సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కాలంలో సైకిళ్లకు డిమాండ్ పుంజుకున్న నేపథ్యంలో ప్రీమియం సైకిల్ తయారీ సంస్థ స్కాట్ స్పోర్ట్స్ ఇండియా ఖరీదైన సైకిల్‌ను లాంచ్ చేసింది. స్పార్క్ ఆర్‌సీ 900 పేరుతో దీన్ని భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధరను 3.7 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఒలింపిక్ విజేత నినో షుర్టర్, ప్రపంచకప్ ఛాంపియన్ కేట్ కోర్ట్నీలాంటి వారు మెచ్చిన బ్రాండ్ తమదని కంపెనీ చెబుతోంది.
కరోనా మహమ్మారి అనంతర కాలంలో భారతదేశంలో సైకిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో జిమ్‌లు ఫిట్‌నెస్ కేంద్రాలు మూసివేత కారణంతగా వినియోగదారులు ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సైకిళ్ల డిమాండ్ 70 శాతానికి పైగా పుంజుకుంది. మరీ ముఖ్యంగా ప్రీమియం సైకిళ్లకు డిమాండ్ దాదాపు 100 శాతం పెరిగినట్టు అంచనా. దీంతో ప్రీమియం సైకిల్ తయారీదారులు ఈ డిమాండ్ క్యాష్ చేసుకోవడంపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే స్కాట్ ఈ ఖరీదైన సైకిల్‌ను ఆవిష్కరించింది.
ఫిట్‌నెస్ లక్ష్యంగా ఉన్న వినియోగాదారులకు తమ ప్రొడక్ట్స్ ను పరిచయం చేసేందుకు ఇదే మంచి సమయంగా స్కాట్ సంస్థ భావిస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రీమియం సైకిళ్లలో భారీ డిమాండ్‌ను గమనించామనీ, మన్నిక, సాంకేతికత, అధిక-నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని స్కాట్ స్పోర్ట్స్ ఇండియా కంట్రీ మేనేజర్ జేమిన్ షా చెప్పారు. 5 లక్షల నుండి 6 లక్షల విలువ చేసే స్కాట్ అడిక్ట్ సిరీస్ సైకిళ్లకు చాలా ఆర్డర్‌లను అందుకున్నామన్నారు. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని సైకిళ్లను లాంచ్ చేయనున్నామని తెలిపారు.
ట్విన్ లాక్ సస్పెన్షన్ సిస్టమ్, 12 స్పీడ్ ఈగిల్ డ్రైవ్‌ట్రెయిన్, షిమనో ఎస్ఎల్ఎక్స్ డిస్క్ బ్రేక్‌లు, మాక్సిక్ రెకాన్ రేస్ కేవ్లర్ టైర్స్ సింక్రోస్ పార్ట్స్ ఇందులో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డీలర్ నెట్‌వర్క్‌తో పాటు స్పోర్ట్స్ నెట్ వర్క్.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. నిపుణులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు 91 8080754321 కస్టమర్ కేర్ నెంబరును కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment