Viral Video: 9 feet tall Hairstyle sets Guinness World Record - Sakshi
Sakshi News home page

Viral: చూస్తుండగానే తలపై క్రిస్మస్‌ చెట్టు రెడీ..! గిన్నిస్‌ రికార్డు హెయిర్‌ స్టైల్‌

Published Tue, Dec 20 2022 7:08 PM | Last Updated on Wed, Dec 21 2022 10:34 AM

9 Feet Tall Hairstyle Sets Guinness World Record watch Viral Video - Sakshi

వైరల్‌: పొడవైన జుట్టంటే ఇష్టపడని అమ్మాయిలే ఉండరనడంలో అతిశయోక్తే లేదు. రోజుకో కొత్త హెయిర్‌ స్టైల్‌ చేసుకోవడం అమ్మాయిలకు తెగ అలవాటు.  తాజాగా ఓ ప్రఖ్యాత హెయిర్‌ స్టైలిస్ట్‌  సరికొత్త హెయిర్‌ స్టైల్‌ డిజైన్‌తో ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించారు. సిరియన్ హెయిర్‌ స్టైలిస్ట్ అయినటువంటి డానీ హిస్వానీ  2.90 మీటర్ల (9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ చెట్టు ఆకారంలో ఓ మహిళ జుట్టును అందంగా అలంకరించి రికార్డ్ సృష్టించారు.

సెప్టెంబర్ 16న దుబాయ్‌లో ప్రపంచలోనే పొడవైన హెయిర్‌ స్టైల్‌గా హిస్వాని ఈ ఘనత సాధించారు. కాగా హిస్వాని ప్రపంచ ఫ్యాషన్‌ మ్యగజైన్‌లు, పెనెలోప్ క్రజ్, దీపిక పదుకొనె, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్ప సెలబ్రిటీలకు హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఈ కేశాలంకరణ చేసిన విధానాన్ని తెలుపుతూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్టు చేసింది.

ఇందులో హిస్వాని ముందుగా మోడల్‌ తలకు సపోర్ట్‌గా ఓ హెల్మెట్‌ను పెట్టింది. దానిపై మూడు మెటల్‌ రాడ్‌లు అమర్చి జుట్టును క్రిస్మస్‌ చెట్టు ఆకారంలో వచ్చేందుకు విగ్‌లు, హెయిర్‌ ఎక్స్‌టన్షన్స్‌ను ఉపయోగించించారు. చివరికి హెయిర్‌ స్టైల్‌ అనుకున్న సైజ్‌లో వచ్చేందుకు పై అంతస్తుకు వెళ్లీ మరీ డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఈ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.
చదవండి: యూనిఫామ్‌ ఉందని మరిచారా సార్‌! మహిళతో ఎస్సై డ్యాన్స్‌ వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement