పియర్సింగ్ సర్వీస్ గురించి సిటీలో ఉండేవాళ్లకు బాగా తెలుస్తుంది. ఇటీవల చెవితో సహా బాడీకి రకరకాల జ్యువెలరీని కుట్టించుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం ఓ ట్రెండ్‌లా ఫీలవ్వుతోంది యువత. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఇంట్లో ఉండే గృహిణుల వరకు అందరూ వీటిని ధరిస్తున్నారు. ఒకప్పుడు చిన్నిపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు తొమ్మిదో నెల లేదా సవంత్సరంలోపు చెవులు కుట్టించేవారు పెద్దవాళ్లు.
పైగా అదొక పెద్ద హడావిడి తంతులా ఉండేది. కానీ ఇప్పుడు సింపుల్‌గా కానిస్తున్నారు. ఎలాంటి ఏడుపులు ఉండవు. రక్తం కారకుండా మంచి సాంకేతికతో కూడిన పరికరాలతో చక్కగా కుట్టేస్తున్నారు. అదికూడా ఇంట్లోనే హాయిగా కుట్టించుకోవచ్చు. దీన్నే ఆంగ్లంలో పియర్సింగ్ సర్వీస్ అని పిలుస్తారు. ఇటీవల సానియా కూడా ఈ సర్వీస్‌తో ఇంట్లోనే చెవుల కుట్టించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సానియా దుబాయ్‌లోని తన ఇంటి నాలుగు గోడల మద్య ఓ సాంకేతిక నిపుణుడితో చెవులు కుట్టించుకున్నట్లు తెలిపింది. తన స్నేహితులు, సోదరి అనమ్ మీర్జాతో కలిసి మిరుమిట్లు గొలిపై స్టడ్ చెవిపోగులను కుట్టించుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన ఈ మధుర క్షణాన్ని వీడియోలో బంధించిన దానికి "పర్ఫెక్ట్ గర్ల్స్ నైట్ ఇన్" అనే క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సానియా తన చెవి అంతటా అద్దుతమైన చెవిపోగులను పెట్టుకుంది.
పియర్సింగ్ సర్వీస్:
ప్రస్తుతం ఇది ఓ మంచి స్టైలిష్ వ్యాపారంలా సాగుతుంది. ఈ సర్వీస్‌తో నొప్పిలేకుండా చెవులు ఈజీగా కుట్టించుకోవచ్చు. కొందరు బాడీ అంతటా రకరకాలుగా కుట్టించుకుంటారు. జస్ట్ ఒక్క కాల్‌తో ఇంటికే నేరుగా వచ్చి సర్వీస్ అందిస్తారు. పైగా మనకు నచ్చిన చెవిపోగులను ఎంచుకుని మరీ పెట్టించుకోవచ్చు.
ఇలాంటి హై రేంజ్ సర్వీస్ దుబాయ్, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులో ఉన్న జస్ట్ సాంకేతికతో స్టడ్చెవిపోగులు పెడతారంతే. అయితే ఈ అత్యాధునిక సర్వీస్‌లో మాత్రం ఫ్యాన్సీ, బంగారం లేదా వెండి చెవిపోగులను కూడా సెలెక్ట్ చేసుకుని మరి పెట్టించుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా సర్వీస్ అందిచడమే గాక కనీసం రక్తం కూడా రాకుండా చాలా సింపుల్‌గా చెవులు కుట్టేస్తారు.
(చదవండి: 'లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్'..!)
Comments
Please login to add a commentAdd a comment