
కొత్తకొత్త ఆవిష్కరణలను ఆవిష్కరించి ఔరా! అనిపించుకుంటారు కొంతమంది. ఎవరు చేయని సాహసకృత్యాలు చేసిన వార్తల్లోకి ఎక్కుతారు. ఇక్కడొక వ్యక్తి అందరూ నడిపే మాములు సైకిల్‌ని అతి పొడవైన సైకిల్‌గా రూపొందించి రైడ్ చేయాలనుకున్నాడు. అతని ఆలోచనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సలో స్థానం దక్కేలా చేసింది.
అసలు విషయంలోకెళ్తే.. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి అతి పొడవైన సైకిల్‌ని రూపోందించాడు. ఈ సైకిల్‌ను రీసైకిలింగ్ వస్తువులతో రూపొందిచడటం విశేషం. పైగా అతనికి ఈ సైకిల్ తయారు చేయడానికి దాదాపు ఒక నెల పట్టింది. సైకిల్ పనితీరు కోసం ఇంకొన్ని వారాలు పట్టిందని ఆడమ్ తెలిపారు.
ఈ మేరకు ఆడమ్ మాట్లాడుతూ.. ‘తనకెప్పడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని, తన ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయి’ అని చెబుతున్నాడు. అయితే ఈ సైకిల్ 24 అడుగుల 3 అంగుళాలు ఉంటుందట. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ బుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడమ్ అతి పొడవైన సైకిల్‌ని రైడింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆడమ్‌ని గొప్ప ఆవిష్కర్త అంటూ నెటిజన్ల ప్రశంసిస్తున్నారు.
(చదవండి: ఇదేందయ్యా ఇది నేను చూడలా.. ‘ఫన్నీ’ స్నానం వీడియో వైరల్)