Reported to police
-
వైరల్ వీడియో: తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
-
తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
భోపాల్: తన చాక్లెట్లు దొంగిలించి దొరక్కుండా దాచి పెడుతోందంటూ తల్లిపై ఓ మూడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మాటలు సైతం సరిగా రాని వయసులోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేసిన ఆ బుడ్డోడికి దీపావళి ముందే వచ్చేసింది. ఏకంగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ పిల్లాడికి సైకిల్ గిఫ్ట్‌గా పంపించారు. పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన ఆ సైకిల్‌పై చిన్నోడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తల్లిపై ఫిర్యాదు చేస్తున్న మూడేళ్ల హమ్జా వీడియో చూసిన తర్వాత.. అతడి ధైర్యానికి మెచ్చిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. దివాళి గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ మరుసటిరోజునే చిట్టి సైకిల్‌ను బాలుడికి పంపించారు. పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం హమ్జా ఇంటికి వెళ్లి సైకిల్‌తో పాటు చాక్లెట్లు అందించారు. వాటిని చూసిన ఆ చిన్నోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్టు చేయండి.. పోలీస్ స్టేషన్లో బుడ్డోడి వీడియో వైరల్ -
బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు
ప్లాట్ విషయమై ఘర్షణ ఇరువర్గాల ఫిర్యాదులు పరిగి : తనపై దాడిచేశారని పరిగికి చెందిన ఓ మహిళ బుల్లి తెర నటి శ్రీవాణిపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో తమపై కూడా దాడికి యత్నించారని శ్రీవాణి పరిగికి చెందిన అనూషపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె సోదరి శ్రీకన్య మరికొందరితో కలిసి సోమవారం పరిగికి వచ్చారు. పరిగికి చెందిన అనూష ఇంటికి వెళ్లి ఆమె ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని, వేరే వారికి విక్రయించేందుకు సదరు స్థలం చూపించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అనూష బయటికి రావడంతో గొడవ జరిగింది. అరుుతే, శ్రీవాణి హైదరాబాద్ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులను తీసుకువచ్చి తనపై దాడి చేశారని అనూష పరిగి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనూష ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై అనూష దాడికి యత్నించిందని శ్రీవాణి సైతం అనూషపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఉంటున్న ఇంటి స్థలానికి శ్రీవాణికి ఎలాంటి సంబంధం లేదని అనూష పేర్కొనగా..తమ తండ్రి పరిగి గ్రామస్తుడని, ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై సీఐ ప్రసాద్‌ను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. ఇంకా కేసు నమోదు కాలేదు. -
స్కీం పేరిట కుచ్చుటోపి
- బోర్డు తిప్పేసిన ఎస్సారార్ ఫైనాన్స్ - మోసపోయిన 540 మంది - పోలీసులకు ఫిర్యాదు సాక్షి, మంచిర్యాల : అంతా చిరు వ్యాపారులు, చిరుద్యోగులు.. ఒకేసారి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని వారే. ఇక్కడే వీరి అశక్తతను సొమ్ము చేసుకుందామనుకున్న కొందరు దుకాణం తెరిచారు. ‘నెలకు కొంత చెల్లిస్తే చాలు.. ప్రతీనెలా డ్రాలో గెలిచిన వారికి ద్విచక్ర వాహనం ఇస్తాం, ఆ తర్వాత డబ్బు కట్టనవడం లేదు.. ఇక డ్రా రాని వారికి కాలపరిమితి ముగిశాక మొత్తం డబ్బు ఇచ్చేస్తాం’ ఇలాంటి ప్రచారంతో పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి.. సుమారు రూ.2కోట్లతో ఉడాయించిన వైనమిది. మంచిర్యాలలో ఎస్సారార్ హైర్‌పర్చేస్ అండ్ ఫైనా న్స్ పేరిట జరిగిన ఈ మోసాన్ని గుర్తించిన పలువురు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. 36 నెలలు.. నెలకు రూ.1390.. మంచిర్యాల పట్టణం బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఎస్సారార్ మోటార్ క్రెడిట్ పేరిట స్కీంను 2012లో 299 మంది సభ్యులతో ప్రారంభించారు. సభ్యులు నెలకు రూ.1390 చెల్లిస్తే డ్రాలో ఎంపికైన వారికి రూ. 40,040 తిరిగి ఇస్తామని చెప్పారు. డ్రాలో ఎంపికైన తర్వాత వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రచారం చేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నమ్మారు. తర్వాత అవే షరతులు.. నిబంధనలతో మే 2013లో 299 మందితో మరో స్కీం ప్రారంభిం చారు. రెండు స్కీంల్లో గత నెల వరకు 58 మందిని డ్రాలో ఎంపిక చేశారు. ఇలా సాగుతుండగా.. వాయి దాలు చెల్లించేందుకు కొందరు కార్యాలయానికి గత నెలలో వెళ్తే తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసి నా నిర్వాహకులు స్పందించకపోవడంతో ఆదివా రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫైనాన్స్ నిర్వాహకులు పంజాల రాజు, వంగర సు మంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. ఫైనాన్స్ నిర్వాహకులు పంజాల రాజు 20 రోజుల క్రితమే స్థానిక సీసీసీలోని తన ఇం టికి తాళం వేసి పరారయ్యాడని.. మరో భాగస్వామి వంగతి సుమంత్ రెండు నెలల కిత్రమే తన సొంత ఊరు తెనాలి వెళ్లిపోయాడని తెలుస్తోంది. కాగా, డ్రా లో గెలిచిన వారిలో కొందరికి ఇంకా బైక్‌లు ఇవ్వలేదని చెబుతున్నారు. మొదటి స్కీం కింద ఇప్పటి వ రకు 267 మంది(డ్రాలో ఎంపికైన 32 మంది మి నహా) రూ.1,390 చొప్పున రూ.1,18,76,160 చె ల్లించారు. రెండో స్కీం కింద 273 మంది (డ్రాలో ఎంపికైన 26 మంది మినహా) రూ.98,66,220 చె ల్లించారు. రెండు స్కీంలు కలిపి నిర్వాహకులు రూ. 2.30 కోట్ల పైగానే వసూలు చేసినట్లు అంచనా. కానీ 58 మందికే రూ.40,040 చొప్పున రూ. 23,22,320 మాత్రమే కావడం గమనార్హం. ఈ మేరకు పోలీసు లు సత్వరమే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. నమ్మి మోసపోయా... నేను సీసీసీలో చిన్న షాపు పెట్టుకుని జీవిస్తున్నా. నెలకు కొంత డబ్బు వెనకేసుకుందామనే ఆలోచనతో పాటు వాహనం తీసుకుందామనే ఉద్దేశ్యంతో నెలకు రూ.1390 ఎస్సారార్‌లో చెల్లించా. ఇప్పటి వరకు 31 నెలల పాటు రూ. 43,090 కట్టాను. ప్రతినెలా ఎవరో ఒకరు డ్రా లో గెలుస్తుండగా, వారిలో కొందరికి ఇంకా బైక్ ఇయ్యలే. ఇప్పటికీ వాళ్లు ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతలో నేను 32వ నెల వాయిదా చెల్లిద్దామని వస్తే ఆఫీసుకు వెళితే బంద్ ఉంది. ఆరా తీస్తే రాజు, సుమంత్ పారిపోయారని తెలిసింది. దీంతో మరికొందరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా. - కె.యాదగిరి, సీసీసీ -
హెచ్ఎం కీచకపర్వం
- విద్యార్థినిని లొంగదీసుకున్న టీచర్ - పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తిరుమలాయపాలెం: పేదరికంలో ఉన్న విద్యార్థినికి మాయమాటలు చెప్పాడు. ఉన్నత చదువులు చెప్పించి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. కీచకుడిగా మారి కొన్నేళ్లుగా శారీరకంగా అనుభవిస్తున్నాడు. ఎలాగోలా అతడి చెర నుంచి బయటపడ్డ విద్యార్థి శుక్రవారం రాత్రి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడుకు చెందిన విద్యార్థిని 8వ తరగతి చదువుతుండగా.. 2008లో బెజవాడ శంకర్‌రెడ్డి హెచ్ఎంగా బదిలీపై వచ్చాడు. మంచి మాటలతో తల్లిదండ్రులను సంప్రదిస్తూ.. మీ కూతురుకు మంచి భవిష్యత్ ఉందని.. బాగా చదివించాలని చెప్పేవాడు. 2011లో పాలిటెక్నిక్ పరీక్ష రాయించాడు. హైదరాబాద్‌లోని కమల నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో సీటు రావడంతో ఆమెను అక్కడ చేర్పించాడు. రెండేళ్లపాటు కళాశాల హాస్టల్లో ఉన్న విద్యార్థిని వద్దకు అప్పుడప్పుడు వెళ్లి బయటకు తీసుకెళ్లి దుస్తులు, సెల్‌ఫోన్ కొనిచ్చాడు. ఏటీఎం కార్డు కూడా ఇప్పించాడు. స్పీక్ కంపెనీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈసీఐఎల్ హాస్టల్లో ఉండగా.. అక్కడికి నుంచి బయటకు తీసుకెళ్లి పార్కులు, లాడ్జీలకు తీసుకువెళ్లి మాయమాటలతో శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయూన్ని మీ వాళ్ల దగ్గర బయటపెడితే నీ ఫొటోలు బయటపెడతానని.. చంపుతానని బెదిరించేవాడు. శంకర్‌రెడ్డి కీచక పర్వాన్ని తట్టుకోలేక చివరకు బయటపడి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా శంక ర్‌రెడ్డి ఈనెల 12 నుంచి 15 వరకు సెలవు పెట్టారు. దీనిని ఈనెల 20 వరకు పొడిగించాలని డిప్యూటీ డీఈవో ద్వారా అనుమతి తీసుకున్నాడు. అయితే హెచ్ఎం శంకర్‌రెడ్డిపై ఐపీసీ 366, 376 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కూతురు బాగా చదవడంతో బంగారు భవిష్యత్ ఇస్తాడని, వయసురీత్యా పెద్ద వాడు అని నమ్మితే ఇంత మోసం చేస్తాడని ఊహించలేదని విద్యార్థిని తండ్రి ‘సాక్షి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.