడల్
జడ్చర్ల: సైకిల్‌పై వెళ్తుండగా కింద పడిన బాలుడి దవడలోకి చేతితో పట్టుకునే బ్రేక్ పెడల్ దిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లికి చెందిన సంతోష్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఇంటి నుంచి ట్యూషన్‌కు సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో బ్రేక్ పెడల్ ఒక్కసారిగా దవడ భాగంలోకి చొచ్చుకుపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఆ బాలుడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ పార్కింగ్, ఎక్కడో తెలుసా
మన దేశంలో సైకిల్ వినియోగం చాలా తగ్గిపోయింది కానీ, నెదర్లాండ్స్‌లో మాత్రం ప్రజలు సైకిల్‌పై సవారీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆఫీసులకు వెళ్లడానికి దగ్గర నుంచి షాపింగ్ మాల్స్‌లో వస్తువుల కొనుగోలు వరకూ సైకిల్‌నే వినియోగిస్తారు. పర్యావరణంపై వాళ్లకు ఉన్న ప్రేమ అలాంటిది. మోటార్ సైకిళ్లు వినియోగిస్తే కాలుష్యం ఎక్కువ అవుతుందనే స్పృహతోనే డచ్ ప్రజలు సైక్లింగ్‌కు మొగ్గుచూపుతారు. మన దేశంలో మోటార్ సైకిల్ పార్కింగ్లు కనబడ్డట్లే నెదర్లాండ్స్‌లో చాలా చోట్ల సైకిల్ పార్కింగ్లు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఉట్రెచ్ నగరంలోని స్టేషన్స్ప్లీన్లో ఉన్న సైకిల్ పార్కింగ్ ప్రపంచంలోనే అతి పెద్దది. 2019 ఆగస్టు 19న దీనిని ప్రారంభించారు. దీనిని ఉట్రెట్ మునిసిపాలిటీ, ప్రోరైల్, ఎన్ఎస్ (డచ్ రైల్) సంయుక్తంగా నిర్వహిస్తాయి. రైల్ ప్రయాణం చేసేవారు తమ సైకిల్‌ను సురక్షితంగా పార్క్ చేసుకోవడానికి ఈ భారీ పార్కింగ్ బిల్డింగ్‌ను నిర్మించారు. ఆ పార్కింగ్ ప్లేస్ విశేషాలు.. ► ఇక్కడ 12,500 సైకిళ్లను పార్క్ చేయవచ్చు. ► దానిలో కొంత జాగా రెంట్ సైకిల్స్‌కు కూడా ఉంటుంది. ► ఉట్రెచ్ రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉంటుంది. 24 గంటలూ తెరిచే ఉంటుంది. ► పెద్ద బిల్డింగ్‌లో ఉంటుంది కాబట్టి సైకిళ్లకు ఎండ, వానల నుంచి రక్షణ ఉంటుంది. ► 24 గంటల వరకూ ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పించారు. ► పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చిప్‌కార్డు సహాయంతో పార్కింగ్ చేసుకోవచ్చు. ► ఇక్కడి కారిడార్లను సైకిల్ తొక్కడానికి అనువుగా రూపొందించారు. ► రెండు ఎంట్రన్స్‌లు ఉండే బిల్డింగ్‌లో వన్‌వే అమల్లో ఉంటుంది. ► మూడు అంతస్తులో ఉండే బిల్డింగ్‌లో ప్రతి చోట బాయ్‌లతో పర్యవేక్షణ ఉంటుంది. ► విభిన్నంగా ఉండే సైకిళ్లు.. అంటే పెద్ద హ్యాండిల్ బార్, డెలివరీ బ్యాగ్‌లను తీసుకెళ్లే సైకిళ్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఉంటుంది. ► ఇక్కడ సైకిల్ రిపేరింగ్‌తో పాటు కావాల్సిన సామానులు కూడా అందుబాటులో ఉంటాయి. -
Bicycle Sales: సైకిల్ అమ్మకాల స్పీడ్
న్యూఢిల్లీ: ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ పెద్దలు చెప్పిన మాట. కానీ, కరోనా వచ్చిన తర్వాతే ఎక్కువ మందికి ఆరోగ్య ప్రాధాన్యం తెలిసొచ్చింది. ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రానంత వరకు చాలా మంది ఆరోగ్యాలు భాగ్యంగానే ఉండేవి. ప్రతీ చిన్న పనికి వాహనాన్ని వినియోగించడం.. ఆధునిక జీవన అలవాట్ల కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం (ఫిట్నెస్) గతంలో మాదిరి పటిష్టంగా ఉండడం లేదు. దీంతో తిరిగి శరీరానికి పని చెప్పడాన్ని ప్రజలు క్రమంగా అలవాటు చేసుకుంటున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సైకిల్ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. సైకిళ్లకు డిమాండ్ దశాబ్దపు గరిష్ట స్థాయికి చేరిందని.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 20 శాతం వృద్ధి చెందుతాయని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదికను విడుదల చేయడం సందర్భోచితం. ‘‘భారత్‌లో సైకిళ్ల విక్రయాలు 2021–22లో 1.45 కోట్లకు పెరుగుతాయి. 2020–21లో విక్రయాలు 1.21 కోట్ల యూనిట్లు. ప్రస్తుత కరోనా మహమ్మారి సైకిళ్లకు డిమండ్‌ను పెంచింది. ఫిట్‌నెస్‌పై అవగాహన విస్తృతం అయ్యింది. విక్రయాలు పెరగడడం వల్ల సైకిల్ తయారీ కంపెనీలకు నగదు ప్రవాహాలు మెరుగుపడతాయి. వాటి రుణ చెల్లింపులకు మద్దతుగా నిలుస్తాయి’’ అని క్రిసిల్ పేర్కొంది. 2019 మార్చి వరకు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సైకిళ్ల విక్రయాలు ఏటా 5 శాతం చొప్పున వృద్ధి చెందాయి. కానీ 2019–20లో మాత్రం విక్రయాలు 22 శాతం క్షీణతను నమోదు చేశాయి. ప్రభుత్వం కొనుగోళ్లను తగ్గించడంతోపాటు పెద్ద కంపెనీలు మూతపడడం కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి. కానీ, గత ఆర్థిక సంవత్సరం మాత్రం సైకిల్ పరిశ్రమకు మంచి వృద్ధిని తీసుకొచ్చింది. ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద సైకిల్ తయారీ కేంద్రం కావడం గమనార్హం. స్టాండర్డ్ విభాగం.. స్టాండర్డ్, ప్రీమియం, కిడ్స్, ఎక్స్‌పోర్ట్స్ ఇలా నాలుగు విభాగాల కింద సైకిళ్ల విక్రయాలు కొనసాగుతుంటాయి. స్టాండర్డ్ సైకిళ్ల విభాగం అతిపెద్దది. 2020లో అమ్ముడపోయిన సైకిళ్లలో సగం మేర స్టాండర్డ్ విభాగం కిందే ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ కొనుగోళ్లు విక్రయాలకు మద్దతుగా నిలుస్తున్నాయి. టెండర్ల ద్వారా సైకిళ్లను కొనుగోలు చేసి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు పంపిణీ చేస్తుంటాయి. ఇక కిడ్స్ (పిల్లల సైకిళ్లు), ప్రీమియం (ఖరీదైన సైకిళ్లు) విభాగం విక్రయాలు గత ఆర్థిక సంవంత్సరం మొత్తం విక్రయాల్లో 40 శాతంగా ఉండడం గమనార్హం. తీరిక సమయాల్లో రైడింగ్, ఆరోగ్యం కోసం ఖరీదైన సైకిళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఎగుమతులు, ఇతర సైకిళ్ల విక్రయాల వాటా 10 శాతంగా ఉంది. ‘‘కరోనా కారణంగా లాక్డౌన్లు, ఆంక్షలతో ఫిట్‌నెస్‌పై దృష్టితోపాటు, తీరిక సమయం లభించింది. ఇది సైకిళ్ల డిమాండ్‌ను ముఖ్యంగా ప్రీమియం, కిడ్స్ విభాగంలో విక్రయాలను పెంచింది’’ అని క్రిసిల్రేటింగ్స్ డైరెక్టర్ నితేష్ జైన్ చెప్పారు. కరోనా రెండో విడత తీవ్రతతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ డిమాండ్ కొనసాగుతుందన్నారు. ప్రీమియం, కిడ్స్ సైకిళ్ల విభాగంలో 22 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల్లో ప్రభుత్వం నుంచి కొనుగోళ్ల ఆర్డర్లు మెరుగుపడడం మొదలైనట్టు, రెండేళ్ల స్తబ్దత తర్వాత స్టాండర్డ్ సైకిళ్లకు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందుతుందని క్రిసిల్ పేర్కొంది. కంపెనీలకు అనుకూలం విక్రయాల్లో వృద్ధి వల్ల 2021–22లో సైకిళ్ల కంపెనీల లాభదాయకత పెరుగుతుందని.. అధిక లాభదాయకత ఉండే కిడ్స్, ప్రీమియం విభాగం విక్రయాల వాటా 10 శాతం మేర పెరిగి 50 శాతాన్ని ప్రస్తుతం చేరుకున్నట్టు క్రిసిల్ తన నివేదికలో వివరించింది. సైకిల్ తయారీలో వినియోగించే స్టీల్ తదితర ముడి సరుకుల ధరలు పెరిగినందున.. ఈ మేర ఉత్పత్తుల ధరలను కంపెనీలు పెంచొచ్చని అంచనా వేసింది. సైకిల్ ధరలో తయారీ వ్యయం 60–65 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ సైకిళ్ల కంపెనీల మార్జిన్లు పెరిగినట్టు క్రిసిల్ ప్రస్తావించింది. ‘‘సైకిళ్ల కంపెనీల మార్జిన్లు 1.10–1.30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయి. కంపెనీలు తయారీ సామర్థ్య విస్తరణకు రుణ సమీకరణ చేయవచ్చు. వడ్డీ కవరేజీ రేషియో గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 3.6 రెట్ల నుంచి 4.8 రెట్లకు పెరుగుతుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. లాక్డౌన్ల వల్ల డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక వంతు క్షీణిస్తుందని.. రెండో త్రైమాసికం నుంచి రికవరీ వస్తుందని అంచనా వేసింది. -
సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్
ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న నెక్స్‌జూ మొబిలిటీ రోడ్‌లార్క్ పేరుతో సూపర్ లాంగ్ రేంజ్ ఈ-సైకిల్‌ను తయారు చేసింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్థాయిలో నడిచే ఈ-సైకిల్ భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ధర రూ.42,000. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. ఆరు రకాల రైడింగ్ మోడ్స్, డ్యూయల్ డిస్క్ ఎలక్ట్రిక్ బ్రేక్స్, డ్యూయల్ లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్, 26 అంగుళాల కాటన్ ట్యూబ్ టైర్స్ ఏర్పాటు ఉంది. కోల్డ్ రోల్డ్ స్టీల్‌తో తయారైంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. నెక్స్‌జూ పోర్టల్ ద్వారాగాన్నీ దేశవ్యాప్తంగా ఉన్న 90 టచ్ పాయింట్లలో రోడ్‌లార్క్‌ను కొనుగోలు చేయవచ్చు. చదవండి: టెకీలకు గుడ్ న్యూస్.. భారీగా నియామకాలు! -
ఈ సైకిల్.. స్పీడ్ 80 మైలేజీ 90
సాక్షి, చిత్తూరు: కాలుష్య నివారణకు ఉపయోగపడే ఈ (ఎలక్ట్రిక్ ) బైసైకిల్‌ను సొంతంగా రూపొందించారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్నాథ్. దామలచెరువు మండలానికి చెందిన కృష్ణమూర్తి, షకీల దంపతుల కుమారుడు అమర్నాథ్ సిక్కిం నీట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తను ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. రూ.80 వేలు వెచ్చించి పర్యావరణహిత ఈ–బైసైకిల్‌ను తయారు చేశారు. దీని వివరాలను అమర్నాథ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మొదట గేర్ సైకిల్‌ను కొనుగోలు చేసి, గేర్లు తొలగించానన్నారు. ఆన్లైన్లో పలు వెబ్సైట్లు, కంపెనీల నుంచి విడిభాగాలు, బ్యాటరీ కోనుగోలు చేశానన్నారు. మొదటిసారి ప్రయోగం కాబట్టి ఖర్చు ఎక్కువ అయిందని, కంపెనీలు సహకారం అందిస్తే మరింత తక్కువ ధరకే వినియోగదారులకు వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. ఈ బైసైకిల్ ప్రత్యేకతలు.. ►మోటార్‌కు 72 వాట్స్ డీసీ పవర్ చార్జింగ్ కనెక్షన్ ►గంటకు 80 కిలోమీటర్ల వేగం ►రెండు గంటలు చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్లు నడుస్తుంది ►బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫెడల్ సాయంతో తొక్కే సౌలభ్యం -
పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఆరోగ్యార్థులకు సైక్లింగ్ ఒక మంచి హాబీగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చాలా మంది నిర్ణీత దూరం నుంచి ఆఫీసులకు సైక్లింగ్ ద్వారానే చేరుకుంటున్నారు కూడా. మరోవైపు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సైక్లిస్టులు మరింత పెరిగారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు రాకపోకల్లో భాగంగా కొంత దరాలకు సైక్లింగ్ మేలని భావిస్తున్నవారు... తమ కార్లకు సైకిల్‌ను ఇలా తగిలించుకుని మరీ తీసుకుపోతున్నారు. చదవండి: వయసును వెనుకే వదిలి పెట్టెయ్ -
కుమారుడికి ప్రేమతో.. బ్యాటరీ బైక్
దొండపర్తి (విశాఖ దక్షిణ): తొక్కడానికి పనికిరాకుండా పోయిన సైకిల్‌ను బాగు చేయమని ఓ కొడుకు తన తండ్రిని అడిగితే.. ఆ సైకిల్‌ను బ్యాటరీ బైక్‌గా తీర్చిదిద్దాడు ఆ తండ్రి. గుంటూరుకు చెందిన మురళీకృష్ణ పదేళ్లుగా విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అక్కయ్యపాలెంలో ఉంటున్నారు. తన కుమారుడు సూర్యసిద్ధార్థ (7)కు చిన్న సైకిల్ ఉండేది. అది పూర్తిగా పాడైంది. దాన్ని బాగు చేయమని కొడుకు రెండేళ్ల కిందట అడిగాడు. దీంతో పాత సైకిల్‌ను కొత్తగా తయారు చేయడం కంటే.. దాన్ని చిన్న బైక్‌గా మార్చి తన కుమారుడికి ఇవ్వాలని మురళీకృష్ణ నిర్ణయించుకుని రూ.20 వేల ఖర్చుతో బైక్‌ను రూపొందించారు. రెండేళ్ల కష్టం.. బ్యాటరీ బైక్ తయారు చేయడానికి ఏయే వస్తువులు, సాంకేతికత అవసరమో మురళీకృష్ణ తెలుసుకున్నారు. పాత సైకిల్ సామగ్రితో పాటు స్క్రాప్‌లో దొరికిన బైక్‌ల విడిభాగాలను తీసుకుని వాటిని తాను అనుకున్న మోడల్లో తయారు చేసుకున్నారు. చార్జింగ్ బైక్‌ను తయారు చేసే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బైక్‌కు మోటర్ కోసం డ్రిల్లింగ్ మెషిన్ మోటర్‌ను ముందు వినియోగించారు. దాని సామర్థ్యం సరిపోకపోవడంతో లారీ, బస్సుల అద్దాలను శుభ్రం చేసే వైపర్ మోటర్‌ను బైక్‌కు అమర్చారు. కంప్యూటర్ యూపీఎస్ బ్యాటరీ పెట్టారు. రెండేళ్లకు తాను అనుకున్న విధంగా ‘హార్లీ డేవిడ్ సన్’ బైక్ రూపురేఖలతో చార్జింగ్ బైక్‌ను తయారు చేశారు. బైక్ ప్రత్యేకతలు.. బైక్‌లో ఒక్కో భాగం ఒక్కో బైక్‌కు చెందినది. సెల్ఫ్ స్టార్ట్, త్రీ స్పీడ్ లెవెల్స్, కిలోమీటర్ల రీడింగ్‌తో స్పీడో మీటర్ మోనో సస్పెన్షన్, సింగల్ షాక్ అబ్జార్బర్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు బైక్‌కు అమర్చిన నాలుగు 12 ఓల్ట్స్, 7 యాంప్స్ బ్యాటరీలను 4 గంటల పాటు చార్జ్ చేస్తే 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం 40 కిలోలు బరువును మోసే సామర్థ్యం సంతోషంగా ఉంది ఈ బైక్ తయారీకి రెండేళ్లు కష్టపడ్డాను. ఏ వస్తువు దొరికినా దాన్ని తీసుకుని బైక్‌కు అనువుగా మలుచుకున్నాను. చేసింది బాగోలేకపోతే వాటిని తీసి కొత్త రకంగా తయారు చేయడంతో ఖర్చు పెరిగింది. రూ.20 వేల వరకు ఖర్చు అయింది. సరిగ్గా దీనిపై దృష్టి పెడితే రూ.15 వేలకే తయారు చేయవచ్చు. నా కొడుకు ఆ బైక్‌ను డ్రైవ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. – మురళీకృష్ణ -
సైకిల్ .. ఇది మామూలుగా ఉండదు మరి!
సైకిల్ తొక్కితే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతారు.. క్రిస్టియన్ టాపింగ్స్ ఇంకో మాట కూడా చెబుతున్నారు! రోలో తొక్కండి... వాయు కాలుష్యాన్ని పారదోలండీ అని! సైకిల్‌కు, వాయు కాలుష్యానికి సంబంధం ఏమిటనేగా మీ డౌటు? మరి ఈ పండుగ వేళ ఒకసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఈ ఫొటో చూడండి. ఏమిటిది! సైకిల్లాగే కనిపిస్తోంది. కానీ, ఇది మామూలు సైకిల్ మాత్రం కాదు. ఎందుకంటే చక్రాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి కాబట్టి! పేరు రోలో! ఈ సైకిల్‌ను తొక్కారనుకోండి.. కాలుష్యం కిల్ అవుతుంది. గాలిని చీల్చుకుంటూ వెళ్లే క్రమంలో కొంత గాలి వేగంగా చక్రాల మధ్యలో ఉండే నిర్మాణాల్లోకి వెళుతుంది. కాలుష్యంతో కూడిన గాలి ఒకవైపు నుంచి వెళితే.. పూర్తిగా శుభ్రమైన వాయువు ఇంకోవైపు నుంచి బయటకు వస్తుంది! క్రిస్టియన్ టాపింగ్స్ అనే బ్రిటన్ డిజైనర్ దీన్ని తయారు చేశారు. ఢిల్లీ కాలుష్యాన్ని చూసి.. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యమున్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సులువైన మార్గం కోసం ఆలోచనలు చేసిన టాపింగ్స్ చివరకు సైకిల్ కదిలే వేగాన్ని ఆసరాగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చక్రంలో ఏర్పాటు చేసిన నిర్మాణం కోసం పలు విఫల ప్రయత్నాలు చేసి చివరకు తాజా డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ చక్రాల ద్వారా ప్రతి కిలోమీటరు దూరానికి దాదాపు 0.665 ఘనపుమీటర్ల గాలి శుభ్రమవుతుందని అంచనా. క్రిస్టియన్ టాపింగ్స్ ఆ మ్యాజిక్ ఎలా? చక్రాల మధ్యలో ఉండే నిర్మాణంలో మూడు ఫిల్టర్లు ఏర్పాటుచేశారు. లోఫా (స్పాంజి లాంటిది)తో తయారైన ఫిల్టర్ గాల్లోని కొంచెం పెద్దసైజు కాలుష్యకణాలను (పీఎం 10 – 2.5) పీల్చేసుకుంటుంది. ఇళ్లలోని ఎయిర్ ప్యూరిఫయర్లలో వాడే హెపా ఫిల్టర్ పీఎం 2.5 కణాలతోపాటు టైర్లు, బ్రేక్‌ల నుంచి వెలువడే పొడిని తనలో దాచుకుంటుంది. చివరగా.. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి విషవాయువులను పీల్చేసుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం విద్యుత్తు అవసరం లేకుండానే పూర్తి కావడం రోలో విశిష్టత. కాలుష్యపు కాటు ఇలా.. ► 45 లక్షలు: వాయు కాలుష్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు ► 15 వేల కోట్లు: వాయు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య, ఇతర సమస్యల కారణంగా భారత్‌లో జరుగుతున్న నష్టం (రూపాయల్లో) ► 91% : 2019లో వాయుకాలుష్యం సమస్యను ఎదుర్కొన్న జనాభా ► 40,000: పీఎం 2.5 కాలుష్యం కారణంగా ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్న చిన్నారులు (ప్రతి ఏడాది) -
60 ఏళ్లుగా సైకిల్‌తో అనుబంధం..
ఆయనకు 16 ఏళ్ల వయసులో వివాహమైంది. తండ్రితో సైకిల్ కొనిపించారు. ఇప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్లు. అప్పుడు కొనుగోలు చేసిన సైకిలే ఇప్పటికీ ఆయన ప్రయాణ రథం. 60 ఏళ్లుగా సైకిల్‌ను చక్కగా చూసుకుంటూ.. ప్రయాణాలకు వినియోగిస్తున్నారు. ఆయన బైస్కిల్ బంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొబ్బిలి రూరల్ : బొబ్బిలి పట్టణం అగ్రహారం వీధికి చెందిన దామెర శ్రీరంగనాయకులు బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన వారు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో ఆయన కూడా వ్యవసాయంపైనే దృష్టిసారించా రు. పెళ్లైన తరువాత బొబ్బిలి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు 16 ఏళ్ల వయసులో 1960 మే 12న వివాహం జరిగింది. మే 20న తండ్రితో మారాం చేసి హెర్క్యులస్ సైకిల్‌ను కొనిపించారు. అప్పట్లో సైకిల్ ధర 60 రూపాయలు. విజయనగరంలోని చెక్కా వెంకటరత్నం షాపులో కొనుగోలు చేశారు. నాటి నుంచి దానిపైనే బొబ్బిలికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్తేరుకు రోజూ రెండు మార్లువెళ్లి వస్తుండేవారు. ఈ సైకిల్‌పై బొబ్బిలి నుంచి పార్వతీపురం, సాలూరు, విజయనగరానికి సినిమా లకు, నాటకాలకు సైతం వెళ్లేవారు. సైకిల్‌పై 60 ఏళ్లుగా వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించారు. సైకిల్ ఫ్రేమ్, హేండిల్బార్, మడ్గర్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈయన ఇటీవల టూవీలర్ కొనుగోలు చేశారు. దానిపై ఆసక్తి లేకపోవడంతో కొనుగోలుచేసిన కొద్దిరోజులకే అమ్మేశారు. నాకెంతో ఆనందం నా హెర్క్యులస్ సైకిల్ అంటే నాకెంతో ఇష్టం. దీనిపై అప్పట్లో రోజుకు 120 కిలోమీటర్లు తొక్కి సరదాగా సినిమాలకు వెళ్లేవాడిని. 76 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండేందుకు సైకిల్ తొక్కడమే కారణం. అప్పటి నుంచి ఇప్పటివరకు సైకిల్ చెక్కుచెదరలేదు. దానిపైనే ప్రతినిత్యం ప్రయాణం సాగిస్తున్నా. – దామెర శ్రీరంగనాయకులు, బొబ్బిలి -
భారీ డిమాండ్ : ఈ సైకిల్ ధర ఎంతంటే?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కాలంలో సైకిళ్లకు డిమాండ్ పుంజుకున్న నేపథ్యంలో ప్రీమియం సైకిల్ తయారీ సంస్థ స్కాట్ స్పోర్ట్స్ ఇండియా ఖరీదైన సైకిల్‌ను లాంచ్ చేసింది. స్పార్క్ ఆర్సీ 900 పేరుతో దీన్ని భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధరను 3.7 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఒలింపిక్ విజేత నినో షుర్టర్, ప్రపంచకప్ ఛాంపియన్ కేట్ కోర్ట్నీలాంటి వారు మెచ్చిన బ్రాండ్ తమదని కంపెనీ చెబుతోంది. కరోనా మహమ్మారి అనంతర కాలంలో భారతదేశంలో సైకిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో జిమ్‌లు ఫిట్నెస్ కేంద్రాలు మూసివేత కారణంతగా వినియోగదారులు ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సైకిళ్ల డిమాండ్ 70 శాతానికి పైగా పుంజుకుంది. మరీ ముఖ్యంగా ప్రీమియం సైకిళ్లకు డిమాండ్ దాదాపు 100 శాతం పెరిగినట్టు అంచనా. దీంతో ప్రీమియం సైకిల్ తయారీదారులు ఈ డిమాండ్ క్యాష్ చేసుకోవడంపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే స్కాట్ ఈ ఖరీదైన సైకిల్‌ను ఆవిష్కరించింది. ఫిట్నెస్ లక్ష్యంగా ఉన్న వినియోగాదారులకు తమ ప్రొడక్ట్స్ ను పరిచయం చేసేందుకు ఇదే మంచి సమయంగా స్కాట్ సంస్థ భావిస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రీమియం సైకిళ్లలో భారీ డిమాండ్‌ను గమనించామనీ, మన్నిక, సాంకేతికత, అధిక-నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని స్కాట్ స్పోర్ట్స్ ఇండియా కంట్రీ మేనేజర్ జేమిన్ షా చెప్పారు. 5 లక్షల నుండి 6 లక్షల విలువ చేసే స్కాట్ అడిక్ట్ సిరీస్ సైకిళ్లకు చాలా ఆర్డర్లను అందుకున్నామన్నారు. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని సైకిళ్లను లాంచ్ చేయనున్నామని తెలిపారు. ట్విన్ లాక్ సస్పెన్షన్ సిస్టమ్, 12 స్పీడ్ ఈగిల్ డ్రైవ్‌ట్రెయిన్, షిమనో ఎస్ఎల్ఎక్స్ డిస్క్ బ్రేక్‌లు, మాక్సిక్ రెకాన్ రేస్ కేవ్లర్ టైర్స్ సింక్రోస్ పార్ట్స్ ఇందులో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డీలర్ నెట్‌వర్క్‌తో పాటు స్పోర్ట్స్ నెట్ వర్క్.ఇన్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. నిపుణులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు 91 8080754321 కస్టమర్ కేర్ నెంబరును కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది. -
భార్యను 120 కిలోమీటర్లు సైకిల్‌పై తీసుకెళ్లినా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదవాడైతేనేం ఆయనకు పెద్ద మనసు ఉంది. క్యాన్సర్ రోగం నుంచి భార్యను కాపాడుకోవాలన్న తపన వృద్ధాప్యాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. లాక్డౌన్ వల్ల బస్సులు లేకపోవడంతో సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని 120 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. భార్య ప్రాణాలు హరించింది. భర్తను కన్నీటి కడలిలోకి నెట్టేసింది. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మనల్‌మేడుకు చెందిన అరివళగన్ (60) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో మంజుల (44)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు విష్ణు (12) ఉన్నాడు. మంజుల ఎడమచెంపకు సమీపంలో క్యాన్సర్ వ్యాధి సోకినట్లు తొమ్మిది నెలల క్రితం గుర్తించారు. పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. మార్చి 24వ తేదీ నుంచి లాక్డౌన్ ఉండడంతో ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. ఈ పరిస్థితిలో భార్య బాధను చూసి తట్టుకోలేకపోయిన అరివళగన్ మార్చి 29వ తేదీన పాత సైకిల్‌పై ఆమెను కూర్చోబెట్టుకుని కుంభకోణం నుంచి బయలుదేరాడు. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదు చ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రిలో చేర్పించాడు. తరువాత అంబులెన్స్‌లో ఆమెను తిరిగి స్వగ్రామానికి చేర్చా డు. భార్య ఆరోగ్యం పట్ల అతడు చూపిస్తున్న ప్రేమను గ్రామస్తులు మెచ్చుకుని తోచిన సహాయాన్ని చేశారు. ఇంట్లోనే ఉంటూ మందులు తీసుకుంటున్న మంజుల ఆదివారం రాత్రి మరణించింది. ‘లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువైంది, మరోవైపు క్యాన్సర్‌తో భార్య బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళదామంటే బస్సులు లేవు. భార్య ను కాపాడుకునేందుకు సైకిల్‌పైనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. నా కష్టం వృథా పోయింది. భార్య ప్రాణా లు నిలబెట్టుకోలేక పోయాను’ అంటూ అరివళగన్ కన్నీరుమున్నీరయ్యాడు. మంజుల మరణం గ్రామ ప్రజలను సైతం తీవ్రంగా కలచివేసింది. -
కొడుకుతో సైకిల్‌పై 105 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే
భోపాల్ : ‘పదో తరగతి పరీక్షలు.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి దాదాపు 100 మైళ్లకు పైగా దూరం. లాక్‌డౌన్‌తో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. తన దగ్గర బైక్, కార్ లాంటి వాహనాలూ లేవు. కానీ చదువు ఎంతో ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. చేసేది ఏం లేక సైకిల్‌పై 105 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష హాల్‌కు చేరుకున్నాడు’. ఇదంతా కొడుకు చదువు కోసం తండ్రి పడిన ఆరాటం. స్వతహాగా తను చదువుకోక పోయినా..కొడుకు అయినా ఉన్నత విద్యావంతుడు కావాలని ఓ తండ్రి చేసిన ఆలోచన. 15 ఏళ్ల కొడుకును సైకిల్‌పై కూర్చొబెట్టుకొని వంద కిలోమీటర్లు ప్రయాణించి తమ పిల్లల కోసం ఏమైనా, ఎంతైనా చేయగలమని నిరూపించాడు ఆ తండ్రి. (ఫెయిలైన విద్యార్థులంతా పాస్) ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శోభ్రామ్ అనే 38 ఏళ్ల వ్యక్తికి పదో తరగతి చదివే కొడుకు ఆశిష్ ఉన్నాడు. అతనికి సప్లిమెంటరీ పరీక్షలు దగ్గర పడ్డాయి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బస్సుతో సహా ఎలాంటి రవాణా మార్గాలు అందుబాటులో లేవు. కొడుక్కి ఒక సంవత్సరం వృథా కావొద్దని ఆలోచించిన శోభ్రామ్ కొడుకు పరీక్షల కోసం ఆశిష్‌ను సైకిల్‌పై ఎక్కించుకొని 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్ష రాయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. अपने बेटे को परीक्षा दिलवाने ये पिता साइकिल से 3 दिनों का सफर तय करके धार पहुंचे, शुभकामनाएं अब बारी बेटे की है! @ChouhanShivraj @OfficeOfKNath @UmangSinghar @ndtvindia @ndtv #ExamResults pic.twitter.com/QHg6rEqJGr — Anurag Dwary (@Anurag_Dwary) August 19, 2020 ఈ విషయంపై శోభ్రామ్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. మాకు డబ్బు, ద్విచక్ర వాహనం లేదు. ఈ సమయంలో ఎవరూ సాయం చేయరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలా చేసి ఉండకపోతే నా కొడుక్కి ఒక ఏడాది వృథా అయ్యేది. ఒక రోజు ముందు బయల్దేరి మంగళవారం ధార్ చేరుకున్నాము.. మా వెంట అవసరమైన ఆహార వస్తువులు తీసుకెళ్లాము’ అంటూ పేర్కొన్నారు. శోభ్రామ్ తన కొడుకు కోసం ఎంతో మంచి పని చేశాడని.. ‘శభాష్ శోభ్రామ్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు) -
వైరల్: కనిపించేదంతా నిజం కాదు
-
ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు
మీరు సైకిల్ చూశారు, బైక్ చూశారు.. కానీ "సైకిల్ బైక్" మాత్రం చూసుండరు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఓ యువకుడు దీన్ని నిజంగానే తయారు చేశాడు. ఇది ముందు నుంచి బైక్‌లాగా, వెనక నుంచి సైకిల్‌గా కనిపిస్తుంది. దీన్ని తొక్కుతున్నప్పటికీ ముందు నుంచి చూసేవాళ్లకు అరె.. ఎంత స్పీడుగా నడపుతున్నాడో అనిపిస్తుంది. తీరా అది మనల్ని దాటి వెళ్లిపోయాక అసలు సంగతి అర్థమవుతుంది. ఇలాంటి ఓ ఫన్నీ వీడియోను సీసీటీవీ ఇడియట్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. (అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం) ఇందులో హీరోలా బైక్ నడుపుతున్నట్లు కనిపించే వ్యక్తి పక్కనున్న బైకర్‌ను కూడా దాటి ముందుకెళ్లిపోయాడు. కానీ కొన్ని సెకన్ల లోపే అతను నడపుతోంది బైక్ కాదు సైకిల్ అని స్పష్టమవుతోంది. లక్షలాది మంది వీక్షించిన ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు పోటెత్తుతున్నాయి. "ఒక్క క్షణం అందరినీ పిచ్చోళ్లను చేశావు కదరా.." అంటూ నెటిజన్లు ఫూల్ అయ్యామని ఒప్పేసుకుంటున్నారు. "కంటికి కనిపించేదంతా నిజం కాదు", "అతని తెలివికి ఏమిచ్చినా తక్కువే..", "తక్కువ బడ్జెట్ బైక్" అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (‘అట్లాస్’ మళ్లీ వస్తుందా..?) -
మళ్లీ వచ్చిన ‘పోకేమాన్ గో’ పెద్దాయన!
ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన 'పోకేమాన్ గో' ఆండ్రాయిడ్ గేమ్‌తో తైవాన్‌కు చెందిన చెన్‌సున్ యాన్ మరోసారి దర్శనమిచ్చాడు. ఏకంగా 64 మొబైల్ ఫోన్లతో పోకేమాన్ ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. వాటన్నింటినీ నెమలి పించం మాదిరిగా సైకిల్‌కు అమర్చి న్యూ తైపీ నగరం వీధుల్లో తిరుగుతూ గేమ్ ఆడుతున్నాడు. పిల్లలు, పెద్దవారిని ఆకర్షిస్తున్నాడు. 72 ఏళ్ల చెన్‌సున్ తనకు ఈ గేమ్ వ్యసనంలా మారిపోయిందని, దాన్ని వదలబుద్ధి కావడం లేదని చెప్తున్నాడు. కొన్నేళ్ల కిందట తన మనుమడితో సరదాగా ఆడిన ఈ ఆటకు బానిసనయ్యానని తెలిపాడు. అయితే, పోకేమాన్ గో తనకు ఎంతో ఇష్టమైన ఆన్లైన్ గేమ్ అని, ఇదంతా పిల్లల సరదాకోసం కూడా చేస్తున్నానని అంటున్నాడు. కాగా, గతంలో సైకిల్‌పై 20 ఫోన్లు, 30 ఫోన్లు అమర్చి పోకేమాన్ ఆడిన చెన్‌సున్ 2019లో ఆ సంఖ్యను 45కు చేర్చాడు. తాజాగా 64 ఫోన్లను సైకిల్‌కు ఫిక్స్ చేసి తన రికార్డును తనే తిరగరాశాడు. ఇక దేశీయ అసుస్ మొబైల్ ఫోన్లతో పోకేమాన్ ఆడుతున్న పెద్దాయనకు గతేడాది ఓ ఆఫర్ వచ్చిందట. అసుస్ మొబైల్ సంస్థ తన ‘అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎం2’ మొబైల్ లాంచింగ్‌కు ఆహ్వానించిందట! ఇక చెన్‌సున్ లక్ష్యం 72 మొబైల్ ఫోన్లతో పోకేమాన్ ఆడటమని తెలిసింది. కానీ, మొబైళ్లు, వాటికి పవర్ బ్యాంకులు, కేబుళ్లు, అమర్చడానికి ప్లాస్టిక్ హ్యాండిళ్లతో కలిపి మొత్తం బరువు 22 కిలోలు. ఇది మరింత పెరిగితే సైకిల్ పాడవుతుందనే ఉద్దేశంతో చెన్‌సున్ ఆ ప్రయతాన్ని వాయిదా వేసుకున్నాడట. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల విలువ అక్షరాల రూ.3,40,000. మరోవైపు అంతభారీ స్థాయిలో గేమ్ ఆడటం వల్ల చెన్సున్కు కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. (చదవండి: అమ్మకానికి చే గువేరా జన్మించిన భవనం) -
వధువు కోసం 100 కి.మీ సైకిల్‌పై..
లక్నో: కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఇక్కడ చెప్పుకునే జంట విషయంలోనూ ఇదే జరిగింది. మా పెళ్లిని ఆపడం కరోనా తరం కూడా కాదంటూ శపథం చేసిందీ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ జంట. హమీర్‌పుర్‌లోని పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతికి మహోబా జిల్లాలోని పునియా గ్రామానికి చెందిన రింకీకి వివాహం నిశ్చయమైంది. ఇంతలో పెళ్లికి వీల్లేదంటూ లాక్డౌన్ వచ్చిపడింది. అలా అని చెప్పి వాళ్లు పెళ్లిని వాయిదా వేసుకోలేదు. ఒంటరిగానైనా సరే వివాహం జరగాల్సిందేనని భీష్మించుకున్నాడు. ఇంకేముందీ తన సైకిల్‌ను బయటకు తీశాడు. తను మనువాడే యువతి కోసం కలలు కంటూ ఏప్రిల్ 27న సైకిల్ తొక్కుతూ పయనం ప్రారంభించాడు. (కొత్త జంటకు కరోనా; గ్రామానికి సీల్) ఇలా జరుగుతుందనుకోలేదు వంద కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్లగా ఏప్రిల్ 28 నాటికి వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఇంకేముందీ.. అప్పటివరకు పడ్డ కష్టాన్ని మరిచి అక్కడే బాబా ధ్యానిదాస్ ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బుధవారం నాడు అదే సైకిల్‌పై కొత్త జంట వరుడి ఇంటికి చేరుకుంది. ఈ పెళ్లి గురించి కల్కు మాట్లాడుతూ.. "నా పెళ్లి కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ విధంగా జరుగుతుందనుకోలేదు" అని పేర్కొన్నాడు. (కరోనా: అప్పుడు మాకు దిక్కెవరు?) -
దూసుకుపో..!
బంజారాహిల్స్: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.. రిజిస్ట్రేషన్‌తో పనేలేదు... గంటకు 25 కిలోమీటర్ల వేగంతో రయ్‌మంటూ రోడ్లపై దూసుకుపోవచ్చు. ఇదెలా అనుకుంటున్నారా...? కొత్తగా ఎలక్ట్రికల్ బై సైకిల్స్ నగర రోడ్లపై దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ అద్దె వాహనాల సేవా సంస్థ 4–వీల్ సంస్థ ఎలక్టిక్ బై సైకిళ్ళను ప్రవేశ పెట్టనుంది. వీటి తయారీ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న ఈ సంస్థ జూన్ మొదటి వారంలో ఎలక్ట్రిక్ సైకిళ్ళను నగర రోడ్లపై తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సైకిళ్ళు అవసరమైన వారికి అద్దెకిచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఈ సంస్థ ఒకేసారి 5 వేల సైకిళ్ళను అందుబాటులోకి తీసుకురానుంది. అవసరమైనప్పుడు తొక్కడానికి, అలిసిపోయినప్పుడు దూసుకుపోవడానికి వీలుగా ఫెడల్ బై సైకిల్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ళు తయారు చేస్తున్నారు. రెండు గంటల చార్జింగ్‌తో 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఈ సైకిల్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని 4–వీల్సంస్థ ఎండీ ఎస్.ఎం.జైన్ తెలిపారు. మెట్రోస్టేషన్లు, బస్టాప్‌లు, మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్ళడానికి వీలుగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత దగ్గర చేసేందుకు ఎలక్ట్రిక్సైకిళ్ళను తీసుకొచ్చామని నగర వాతావరణానికి ఇవి సరిగ్గా సరిపోతాయని పేర్కొన్నారు. ఈడబ్లుఈ బ్రాండ్‌లో భాగంగా సైకిల్‌తోపాటు స్కూటీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. 15 నిమిషాల వ్యవధికి రూ.15 రుసుము చెల్లించాల్సి ఉంటుందని నిమిషాల పద్ధతిమీద వీటి వినియోగం ఉంటుందన్నారు. ఎకో ఫ్రెండ్లీ సైకిళ్ళ పేరుతో ఇవి రూపుదిద్దుకుంటున్నాయని మెట్రో ఉపయోగించే వారికి ఇవి బాగా దోహదపడతాయన్నారు. అంతా మొబైల్ యాప్‌తోనే... జూన్ మొదటి వారంలో అందుబాటులోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్ బై సైకిళ్ళను మొబైల్ యాప్ ద్వారా లాక్, అన్‌లాక్ చేసుకునే సదుపాయం ఉంది. దీన్ని ఉపయోగించుకునే వారు యాప్ ద్వారానే తమ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. దీనికి లైసెన్స్కాని, రిజిస్ట్రేషన్ కాని అవసరం లేదు. ప్రతి నిమిషానికి 70 పైసల చొప్పున వసూలు చేస్తాం. కొన్ని చోట్ల డాకింగ్ ఏరియాలు కూడా గుర్తించి అక్కడ ఎలక్ట్రిక్ సైకిళ్ళను పార్కింగ్ చేసే సదుపాయాన్ని కల్పిస్తాం. మెట్రో ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అకౌంట్ తీసుకొని దాని ద్వారానే పేమెంట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. – అశ్విన్ జైన్, డ్రైవెన్ అధినేత -
చంద్రబాబు,గంటా స్టిక్కర్లతో సైకిళ్లు
-
అక్క ప్రేమ
తల్లి బొడ్డుతాడు తెగితేనే బిడ్డ స్వేచ్ఛగా ఊపిరి పోసుకుంటుంది. నడవలేని తమ్ముడిని తనకు బొడ్డుతాడులా కట్టుకుని రోజూ స్కూలుకు తీసుకెళ్లి, తీసుకొస్తోన్నఈ అక్క.. తమ్ముడి భవిష్యత్తుకు ఊపిరిపోస్తోంది. అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ ఉంటుంది, గొడవలూ ఉంటాయి. చెల్లి కోసం అన్న చిటారు కొమ్మన ఉన్న కాయలు కోసిస్తాడు. చెల్లి కోరుకుంటోందని తాను తినకుండా రెండూ చెల్లికే ఇచ్చేస్తాడు కూడా. నాన్న తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను తమ్ముడి కోసం అక్క త్యాగం చేస్తుంటుంది. తాను త్యాగం చేయకముందే వాటిని తమ్ముడు తినేస్తే దెబ్బలాడుతుంది కూడా. ఎంత దెబ్బలాడినా సరే.. తమ్ముడికి అవసరమైనప్పుడు అమ్మలా బాధ్యత తీసుకుంటుంది అక్క. మయూరి కూడా తన తమ్ముడి విషయంలో తండ్రి బాధ్యతను తలకెత్తుకుంది. నడవలేని తమ్ముడి వీల్ చైర్‌ని తన సైకిల్‌కి ‘లింక్’ చేసుకుంది. రోజూ తనతోపాటు తమ్ముడు నిఖిల్‌ని స్కూలుకు తీసుకెళ్తోంది! తమ్ముడి కష్టం.. నాన్న అవస్థ హోల్ గ్రామం మహారాష్ట్ర, çపుణే జిల్లాలోని బారామతి తాలూకాలో ఉంది. మయూరి, నిఖిల్ ఉండేది హోల్ గ్రామంలోనే. నిఖిల్‌కి పదమూడేళ్లు, మయూరికి పదహారేళ్లు. నిఖిల్ ఫిజికల్లీ చాలెంజ్డ్ చైల్డ్. దాంతో నిఖిల్‌ని రోజూ అతడి తండ్రి స్కూటర్ మీద స్కూల్లో దింపేవాడు. తండ్రి ఇతర పనుల మీద బయటకు వెళ్లాల్సిన టైమ్ అవుతున్నా సరే.. నిఖిల్ స్కూల్ వేళల్లో ఆయన అందుబాటులో ఉండాల్సిందే. ఉదయం స్కూల్లో దించే టైమ్ లోపు వచ్చేయొచ్చు అనుకుని ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు ఒక్కోసారి స్కూల్ టైమ్‌కి రాలేకపోతే ఆ రోజు నిఖిల్ స్కూలుకి ఆబ్సెంట్ అవ్వక తప్పేది కాదు. సాయంత్రం తండ్రి రావడం ఆలస్యమైతే నిఖిల్ స్కూల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. పిల్లలందరూ ఇళ్లకు వెళ్లి పోతుంటే తమ్ముడిని వదిలి వచ్చేయలేక మయూరి కూడా తండ్రి వచ్చే వరకు స్కూల్లోనే ఎదురు చూసేది. తమ్ముడి కష్టం, తండ్రి అవస్థ అర్థమవుతున్నాయామెకి. అక్క సైకిల్‌కి తమ్ముడి వీల్‌చైర్ చదువులో చురుకైన కుర్రాడు నిఖిల్. నెలలో నాలుగైదు రోజులు స్కూలుకు వెళ్లలేక పాఠాలు మిస్ అవుతున్నాడు. పరిష్కారం కోసం ఆలోచించిందా అమ్మాయి. తనకొచ్చిన ఐడియాని టీచర్లకు చెప్పింది. ప్రిన్సిపాల్ మెచ్చుకున్నాడు. ఇద్దరు టీచర్లకు మయూరి ఆలోచనను ఆచరణలో పెట్టే బాధ్యత అప్పగించారాయన. సైన్స్ టీచర్లు జయరామ్, వాశీకర్లు మయూరి అడిగినట్లు డిజైన్‌ను కాగితం మీద గీసిచ్చారు. మెకానిక్కు చెప్పి వెల్డింగ్ చేయించారు. మయూరి వీల్‌చైర్‌తో ఉన్న సైకిల్ తొక్కేటప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఉండడానికి సపోర్టు రాడ్ పెట్టించడం వంటి మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. వారం రోజుల్లో సైకిల్‌కు వీల్ చైర్ అనుసంధానం అయింది! ఇప్పుడు అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి స్కూలుకెళ్తున్నారు. కాదు కాదు... అక్క రోజూ తమ్ముడిని స్కూలుకు తీసుకెళ్తోంది. తండ్రికి తన పనులు చేసుకోవడానికి తగినంత వెసులుబాటు కల్పించింది. పాఠాలు తప్పిపోకుండా చదువుకోవడానికి తమ్ముడికి మార్గం చూపించింది. ‘‘మయూరి చేసిన ప్రయోగం తమ్ముడికి, తండ్రికి సహాయపడడమే కాదు స్కూలుకి మంచి పేరు తెచ్చింది’’ అంటున్నారు ప్రిన్సిపాల్ ఏఎస్ అతర్. ‘‘నస్రపూర్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో ఈ సైకిల్‌ను ప్రదర్శించాం. ప్రైజ్ వచ్చింది. రాష్ట్ర స్థాయి సైన్స్ పోటీల్లో ప్రదర్శించడానికి అర్హత సాధించింది. ఇలా మా ఆనంద్ విద్యాలయ స్కూల్‌కి మంచి పేరు రావడమే కాదు, ఈ సైకిల్ డిజైన్ నడవలేని పిల్లలున్న పేరెంట్స్ చాలా మందికి ఉపయోగకరం అవుతుంది’’ అన్నారాయన సంతోషంగా.మెదడు పెట్టి చేసిన డిజైన్ కమర్షియల్‌గా హిట్ అవుతుందేమో, కానీ మనసు పెట్టి ప్రేమ రంగరించి చేసిన ఈ సైకిల్ డిజైన్ హృదయాలను బరువెక్కిస్తోంది. సంతోషం నిండిన నిట్టూర్పుతో గుండెని తేలిక పరుస్తోంది. – మంజీర -
ఈ సైకిల్‌ను దేనితో తయారు చేశార్రా బాబూ!!
దక్షిణ చైనాలోని షెంజన్ నగరంలోని చోటుచేసుకున్న ఓ ఘటన.. అక్కడి పాదచారులతో పాటుగా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వేగంగా వచ్చిన ఓ సైకిల్ కారును ఢీకొనడంతో.. కారు బంపర్ ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో... ఇలా ఎలా జరిగిందబ్బా అని కొంతమంది నెటిజన్లు సందేహపడుతుంటే... మరికొంత మంది మాత్రం సైకిల్ ఢీకొడితే కారు ఇలా అయిపోతుందా.. ఇదో ఫేక్ ఫొటో అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఇది నిజమే అనుంటున్నారు షెంజన్ పోలీసులు. రాంగ్రూట్లో వచ్చిన ఓ సైక్లిస్ట్ కారును ఢీకొట్టగా ఈ ప్రమాదం సంభవించిందని క్లారిటీ ఇచ్చారు. సైక్లిస్ట్‌కు చిన్నపాటి గాయాలు కాగా కారులో ఉన్న వారు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో... సైకిల్‌ను దేనితో తయారు చేశార్రా బాబూ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారట ఈ ఫొటో చూసినవాళ్లు. -
సైకిళ్లకు రిజిస్ట్రేషన్.. అతిక్రమిస్తే చలాన్లు!
నిజాం సంస్థానంలో ప్రధాన ప్రయాణ సాధనం సైకిల్. అప్పట్లో నగర రోడ్లపై ఎటు చూసినా ఇవే దర్శనమిచ్చేవి. 1918లో హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన సైకిళ్లు... 2000 సంవత్సరం వరకు రాజ్యమేలాయి. అయితేసంస్థానంలో సైకిళ్లకు రిజిస్ట్రేషన్ ఉండేది. వినియోగదారులు పన్నులు కూడా చెల్లించేవారు. నిబంధనలు అతిక్రమిస్తేచలాన్లు కూడా విధించేవారు. సిటీలో సైకిల్ రాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్ : యూరోపియన్ దేశాల్లో 1860లలోనే సైకిళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ... హైదరాబాద్‌లో 1918 నుంచి వాడుకలోకి వచ్చాయి. అప్పట్లో వీటిని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆర్డర్ ఇచ్చిన మూడు నాలుగు నెలల్లో ముంబైకి వస్తే.. అక్కడి నుంచి రైలు మార్గంలో నగరానికి తీసుకొచ్చేవారు. అయితే తొలుత ఇవి కేవలం ఉన్నత వర్గాలు, ధనిక కుటుంబాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ అధికారులు, పోలీస్‌ల దగ్గర ఉండేవి. 1938లో కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో సైకిల్ షాపులు ప్రారంభమయ్యాయి. వ్యాపారులు విదేశాల్లో తయారయ్యే సైకిళ్లను ముంబై నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించేవారు. షాపులు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 1951లో అట్లాస్ తదితర కంపెనీలు మన దేశంలో ప్రారంభమవడంతో సైకిళ్ల వినియోగం విరివిగా పెరిగింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి... హైదరాబాద్ సంస్థానంలో సైకిల్ కొంటే దాన్ని తప్పనిసరిగా బల్దియాలో రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధన ఉండేది. సైకిల్ కొనుగోలుకు సంబంధించిన రసీదు, యజమాని చిరునామాతో సహా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించేవారు. బల్దియా అధికారులు సిల్వర్ టోకెన్‌పై సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్, గడువు వివరాలు మెషిన్‌తో ముద్రించి ఇచ్చేవారు. ఆ సిల్వర్ టోకెన్‌ను సైకిల్ ముందు భాగంలో అమర్చేవారు. సైకిళ్లకు రిజిస్ట్రేషన్ లేని పక్షంలో పోలీసులు జరిమానా విధించడంతోస్వాధీనం చేసుకునేవారు. ప్రతిఏటా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించాల్సి ఉండేది. సైకిళ్లు వినియోగించేవారు నిజాం కాలంలో పలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉండేవి. సైకిల్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. రాత్రి సమయంలో సైకిల్ నడిపితే.. దాని ముందు భాగంలో లాంతర్ లైట్ తప్పనిసరి ఉండాలి. లాంతర్ల అనంతరం డైనమాను వెనక టైరుకు అమర్చి దాని ద్వారా లైట్‌ను వెలిగించేవారు. నిబంధనలు పాటించని పక్షంలో చలాన్లు విధించేవారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పోలీసులకు పట్టుబడితే సైకిల్ సీజ్ చేసేవారు. స్వాతంత్య్రానంతరం 1976 వరకు చలాన్ల వ్యవస్థ కొనసాగింది. ఆ తర్వాత దీన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అలా 50 ఏళ్లు... 1951లో దేశీయ సైకిల్ తయారీ కంపెనీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వాడకం విరివిగా పెరిగింది. 2,000 సంవత్సరం వరకు నగర రోడ్లపై సైకిళ్లు రయ్‌మంటూ దూసుకెళ్లాయి. గ్రామాల్లోనూ సైకిళ్ల వినియోగం ఎక్కువగా ఉండేది. అయితే 2,000 సంవత్సరం తర్వాత మోటార్ బైక్‌లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు సైక్లింగ్‌పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నగర యువత వారాంతంలో ప్రత్యేకంగా సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తూ పాల్గొంటున్నారు. -
సిటీ పోలీస్: ఇక గల్లీల్లోనూ సైకిళ్లతో గస్తీ!
సిటీ పోలీస్ ఇక సైకిల్ బాట పడుతున్నారు. స్ట్రీట్ బైస్కిల్ పెట్రోలింగ్ (ఎస్బీపీ) పేరిట కాలనీలు, గల్లీల్లో గస్తీ నిర్వహణకు ప్రత్యేక సైకిళ్లు వినియోగించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సైకిళ్లను సోమవారం నుంచి వినియోగిస్తున్నారు. బ్లూకోల్ట్స్, ఇన్నోవాలు, ఇంటర్సెప్టార్ వాహనాలు వెళ్లలేని గల్లీల్లోనూ గస్తీ చేపట్టేందుకు ఈ సైకిళ్లు ఉపయోగపడతాయని, ఇంధనం అవసరం లేని కారణంగా ఇవి పర్యావరణ హితమైనవి కూడా అని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దశలవారీగా వీటి వినియోగాన్ని విస్తరిస్తామని తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం బ్లూకోల్ట్స్‌గా పిలిచే ద్విచక్ర వాహనాలు, రక్షక్లుగా పిలిచే ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్–డివిజన్లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ ఉన్న మారుమూల గల్లీల్లోకి వీటి ద్వారా వెళ్ళడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో మౌంటెడ్ పోలీసుగా పిలిచే అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పెట్రోలింగ్ కోసం ప్రత్యేకమైన సైకిల్స్ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను ప్రయోగాత్మకంగా పంజగుట్ట ఠాణా పరిధిలో సోమవారం ప్రారంభించారు. తొలి దశలో ఐదు సైకిళ్లలో స్ట్రీట్ బైస్కిల్ పెట్రోలింగ్ (ఎస్బీపీ) పేరుతో ఇది మొదలైందని ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ ‘సాక్షి’కి తెలిపారు. ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, ఎల్లారెడ్డిగూడ, ఆనంద్‌నగర్‌కాలనీ, సోమాజిగూడల్లోని స్లమ్స్, గల్లీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎస్బీపీ వ్యవస్థ పని చేస్తుందని వివరించారు. అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు... ఈ సైకిళ్లను గస్తీ పోలీసుల దైనందిన అవసరాలకు తగ్గట్లు డిజైన్ చేశారు. వీటిని వినియోగించడం ద్వారా గస్తీ సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బ్లూకోల్ట్సŠ, రక్షక్‌లు చేరలేని ప్రాంతాలకూ ఇవి వెళ్తాయి. లాఠీ, వాటర్‌బాటిల్, సైరన్లతో పాటు జీపీఎస్ విధానం కూడా ఈ సైకిళ్లకు ఉంటుంది. వాకీటాకీ, సెల్‌ఫోన్, డైరీలను తమ వెంట తీసుకువెళ్ళడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఉదయం ఠాణా నుంచి గస్తీకి బయలుదేరిన సిబ్బంది సాయంత్రం వరకు ఈ సైకిల్ పైనే తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి అలసట లేకుండా అద్భుతంగా పని చేసే షాక్ ఎబ్జార్వర్స్, బ్రేకింగ్ సిస్టం దీనికి ఉన్న అదనపు ఆకర్షణలు. ఈ సైకిల్‌కు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పెట్టెలో ప్రథమ చికిత్స ఉపకరణాలతో పాటు క్రైమ్ సీన్‌ను రక్షించడానికి ఉపయోగించేవీ, సైరన్ ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం లో నేరం జరిగినప్పుడు తక్షణం అక్కడు వెళ్ళే ఎస్బీపీ సిబ్బంది తక్షణం సహాయక చర్యలు చేపట్టడానికి, నేర స్థలిని రక్షించడానికి ఇవి ఉపకరిస్తాయి. భవిష్యత్‌లో ఎస్బీపీ విస్తరణ... దేశంలోనే బెస్ట్ ఠాణాగా నిలిచిన పంజగుట్ట నుంచి ఈ ఎస్‌బీసీని ప్రారంభించారు. భవిష్యత్తులో మరింత విస్తరించాలని నగర పోలీసులు భావిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్ కోసం వినియోగించనున్నట్లు తెలిసింది. రెండో దశలో టూరిస్ట్‌లు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో గస్తీ కోసం వినియోగిస్తారు. ట్యాంక్‌బండ్ చుట్టూ సంచరించే లేక్ పోలీసులతో పాటు కేబీఆర్ పార్క్, పెడస్ట్రియన్ ప్రాజెక్టు అమలవుతున్న చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయించాలని భావిస్తున్నారు. టూరిజం పోలీసింగ్‌కు మాత్రమే కాకుండా బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు. -
చిరుధాన్యాల సైకిల్ మిల్లు!
ఆరోగ్య సిరులనిచ్చే వివిధ రకాల చిరుధాన్యాలను వర్షాధారంగా సాగు చేసుకునే మెట్టప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులకు ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవడం పెను సమస్యగా మారింది. మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసే చిన్న రైతులు వాటిని మిల్లుల్లో మరపట్టించడానికి దూరప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొండ ప్రాంత గిరిజన రైతులకు మరీ ఇబ్బంది. లేదంటే పాత పద్ధతుల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ.. రోట్లో దంచుకొని తినాల్సి వస్తోంది. నిజానికి పండించిన చిరుధాన్యాలను సులభంగా పొట్టు తీసి బియ్యంగా మార్చుకోలేకపోవడం వల్ల చాలా మంది రైతులు వీటిని సాగు చేయడం మానేశారు. అయితే, ఇటీవల కాలంలో పట్టణ, నగరప్రాంత వాసుల్లో కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెల (సిరిధాన్యాల) వాడకం పట్ల అమితాసక్తి రేకెత్తడంతో ప్రస్తుతం చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలా మంది రైతులు, రైతు బృందాలు సిరిధాన్యాల సాగుకు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఖాదర్‌వలీ సాధారణ మిక్సీని వేగాన్ని తగ్గించేందుకు కాయిల్ మార్చడం, బ్లేడు పదునును తగ్గించడం ద్వారా సిరిధాన్యాలను ఇంటిపట్టునే సులభంగా బియ్యం తయారు చేసుకునే పద్ధతిని సూచిస్తున్నారు. ఇదే కోవలో.. మైసూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ(సి.ఎఫ్.టి.ఆర్.ఐ.) సైకిల్ మాదిరిగా తొక్కుతూ చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యం తయారు చేసే చిన్న యంత్ర నమూనాను రూపొందించింది. దీన్ని ‘పెడల్ ఆపరేటెడ్ మిల్లెట్ డీహల్లర్’ అని పిలుస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు విద్యుత్తు అవసరం లేకుండా గ్రామస్థాయిలో ఉపయోగించుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఈ డిజైన్‌ను సి.ఎఫ్.టి.ఆర్.ఐ. వెబ్సైట్ ఫ్రీ టెక్నాలజీస్ విభాగం నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని, ఆయా కొలతల మేరకు ఎవరికి వారు ఈ యంత్రాన్ని తమ ఊరిలోనే తయారు చేయించుకునేందుకు అన్ని వివరాలను పొందుపరిచారు. సైకిల్ మాదిరిగా తొక్కుతుంటే.. చిరుధాన్యాల ధాన్యం పైన ఉండే పొట్టు ఊడిపోయి వండుకు తినడానికి అనువైన బియ్యం వెలికి వస్తాయి. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. మైసూరులో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ బి. వి. సత్యేంద్రరావు ఈ యంత్రాన్ని రూపొందించారు. ‘పెడల్ ఆపరేటెడ్ మిల్లెట్ డీహల్లర్’ ఉపయోగాల గురించి ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి డా. సత్యేంద్రరావు ప్రత్యేకంగా అందించిన వివరాలు.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసి, వండుకుతినే చిన్న, సన్నకారు రైతులు తమ ఇంట్లోనే చిరుధాన్యాల బియ్యం అవసరమైనప్పుడు తయారు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం. గ్రామంలో రైతులంతా కలిసి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. మట్టిపెళ్లలు, రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రం చేసి ఎండబెట్టిన ధాన్యాన్ని ఉపయోగించాలి. ధాన్యం సరిగ్గా ఎండితేనే తక్కువ మెరికలు వస్తాయి. విద్యుత్తు అవసరం లేదు. సైకిల్ తొక్కినట్టు తొక్కితే చాలు. గంటకు 10–15 కిలోల చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యం రకాన్ని బట్టి, ఎంత వేగంగా తొక్కుతున్నామన్న దాన్ని బట్టి గంటకు ఎన్ని కేజీలు మర ఆడవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. ధాన్యం నెమ్మదిగా యంత్రంలోకి వెళ్లేలా చూసుకోవాలి. వేగంగా ధాన్యం లోపలికి పడుతూ ఉంటే యంత్రాన్ని తొక్కే మనిషి మరింత బలంగా తొక్కాల్సి ఉంటుంది. యంత్రాన్ని స్థిరమైన వేగంతో తొక్కితేనే పని సజావుగా సాగుతుంది. యంత్రాన్ని గంట తొక్కితే 13 కిలోల ఊదలు, 11 కిలోలకు పైగా కొర్రలు, 15 కిలోల అరికెలు, 11 కిలోల ఒరిగెలను మర పట్టవచ్చు. పోషకాలు కోల్పోకుండా నాణ్యంగా చిరుధాన్యాల బియ్యాన్ని పొందవచ్చని డా. సత్యేంద్ర వివరించారు. వేగాన్ని బట్టి యంత్రంలోని బ్లోయర్ తిరుగుతుంది. పై నుంచి జారే ధాన్యాన్ని బ్లోయర్ వేగంగా రబ్బర్ రింగ్‌కు తగిలేలా విసురుతుంది. ఆ దెబ్బకు ధాన్యపు గింజ పైపొర ఊడిపోతుంది. బియ్యం, పొట్టు వేర్వేరుగా బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. ఈ యంత్రం నమూనా(ప్రొటోటైప్)ను తయారు చేసి మైసూరులో సందర్శకులకు అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ సి.ఎఫ్.టి.ఆర్.ఐ.లో కూడా నమూనా యంత్రాన్ని ప్రదర్శనకు ఉంచితే రైతులకు మేలు కలుగుతుంది. దీని విడిభాగాల కొలతలు, తయారు చేసే విధానాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. దీని తయారీకి రూ. 17,500 ఖర్చు అవుతుందని, రూ.25 వేలకు విక్రయించవచ్చని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. అంచనా. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు పెద్ద ఎత్తున చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచుకుంటే విద్యుత్తు మోటార్లతో నడిచే యంత్రాలు మార్కెట్లో అనేక సంస్థలు అందుబాటులోకి తెచ్చాయని డా. సత్యేంద్ర తెలిపారు. రాళ్లు రప్పలు, మట్టిగడ్డలు తదితరాలను చిరుధాన్యాల నుంచి వేరు చేయడానికి చిన్న, పెద్దస్థాయి యంత్రాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయని డా. సత్యేంద్రరావు తెలిపారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ సత్యేంద్రరావును 0821–2514534, 099868 46730 ద్వారా సంప్రదించవచ్చు. Email: ttbd@cftri.res.in -
సైకిల్‌పై నుంచి పడి విద్యార్థి దుర్మరణం
పగిడ్యాల : బీరవోలులో ప్రమాదవశాత్తు సైకిల్ మీద నుంచి జారిపడి ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి..గూడూరు గ్రామానికి చెందిన బోయ విజయుడు, నాగమణి దంపతుల కుమారుడైన రాంభూపాల్(13) అవ్వతాత ఊరైన బీరవోలులో ఉంటూ నందికొట్కూరు జీవనజ్యోతి పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాల వెళ్లి వచ్చిన రాంభూపాల్ సాయంత్రం సరదాగా సైకిల్ తొక్కడానికి పగిడ్యాలలోని మోడల్ పాఠశాల మైదానంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో సైకిల్ నుంచి ప్రమాదావశాత్తు జారిపడిపోయాడు. ఘటనలో నడుముకు తీవ్రగాయాలు కావడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన మోడల్ స్కూల్ విద్యార్థులు బాలుడి అవ్వతాతలకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని నందికొట్కూరుకు తరలించారు. వైద్యుల సూచనల మేరకు కర్నూలు రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స ఫలించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
టాప్ స్పీడ్‌లో టూవీలర్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు డిసెంబర్ నెలలో జోరు చూపించాయి. హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలన్నీ వాటి వాహన విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. సుజుకీ మోటార్‌సైకిల్ దేశీ విక్రయాలు 53 శాతం వృద్ధితో 21,362 యూనిట్ల నుంచి 32,786 యూనిట్లకు ఎగశాయి. రాయల్ ఎన్ఫీల్డ్ దేశీ విక్రయాలు 16 శాతం వృద్ధితో 56,316 యూనిట్ల నుంచి 65,367 యూనిట్లకు పెరిగాయి. మరొకవైపు టాటా మోటార్స్ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 30.96 శాతం వృద్ధితో 14,180 యూనిట్లకు పెరిగాయి. ఇక మొత్తం వాహన విక్రయాలు 52.48 శాతం వృద్ధితో 35,825 యూనిట్ల నుంచి 54,627 యూనిట్లకు ఎగశాయి. ఫోర్డ్ ఇండియా దేశీ విక్రయాలు మాత్రం 8.6 శాతం క్షీణతతో 5,566 యూనిట్ల నుంచి 5,087 యూనిట్లకు తగ్గాయి. దీని మొత్తం వాహన అమ్మకాలు 27 శాతంమేర పెరిగాయి. ఇవి 23,470 యూనిట్ల నుంచి 29,795 యూనిట్లకు ఎగశాయి. కాగా ‘లో బేస్ ఎఫెక్ట్’ వల్లే తాజా వృద్ధి కనిపించినట్లు వారు చెప్పారు. -
మొబైక్.. ఇదో హైటెక్ సైకిల్
సాక్షి, హైదరాబాద్: లేటెస్ట్ మోడల్ కార్లు హల్చల్ చేసే విశ్వనగరం రోడ్లపై త్వరలో కిరాయి సైకిళ్లు కన్పించనున్నాయి! సైకిళ్లంటే మామూలు సైకిళ్లు కాదండోయ్.. హైటెక్ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా హైటెక్ హంగులతో రాబోతున్నాయి మొబైక్‌లు. బిజీ లైఫ్‌లో వ్యాయామం సాధ్యం కాని వారికి ఈ మొబైక్లతో ఆ చాన్స్ దొరకనుంది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఇంధనాన్ని పొదుపు చేయెచ్చు. త్వరలోనే మెట్రో రైల్ కారిడార్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త రకం సైకిళ్లను కొనాల్సిన పని లేదు. పాతకాలం రోజుల్లో మాదిరిగా గంటల లెక్కన కిరాయికి తీసుకోవచ్చు. మెట్రో రైలు దిగగానే చూడచక్కని డిజైన్‌తో ఆకట్టుకునే ఇంపోర్టెడ్ సైకిలెక్కి వెళ్లాల్సిన చోటికి వెళ్లొచ్చు. హైదరాబాద్ లాంటి ట్రాఫిక్‌లో సైకిళ్లెక్కడ వర్కవుట్ అవుతాయనే చింతక్కర్లేదు! ఏ గల్లీలో నుంచైనా షార్ట్కట్లు ఉంటాయి. చిన్నప్పుడు సైకిల్ తొక్కినా తొక్కకపోయిన ఆరోగ్యం, అవసరం కోసం ఇప్పుడు అలవాటు చేసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. చైన్లెస్.. డిస్క్ బ్రేకులు.. మెట్రో మార్గాల్లో అందుబాటులోకి రానున్న మొబైక్ను వినూత్న పద్ధతిలో రూపొందించారు. ఇది సైకిల్ మాదిరే ఉన్నా.. సాధారణ సైకిల్‌కు ఉన్నట్లు చైన్ ఉండదు. పంక్చర్లెస్ టైర్లు ఉం టాయి. బ్రేక్ సిస్టం అత్యంత భద్రమైనది. సాధారణ సైకిళ్ల బ్రేకులు కొన్ని సందర్భాల్లో సకాలంలో సహకరించకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తుంది. మొబైక్లో బ్రేక్ వ్యవస్థ మోటారు సైకిళ్ల మాదిరిగా డిస్క్ సిస్టంతో రూపొందించారు. ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఈ మొబైక్కు అత్యాధునిక పద్ధతిలో సీటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. సరుకులు తీసుకెళ్లేందుకు వీలుగా స్ట్రాంగ్ బాస్కెట్ ఉంటుంది. విదేశాల్లో విజయవంతంగా.. ప్రస్తుతం సింగపూర్, జపాన్, మలేసియా, అమెరికా, చైనా, యూకే, ఇటలీ, థాయ్‌లాండ్ దేశాల్లోని 180 నగరాల్లో 70 లక్షల మొబైక్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. రోజుకు సగటున 2.5 కోట్ల మంది వీటిని నడుపుతుండగా.. 15 కోట్ల మంది ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. త్వరలో ఇండియాలోని మెట్రో నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైక్ సంస్థ ఏర్పాట్లు వేగవంతం చేసింది. భారత మార్కెట్‌కు అనుగుణంగా వీటిని మరింత అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. శనివారం హైటెక్స్‌లో జరిగిన అర్బన్ మొబిలిటీ ఇండియా–2017 సదస్సులో మొబైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతిక హంగులు... మొబైక్ల నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు. ప్రస్తుతం ఇవి మెట్రో మార్గాల్లో అద్దె పద్ధతిలో అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో రైల్ స్టేషన్ నుంచి వీటిని కిరాయికి తీసుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకించి వ్యవస్థ ఏమీ ఉండదు. అంతా సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రక్రియ పూర్తవుతుంది. మొబైక్ను అద్దెకు తీసుకోవాలనుకున్న వారి వద్ద సెల్‌ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. అందులో మొబైక్ యాప్ డౌన్లో చేసుకున్న తర్వాత మొబైక్పై ఉండే క్యూఆర్ కోడ్‌ను చూపిన వెంటనే తాళం తెరుచుకుంటుంది. అప్పట్నుంచి అద్దె సమయం మొదలవుతుంది. గమ్యస్థానాన్ని చేరిన తర్వాత తిరిగి మొబైక్ స్టోర్‌లో నిలిపేయాలి. అద్దె చెల్లింపులకు సంబంధించి నిధులను యాప్‌లో ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలి. మొబైక్‌లు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో నడుస్తాయి. అందుకు ప్రత్యేక వ్యవస్థ అందులో ఉంటుంది. మొబైక్‌లను దారిమళ్లించే ప్రయత్నం చేస్తే రైడర్ మొబైల్ నంబర్‌తో పాటు జీపీఎస్ సిస్టంతో ఇట్టే పట్టేయొచ్చు. -
సైకిల్‌కు బ్రేకులు
ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సర్కారు అందించిన సైకిళ్లు జిల్లాలో పలుచోట్ల పక్కదారి పట్టాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు బడికొస్తా పథకం పేరుతో వీటి పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని తెలుగుదేశం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొంత మంది బాలికలకు సైకిళ్లను అందజేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత వీటిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయా రు. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, మదనపల్లి, శాంతిపురం మండలాల పరిధిలోని పాఠశాలల్లో సైకిళ్లు మాయమయ్యాయనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని మొత్తం 547 ఉన్నత పాఠశాలల్లో గత ఏడాది తొమ్మిదవ తరగతి చదువుతున్న 14,423 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా అధికారుల నివేదికల ప్రకారం రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి ఈ ఏడాది మార్చిలో అన్ని మండల కేంద్రాలకు సైకిళ్లు చేరాయి. అధికారులు జూన్ నెల నుంచి అరకొరగా సరఫరా చేసారు. మిగిలిన సైకిళ్లను అలాగే భద్రపరిచామంటూ పలు చోట్ల విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఎంపిక చేసిన విద్యార్థినులకు బదులుగా అయినవారికి సైకిళ్లను ఇచ్చారని తెలిసిం ది. మొత్తం మీద విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల బడికొస్తా పథకం ఆశయం పూర్తిగా దెబ్బతింది. ఆర్జేడీ హెచ్చరించినా..? జిల్లాలో బాలికలకు సరఫరా చేసిన సైకిళ్లను, వారి ఫొటోలతో సహా బడికొస్తా యాప్‌లో, సీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశిం చారు. ఆ ఆదేశాల ప్రకారం సైకిల్ తీసుకొన్న బాలిక ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ ప్రక్రియ ఏమాత్రం ముందుకు కదలడం లేదు. గత నెలలో తనిఖీకి వచ్చిన ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి త్వరతిగతిన ఫొటోలను అప్లోడ్ చేయకపోతే సంబంధింత సిబ్బందిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అయినా ఎంఈఓ, డీవైఈఓల్లో ఎలాంటి చలనమూ లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క ఫొటోనూ అప్లోడ్ చేయని మండలాలివే.. జిల్లాలో14,423 సైకిళ్లను సరఫరా చేసినట్లు చెబుతుం డగా.. ఇప్పటి వరకు 2,393 సైకిళ్ల ఫొటోలను మాత్రమే అప్లోడ్ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క విద్యార్థి ఫొటో కూడా అప్లోడ్ చేయని మండలాల్లో కుప్పం, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, రేణిగుంట, ఏర్పేడు, విజయపురం, చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల, నిమ్మనపల్లి, పులిచెర్ల, కార్వేటినగరం, పెనుమూరు, తవణంపల్లి, గుడిపాల, యాదమరి, గంగవరం ఉన్నాయి. అక్రమాలు రుజువైతే కఠిన చర్యలు రాష్ట్ర విద్యాశాఖ నిబంధనల ప్రకా రం విద్యార్థినుల ఆధార్ లింక్ ఆధారంగానే సైకిళ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన వారికి కాకుండా వేరొకరికి సైకిళ్లను ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో విద్యార్థుల ఫొటోలను అప్లోడ్ చేయని వారిపై నివేదిక సిద్ధం చేస్తాం. – పాండురంగస్వామి, డీఈఓ -
వెయ్యి రాకెట్లకు నిప్పు.. వైరల్ వీడియో
-
వెయ్యి రాకెట్లకు నిప్పు.. వైరల్ వీడియో
సాక్షి ప్రత్యేకం: అమెరికాకు చెందిన కొలిన్ ఫర్జ్ అనే వ్యక్తి చేసిన సహసం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వెయ్యి రాకెట్ టపాసులను సైకిల్ వెనుక పెట్టుకుని దాన్ని తొక్కుతూ వాటికి నిప్పంటించాడు. అంతే ఒక్కసారిగా భారీ శబ్దాలతో రాకెట్లన్నీ నింగిలోకి దూసుకెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్ చక్కర్లు కొడుతోంది. మరి మీరు ఓ లుక్కేసేయండి. -
సైకిల్ కోసం తమ్ముడితో గొడవపడి..
బంజారాహిల్స్: సైకిల్ కోసం ఇంట్లో తమ్ముడితో గొడవపడిన ఓ బాలుడు అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని దుర్గా ఎన్‌క్లేవ్‌కు చెందిన అశోక్‌దాస్ స్థానిక సెయింట్ అగస్టీన్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా తన సోదరుడు అభినాకాంత్తో సైకిల్ విషయమై గొడవపడుతున్నాడు. తల్లిదండ్రులు తమ్ముడికే మద్దతు ఇస్తున్నారంటూ అలిగి బుధవారం ఉదయం చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో తండ్రి ఆనంద్ కిషోర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8106216163 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఘోర ప్రమాదం, ఇద్దరు మృతి
వరంగల్: నగరంలోని నాగమయ్య పెట్రోల్ బంకు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
మేనకోడలి మృతదేహంతో 10 కి.మీ..
కౌశాంబి : ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ హృదయవిధారక సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో అంబులెన్స్‌లు ఉన్నా డబ్బులేనిదే పనిజరగదని మొరాయించాయి. దీంతో కొండంత దుఃఖాన్ని దిగమింగి ఏడు నెలల మేనకోడలి మృతదేహాన్ని తన భుజాలపైనే మోసుకెళ్లాడో అభాగ్యుడు. చిన్నారిని ఓ చేత్తో మరో చేత్తో సైకిల్ హ్యాండిల్ పట్టుకొని 10 కిలో మీటర్లు ప్రయాణించాడు. వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్‌లోని మజ్హన్పూర్లో మలాక్ సద్దీ గ్రామానికి చెందిన 7 నెలల చిన్నారి పూనమ్‌కు వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవ్వడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు సమకూర్చడానికి రోజూవారి కూలిగా పనిచేసే పూనమ్ తండ్రి అనంత్ కుమార్ అలహాబాద్ వెళ్లాడు. అదే సమయంలో చిన్నారిని చూసుకోవాల్సిందిగా బావమరిది బ్రిజ్ మోహన్‌కు అనంత్ చెప్పి బయలుదేరాడు. అయితే రెండు రోజుల చికిత్స అనంతరం పూనమ్ మృతిచెందింది. దీంతో చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సమకూర్చాలని ఆసుపత్రి వర్గాలను బతిమిలాడాడు బ్రిజ్ మోహన్. వారు నిరాకరించడంతో చేసేదేమీలేక చివరకు ఓ సైకిల్‌ను అద్దెకి తీసుకొని చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వెళ్లాడు. భుజంపైనే మేనకోడలి మృతదేహాన్ని పెట్టుకొని సైకిల్ పై గ్రామానికి చేరుకున్నాడు. 'నేను అంబులెన్స్ డ్రైవర్‌కు చాలా సార్లు ఫోన్ చేశాను. కానీ, నా మేనకోడలి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లడానికి అతను నిరాకరించాడు. చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో సైకిల్ మీదే నా కోడలిని తీసుకువెళ్లాను'అని బ్రిజ్ మోహన్ చెప్పాడు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్ కే ఉపాధ్యాయ్ తెలిపారు. డ్రైవర్‌తో పాటూ ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. కాగా, డీజిల్‌కు డబ్బులేక పోవడం వల్లే అంబులెన్స్‌ను సమకూర్చలేకపోయామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. -
సైకిల్‌పై గొత్తికోయ గూడెంలకు కలెక్టర్
గోవిందరావుపేట(ములుగు): జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఏ.మురళి ఆదివారం సైకిల్ సవారీ చేశారు. తాడ్వాయి రేంజ్ పరిధిలోని రాపట్ల అటవీ ప్రాంతంలో నివ సిస్తున్న గొత్తికోయ గూడెంను ఆయన సందర్శించారు. ఆ ప్రాంతానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవ డంతో పస్రా రేంజ్ అటవీ ప్రాంతం నుంచి అటవీ శాఖ బేస్ క్యాంపు సిబ్బందితో కలసి సైకిల్‌పై వెళ్లిన ఆయన గూడెంలోని మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. -
సైకిల్ వాలాలేరి
‘‘ట్రింగ్.. ట్రింగ్, నేను... సైకిల్ని. నా కర్మకాలి.. ఈ ఎదవ కింద పడ్డాను.. నాలాంటి అందాల సైకిల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలా..? మరి ఏం చేస్తున్నాడు వీడు.... టైమ్‌కి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు...’’ ఈ డైలాగ్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు.. ‘మర్యాదరామన్న’ సినిమాలో సైకిల్ డైలాగేగా... బాగా గుర్తుంది అంటారా..? ’ హీరో ఇంట్రడక్షన్లో ఓ సీను.. రైల్వే స్టేషన్లో ఓ సీను.. లాస్ట్‌లో ఓ సీను’.. అంటూ సినిమా అంతా గుర్తు తెచ్చుకుంటు న్నారా? ‘‘బెల్ లేకపోయినా, బ్రేక్‌లు పని చేయకపోయినా.. చైన్ లూజ్ అయిపోయినా... టైర్లు అరిగిపోయినా... చక్రాలకు రెండు, మూడు ఊసలు విరిగిపోయినా... ‘‘సీటు, హ్యాండిల్ బాగానే ఉన్నంతకాలం ఏ సైకిల్నైనా అలానే వాడేస్తాం’’. అందుకే కాబోలు రాజమౌళి సైకిల్ బాధను సినిమాలో చూపించి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. ముసలిదై మూలన పడి... నిజానికి నిదానంగా నడిచే ప్రపంచానికి పరుగు నేర్పించింది సైకిల్. సమయాన్ని, శ్రమను తగ్గించి సౌఖ్యాన్ని కూర్చింది. సుదూర గమ్యాలను సునాయాసంగా కాణీ ఖర్చు లేకుండా చేర్చే సైకిల్... కాల క్రమేణా పేదలకు, పెద్దలకు పల్లకిగా మారి ఓ వెలుగు వెలిగింది. కానీ, ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో పరుగుతీసే జనాల వేగాన్ని అందుకోలేక.. పల్లెల్లో పొలం పనులకు వెళ్లే వారు, చదువుకునే పిల్లలు, చిన్నా చితకా పనులు చేసుకునే కూలీలు, వర్క్ఔట్లు చేసేవాళ్లు చేతుల్లో మాత్రమే ప్రస్తుతం సైకిల్ ‘ట్రింగ్.. ట్రింగ్..’ అంటోంది. కిల్ అయిన సైకిల్ సామాన్యుడికి కొండంత అండగా ఉన్న సైకిల్ టైర్‌కి పంక్చరయ్యింది. చైన్ తెగిపోయింది. హ్యాండిల్ వంగిపోయింది. బెల్ ఊడిపోయింది, బ్రేకులు పాడైపోయాయి. చివరాఖరికి మూలన పడిపోయిన... సైకిల్ ఒకప్పుడు చరిత్రను ఏలింది. ఒకప్పుడు దొరలను మోసింది. మంత్రులను పార్లమెంటులో దించింది. కట్నంలా మారి పెళ్లికొడుకుల డిమాండ్‌ను కూడా విపరీతంగా పెంచేసింది. 200 ఏళ్ల వయసు సైకిల్ పుట్టి ఒకటì , రెండు సంవత్సరాలు కాదు. ఏకంగా 200 ఏళ్లు పూర్తయ్యింది. జర్మన్ బారన్ కార్ల్ వాన్ డ్రైస్ అనే శాస్త్రవేత్త 1817లో జర్మనీలో సైకిల్‌ను రూపొందించారు. మొదట్లో సైకిల్‌కి కిందSచైన్ కనెక్షన్ ఉండేది కాదు. ఎక్కి కూర్చుని కాళ్లతోనే నెట్టుకుంటూ ప్రయాణాలు చేసేవారు. 1870 నాటికి సైకిల్ చరిత్రలో వింత మోడల్ సంతరించుకుంది. సీట్ కింద టైర్ చాలా పెద్దదిగా, వెనుక ఉండే సపోర్టింగ్ టైర్ చాలా చిన్నదిగా ఉండి.. అప్పటి యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా శతకోటి సైకిళ్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల సైకిల్స్ పైనే ఉండగా.... అందులో సింహభాగం చైనావే కావడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ 10 కోట్ల సైకిళ్లు తయారవుతున్నాయని ఓ అంచనా. రికార్డుల్లో సైకిల్ డచ్ సైక్లింగ్ సంస్థ సభ్యులు ప్రపంచంలోనే అతి పొడవాటి సైకిల్ తయారు చేసి గిన్నిస్ రికార్డును సృష్టించారు. ఏకంగా 35.79 మీటర్ల పొడవు ఉన్న ఈ సైకిల్ చూడటానికి బైక్‌లా కనిపిస్తుంది. ఇక ప్రపంచంలో అతి చిన్న సైకిల్ కూడా ఉంది. ఆటబొమ్మలా కనిపించే దీని పొడవు 7 అంగుళాలు మాత్రమే. తన తండ్రి తయారు చేసిన అంత చిన్న సైకిల్‌ను తొక్కి బాబీ అనే వ్యక్తి గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. సైకిల్ రూట్ ప్రపంచ వ్యాప్తంగా సైకిల్ వాడకం ఎంత తగ్గిపోయినా.. ప్రత్యేకించి వాటినే వాడే వారికోసం స్పెషల్‌గా సైకిల్ పాత్లను కూడా నిర్మించాయి చైనా, జర్మనీ, అమెరికా వంటి కొన్ని దేశాలు.... రయ్ రయ్ మంటూ పరుగులు తీసే కార్లు, బైకులు, లారీలు, వ్యాన్లతో సంబంధం లేకుండా కేవలం సైకిళ్ల కోసం స్పెషల్ రోడ్లను, బ్రిడ్జ్‌లను సమకూర్చి ఔరా అనిపిస్తున్నాయి. -
సైకిళ్లిస్తున్నాం..సైకిల్‌కే ఓటేయించండి
బాలికలను కోరిన సీఎం సాక్షి, అమరావతి: తొమ్మిదో తరగతి చదివే బాలికలందరికీ సైకిళ్లిస్తున్నామని, అందరూ సైకిల్‌కే ఓటేయించాలని సీఎం చంద్రబాబు విద్యార్థినులను కోరారు. మీ అమ్మానాన్నలు, మీ చుట్టుపక్కల వాళ్లతో చెప్పి ఓట్లేయించి మళ్లీ తమనే గెలిపించాలన్నారు. సోమవారం విజయవాడలోని ఒక ఫంక్షన్ హాలులో ‘బడికొస్తా’ పేరుతో తొమ్మిదో తరగతి బాలికలకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైకిల్ తొక్కితే ఆరోగ్యం బాగుంటుందని, అలాగే సైకిల్‌కి ఓటేస్తేనే అందరి ఆరోగ్యం బాగుంటుందన్నారు. బడి పిల్లల సభలోనూ బాబు ఓట్ల గురించి మాట్లాడడంతో అంతా విస్తుపోయారు. ఉచితంగా సైకిల్ ఇచ్చామని దాన్ని కచ్చితంగా బాలికలే వినియోగించాలని చంద్రబాబు సూచించారు. -
సైకిల్ కావాలా.. ఆటో కావాలా..!
- ఎస్‌హెచ్‌జీల మహిళలకు స్త్రీనిధి బ్యాంక్ రుణ సదుపాయాలు - సైకిల్‌కు రూ.5వేలు, ఆటో లేదా ట్రాలీకి రూ.1.20 లక్షలు రుణమివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల కుటుంబాలకు సాధారణ రవాణా సౌలభ్యంతో పాటు జీవనోపాధికి రెండు కొత్త రుణ సదుపాయాలను స్త్రీనిధి బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి సైకిల్ కొనుగోలుకు కాగా, మరొకటి ఆటో లేదా ట్రాలీని కొనుక్కునేందుకు రుణాలను అందించాలని నిర్ణయించింది. సైకిల్ కొనుక్కోవాలనుకున్న మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 3వేల నుంచి రూ.5 వేల చొప్పున, ఆటో లేదా ట్రాలీ కొనుగోలుకు రూ.1.20 లక్షల చొప్పున రుణాలిచ్చే ప్రతిపాదనలకు స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్య కమిటీ ఆమోదం తెలిపింది. స్త్రీనిధి బ్యాంక్ నుంచి ఆయా స్వయం సహాయక సంఘాలు సాధారణంగా తీసుకునే మైక్రో/టైనీ రుణాలతో నిమిత్తం లేకుండా కొత్త రుణాలను పొందవచ్చని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్‌హెచ్‌జీల నుంచి వచ్చే డిమాండ్ మేరకు కొత్త రుణ సదుపాయాల నిమిత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల దాకా బడ్జెట్‌ను కేటాయించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సైకిల్ రవాణా.. పర్యావరణ హితం: పర్యావరణ హితమైనది కాబట్టి సైకిల్ రవాణాను పోత్సహించాలని స్త్రీనిధి బ్యాంక్ భావించింది. తొలుత ఆయా గ్రామాలు, మురికివాడల్లోని ఏ, బీ, సీ గ్రేడ్ సంఘాల్లోని సభ్యులకు, ఏ, బీ, సీ గ్రేడ్ మండల, పట్టణ సమాఖ్యల్లోని సభ్యులకు సైకిల్ రుణాలను అందించనున్నారు. సైకిల్ కోసం తీసుకున్న రుణాన్ని 12 సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. లాభసాటి ఉపాధి కోసం ఆటో, ట్రాలీ: లాభసాటి ఉపాధిని కోరుకునే ఎస్‌హెచ్‌జీ మహిళల కుటుంబసభ్యులు ఆటో లేదా ట్రాలీ కొనుగోలు చేసేందుకు రుణాలను అందించాలని స్త్రీనిధి బ్యాంక్ నిర్ణయించింది. కొత్త వాహనం లేదా మూడేళ్లకు మించని సెకండ్ హ్యాండ్ వాహనాన్నైనా కొనుక్కునేందుకు వెసులుబాటు కల్పించింది. ఒక్కొక్క గ్రామ/మురికివాడ(స్లమ్ లెవల్ ఫెడరేషన్ సమాఖ్య)లో ఈ రుణ సదుపాయాన్ని ఇద్దరికే పరిమితం చేశారు. ప్యాసింజర్ ఆటో లేదా ట్రాన్స్పోర్ట్ ట్రాలీ కొనుగోలు చేయనున్న ఎస్‌హెచ్‌జీ మహిళ కుటుంబసభ్యుల్లో ఒకరికి సదరు వాహనం నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వాహనం కొనుగోలుకు గరిష్టంగా రూ.1.20 లక్షలను స్త్రీనిధి బ్యాంక్ ఇస్తుండగా, అంతకన్నా ఎక్కువ ధర అయినట్లయితే మిగతా సొమ్మును లబ్ధిదారులే భరించాలి. వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత రుణ మొత్తాన్ని 60 సులభ వాయిదాల్లో చెల్లించాలి. -
‘పోలో’మంటూ..
పోలో.. ఆట గురించి తెలుసు కదా? గుర్రాల మీద దౌడుతీస్తూ... పొడవాటి కర్రతో బంతిని గోల్‌లోకి నెట్టే క్రీడ. చూడ్డానికి ఉత్కంఠ భరింతగా.. గుర్రాలతో తలపడే తీరు పాతకాలం నాటి యుద్ధా సన్నివేశాలను తలపిస్తోంది. ఇంచుమించు అటువంటి క్రీడే... సైకిల్ (బైస్కిల్) పోలో. గతం నుంచీ ఉన్న సంప్రదాయ క్రీడేనైనా.. ఇప్పుడిప్పుడే తూర్పుగోదావరి జిల్లాలో ‘పోలో’మంటూ దీనికి ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)లో దీనిని చేర్చడంతో మరింత ఆదరణ పెరిగే అవకాశముంది. సాక్షి, అమలాపురం: ఒక్కో జట్టు తరఫున నలుగురు మాత్రమే క్రీడాకారులు మైదానంలో ఆడాల్సి ఉంది. మరో ఇద్దరు, నలుగురు అదనపు క్రీడాకారులుంటారు. ఎవరు ఎక్కువగా గోల్స్ చేస్తే వారే గెలిచినట్టు. మొత్తం 30 నిమిషాల పాటు రెండు జట్ల మధ్య పోటీ సాగుతుంది. నాలుగు క్వార్టర్లుగా (క్వార్టర్ 7.30 నిమిషాలు) చేసి ఆడిస్తారు. ఈ ఆటలో ప్రత్యేకంగా గోల్‌కీపర్ అంటూ ఉండడు. ఏ క్రీడాకారుడైనా గోల్ చేయడం, అడ్డుకోవడం చేయవచ్చు. కాని బాల్‌ను బ్యాట్‌తో టచ్ చేసేటప్పుడు మాత్రం కాలు భూమిమీద పెట్ట కూడదు. అలా చేస్తే ఫౌల్‌గా పరిగణిస్తారు. క్రీడా మైదానం 100 మీటర్లు పొడవు, 80 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ గేమ్‌కు వినియోగించే సైకిల్‌కు ముందు బ్రేక్, మధ్యలో మడ్ఘర్ ఉండదు. బ్యాట్ ఇంచుమించు సుత్తిలా ఉంటుంది. పట్టుకునే కర్ర మాత్రం పొడవుగా ఉంటుంది. ప్రపంచ పోటీల్లో మన దేశం హవా ఇంటర్నేషనల్ బైస్కిల్ చాంపియన్ షిప్ పోటీల్లో మన దేశ జట్టు పలు సందర్భాల్లో సత్తా చాటింది. 1996లో యూఎస్ఏలో రిచ్‌ల్యాండ్, 1999లో కెనడా, 2000లో మన దేశంలో న్యూఢిల్లీలో, 2001లో బ్రిటన్‌లోని లండన్‌లో మనదేశం విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించింది. 2002లో ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో, 2004లో కెనడాలో జరిగి పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచి రజపతకాలు కైవసం చేసుకుంది. పెరుగుతున్న ఆదరణ సైకిల్ పోలోకు మన జిల్లాలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. కాకినాడ, పిఠాపురం, మామిడికుదురు కేంద్రాలుగా ఈ క్రీడ వృద్ధి చెందుతోంది. గత ఏడాది నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్ –19 విభాగంలో సైకిల్ పోలోకు అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో మన జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. గత ఏడాది కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఎస్జేఎఫ్–17 రాష్ట్రస్థాయి పోటీల్లో బాలురు మూడో స్థానం, బాలికలు రెండో స్థానం పొందారు. జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారుల్లో జేహెచ్ఎస్ అరుణ్‌తేజ్, వి.యశస్వీ, యు.అంబికా, స్వర్ణలేఖలు జాతీయస్థాయి పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఛతీస్ఘడ్ రాష్ట్రం బిలాయిలో జరిగిన జాతీయ పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించారు. వీరి ఎంపిక మరికొంత మంది క్రీడాకారులకు ఉత్తేజాన్నిస్తోంది. అక్కడ కూడా మన రాష్ట్ర బాలికల జట్టు రెండవ స్థానంలో, బాలుర జట్టు మూడవ స్థానంలో నలిచింది. రాజోలు ఎంఈవో జొన్నలగడ్డ గోపాలకృష్ణ, పిఠాపురానికి చెందిన యోగాకోచ్ పల్ల లక్ష్మీణరావులు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం చత్తీస్ఘడ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఇండియన్ ఆర్మీ, రాజస్థాన్ జట్లు ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇటువంటి క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో క్రీడామైదానాలు, సైకిళ్లను ఏర్పాటు చేయాలి. మన క్రీడాకారులు సాధారణ సైకిళ్లపై శిక్షణ పొందుతున్నారు. వీరు అంతర్జాతీయ పోటీలకు వెళితే ఆ స్థాయిలో రాణించలేరు. – జొన్నాలగడ్డ గోపాలకృష్ణ, ఎంఈవో, కోచ్, రాజోలు జాతీయస్థాయిలో ఆడడం ఆనందంగా ఉంది తొలి ప్రయత్నంలో నేను రాష్ట్ర జట్టుకు ఎంపికకావడం ఆనందంగా ఉంది. మాకు స్థానికంగా మంచి శిక్షణ ఇచ్చారు. జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ పోటీల్లో రాణించాలన్నదే నా ఆశ. – జె.హెచ్.ఎస్.అరుణ్‌తేజ్, సైకిల్‌పోలో క్రీడాకారుడు -
సైకిల్‌పై బీట్ కానిస్టేబుళ్ల గస్తీ
కర్నూలు : గస్తీ పోలీసులు ఇకనుంచి సైకిళ్లపై పర్యటించే విధంగా ఎస్పీ ఆకే రవికృష్ణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు గస్తీ పోలీసులు మోటర్‌సైకిళ్లపై కాలనీల్లో పర్యటించేవారు. అయితే ఇకపై ఈ–గస్తీలో భాగంగా సైకిళ్లపై బీట్లు తిరగడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్థానిక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసుల ఆరోగ్యం కోసం పార్కులు, జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు కుటుంబాల మహిళలకు అధునాతన జనపనార బ్యాగ్ చేతికుట్టు పనులు, పోలీస్ గెస్ట్‌హౌస్‌లో టీవీలు తదితర వాటి ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, కృష్ణమోహన్, సీఐ డేగల ప్రభాకర్, ఏఓ అబ్దుల్ సలాం, ఆర్ఐ రంగముని, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
సైకిల్‌కు రెండు చక్రాలం
ఎస్పీ సైకిల్‌కు హస్తం సారథ్యం ► రాహుల్, అఖిలేశ్ వ్యాఖ్య ► బీజేపీ విభజన రాజకీయాలను తుదముట్టించాలని ప్రజలకు పిలుపు ► తొలిసారి సంయుక్తంగా ప్రెస్‌మీట్, రోడ్ షో లక్నో: బీజేపీ విభజనవాద రాజకీయాలను తుదముట్టించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌లు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి ఆదివారం లక్నోలో సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తర్వాత రోడ్ షో నిర్వహించారు. దాదాపు ఒకే రకం దుస్తులు ధరించిన యువనేతలు అన్యోన్యంగా కనిపించారు. తామిద్దరం ఒక సైకిల్‌కున్న రెండు చక్రాలమని పేర్కొన్నారు. ‘మా ఇద్దరి వయసుల్లో పెద్ద తేడా లేదు. ఈ రోజు ఆరంభం మాత్రమే. మేమిద్దరం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం’ అని అఖిలేశ్ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీల పొత్తు బీజేపీ విభజన, కక్షపూరిత రాజకీయాలకు సమాధానం(ఉత్తర్) అని రాహుల్ అన్నారు. ‘మా పొత్తు ప్రజల ఆకాంక్ష. ఇది గంగ, యమునల సంగమం. అందులోంచి సరస్వతి అనే అభివృద్ధి వెలువడుతుంది.. ఇది హృదయాల బంధం. మేం కలసి విజయం సాధిస్తాం’ అని పేర్కొన్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఒక్కటిగా ఉన్నారని, ఈ పొత్తు ద్వారా ప్రధాని మోదీకి చెబుతున్నామన్నారు. గంటపాటు సాగిన విలేకర్ల సమావేశంలో ఇద్దరు నేతలు.. ‘కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అయిన హస్తం ఎస్పీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ప్రగతి, అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తుంది’ అని చెప్పారు. తన సోదరి ప్రియాంక, అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్‌లు రెండు పార్టీల తరఫున ప్రచారం చేస్తారా అని రాహుల్‌ను విలేకర్లు అడగ్గా.. ‘ప్రియాంక నాకెంతో సాయం చేస్తోంది. ఆమె మా పార్టీకి పెద్ద అండ. ప్రచారం చేయాలా, వద్దా అన్నది ఆమె నిర్ణయించుకోవ్సాలిన అంశం’ అని అన్నారు. ప్రచారంపై డింపులే నిర్ణయం తీసుకుంటారని అఖిలేశ్ అన్నారు. పొత్తు.. మూడు ‘పీ’ల(ప్రోగ్రెస్, ప్రాస్పరిటీ, పీస్) కోసమని రాహుల్ చెప్పగా, ప్రజల(పీపుల్) కోసమని అఖిలేశ్ మరో పీని జతచేశారు. ‘యూపీకి మా పొత్తు పసందు’ అంటూ ఆలింగనం చేసుకున్నారు. మాయకు చాలా స్థలం కావాలి: అఖిలేశ్ కాంగ్రెస్, ఎస్పీల జట్టులోకి మాయావతి సారథ్యంలోని బీఎస్పీ కూడా చేరే అవకాశముందా అని అఖిలేశ్‌ను విలేకర్లు ప్రశ్నించగా ఆయన సరదాగానే అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జట్టులో ఆమెకు స్థలమెక్కడ ఇవ్వగలం? ఆమెకు చాలా స్థలం కావాలి. ఆమె పార్టీ ఎన్నికల గుర్తు కూడా ఏనుగు’ అని అన్నారు. తాను ఇకపై మాయావతిని అత్త అని అననన్నారు. ‘బీఎస్పీ ప్రభుత్వం తప్పులు చేసి ఉండొచ్చు. అయితే మాయావతీజీ(బీఎస్పీ చీఫ్)పై నాకు గౌరవముంది’ అని రాహుల్ పేర్కొన్నారు. 2006 నాటి కాంగ్రెస్–బీఎస్పీ పొత్తు తప్పిదమని, ఇప్పటి పొత్తు(ఎస్పీతో) కూడా తప్పు కావొచ్చని, చరిత్ర మారుతూ ఉంటుందని అన్నారు. విలేకర్ల సమావేశం తర్వాత రాహుల్, అఖిలేశ్‌లు ‘యూపీ విజయ్ రథ్’లో 12 కి.మీ. రోడ్ షో ప్రారంభించారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల గుండా ఇది సాగింది. ప్రచారం చేయను: ములాయం కాంగ్రెస్, ఎస్పీల పొత్తును ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం తప్పుబట్టారు. ఆ పార్టీల జట్టుకు ప్రచారం చేయనని, ఒంటరిగా పోటీ చేసే సత్తా ఎస్పీకి ఉందని అన్నారు. సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ దేశాన్ని వెనక్కు నెట్టిందని ఆరోపించారు. -
‘సైకిల్’పై 13న స్పష్టత!
ఎల్లుండి ములాయం, అఖిలేశ్ వాదనలు విననున్న ఈసీ లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల గుర్తు సైకిల్ ఎవరికి దక్కనుందనే ఉత్కంఠకు మరో మూడు రోజుల్లో తెరపడనుంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ అయిన ఎస్పీ రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల గుర్తు సైకిల్‌ను తమకే కేటాయించాలంటూ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఎన్నికల సంఘం ఎస్పీ ఇరు వర్గాల నాయకులు అయిన ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ల వాదనలు విననుంది. అనంతరం సైకిల్ గుర్తు ఎవరికి కేటాయించాలన్న దానిపై నిర్ణయం ప్రకటించనుంది. ఉత్తర ప్రదేశ్ తొలి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుండటంతో అంతకు ముందే ఎన్నికల సంఘం గుర్తు ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఈసీ ఈ నెల 13న విచారణకు హాజరవాలని ఎస్పీలోని ఇరు వర్గాలకు నోటీసులు పంపింది. ఇప్పటికే ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని కోరుతూ ఇరు వర్గాలు ఎన్నికల కమిషన్ అధికారులను వేర్వేరుగా కలిశారు. ఉత్తర ప్రదేశ్ అధికార పార్టీ ఎస్పీలో రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మంగళవారం తన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. తన కుమారుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ములాయం ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో అఖిలేశ్ 90 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండానే సీఎం అధికార గృహంలోకి వెళ్లిపోయారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో ఇరువురూ ఏ విషయంపైనా ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో అఖిలేశ్ వ్యతిరేకిస్తున్న శివ్‌పాల్ యాదవ్, అమర్ సింగ్‌ల గురించి చర్చకు రాకపోవడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదరనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఎస్పీ యూపీ అధ్యక్షుడిగా శివ్‌పాల్ యాదవ్‌ను తప్పించాలని, అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న అఖిలేశ్ డిమాండ్లను ములాయం అంగీకరించకపోవడంతోనే అసలు వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఒకటిన ఎస్పీ అధ్యక్షుడిని తానేనని అఖిలేశ్ ప్రకటించుకున్నాడు. అయితే ఇప్పటికీ తానే ఎస్పీ అధ్యక్షుడినని ములాయం అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మద్దతు ఉన్నందున ఆ పదవిని వదులుకోవడానికి అఖిలేశ్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. -
నడిస్తేనే ఆ సైకిల్ ముందుకు కదుల్తుంది..
ఎవరికైనా సైకిల్ అంటే ఒక హ్యాండిల్, సీట్, పెడల్స్, రెండు చక్రాలు గుర్తుకువస్తాయి. ఇది సహజమే. కానీ కాలం మారింది గురూ.. రోజుకో కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తోంది. ప్రస్తుతమున్న టెక్నాలజీలే అప్డేట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి వాటికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఈ సోది అంతా ఎందుకు మ్యాటర్‌కి రా అంటారా? అదే చెబుతున్నా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న సైకిల్ సాధారణ సైకిల్లాగే ఉన్నప్పటికీ దీనికో ప్రత్యేకత ఉంది. సైకిల్ ముందుకు కదలాలి అంటే ఎవరైనా పెడల్‌ను తొక్కాలి. కానీ ఈ సైకిల్ ముందుకెళ్లాలంటే మాత్రం దీనిపై మనం నడవాల్సిందే. సైకిల్‌పై ఉన్న ట్రెడ్‌మిల్‌పై వాహనదారుడు నడుస్తూ ఉంటే సైకిల్ ముందుకు కదులుతూ ఉంటుంది. ఈ సైకిల్‌కు ఒక ఎలక్ట్రిక్ మోటార్‌ను ఫిట్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో సైకిల్ ముందుకు కదులుతుంది. రెండు చక్రాల మధ్య ఉన్న ట్రెడ్‌మిల్‌పై వాహనదారుడు నడుస్తూ ఉంటే ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తి అంది సైకిల్ ముందుకు కదులుతుంది. మనిషి సామర్థ్యాన్ని బట్టి ఇది గంటకు 6 నుంచి 27 కి.మీ. వేగంతో వెళ్లగలదు. దీని ధర 2,115 యూఎస్ డాలర్లు (సుమారుగా రూ. 14 లక్షలు).. డచ్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరగడంతో తయారీదారులు వీటిని ఉత్పత్తి చేసే పనిలో పడ్డారు. దీని పేరు లోపాన్. డచ్‌లో లోపాన్ అంటే నడవడం అని అర్థం. -
తస్కరించాలని చూస్తే.. ఇక అంతే!
సైకిల్ ఎక్కడైనా పెట్టి తాళం వేసి ప్రశాంతంగా ఉండగలమా? ఎంత తాళాలు వేసినా ఎవరు దొంగిలిస్తారో అని అనుమానంగానే ఉంటుంది. మిగిలిన తాళాల సంగతి ఏమోగానీ.. తాము తయారు చేసిన సరికొత్త తాళం వాడితే మాత్రం సైకిళ్లు ఎక్కడికీ పోవని తయారీదారులు గ్యారంటీగా చెబుతున్నారు. ఎందుకంటే ఎవరైనా దొంగలు ఆ తాళం తీయాలని ప్రయత్నిస్తే వాళ్లకు ఆగకుండా వాంతులు అవుతాయట! షంక్లాక్ అనే ఈ కొత్త తాళాన్ని తాము విభిన్నంగా తయారు చేశామని దీని తయారీదారుడు అమెరికాలోని శానిఫ్రాన్సిస్కోకు చెందిన డేనియల్ ఇడ్జ్కోవ్స్కీ చెబుతున్నారు. తమ సైకిళ్లు కూడా తాళాలు వేసి పెట్టినా పోయాయని, అందుకే కాస్త బలమైన తాళం తయారు చేయాలని అనుకున్నామని ఇడ్జ్కోవ్స్కీ తెలిపారు. ఆరు నెలల పాటు కష్టపడి ఆలోచించిన తర్వాత ఈ షంక్లాక్ అనే కొత్తరకం తాళం తయారుచేశామన్నారు. దీన్ని ఎవరైనా కోయాలని ప్రయత్నించగానే.. లోపల ఒక రకమైన రసాయనం ఉంటుందని, అది దొంగల శరీరంలోకి ప్రవేశించి, వాళ్లకు ఆగకుండా వాంతులు అవుతాయని అన్నారు. నేరుగా తాళం చెవి పెట్టి తీస్తే మాత్రమే ఇది సురక్షితమని.. అలా కాకుండా మరే రకంగా తెరవాలని ప్రయత్నించినా అవతలి వాళ్ల పని అంతేనని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జూన్‌లో మార్కెట్లోకి విడుదలయ్యే ఈ తాళం ధర మన కరెన్సీలో రూ. 6,621 మాత్రమే. -
అవిశ్రాంత సవారీ
సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగుల ఆదర్శం ఎటు వెళ్లినా సైకిల్‌పైనే.. కార్లు, బైక్లున్నా.. సైకిలే ఇష్టం సిరిసిల్ల: ఉరుకులు... పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. సరైన వ్యాయామం లేక మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఈ తరుణంలో సైకిల్ సవారీతో నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపొచ్చని నిరూపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు. ఆరు పదుల వయసు దాటినా 20 ఏళ్ల యువకుల్లా ఎక్కడికి వెళ్లినా సైకిల్‌పై సవారీ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వ్యాయామంలో భాగంగా సైకిల్‌పై సంచరిస్తూ అందరినీ పలకరిస్తున్నారు. రోజూ సైకిల్ తొక్కడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్న రిటైర్డు ఉద్యోగులపై ప్రత్యేక కథనం.. ఏళ్ల తరబడి సైకిల్‌పై.. ఒకటి.. రెండు రోజులో కాదు.. ఏళ్లకు ఏళ్లుగా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు. ఇందులో కొందరు ఆర్థికంగా స్థిరపడి కార్లు, బైక్‌లు, మోపెడ్లు ఉన్నా వాటికి దూరంగా ఉంటూ సైకిల్‌పైనే ప్రయాణం చేస్తున్నారు. మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణ సామగ్రి దాకా అన్నింటికీ సైకిలే. నిత్యం ఉదయం గంటసేపు సైకిల్ తొక్కుతూ యువకుల్లా ఉత్సాహంగా గడుపుతున్నారు. సిరిసిల్లలో పాతిక మంది రిటైర్డు ఉద్యోగులు ఎవరికి వారు తీరిక వేళల్లో సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. యువతకు ఆదర్శం.. ఏ చిన్న పనైనా.. కొద్దిపాటి దూరమైనా బైక్‌పై వెళ్తున్న ఈ రోజుల్లో యువతకు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ పని అయినా సైకిల్‌పై వెళ్లి చేసుకుంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగడకుండా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 30 ఏళ్లు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న నేటితరం యువతకు అవిశ్రాంత సైకిలిస్టులు ఆదర్శంగా ఉన్నారు. సైకిల్ తొక్కడంతో చెమట వస్తుందని, గుండెవేగం పెరిగి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మోకాళ్లు, మడిమెల, కీళ్లనొప్పులు ఉండి వాకింగ్ చేయలేని వారికి సైతం సైకిల్ తొక్కమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో సిరిసిల్ల వీధుల్లో సైకిల్ సవారీతో రిటైర్డు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచి.. 15 ఏళ్ల వయసు నుంచి నేను సైకిల్ తొక్కుతున్నా. నాకు పది మంది పిల్లలు. 1965లో పోస్టల్ శాఖలో చేరా. 2010లో రిటైర్ అయ్యాను. ఉద్యోగంలో ఉండగా.. నిత్యం సైకిల్‌పైనే ఉత్తరాలను పంచేవాడిని. అదే అలవాటుతో ఇప్పటికీ సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. - అబ్దుల్ అజీమ్(75), పోస్టుమెన్ మనవడి సైకిల్ తొక్కుతున్నా.. మా మనవడి సైకిల్ నేను తొక్కుతున్న. రోజూ ఉదయం గంట సైకిల్ తొక్కుత. 2009లో ఉద్యోగ విరమణ చేశా. వ్యాయామం కోసం సైకిల్ తొక్కమని డాక్టర్లు చెప్పారు. మూడేళ్లుగా సైకిల్ తొక్కుతున్నా. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. మా మనవడి సైకిల్‌ను వాడుకుంటున్నా. ఉల్లాసంగా ఉంది. - మాణిక్‌రావు లక్ష్మీనారాయణ(68), రిటైర్డు ఉద్యోగి కారు, స్కూటర్ ఉన్నా.. నాకు కారుంది. స్కూటర్ ఎప్పటి నుంచో ఉంది. ఆరోగ్యం కోసం రోజూ సైకిల్ తొక్కుతా. ఉదయం వ్యాయామంలో భాగంగా సిరిసిల్ల వీధుల్లో సైకిల్ తొక్కుతా. కొందరు కొత్తగా చూశారు. కానీ నాకు అలవాటైంది. ఐదేళ్లుగా సైకిల్‌పైనే వ్యాయామం చేస్తున్నాను. పార్కింగ్ సమస్య ఉండదు. పెట్రోల్ అవసరం లేదు. అన్నింటికీ సైకిలే బెటర్. - గుడ్ల రవి(60), రిటైర్డు ఉపాధ్యాయుడు -
సైకిల్‌పై ఎమ్మెల్యే...
చండీగఢ్: పక్క గల్లీకి వెళ్లాలంటే బైక్‌ను ఆశ్రయించే వాళ్లున్న ప్రస్తుత సమాజంలో ఓ ఎమ్మెల్యే ఏకంగా 110 కి.మీ దూరాన్ని సైకిల్ తొక్కుకుంటూ వచ్చేశారు. ఔరా అనిపించినా ఇది నిజం. పవన్ కుమార్ సైనీ బీజేపీ ఎమ్మెల్యే. చండీగఢ్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు పది మంది పార్టీ కార్యకర్తలతో కలసి తొక్కర తొక్కు హైలెస్సా అనుకుంటూ సరదాగా వచ్చేశారు. సైనీ లాడ్వా నుంచి సైకిల్‌పై 8 గంటల్లో చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ‘సైకిల్ తొక్కండి. ఆరోగ్యంగా ఉండండి. పర్యావరణానికి మేలు చేయండి’ అనే సందేశాన్ని ఆచరించి మరీ చూపారు. సైకిల్‌పై అసెంబ్లీకి వచ్చిన సైనీని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా, తాను ఎమ్మెల్యేనని చెప్పడంతో అనుమతిచ్చారు. తక్కువ దూరాలకు ఇప్పటికీ సైకిల్ వాడతానని ఇదే తన ఆరోగ్య రహస్యమని ఆయన చెప్పారు. ఇవే కాదండోయ్ అక్కడి యువత, చిన్నారులకి సైతం సైక్లింగ్ చేయమని సలహానిస్తున్నారు. -
కాల ‘చక్రం’ గిర్రున తిరిగింది...
‘ఏమండీ రేపు ఊరెళదాం,అని పెళ్లాం’ అంటే బస్సా? రైలా? కార్లో వెళదామా అని ఆలోచిస్తాం. కానీ అప్పట్లో కాశీకి పోవాలన్నా మనోళ్లు నడిచే వెళ్లేవారు! అమ్మో అంత దూరం.. అదీ నడిచా? అని మనం ఇప్పుడు నోరెళ్లబెట్టొచ్చేమోగాని.. అప్పట్లో విమానాలు, రైళ్లు, కార్లు సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. చాలా మంది దగ్గర సైకిళ్లు ఉంటే.. కొంత మంది దగ్గర గుర్రపు బగ్గీలు, ఎద్దుల బళ్లు, మోటార్ సైకిళ్లు ఉండేవి. బాగా ధనవంతులు మాత్రమే కార్లలో, రైళ్లలో తిరిగేవారు. ఇక విమానాలంటే మామూలు మాట కాదు!! ♦ నిజానికి అప్పట్లో కొందరు కారు ఉన్నా కూడా ఎక్కువ దూరం పోవాలంటే నడిచే వెళ్లేవారు. కారణంపెట్రోలు ఇప్పటిలా ఎక్కడబడితే అక్కడ దొరికేది కాదు! అయితే దేశం మొత్తాన్నీ కాలినడకనే చుట్టివచ్చిన వారూ ఉన్నారు. ♦ నడక తర్వాత అందరూ ఎక్కువగా ఉపయోగించేది సైకిలే! ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా సైకిల్‌కు లెసైన్స్ లేకపోవచ్చేమోగాని.. అప్పట్లో సైకిల్‌కు లెసైన్సు ఉండేదని, అలాగే సైకిల్‌కు లైటు లేకపోతే పోలీసులు ఫైన్ వేసేవారని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు మరి! ♦ అప్పట్లో సైకిల్ సామాన్యుడి వాహనమైతే.. ఇప్పుడు శ్రీమంతుడి వాహనం కూడా! అదే కొత్త ఛేంజ్! ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవడమో, సైకిల్ తొక్కడమో చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటే అందరూ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ‘చక్రాల్లోకి’ వెళ్లక తప్పడం లేదు. ♦ ఇక స్కూటర్ల విషయానికొస్తే అప్పట్లో బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటివి ప్రధానంగా అందుబాటులో ఉండేవి. ♦ ఇక తాజాగా వచ్చిన బ్యాలెన్సింగ్ స్కూటర్ చూశారా? జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రెండు చక్రాల బుల్లి వాహనంపై తిరుగుతూ ఉన్నాడే అదే! ఇలాంటిదొకటి వస్తుందని అప్పుడు ఎవరూ ఊహించి కూడా ఉండరు!! -
నౌకల మెటీరియల్‌తో సైకిల్
టెక్ టాక్ సైకిల్లా కనిపిస్తోంది గానీ.. చక్రాల్లో స్పోక్స్, హబ్ ఏవీ లేవు? అయినప్పటికీ ఇది సైకిలే! ప్రపంచంలోనే తొలి స్పోక్లెస్, హబ్లెస్ సైకిల్ ఇది. పేరు సైక్లోట్రాన్. చక్రాలను ముందుకు నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ సైకిల్ ఫ్రేమ్‌లోనే ఉన్నాయి. ఇదొక్కటే దీని ప్రత్యేకత కాదు. ముందుగా చెప్పుకోవాల్సింది దీని డిజైన్ గురించి. అంతరిక్ష నౌకల నిర్మాణానికి వాడే ప్రత్యేకమైన కార్బన్‌ఫైబర్‌తో తయారైన ఈ సైకిల్ బరువు కేవలం 11 కిలోలు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రయాణించిన దూరం, ఎత్తుపల్లాలు, జీపీఎస్ వంటి వివరాలు మీకు తెలిపేందుకు దీంట్లో పది సెన్సర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 18 గేర్లు ఉన్న సైక్రోట్రాన్లో విద్యుత్తుతో నడిచే మోడల్ కూడా ఉంది. సైకిల్ బాడీలోనే 36 వోల్టుల లిథియం అయాన్ బ్యాటరీలు, 500 వాట్ల బ్రష్‌లెస్ డీసీ విద్యుత్ మోటర్‌ను ఏర్పాటు చేస్తారు. అవసరమైతే దీన్ని మినీ రిక్షాగానూ మార్చుకోవచ్చు. సైక్రోట్రాన్ను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఓ అమెరికన్ సంస్థ కిక్‌స్టార్టర్‌లో ప్రచారం మొదలుపెట్టగా దాదాపు 132 మంది 1.4 లక్షల పౌండ్లు అందించి ఈ ఐడియాకు ఓకే చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ హైటెక్ సైకిల్ అందరికీ అందుబాటులోకి రానుంది. -
రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
కురవి (వరంగల్): వేగంగా వెళ్తున్న కారు సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం బంచరాయితండలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్(18) సైకిల్‌పై వెళ్తుండగా.. మహబూబాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సైకిల్‌పై మంత్రి పర్యటన
పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలంటూ హెచ్చరిక మచిలీపట్నం: రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సైకిల్‌పై పట్టణంలో పర్యటించారు. కోనేరుసెంటర్ నుంచి సైకిల్‌పై బయలుదేరిన ఆయన బస్టాండ్‌సెంటర్, జిల్లాకోర్టుసెంటర్, లక్ష్మీటాకీస్‌సెంటర్ మీదుగా మూడో వార్డులోని పెయింటర్స్‌కాలనీ, నీలగిరికాలనీల్లో పర్యటించారు. మంత్రి పట్టణంలోని మురికివాడల్లో పారిశుద్ధ్య సిబ్బంది విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నదీ, సక్రమంగా విధులకు హాజరవుతున్నదీ లేనిదీ ఆరా తీయడంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక ఆరా తీశారు. పెయింటర్స్‌కాలనీ వాసులు తమ ప్రాంతంలో డ్రైనేజీ వసతి సరిగా లేదని, వర్షాకాలంలో కాలనీ మొత్తం తటాకంలా తయారవుతుందని మంత్రి ఎదుట వాపోయారు. కాలనీకి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి డ్రైనేజీల అనుసంధానానికి మొదటి విడతగా రూ. 18 కోట్ల నిధులు మంజూరయినట్లు కాలనీ వాసులకు చెప్పారు. మంత్రి మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులందితే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు బత్తిన దాసు, నారగాని ఆంజనేయప్రసాద్, లోగిశెట్టి వీరాస్వామి పాల్గొన్నారు. -
ఎండలకు బండి భద్రం
♦ అశ్రద్ధ తగదు రక్షణ చర్యలు చేపట్టాలి ♦ అప్పుడే ఎక్కువ రోజులు మన్నిక ఘట్కేసర్ టౌన్: వేసవిలో భానుడి ప్రతాపానికి ప్రాణాలు అరచేతపట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఎండవేడికి శరీరం మండుతుంటుంది. ఉక్కపోతకు ఒంటిలోని నీరంతా ఆవిర వుతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటాం. రోజూ ప్రయాణించే ద్విచక్ర వాహన విషయానికొస్తే ఆ.. బైకే కదా అని వదిలేస్తుంటారు. బైక్‌లకు కూడా తీవ్ర ఎండల నుంచి కాస్తంత రక్షణ కల్పించాలంటున్నారు మెకానిక్‌లు. లేదంటే ఆయిల్ ఎక్కు వగా ఖర్చవడం, ఇంజిన్‌లో రిపేరులు ఏర్పడడం తదితర సమస్యలు ఎదురవు తాయంటున్నారు. మొత్తంగా బైక్ లైఫ్ టైమ్ తగ్గిపోతుందంటున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ♦ వాహన ఇంజిన్ ఆయిల్ ఎండ వేడికి త్వరగా పలచనవుతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం ఎంతైనా అవసరం. ఎండాకాలం మొదలవగానే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం శ్రేయస్కరం. ♦ పెట్రోలు ట్యాంకుపై మం దపాటి కవర్ ఉండేటట్టు చూసు కోవడం వల్ల కొంత వరకు పెట్రోలు ఆవిరి కాకుండా తగ్గించుకోవచ్చు. సాధారణ సీటు కవర్లు త్వరగా వేడెక్కుతాయి. ఇది మన ఆరోగ్యానికి కూడా హానికరం. వేడెక్కకుండా ఉండే సీటు కవర్లు అందుబాటులో ఉన్నాయి. వెల్వెట్, పోస్టు క్లాత్ వంటివి వాడడం మంచిది. ♦ టైర్లు ఎక్కువ అరిగి ఉంటే కొత్తవి మార్చుకోవాలి. ట్యూబ్‌లకు పంక్చర్లు ఎక్కువగా ఉంటే వేసవిలో ట్యూబులు మార్పించడం మంచిది. మధ్యాహ్నం ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే వాహన జీవితకాలం తగ్గుతుంది. ♦ వేసవిలో ఇంజిన్ గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం తీయాల్సి వస్తే మధ్యమధ్యన విరామం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ వేడి తగ్గుతుంది. ♦ వేసవిలో ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి వేళ ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెడితే మంచిది. దీంతో గ్యాస్ బయటకు పోయి ఆయిల్ సులువుగా ఇంజిన్లోకి వెళ్తుంది. ♦ మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు బండి నిలిపితే రంగు త్వరగా వెలిసిపోతుంది. పెట్రోలు ఆవిరైపోతుంది. ♦ వేసవిలో సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. ♦ ఉదయం 8 గంటలకు ముందు సాయంత్రం 6 గంటల తర్వాత పెట్రోల్ పోయించుకోవాలి. ♦ ఎండ నుంచి బండిని కాపాడుకోవడానికి సాధ్యమైనంత వరకు నీడపట్టున నిలపాలి. వాహనాలను కాపాడుకోవాలి.. వేసవిలో తగు జాగ్రత్తలు పాటిస్తే బైక్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ఎండ నుంచి వాహనాలను రక్షించు కోవడానికి బైక్‌లకు నాణ్యమైన కవర్లను వినియోగిం చాలి. ఎండ వేడిమికి టైర్లు పగిలిపోయే అవ కాశముంది. రంగులు కోల్పోయి వెలసిపోతాయి. సాధ్యమై నంత వరకు వాహనాలను నీడలో నిలపడం ఉత్తమం. ఇంటి ముందు మధ్యాహ్నం వేళల్లో నీడలో పెట్టడానికి అవ కాశం లేకపోతే మందపాటి టార్ఫాలిన్ కప్పడంతో రక్షణ కల్పించాలి. - కొమ్మిడి జైపాల్‌రెడ్డి, మెకానిక్ -
సైకిల్ తోడుగా... !
30ఏళ్లుగా సైకిల్ పైనే ప్రయాణం వీపనగండ్ల మండలం అమ్మాయిపల్లికి చెందిన వెంకటేశ్వర్లుగౌడ్ ఫొటోగ్రాఫర్. తన పొలంలో వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాడు. 30ఏళ్లుగా సైకిల్‌పైనే ప్రయాణం చేస్తున్నాడు. ఏచిన్న అవసరం ఉన్నా, ఎంత దూరం వెళ్లాలన్నా సైకిల్‌పైనే వెళ్లివస్తున్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల హెల్మెట్ పెట్టుకున్నానని తెలిపారు. హెల్మెట్‌ను కర్నూలులో కొనుగోలు చేశానని, సైకిల్‌పైనే అక్కడికి (70కిలోమీటర్లు) వెళ్లివచ్చానని చెప్పారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో వడగాల్పుల నుంచి రక్షణ కోసం హెల్మెట్‌ను వాడుతున్నానని అన్నారు. పోలీసులు వాహనదారులను ఆపి హెల్మెట్ తప్పకుండా ధరించాలని చెబుతున్నా, కొందరు పట్టించుకోవడం లేదు. కనీసం ఇతన్ని ఆదర్శంగా తీసుకుని హెల్మెట్‌ను తప్పకుండా వాడాలని పలువురు ప్రజాప్రతినిధులు, ఎస్ సూచిస్తున్నారు. తలకు రక్షణతోపాటు ఇతర ఉపయోగాల గురించి వాహనచోదకులకు పోలీసులు ఎప్పటికప్పుడు క్లాస్ తీసుకుంటున్నారు. - వీపనగండ్ల -
శతవృద్ధ సైకిలిస్ట్
తిక్క లెక్క ఈ రోజుల్లో బైకులు మరిగిన కుర్రాళ్లు సైతం సైకిల్ తొక్కాలంటే ఆపసోపాలు పడిపోతారు. ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న ఫ్రెంచి తాతయ్య మాత్రం సైకిల్ రేసులకు ఇప్పటికీ సై అంటే సై అంటూ సిద్ధమైపోతాడు. ఈయన పేరు రాబర్ట్ మర్చంద్. వయసంటారా..? సెంచరీ పూర్తిచేసి రెండేళ్లు దాటింది. స్విట్జర్లాండ్‌లో శతవృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన సైకిల్ రేసులో ఈయన గంటలోనే ఏకంగా పదిహేను మైళ్లు ఆపకుండా సైకిల్ తొక్కి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టేశాడు. -
మోసేవారు లేక... సైకిల్‌పై శవయాత్ర
కలువాయి (నెల్లూరు) : లోకాన్ని వీడిన ఆ దేహాన్ని మోసుకెళ్లేందుకు సమయానికి నలుగురు ముందుకు రాలేదు. చేసేది లేక వరుసకు సోదరుడైన వ్యక్తి సైకిల్‌పై మృతదేహాన్ని మోసుకెళ్లాడు. కంటతడి పెట్టించే ఈ హృదయ విదారకర దృశ్యం మంగళవారం నెల్లూరు జిల్లా కలువాయిలో కనిపించింది. తమళనాడు రాష్ట్రానికి చెందిన కొందరు కలువాయిలో ఉంటూ చుట్టుపక్కల పల్లెల్లో దుప్పట్ల అమ్మకంతో జీవనం సాగిస్తున్నారు. వారిలో సంబురాజు (70) అనే వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురికాగా మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఎవరూ కనిపించలేదు. దీంతో సంబురాజు మృతదేహాన్ని సోదరుడు గోవిందరాజు తన సైకిల్‌పై పెట్టుకుని శ్మశానం వరకు తీసుకెళ్లి అక్కడ కూర్చున్నాడు. అది చూసిన కొందరు పంచాయతీ వారికి సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ ఇందిర అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. -
ఇదో పొడవా...టి సైకిల్!
లోకో భిన్న రుచి అనే నానుడికి ఇది అచ్చంగా సరిపోతుంది. ఫొటోలో ఉన్న సైకిల్ చూశారా.. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్. దీని పొడవెంతో తెలుసా ఏకంగా 117 అడుగులు. నెదర్లాండ్స్‌లోని మిజిల్ వాన్ మారెస్ వెర్క్ప్లాగ్ అనే సంస్థ ఈ సైకిల్‌ను తయారుచేసింది. అంతేకాదు ఈ సైకిల్ గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించుకుంది. దీన్ని నడిపేందుకు ఎందరు కావాలో అని అనుమానపడకండి. ఎందుకంటే కేవలం ఇద్దరు ఎంచక్కా జాం జాం అంటూ నడిపేయొచ్చు. ఒకరు పూర్తిగా వెనక కూర్చుని సైకిల్ తొక్కుతుంటే, ముందు ఉన్న మరొకరు హ్యాండిల్ నియంత్రిస్తారు. అయితే ఈ సైకిల్‌ను తయారు చేసిన వెంటనే ఆస్ట్రేలియాలోని ఓ బృందం 135 అడుగుల పొడవైన సైకిల్ తయారు చేసి రికార్డును తిరగరాయడం కొసమెరుపు. కాకపోతే దీన్ని నడిపేందుకు 20 మంది కావాలి మరి. -
ప్రాణాలు తీసిన సరదా
ఏలూరు అర్బన్ (పశ్చిమగోదావరి) : రైల్వే ట్రాక్ మధ్యలో సైకిల్ తొక్కాలన్న ఇద్దరు స్నేహితుల సరదా వారి ప్రాణాలను బలితీసుకుంది. ఏలూరులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు పత్తేబాద ప్రాంతానికి చెందిన ఆవాల మౌళికుమార్(22), జన్యావుల మోహన్(18) స్నేహితులు. మౌళికుమార్ సెంట్రింగ్ వర్కర్‌గా పనిచేస్తుండగా, మోహన్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. కాగా గురువారం వీరిద్దరూ సీఆర్ఆర్ కళాశాల వెనుక హనుమాన్ నగర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ మధ్యలో సైకిళ్లు తొక్కుతుండగా విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ట్రాక్టర్ ఢీకొని మహిళ దుర్మరణం
సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం మంగలి గుంటపాలెం గ్రామానికి చెందిన ఎస్తేర్‌రాణి(36) సోమవారం సాయంత్రం కుమారుడితో కలిసి సైకిల్‌పై వెళ్తోంది. ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ వారిని ఢీకొట్టటంతో ఎస్తేర్‌రాణి అక్కడికక్కడే మరణించింది. గాయపడిన ఆమె కుమారుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. -
స్వచ్ఛ భారత్ కోసం సైకిలెక్కిన ఎస్పీ
దేవనకొండ (కర్నూలు) : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ రవికృష్ణ సైకిల్ తొక్కారు. ఆయన ఆదివారం ఉదయం కొమరాడ నుంచి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వరకు ఇతర పోలీసు అధికారులతో కలసి సైకిల్ తొక్కారు. అనంతరం ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బండిజల్ల సైకిల్‌పై ఇలా..
సైకిల్‌పై నీడ కోసం బండిజల్లను గొడుగులా పెట్టుకున్నారనుకుంటే పొరపాటే! ఎరువును తరలించేందుకు అవసరమైన బండిజల్ల(పొనక)ను ఇదిగో ఇలా కొత్తగూడెంలోని బృందావనం బ్రిడ్జి మీదుగా తీసుకెళ్తుండగా‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. ట్రాక్టర్లు, వ్యానులు, లారీలు గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అందుబాటులో లేని రోజుల్లో ఎరువులు, ఇసుక, మట్టి తదితరాలను ఈ పొనకను ఎడ్లబండిపై ఉంచి తరలించేవారు. ఇప్పటిలాగా ఆటోలు, బస్సులు తదితర వాహనాలు లేని నాటి రోజుల్లో ప్రజలు దూర ప్రాంతాలకు ఎడ్లబండిపై వెళ్లేవారు. పైన ఎండ తగలకుండా బండిపై పొనకను పైకప్పుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఇవి ఏ పల్లెటూరులోనూ కనినపించడం లేదు. - సాక్షి ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
రేసు గుర్రాలు
ద్వారకానగర్: ముద్దులొలికే చిన్నారులు ఇప్పుడు బుడిబుడి అడుగులు వేస్తూనే సైకిల్ కావాలంటున్నారు. రకరకాల మోడల్స్‌లో వస్తున్న బైసికిల్ కావాలని మారాం చేస్తున్నారు. కట్టిపడేసే కార్టూన్ బొమ్మల రూపంలో మార్కెట్లోకి వస్తున్న చైనా సైకిళ్లు వారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. సైకిళ్లు కొనిపించుకొని రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చక్కర్లు కొడుతున్నారు. కాస్త పెద్ద పిల్లలైతే ఎత్తయిన సైకిళ్లు కొనుక్కొని రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నారు. ‘ఇది మన ఏరియా’ అన్నట్టు రహదారులను ఆక్రమించేస్తున్నారు. వాహన చోదకులు బాలల ఉత్సాహాన్ని చూసి ముచ్చట పడుతూ వారికి దారి వదులుతున్నారు. సైకిలు కొనుక్కోవాలనుకునే వారికి కొన్ని సూచనలు...మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సుగల చిన్నారులకు 12 ఇంచీల సైకిల్ సరిపోతుంది. దీని ధర రూ.2500 ఉంది. నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వయస్సు మధ్యగల చిన్నారులకు 14 ఇంచీల సైకిల్ సరిపోతుంది. దీని ధర రూ.3,500లు. ఐదు నుంచి పది సంవత్సరాల చిన్నారులకు 16 ఇంచీలు, ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల వారికి 18 ఇంచీల సైకిల్ అవసరం. ఇవి రూ.3,900 నుంచి రూ.4,250 వరకు ధర పలుకుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఐదు శాతం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త మోడల్స్ వచ్చాయి. ఆధునిక సైకిళ్లకు మ్యూజికల్స్తోపాటు డిస్క్ బ్రేకు ఇచ్చారు. లైటింగ్ ఉంటుంది. ట్రైసైకిల్ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల చిన్నారులకు ఉపయోగపడుతుంది. హ్యాండిల్ వద్ద ఉన్న వీణలోను హెడ్‌లోనూ మ్యూజిక్ ఉంటుంది. వెనక భాగంలో పెద్దలు పట్టుకుని తోయడానికి హ్యాండిల్ ఉంటుంది. ఇవి నగరంలోని పలు పేరొందిన షాపుల్లో లభిస్తున్నాయి. మరికొన్ని సైకిల్స్ కారు మోడల్స్ కూడా లభిస్తున్నాయి. -
ఫిట్ & గ్రీన్
FUN WAY హైదరాబాదీలు ఆడుతూపాడుతూ సైకిల్ తొక్కేస్తున్నారు. ఆఫీసులకు రివ్వున దూసుకుపోతున్నారు. ఇక వీక్లీ రౌండప్స్ సరేసరి. కాలు కదిపితే కార్లు.. రైడ్ కొట్టేందుకు స్పోర్ట్స్ బైక్.. ఇవన్నీ ఉన్నా కూడా మా స్టేటస్ సింబల్- సైకిల్ అంటున్నారు. ఆరోగ్యానందాల కోసం ఇంతకుమించిన బెని‘ఫిట్’ లేదంటున్నారు. గ్రీన్‌సిటీ అనేది ఓ డ్రీమ్ కాదు.. డెస్టినేషన్. సైక్లింగ్ మాత్రమే ఆ గమ్యాన్ని చేర్చగలదంటున్న మన హైదరాబాదీల న్యూ స్టైల్ స్టేట్మెంట్- ‘సైకిల్ టు వర్క్’. - సీహెచ్.ఎమ్.నాయుడు ఇప్పుడు మెట్రో నగరాలు రెండు రకాలు..ఒకటి- సైకిల్ నెట్వర్క్ ఉన్నవి.. రెండు- అటువంటి నెట్వర్క్ కోరుకుంటున్నవి..మన హైదరాబాద్ ఏ ట్రాక్‌పై ఉందో తెలుసుకోవాలంటే.. సిటీలో వాహనాల సగటు వేగం గంటకు 15 కిలోమీటర్ల లోపే. దాదాపు ఇదే వేగంతో మోటారు వాహనాలతో పోటీపడి నగరంలో సైకిళ్లు రోజూ వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంధన వ్యయం, కాలుష్యం, జర్నీ టైమ్ పెరిగిపోతుండటం, వాహనాలతో కిక్కిరిసిపోతున్న ఇరుకిరుకు రోడ్లకు సైకిళ్లే ప్రత్యామ్నాయం అవుతున్నాయి. పైగా గజిబిజీ లైఫ్స్టైల్లో కసరత్తులు చేసే ఓపిక, తీరిక ఎవరికీ ఉండట్లేదు. అందుకే సైక్లింగ్ మంచి ఎక్సర్సైజ్గా మారుతోంది. ఇటు ట్రాఫిక్ సమస్యా తీరుతోంది. ఫలితంగా ఐదారంకెల జీతాలు అందుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్లు, బైకులు వదిలేసి సైకిళ్లెక్కుతున్నారు. ‘సాఫ్ట్వేర్ జాబ్ కూర్చుని చేసేది. బాడీ యాక్టివిటీ ఉండదు. అలాగని జిమ్‌కి వెళ్లే టైమూ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసమైనా సైక్లింగ్ మంచిది. అందుకే ఇప్పుడు చాలామంది ఐటీ పీపుల్ సైకిల్ టు వర్క్‌ను ప్రిఫర్ చేస్తున్నారు’ అంటారు రన్కోడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంట్రీహెడ్ ప్రవీణ్ పమిడిముక్కల. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్లో ఆరు వేల మంది సభ్యులుంటే, వీరిలో సైకిల్ టు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు దాదాపు 2500. సై.. సైక్లింగ్ సైబరాబాద్.. సాఫ్ట్వేర్, ఎంఎన్సీ, కార్పొరేట్ కంపెనీల ఎదుట ఎన్ని అత్యాధునిక, ఖరీదైన వాహనాలుంటే అంత గొప్పగా భావించే పరిస్థితి అక్కడ. అటువంటి కంపెనీలు ఇప్పుడు సైకిళ్లపై ఆఫీస్‌లకు వచ్చే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నాయి. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, రాయదుర్గంలోని వెల్స్ ఫార్గో సొల్యూషన్స్, హెచ్ఐసీసీ వంటి కార్పొరేట్ సంస్థలు సైకిల్ పార్కింగ్ జోన్లు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. వేవ్‌రాక్ కంపెనీలో ప్రత్యేక సైకిల్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇంకొన్ని సంస్థలు ఫుడ్ కూపన్స్ అందిస్తున్నాయి. అయితే, సైకిళ్లపై ఆఫీస్‌లకు వచ్చే వారు వెంటనే రీఫ్రెష్ కావడానికి విదేశాల్లో ఆఫీస్ కారిడార్లలోనే ‘బైక్ పాడ్స్’ (రీఫ్రెషింగ్ పాయింట్స్) ఉంటాయి. వాటితో పాటు లోన్లు, బీమా సౌకర్యాలు మన దగ్గరా కల్పిస్తే సైక్లింగ్ మరింత పెరుగుతుందంటున్నారు ఐటీ ఉద్యోగులు. గ్రీన్రైడ్... ఇప్పుడు మెట్రో నగరాలు సైకిల్ నెట్‌వర్క్‌ను కోరుకుంటున్నాయి. ఇందులో బెంగళూరు రైట్ ట్రాక్‌లో ఉంది. అక్కడ సైకిల్ టు వర్క్ చేసే వారందరికీ ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది. మన సైబరాబాద్ ఇప్పుడిప్పుడే గ్రీన్రైడ్ చేస్తోంది. గ్రేటర్ సిటీలోని దాదాపు 45 లక్షల వివిధ రకాల వాహనాలు నిత్యం 63 లక్షల లీటర్ల ఇంధనాన్ని కాల్చేస్తున్నాయి. ఒక లీటర్ పెట్రోల్ నుంచి 2.3 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ (వాహనం కండిషన్ బట్టి) విడుదలవుతుందని అంచనా. అంటే, ఏటా వాహనాల నుంచి 144.9 లక్షల కిలోల సీఓ2 విడుదలవుతుంది. అయితే ఒక చెట్టు రోజూ 21.77 కేజీల కార్బన్‌డైఆక్సైడ్ మాత్రమే గ్రహించగలదు. మన సిటీలో చెట్లకు మించి కార్లే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. సైకిల్ ఫ్రెండ్లీ సిటీ.. నగరంలో ఎక్కువ మంది నిత్యం ప్రయాణించే దూరాలు సగటున 5 నుంచి 10 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి సైకిలే తగిన రవాణా సాధనం అంటారు అర్బన్ ట్రాన్స్పోర్ట్ నిపుణుడు ప్రశాంత్ బాచు. ‘మెట్రో రైలు వస్తున్నా.. మన ప్రజా రవాణా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న రష్ తగ్గదు. ఎందుకంటే ఆర్టీసీ, సైకిల్ స్టేషన్లతో మెట్రో స్టేషన్లు ఎంతగా అనుసంధానం అవుతాయనే దానిని బట్టే ఇది సక్సెస్ అవుతుంది’ అంటారాయన. ప్రస్తుతం రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్ టు బయో డైవర్సిటీ పార్కు వరకు 1.2 కిలోమీటర్ల మేర నగరం మొత్తానికి ఒకే ఒక్క సైకిల్ ట్రాక్ ఉంది. కొన్ని రహదారులపై ఎల్లో లైన్స్ వేసి అదే సైకిల్ ట్రాక్ అంటున్నారు. ఇక, నక్లెస్ రోడ్, గచ్చిబౌలి, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. ‘మన రోడ్లపై సైకిల్ ట్రాక్‌లు లేవు. కనీసం సైకిల్ వే సూచించే గుర్తులూ లేవు. అయినా సరే.. ఇది దేశంలోనే మంచి సైకిల్ ఫ్రెండ్లీ సిటీ. అంతేకాదు.. సిటీలో సైక్లింగ్ పెరుగుతోంది. నేను సైక్లింగ్ చేసిన మొదట్లో రోజూ ఐదారుగురిని రోడ్లపై చూసేవాడిని. వారంతా చిరు వ్యాపారులే. ఇప్పుడు నిత్యం 60 మంది వరకు కనిపిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే’ అంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కృష్ణ మండవ. శ్రీనివాస్ కొల్లి ప్రొఫెషన్: అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జ్, మాక్రో మీడియా సిస్టమ్స్ సైకిల్ టు వర్క్: ఏడేళ్లుగా.. పెడల్ పవర్: ఎల్లారెడ్డిగూడ-చర్లపల్లి ఐడీఏ (రానుపోను 44 కి.మీ.) ట్రాక్‌లైన్: చాలా కాలం ఒబేసిటీతో బాధపడ్డా. సైక్లింగ్‌తో ఫిట్ అయ్యా. ప్రవీణ్ పమిడిముక్కల ప్రొఫెషన్: కంట్రీహెడ్, రన్కోడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సైకిల్ టు వర్క్: రెండేళ్ల నుంచి పెడల్ పవర్: బోయిన్పల్లి-బంజారాహిల్స్ (రానుపోను 16 కి.మీ.) ట్రాక్‌లైన్: హెల్త్ బెనిఫిట్ కోసమైనా సిటీలో సైక్లింగ్ కల్చర్ పెరగాలి. కృష్ణ మండవ ప్రొఫెషన్: అసిస్టెంట్ మేనేజర్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సైకిల్ టు వర్క్: తొమ్మిదేళ్లుగా.. పెడల్ పవర్: సికింద్రాబాద్-బషీర్‌బాగ్ (అప్‌అండ్‌డౌన్ 14 కి.మీ.) ట్రాక్‌లైన్: తక్కువ దూరాలకు సైకిల్‌పైనే ప్రయాణించాలి. తీరు మారితేనే... ‘సిటీలో నేటికీ సైకిల్ అంటే పేదవాడి రవాణా సాధనంగానే చూస్తున్నారు. నగరాలను జీవనయోగ్యంగా తీర్చిదిద్దే క్రమంలో ఆధునిక హంగులపైనే దృష్టి సారించి, సైకిళ్లను విస్మరిస్తున్నారు. ఫలితంగానే సిటీలో సైకిల్ ట్రాక్‌లు కనిపించట్లేదు’ అంటారు సైకిల్ టు వర్క్ కోఆర్డినేటర్ విశాల. ‘సిటీలైఫ్‌లో ఏదైనా కెరీర్లో స్థిరపడగానే చాలామంది తమ స్థాయి, హోదా పెరిగే కొద్దీ... బైక్.. ఆ తరువాత కారు.. ఇలా వారి స్టేటస్ సింబల్స్ మారిపోతున్నాయి. నిజానికి లైఫ్‌స్టైల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం అంటే, హోదా చిహ్నాలను పెంచుకుంటూ పోవడం కాదు కదా! అందరూ ఇంధన వాహనాలే వాడితే.. రోడ్లన్నీ వాటితోనే నిండిపోతే పరిస్థితి ఏమిటి?..ఈ ప్రశ్నకు సమాధానమే సైకిల్ టు వర్క్’ అంటారామె. ఐడెంట్‌సిటీ ఫౌండర్ డెరైక్టర్ కూడా అయిన ఈమె.. సిటీలో సైక్లింగ్‌ను పెంచేందుకు గల అవకాశాలపై తెలంగాణ రాష్ట్ర ఇండ్రస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)తో కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను రూపొందిస్తున్నారు. రాజశేఖర్ బత్తుల ప్రొఫెషన్: ఇన్చార్జ్, గోస్ గ్రీన్ స్టోర్స్ సైకిల్ టు వర్క్: నాలుగేళ్లుగా.. పెడల్ పవర్: సనత్‌నగర్-బంజారాహిల్స్ (రానుపోను 16 కి.మీ.) ట్రాక్‌లైన్: సిటీలో ఇప్పుడున్న ట్రాఫిక్ స్థితిగతులకు సైకిలే బెటర్ ఆప్షన్. -
కుక్కను తప్పించబోయి...
రోడ్డు ప్రమాదంలో మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు ద్విచక్ర వాహనం బోల్తాతో ప్రమాదం యలమంచిలి : రోడ్డుకు అడ్డంగా వచ్చిన శునకాన్ని తప్పించబోయి దురదృష్టవశాత్తు ద్విచక్ర వాహనం బోల్తాపడిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెదపల్లి హైవే జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కశింకోట మండలం పల్లపు సోమవరానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కలిగట్ల వెంకటరమణ (45), అదే గ్రామానికి చెందిన పూడి వెంకటనాగరాజు ద్విచక్ర వాహనంపై యలమంచిలి నుంచి స్వగ్రామం పల్లపు సోమవారానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పెదపల్లి హైవే జంక్షన్ దాటిన తర్వాత రోడ్డుకు అడ్డంగా శునకం అకస్మాత్తుగా అడ్డువచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కగా ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం బోల్తాపడింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మాజీ సైనిక ఉద్యోగి వెంకటరమణ రోడ్డు పక్కన ఉన్న ఇనుప కమ్మెను ఢీకొట్టారు. దీంతో అతని తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటనాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనంలో క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంలో దుర్మరణం పొందిన మాజీ సైనిక ఉద్యోగి వెంకటరమణ నక్కపల్లి మండలం కాగిత టోల్‌ప్లాజా వద్ద పనిచేస్తున్నారు. అతని మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని వెంకటరమణ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటరమణ మృతదేహాన్ని యలమంచిలి మార్చురీలో భద్రపరిచారు. ఈ ప్రమాదంపై యలమంచిలి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.