భోపాల్: తన చాక్లెట్లు దొంగిలించి దొరక్కుండా దాచి పెడుతోందంటూ తల్లిపై ఓ మూడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మాటలు సైతం సరిగా రాని వయసులోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేసిన ఆ బుడ్డోడికి దీపావళి ముందే వచ్చేసింది. ఏకంగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ పిల్లాడికి సైకిల్ గిఫ్ట్‌గా పంపించారు. పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన ఆ సైకిల్‌పై చిన్నోడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తల్లిపై ఫిర్యాదు చేస్తున్న మూడేళ్ల హమ్జా వీడియో చూసిన తర్వాత.. అతడి ధైర్యానికి మెచ్చిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. దివాళి గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ మరుసటిరోజునే చిట్టి సైకిల్‌ను బాలుడికి పంపించారు. పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం హమ్జా ఇంటికి వెళ్లి సైకిల్‌తో పాటు చాక్లెట్లు అందించారు. వాటిని చూసిన ఆ చిన్నోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదీ చదవండి: మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్టు చేయండి.. పోలీస్ స్టేషన్‌లో బుడ్డోడి వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment