ear
-
పియర్సింగ్ సర్వీస్ గురించి తెలుసా..! సానియా మీర్జా..
పియర్సింగ్ సర్వీస్ గురించి సిటీలో ఉండేవాళ్లకు బాగా తెలుస్తుంది. ఇటీవల చెవితో సహా బాడీకి రకరకాల జ్యువెలరీని కుట్టించుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం ఓ ట్రెండ్‌లా ఫీలవ్వుతోంది యువత. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఇంట్లో ఉండే గృహిణుల వరకు అందరూ వీటిని ధరిస్తున్నారు. ఒకప్పుడు చిన్నిపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు తొమ్మిదో నెల లేదా సవంత్సరంలోపు చెవులు కుట్టించేవారు పెద్దవాళ్లు. పైగా అదొక పెద్ద హడావిడి తంతులా ఉండేది. కానీ ఇప్పుడు సింపుల్‌గా కానిస్తున్నారు. ఎలాంటి ఏడుపులు ఉండవు. రక్తం కారకుండా మంచి సాంకేతికతో కూడిన పరికరాలతో చక్కగా కుట్టేస్తున్నారు. అదికూడా ఇంట్లోనే హాయిగా కుట్టించుకోవచ్చు. దీన్నే ఆంగ్లంలో పియర్సింగ్ సర్వీస్ అని పిలుస్తారు. ఇటీవల సానియా కూడా ఈ సర్వీస్‌తో ఇంట్లోనే చెవుల కుట్టించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో సానియా దుబాయ్‌లోని తన ఇంటి నాలుగు గోడల మద్య ఓ సాంకేతిక నిపుణుడితో చెవులు కుట్టించుకున్నట్లు తెలిపింది. తన స్నేహితులు, సోదరి అనమ్ మీర్జాతో కలిసి మిరుమిట్లు గొలిపై స్టడ్ చెవిపోగులను కుట్టించుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన ఈ మధుర క్షణాన్ని వీడియోలో బంధించిన దానికి "పర్ఫెక్ట్ గర్ల్స్ నైట్ ఇన్" అనే క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సానియా తన చెవి అంతటా అద్దుతమైన చెవిపోగులను పెట్టుకుంది. View this post on Instagram A post shared by The PiercingSpot (@piercingspot)పియర్సింగ్ సర్వీస్:ప్రస్తుతం ఇది ఓ మంచి స్టైలిష్ వ్యాపారంలా సాగుతుంది. ఈ సర్వీస్‌తో నొప్పిలేకుండా చెవులు ఈజీగా కుట్టించుకోవచ్చు. కొందరు బాడీ అంతటా రకరకాలుగా కుట్టించుకుంటారు. జస్ట్ ఒక్క కాల్‌తో ఇంటికే నేరుగా వచ్చి సర్వీస్ అందిస్తారు. పైగా మనకు నచ్చిన చెవిపోగులను ఎంచుకుని మరీ పెట్టించుకోవచ్చు. ఇలాంటి హై రేంజ్ సర్వీస్ దుబాయ్, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులో ఉన్న జస్ట్ సాంకేతికతో స్టడ్చెవిపోగులు పెడతారంతే. అయితే ఈ అత్యాధునిక సర్వీస్‌లో మాత్రం ఫ్యాన్సీ, బంగారం లేదా వెండి చెవిపోగులను కూడా సెలెక్ట్ చేసుకుని మరి పెట్టించుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సర్వీస్ అందిచడమే గాక కనీసం రక్తం కూడా రాకుండా చాలా సింపుల్‌గా చెవులు కుట్టేస్తారు. View this post on Instagram A post shared by Anam Mirza (@anammirzaaa) (చదవండి: 'లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్'..!) -
చెవి కొరికిన కోడలు.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన అత్త
సాక్షి,గుంటూరు:అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో మంగళవారం(అక్టోబర్8)జరిగింది.కుటుంబ కలహాల నేపధ్యంలో అత్త నాగమణి,కోడలు పావని మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలోనే అత్త చెవిని కోడలు పావని కొరికింది. బలంగా కొరకడంతో అత్త చెవిలోని ఒక ముక్క ఊడిపడింది.ఊడిపడిన చెవి ముక్కను తీసుకుని అత్త నాగమణి గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చింది.చెవి ముక్క తెగిపోయి సమయం ఎక్కువవడంతో తిరిగి అతికించడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు. ఇదీ చదవండి: ధర్మవరం సీఐ కిడ్నాప్ ఆపై హత్య -
మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి..
పెరుగుతున్న కాలుష్యానికి ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. మనకు తెలియకుండానే రోగాల బారిన పడుతున్నాం. ఈ కాలుష్యానకి చెవి, ముక్కు, కంటి సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. చెవి విషయానికొస్తే, చిన్న పిల్లల్లోనే కాకుండా పెద్దవారిలోనూ వినికిడి లోపం పెరుగుతంది. వాటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి చెవిని కాపాడడంలో.. చేయాల్సిన జాగ్రత్తలను చూద్దాం. చెవులను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.. పల్లెటూళ్లలో వేసవి సెలవులు రాగానే ఈత నేర్చుకోవడం కోసం పిల్లలు నీటి కుంటలు, చెరువులకు వెళ్తుంటారు. చెరువుల్లోని మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు పరిశుభ్రమైన నీళ్లలోనే దిగాలి. చెవులను శుభ్రం చేయడానికి కొందరు గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనె, ఆముదం చెవుల్లో పోస్తారు. ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌క్రీముల వంటివాటితో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవే ఇన్ఫెక్షన్లు చెవులకూ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చెవి, గొంతు, ముక్కు.. భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను మరింతగా పాటించాలి. పై జాగ్రత్తలు పాటించాక కూడా.. గులివి, చీము వంటి సమమస్యలతో పాటు.. చెవిపోటు ఎక్కువగా వస్తున్నా, సరిగా వినిపించకపోయినా.. వీలైనంత త్వరగా ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. ఇవి చదవండి: హాయి హాయిగా... కూల్ కూల్‌గా! -
మీ తలలో 'గుయ్య్య్' మంటూ సన్నని శబ్దమా.. అయితే జాగ్రత్త!
'చెవి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టుగా చెవిలోనో లేదా తలలోనో గుయ్య్య్ మంటూ హోరు. ఇలా గుయ్‌మంటూ శబ్దం వినిపించడాన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘టినైటస్’ అంటారు. ప్రజల్లో ఇదెంత సాధారణమంటే.. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 16 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ ‘టినైటస్’ బాధించే జనాల సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వయసుల వారినీ వేధిస్తూ లక్షలాది మందిని బాధించే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.' టినైటస్తో చెవిలో లేదా తలలో హోరున శబ్దం అదేపనిగా వినిపిస్తున్నప్పుడు నొప్పి కంటే.. దాన్ని విడిపించుకోలేకపోవడంతో విసుగుతో కూడిన నిస్పృహ వేధిస్తుంది. కొందరిలో ఇది గర్జన అంతటి తీవ్రంగా కూడా వినిపిస్తుండవచ్చు. కొందరిలో ఎడతెగకుండా వినిపిస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం వస్తూ, పోతూ ఉండవచ్చు. ఇలా వస్తూపోతూ వినిపిస్తుండే హోరును ‘పల్సేటింగ్ టినైటస్’ అంటారు. దీని వల్ల ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. దేనిమీద ఏకాగ్రతా, దృష్టీ నిలపలేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో నిరాశా నిస్పృహలకూ, తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే అవకాశముంది. ఎందుకిలా జరుగుతుందంటే.. ఈ కింది అంశాలు టినైటస్కు దోహదపడవచ్చు లేదా అవి ఈ సమస్యను తీవ్రతరం చేసే అవకాశమూ ఉంది. అవి.. చెవిలో పేరుకుపోయే గులివి లేదా చెవిలో ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంపాటు బయట ఏదైనా హోరుకు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వినికిడి తగ్గడం / వినికిడి సమస్యలు ఇంకేమైనా మందులు తీసుకుంటూ ఉండటంతో వాటి దుష్ప్రభావంగా తలలో లేదా మెడభాగంలో ఎక్కడైనా గాయాలు కావడం దీర్ఘకాలపు అనీమియా, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ వంటి తలనొప్పులు ముప్పుగా పరిణమించే అంశాలు.. సాధారణంగా టినైటస్ ప్రాణాపాయం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టే అంశంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఆ ముప్పులేమిటంటే.. నిటారుగా నిల్చోలేక, ఎటో ఓ పక్కకు తూలిపోయే బ్యాలెన్సింగ్ సమస్య రావడం. వినికిడి సమస్యలు వస్తూపోతూ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన వినికిడి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఈఎన్టీ నిపుణులను కలిసి, తమకు మీనియర్స్ డిసీజ్ (కళ్లు తిరుగుతుండే లక్షణాలతో కూడిన లోపలి చెవిని ప్రభావితం చేసే వర్టిగో లాంటి వైద్య సమస్య), అకాస్టిక్ న్యూరోమా (ఒక రకం నరాల సమస్య) వంటి జబ్బులేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం. నిర్ధారణ.. దీని లక్షణాలు కొన్ని ఇతర సమస్యలతోనూ పోలుతున్నందువల్ల దీన్ని జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయడమన్నది చాలా కీలక అంశం. టినైటస్ నిర్ధారణకు ఈఎన్టీ నిపుణులు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిలో కొన్ని.. బాధితుల వైద్య చరిత్ర: వీరి మెడికల్ హిస్టరీని సునిశితంగా పరిశీలించడం. అంటే వారికి వినిపిస్తున్న శబ్దాలు ఎలాంటివి, మునుపు తల, మెడ వంటి చోట్ల ఏమైనాగాయాలయ్యాయా, ఇతరత్రా ఏమైనా వైద్యసమస్యలున్నాయా వంటి అంశాలని పరిశీలిస్తారు. వినికిడి పరీక్షలు: వినికిడి లోపం ఏదైనా ఉందా, ఉంటే ఏమేరకు వినికిడి కోల్పోయారు వంటి అంశాలు. ఇమేజింగ్ పరీక్షలు: కొన్ని సందర్భాల్లో ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, చెవిలో లేదా మెదడులో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలించడం. చికిత్స / మేనేజ్మెంట్.. అన్ని రకాల వైద్యపరీక్షల తర్వాత.. ఒకవేళ చెవిలో గులివి లేదా చెవి ఇన్ఫెక్షన్తో ఈ సమస్య వచ్చినట్టు గుర్తిస్తే ఆ మేరకు గులివిని క్లీన్ చేయడం లేదా చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు అవసరమైన మందులు వాడాలి. ఎమ్మారై / సీటీ స్కాన్ వంటి పరీక్షల్లో మెదడులోగానీ, చెవిలోగాని గడ్డలు లేవని తేలితే.. అక్కడ టినైటస్కు ఉన్న కారణాలనూ, బాధితులపై ప్రభావాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాధితుల్లో తీవ్రమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు టినైటస్ను తగ్గించే మందులతో పాటు, యాంటీ యాంగ్జైటీ మందుల్ని వాడాలి. కొన్నిసార్లు ఓరల్ స్టెరాయిడ్స్ లేదా అవసరాన్ని బట్టి ఇంట్రా టింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లూ, కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్స్ వంటివి వాడాల్సి రావచ్చు. డా. సంపూర్ణ ఘోష్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఇవి చదవండి: ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..! -
మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..
ఒక్కొసారి చీమలు, మిడతలు, సాలీడు వంటివి చెవిలోకి ఎలా వెళ్తాయో తెలియదు గానీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఫేస్చేసే నరకం అంతా ఇంత కాదు. అచ్చం అలానే ఇక్కడో మహిళ కూడా అదే సమస్యే ఎదుర్కొంది. అయితే ఏ కీటకం అయిన మనిషి శరీరంలోకి వెళ్లితే చనిపోవడం ఖాయం. కానీ ఈ సాలీడు మహిళ చెవిలోనే ఏకంగా గూడు కట్టుకుని జీవిస్తోంది. అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వైద్యం తీసుకోవడంతో నరకయాతన చవిచూసింది. చివరికీ పరిస్థితి క్రిటికల్ అయ్యి ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషాదకర ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌కి చెందిన లూసీ వైల్డ్ అనే మహిళకి ఒక రోజు ఉన్నటుండి చెవిలో వింత శబ్దాలు రావడం ఒకటే నొప్పిగా అనిపించింది. ఇంక లాభం లేదనుకుని తన భర్త సాయంతో మైక్రోస్కోపిక్ కెమెరాతో ఏం ఉందో తెలుసుకుంటారు. లోపల సాలీడు ఉన్నట్లు అర్థమై భయంతో కేకలు పెట్టింది. అయితే ఆమె భాగస్వామి వేడి నూనె వంటివి వేసి తీయాలనుకుంటాడు. అయితే అవేమీ తన బాధను తగ్గించకపోగా చెవి నుంచి రక్తస్రావం అవ్వడం మొదలైంది. ఇక దీంతో ఈఎన్టీ ఆస్పత్రికి హుటాహుటినా ఆ మహిళలను తరలిస్తారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి ఆ సాలీడు, దాని గూడుని తొలగించి యాంటి బయోటిక్ మందులతో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తారు. ఇప్పుడు లూసీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అలా సొంత వైద్యం తీసుకోవడంతో ఇంకా చెవిలో ఏదో అసౌకర్యంగా ఉన్నట్లే అనిపిస్తోంది లూసీకి. ఇలాంటప్పుడూ ఏం చెయ్యాలంటే.. ఇలా చెవిలో ఏదైన కీటకం దూరినట్లయితే వెంటనే చెవిని ఒకవైపుకి వంచి ఉంచండి. అయినప్పటికీ అది కొరుకుతూ ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లిపోండి. ఆలస్యం చేశారో ఇన్ఫెక్షన్కు దారితీసి చీము వంటి ద్రవాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. మీ సొంత వైద్యంతో చెత్త పరికరాలతో తీసేందుకు యత్నిస్తే ఈయర్ డ్రమ్‌కి సమస్య ఏర్పడవచ్చు ఒక్కోసారి వైద్యుడి వద్దకు వెళ్లి కీటకాన్ని తీయించుకున్నా కూడా వినికిడి శక్తి కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే క్రిమి పూర్తిగా తొలగించబడలేనట్లు అసౌకర్యంగా ఉన్న మళ్లీ వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటప్పుడూ సొంత ప్రయోగాల కంటే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
మీనియర్స్ డిసీజ్ అంటే..!
మన లోపలి చెవి (ఇన్నర్ ఇయర్) వినికిడి సామర్థ్యానికీ, నిటారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక్కడ సమస్య వస్తే వినికిడి శక్తి తగ్గడంతో పాటు, నిటారుగా నిలబడి ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఒళ్లంతా గిర్రున తిరుగుతూ, తూలి కిందికి పడిపోతామేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు... ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడిప్పుడు వినిపించే హోరు లాంటిది చెవిలోంచి వినబడుతుంటుంది. ఇలా వినికిడి తగ్గడం, తూలి కిందపడిపోయేలా బ్యాలెన్స్ కోల్పోవడం, చెవిలోంచి హోరు వినిపించడం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే మీనియర్స్ డిసీజ్‌పై అవగాహన కోసం ఈ కథనం. మీనియర్స్ డిసీజ్‌ను ‘ఇడియోపథిక్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్’ అని కూడా అంటారు. అది ప్రాణాంతకం కాదుగానీ... చికిత్స అందరకపోతే క్రమంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశమూ ఉంది. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ సమస్య... ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. లక్షణాలు: మీనియర్స్ డిసీజ్‌లో వర్టిగో, టినైటస్, వినికిడిలోపం (డెఫ్నెస్) ఈ మూడు లక్షణాలూ కలగలసి ఉంటాయి. వర్టిగో లక్షణాలు: పిల్లలు గిరగిరా తిరిగీ, తిరిగీ అకస్మాత్తుగా ఆగినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి తూలికింద పడిపోతామేమో అనిపించినట్లుగా లేదా రంగుల రాట్నంపై నుంచి విసిరివేసినట్లుగా అనుభూతి చెందుతూ ఆందోళన పడుతుంటారు. వర్టిగోలో కనిపించే ఇదే లక్షణం మీనియర్లోనూ కనిపిస్తుంది. టినైటస్ లక్షణాలు : ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరి గుయ్ అనే శబ్దమే కొందరికి చెవుల్లోంచి వినిపిస్తూ, చికాకు కలిగిస్తుంది. టినైటస్లోని ఇదే లక్షణం... మీనియర్స్ డిసీజ్‌లోనూ కనిపిస్తుంది. వినికిడి తగ్గడం : లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల శాశ్వతంగా వినికిడి కోల్పోయి... పర్మనెంట్ డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంది. వినికిడి లోపం అన్నది ఒక్కోసారి పెరుగుతూ ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకేరోజులోనే ఈ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. చెవి నిండిపోయినట్లుగా ఉండే ఫీలింగ్ చికాకు కలిగిస్తూ ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు: బాధితులు చెప్పే లక్షణాలతో ఆడియాలజిస్టుల ఆధ్వర్యంలో వినికిడి సామర్థ్యం పరీక్షలు (ఆడియోమెట్రీ టెస్ట్) , వెస్టిబ్యులార్ టెస్ట్ బ్యాటరీ పరీక్షలతో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో మెదడు ఎమ్మారై, ‘ఎలక్ట్రో కాక్లియోగ్రఫీ’, ‘ఎలక్ట్రో నిస్టాగ్మోగ్రఫీ’ వంటి పరీక్షలు మీనియర్స్ డిసీజ్ నిర్ధారణకు తోడ్పడతాయి. ఇతర పరీక్షలు: మెదడులో గడ్డలు, కొన్ని రకాల మెదడు సమస్యలు ఉన్నప్పుడూ ఈ లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి... ‘మీనియర్స్ ప్రోటోకాల్’ కూడా చేసి... సమస్య మెదడుకు సంబంధించింది కాదని రూల్ అవుట్ చేసుకుంటారు. నివారణ / వ్యాధి ఉన్నవారికి చెప్పే జాగ్రత్తలు : మీనియర్స్ డిసీజ్ ఉన్నవారిలో కొన్ని రకాల ఆహార నియంత్రణలను సూచిస్తారు. ఇవి కొంతమేరకు నివారణకూ తోడ్పడతాయి ఆహారంలో ఉప్పు తగ్గించడం చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కోలాడ్రింక్స్ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవడం ∙ఆల్కహాల్, పొగ అలవాట్లకు దూరంగా ఉండటం చైనా సాల్ట్‌కు దూరంగా ఉండటం. చికిత్స : ►వికారం, వాంతుల వంటి లక్షణాలను తగ్గించేందుకు యాంటీ–నాసియా (యాంటీ–ఎమిటిక్) మెడిసిన్స్ ఇస్తారు ∙ చెవిలోని ఒక రకం ద్రవం పెరగడం వల్ల మీనియర్స్ డిసీజ్ ►వచ్చే అవకాశం ఉన్నందున దేహంలోని ద్రవాలను బయటకు పంపించేందుకు మూత్రం ఎక్కువగా వచ్చే మందులైన ‘డై–యూరెటిక్స్’ అనే మందుల్ని వాడతారు ►వర్టిగోలో కనిపించే కళ్లు తిరగడం, పడిపోవడం లాంటి లక్షణాలను తగ్గించేందుకు ‘వెస్టిబ్యులార్ రీ–హ్యాబిలిటీషన్’ అని పిలిచే ఫిజియోథెరపీ లాంటి చికిత్సలను అందిస్తారు. ఇందులో బాధితులతో కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తారు ►వినికిడి సామర్థ్యం కోల్పోయిన వారిలో... వారు ఏ మేరకు కోల్పోయారో దాన్ని బట్టి హియరింగ్ ఎయిడ్ మెషిన్‌నూ అమర్చవచ్చు. ►పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు చాలా అరుదుగా కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇందులో ‘ఎండోలింఫాటిక్ శాక్’ అనే ప్రొసీజర్ ద్వారా చెవిలో అత్యధికంగా స్రవించే ద్రవాన్ని డ్రైయిన్ చేస్తారు∙ ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన ‘ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్’ థెరపీ కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఈ.సీ. వినయ కుమార్ సీనియర్ ఈఎన్టి సర్జన్ (చదవండి: అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?) -
బాబోయ్! చెవిలో ఇరుక్కుపోయిన పాము: వీడియో వైరల్
పలు రకాల వైరల్ వీడియోలు చూశాం. కొన్ని రకాల వైరల్ వీడియోలు చూస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఊహజనితమైన వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక పాము మహిళ చెవిలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ పామును తీసేందుకు డాక్టర్ శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. పాపం వైద్యుడు చేతికి గ్లోవ్స్ ధరించి చెవి నుంచి పామును తొలగించే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఆ వీడియోలో చివరకు పాము చెవి నుంచి బయటకు వచ్చిందో లేదా అనేది సస్సెన్స్‌లో ఉండిపోతుంది. ఈ వీడియోని చందన్‌సింగ్ అనే ఫేస్బుక్ వినియోగదారుడు 'పాము చెవి లోపలికి వెళ్లింది' అనే క్యాప్షన్‌తో సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి 80 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 100 లైక్‌లు రాగా, నెటిజన్లు కొంతమంది పాము చెవిలోకి ఎలా దూరిందని, మరోకరు ఇది నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. (చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం) -
భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే..
సాధారణంగా చెవిలో అప్పుడు చీమలు, చిన్న చిన్న పురుగులు వెళ్లడం గురించి వింటుంటాం.. చెవిలో నీళ్లు పోసి లేదా ఏదైనా వస్తువుతో వాటిని బయటకు తీస్తాం. కానీ తాజాగా ఓ మహిళ చెవిలో ఏకంగా పీత ఇరుక్కుపోయింది. అంతేగాక దాన్ని తీసేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. మహిళ చెవిలో పీత ఇరుక్కుపోయిన వీడియోను ఓ టిక్‌టాక్ యూజర్ షేర్ చేశారు. దీనిని బట్టి అట్లాంటిక్ తీరంలోని ప్యూయెర్టో రికోలో జరిగినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో మహిళ బీచ్‌లో ఉండగా ఆమె చెవిలోకి పీత వెళ్లిన్నట్లు గుర్తిస్తుంది. ఈ విషయాన్ని వెంటనే ఆమె పక్కన ఉన్న వ్యక్తి తెలియజేయగా.. అతను దానిని బయటకు తీయడానికి వ్యక్తి ఓ పరికరంతో ప్రయత్నిస్తుంటాడు. ఎంత ప్రయత్నించినా పీత బయటకు రాకపోగా మరింత లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. చివరికి అలాగే ప్రయత్నించగా చాలాసేపటకి పీత బయటకు వస్తుంది. అయితే మహిళ చెవిలోకి పీత ఎలా వెళ్లిందో తెలియదు గానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మహిళ పరిస్థితిని చూసి కాస్త భయందోళనకు గురయ్యారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. Huh??? pic.twitter.com/YeiMgYe4Q4 — Lady Sesshōmaru (@JasmineSW3) March 28, 2022 https://t.co/33N24UTpfp pic.twitter.com/X4btHoqlrG — Name can't be blank (@brattypanda) March 28, 2022 -
ఏకంగా చెవిలోనే గూడు కట్టేసుకుంది!
బీజింగ్: ఇంట్లో బొద్దింక కనబడితేనే ఒకింత కలవరానికి గురవుతాం. ముఖ్యంగా అమ్మాయిలు వాటిని చూసి చెవులు చిల్లులు పడేలా గోల చేస్తారు. కానీ, చెన్ అమ్మాయి చెవిలో మాత్రం ఓ బొద్దింక ఏకంగా గూడే కట్టేసుకుంది. చెవిలోకి ఎప్పుడు చొరబడిందో ఏమోగానీ, రోజూ వింత శబ్దాలతో ఆ యువతిని బొద్దింక హడలు కొట్టించేది. దాని చర్యలతో ఆమెకు అప్పుడప్పుడు నొప్పిగా అనిపించేది. దాంతో చెవిలో దుమ్మూధూళీ ఉండొచ్చని ఆమె ఇయర్ బడ్స్‌తో శుభ్రం చేసేది. అయినా, చెన్కు ఉపశమనం లభించకపోగా నొప్పి మరింత ఎక్కువైంది. చివరకు ఆమె డాక్టర్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. చెన్ చెవిలో బొద్దింక ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఆ బొద్దింక బతికే ఉందని తెలియడంతో డాక్టర్లు ఒకింత ఆశ్చర్యం, ఆందోళనకు గురయ్యారు. (ఆ యువకుడి చెవిలో 26 బొద్దింకలు) ఒటోస్కోప్ విధానం ద్వారా ఎట్టకేలకు యువతి చెవిలో నుంచి బొద్దింకను డాక్టర్లు బయటకు తీశారు. బొద్దింక ఇంకొన్ని రోజులు చెవిలోనే ఉండి ఉంటే.. కర్ణభేరీకి రంధ్రం చేసి తలలోకి ప్రవేశించేదని డాక్టర్లు పేర్కొన్నారు. చెన్ నిద్రించే సమయంలోనే బొద్దింక చెవిలో దూరి ఉండొచ్చని చెప్పారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా! పురుగులు, పాములు, బళ్లుల్ని సైతం వేయించుకు తినే చైనాలో. ఇదిలాఉండగా.. ఇళ్లల్లో తరచుగా క్రిమివినాశకాలు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చెవిలో ఏదైనా ఉందనే సందేహం కలిగినప్పుడు సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించాలని చెప్తున్నారు. (చదవండి: డబ్ల్యూటీవోకు చైనా: భారత్‌కు అనుకూలించే విషయాలివే!) -
బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..
సాక్షి, మహానంది : హోటల్‌కు వచ్చాడు.. జొన్నరొట్టె.. చికెన్ తదితర వాటిని ఆర్డర్ చేశాడు.. కడుపునిండా తిన్నాడు.. బిల్లు చెల్లించమని అడిగితే మద్యం మత్తులో గొడవపడి హోటల్ నిర్వాహకుడి కుమారుడి చెవిని కొరికాడు.. ఈ ఘటన మండలంలోని గాజులపల్లెలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. రంగస్వామి, లక్ష్మి గాజులపల్లె మెట్ట వద్ద చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు మహేష్ హోటల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా పనిచేస్తున్నాడు. రొట్టె, పప్పు, చికెన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారి హోటల్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి వచ్చాడు. కడుపు నిండా తిని సుమారు రూ. 200 బిల్లు చేశాడు. తిన్నవాటికి డబ్బులు ఇవ్వాలని అడుగగా వారితో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శివదీక్షలో ఉన్న మహేష్ చెవిని శ్రీను కొరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు నంద్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 16 కుట్లు పడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు. వారు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
ఆ యువకుడి చెవిలో 26 బొద్దింకలు
మెల్బోర్న్: చెవిలో విపరీతమైన దురద, నెప్పి రావడంతో ఓ యువకుడు వైద్యుల ను సంప్రదించాడు. వైద్యపరీక్షల అనంతరం అతడి చెవిలో 26 బొద్దింకలున్నాయని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగింది. లీ(19)కి ఒక రోజు రాత్రి కుడి చెవిలో భరించలేని దురద వచ్చింది. వెంటనే వేలు పెట్టి చూడగా విపరీతమైన నొప్పి మొదలైంది. దీంతో వైద్యులను సంప్రదించాడు. వైద్యపరీక్షల అనంతరం వారు అతడి చెవిలో 26 బొద్దింక పిల్లలున్నాయని గుర్తించారు. లీ చెవి మార్గంలో ఎన్నో వారాలుగా బొద్దింక నివసించి గుడ్లు పెట్టిందని, అందుకే అతడి చెవి దగ్గర చర్మం పాడైందని వివరించారు. అతడు సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చాడని లేకపోతే చెవి పూర్తిగా దెబ్బతినేదని పేర్కొన్నారు. -
గొడవ చేయొద్దన్నందుకు.. చెవి కొరికి మింగాడు
న్యూఢిల్లీ : 28 ఏళ్ల యువకుడిపై దాడి చేసి చెవి కొరికి మింగేశాడో తాగుబోతు. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్‌పరిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుమార్(28) ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన దీపక్, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులు తప్పతాగి కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కుమార్‌ను గమనించిన ఆ ఇద్దరు అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. కుమార్ వారిని గొడవ చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని బతిమాలాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగి ముఖంపై పిడిగుద్దులు గుద్దటం ఆరంభించారు. దెబ్బలకు తాళలేకపోయిన అతడు సహాయం కోసం బిగ్గరగా అరవటం మొదలు పెట్టాడు. విచక్షణ కోల్పోయిన సంతోష్ దాదాపు సెంటీమీటర్ మేర కుమార్ చెవి భాగాన్ని కొరికి దాన్ని నమిలి మింగేశాడు. విషయం తెలుసుకున్న అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే ముందే కుమార్‌ను ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి వారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. కుమార్‌కు ఆ ఇద్దరు వ్యక్తులతో ఎటువంటి గొడవలు లేవని దర్యాప్తులో తేలింది. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు. -
చేతిలో చెవిని పెంచారు..!!
టెక్సస్ : వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుందనడానికి టెక్సస్‌లో జరిగిన ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఓ వ్యక్తి శరీరంలో ఏదైనా అవయవం పాడైపోతే.. దాని స్థానంలో మరో వ్యక్తి నుంచి సేకరించిన అవయవాన్ని అమర్చుతున్నారు. కానీ అమెరికా మిలిటరీ వైద్యులు చెవిని కొల్పోయిన ఓ మహిళ శరీరంలోనే కొత్త చెవిని పునరుత్పత్తి చేశారు. వివరాల్లోకి వెళితే... ఆర్మీలో పనిచేస్తున్న షమిక బ్యూరేగ్ అనే అధికారిణి 2016లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో ఆమె తన చెవిని కొల్పోయారు. వినికిడి శక్తిని కోల్పోయారు. దీంతో ఆమెను తిరిగి ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని భావించిన మిలిటరీ వైద్యుల బృందం సహజసిద్ధమైన చెవిని తిరిగి ఏర్పరచాలని భావించారు. ఇందుకోసం 2012లో తొలిసారి జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీలో సహజసిద్ధంగా చెవిని తిరిగి సృష్టించి.. దానిని అమర్చిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మిలటరీ వైద్యులు ఆ దిశగా అడుగులు వేశారు. టెక్సస్‌లోని విలియం బ్యూమెంట్ మెడికల్ సెంటర్లో షమిక పక్కటెముకల నుంచి మృదులాస్థిని తీసుకొని దాన్ని చెవి ఆకృతిలోకి మార్చారు. ఆ తర్వాత దానిని ఆమె ముంజేతిలో అమర్చి.. స్వతహాగా అది వృద్ధి చెందించడంతో పాటు కొత్త రక్త నాళాలు, స్పందనలు ఏర్పడేలా చేశారు. తర్వాత శస్త్ర చికిత్స ద్వారా చెవిని తిరిగి షమికకు అమర్చారు. దీనిపై షమిక మాట్లాడుతూ.. ‘మొదట్లో నేను దీనికి ఇష్టపడలేదు. వైద్యులు, ఆర్మీ అధికారులు దీని గురించి పూర్తిగా వివరించిన తర్వాత బాగుంటుందేమో అనిపించింది. అవయవ మార్పిడి భయం కలిగించినప్పటికీ నాకు చెవి ఉంటే బాగుంటుందని అనిపించడంతో ఇందుకు ఒప్పుకున్నాను’ అని పేర్కొన్నారు. -
ఏకంగా ఆమె చెవిలో మకాం వేసింది...
సాధారణంగా సాలీడు ఏ చెట్టుకో, ఇళ్లల్లోనో బూజు గూళ్లు అల్లుకునే విషయాన్ని మనం చూసి ఉంటాం. అయితే ఈ సాలీడు మాత్రం తన రూట్ మార్చి ఏకంగా ఓ మహిళ చెవిలోనే మకాం వేసింది. అంతే కాకుండా ఆమె తన ప్రాణం పోతుందేమో అనుకునేలా చేసింది. తీవ్రమైన తలనొప్పితో బాధిత మహిళ ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బతికున్న సాలీడును ఆమె చెవిలో గుర్తించారు. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల లక్ష్మి అనే మహిళకు మధ్యాహ్నం లేవగానే భరించలేని తలనొప్పితో పాటు తన కుడి చెవిలో ఏదో ఉన్నట్లు అనిపించింది. చెవిలో ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించడంతో... ఆమె చెవిని పలుసార్లు రుద్దుకుని, చెవిలో ఉన్నదాన్ని తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా తలనొప్పి అంతకంతకు తీవ్రతరం కావడంతో కొలంబియా ఏషియా ఆస్పత్రికి వెళ్లిన ఆమెను డాక్టర్ పరీక్షించిన చెవిలో సాలీడు ఉన్నట్లు గుర్తించారు. అయితే లక్ష్మి చెవిపై టార్చ్ లైట్ వేయగానే ఆ వెలుగుకు సాలె పురుగు పాక్కుంటూ దానికదే చెవిలో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో షాక్ తినడం డాక్టర్ వంతైంది. ఈ సందర్భంగా లక్ష్మిని పరీక్షించిన ఈఎన్టీ డాక్టర్ సంతోష్ శివస్వామి మాట్లాడుతూ .... చెవిలో దూరిన సాలీడు బతికి ఉండటం తాము తొలిసారి చూశామని, ఇది అరుదైన ఘటన అని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. -
రక్త కన్నీరు..
ఈ పిల్లాడి పేరు అఖిలేశ్ రఘువంశీ(10). మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఉంటాడు. తండ్రి వ్యవసాయదారుడు. చూశారుగా.. సమస్య ఏమిటో.. ఒక్క కంటి నుంచే కాదు.. తల నుంచి.. చెవి నుంచి.. ముక్కు నుంచి.. కాళ్ల నుంచి రక్తం ధారలా కారుతుందట. ఒక్కోసారి రోజుకు 10 సార్లు వస్తే.. ఒక్కోసారి మూడు నెలల వరకూ దాని జాడే కనిపించదట. మూడేళ్ల నుంచి అఖిలేశ్ ఈ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. చాలా మంది డాక్టర్లు చూశారు. ఎయిమ్స్ వైద్యులు సైతం పరీక్షించారు. కారణం ఇదీ.. అని ఎవరూ చెప్పలేకపోయారు. దెబ్బ తగలకున్నా.. రక్తం కారిపోతూ ఉంటుందని.. ఇలా వచ్చినప్పుడు తనకు తీవ్రమైన తలనొప్పి వస్తుందని అఖిలేశ్ చెబుతున్నాడు. ఇతడు ‘హీమోలక్రియా’ తో బాధపడుతుండొచ్చని చెబుతున్నప్పటికీ.. పూర్తిగా నిర్ధారించడం లేదు. హీమోలక్రియాతో బాధపడుతున్నవారి కంటి నుంచి రక్తం వస్తుంటుంది. వైద్యులు ఏదీ సరిగా చెప్పకపోవడంతో తన కొడుకు ఏమైపోతాడా అన్న ఆందోళన అతడి తండ్రిలో నెలకొంది. ప్రపంచంలో పేరుగాంచిన వైద్యులు అఖిలేశ్‌కు వచ్చిన వ్యాధికి చికిత్సను సూచించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. -
వింతైన కఫ్ఫులు...
మారుతున్న ఫ్యాషన్, ట్రెండ్‌ను బట్టి మనమూ మారుతుండాలి. ఒకప్పుడు చెవికి ఎన్ని రంధ్రాలు, కమ్మలు ఉంటే అంత అందం అనుకునేవారు. తర్వాత ఒకే చోట దుద్దులు పెట్టుకోవడమే ఫ్యాషన్. కానీ ఇప్పుడో... ఇయర్ కఫ్స్ అని కొత్తగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. రెండు మూడు ఎక్స్ట్రాగా కుట్టించుకొని మరీ రింగ్స్, స్టడ్స్ పెట్టుకుంటున్నారు. అంతేకాదు... భారీ సైజులో ఉండే రెడీమేడ్ కఫ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. అంటే, వీటిని పెట్టుకోవడానికి చెవికి రంధ్రాలు ఉండాల్సిన పని లేదు.. ప్రెస్ చేస్తే సరి. అమాంతం చెవికి అతుక్కుపోతాయి. వీటిని షాపుల్లో కాకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే..? ఇలా... కావలసినవి: కాపర్ లేదా స్టీల్ వైర్ (సన్నది, దృఢమైనది), కటింగ్ ప్లయర్, గ్లూ, పూసలు, చిన్న సైజు రాళ్లు తయారీ: ముందుగా ఇయర్ కఫ్స్ ఏ ఆకారంలో కావాలో నిర్ణయించు కోవాలి. తర్వాత దానికి తగ్గట్టు వైర్‌ను కటింగ్ ప్లయర్ సాయంతో మెలితిప్పు కుంటూ కట్ చేసుకోవాలి. ఎలాంటి ఆకారాన్ని తయారు చేసినా.. చివర్లను మాత్రం మెలితిప్పుకోవాలి. లేదంటే అవి చెవులకు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ తీగలకు కావలసిన చోట, డిజైన్‌ను బట్టి పూసలు ఎక్కించొచ్చు లేదా రాళ్లను గ్లూ సాయంతో అతికించొచ్చు. ఈ ఇయర్ కఫ్స్‌లో హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి. ఒక్కో డిజైన్‌లో దళసరి తీగకు సన్నని తీగ చుట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ డిజైన్ మరింత అందంగా ఉంటుంది. అయినా ఓసారి పక్కనున్న ఫొటోలను చూడండి. తయారీ, డిజైన్ సెలక్షన్ అంతా మీకే అర్థమవుతుంది. -
నేను చెవిని..
ఈమధ్య ఆనంద్ కంప్యూటర్ కొన్నాడు. దానిలోని సర్క్యూట్లను చూసి అబ్బురపడుతున్నాడు. గొప్ప కాదు గానీ... నాలోని నిర్మాణంతో పోలిస్తే నాకేమో అది కాంక్రీట్‌ను కలిపే యంత్రం కంటే మెరుగ్గా ఏమీ అనిపించడం లేదు. ఒక మహానగరానికి ఫోన్ కమ్యూనికేషన్లను కలిపే ఎలక్ట్రిక్ సర్క్యూట్ల వ్యవస్థ అంతటినీ ఒక అక్రోట్ సైజుకు కుదిస్తే ఎంత ఉంటుందో నేనూ అంతే ఉంటా. నేను ఆనంద్ చెవిని. నాకంటే నా పార్ట్నర్ కన్ను గొప్పదని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. కానీ ఆనంద్ కొన్న కంప్యూటర్లో సినిమా వేసుకొని, శబ్దాలు వినకుండా కేవలం చూడటమే జరిగితే నేనెంత అవసరమో ఆనంద్‌కు తెలిసివస్తుంది. ఒక నిశ్శబ్ద స్థితి ఎంత నిస్తేజంగా అనిపిస్తోందో అతగాడికి అర్థమవుతుంది. బయట కనపడుతున్న డొప్ప లాంటి దాన్ని చూసి, దాన్నే చెవి అనుకుంటాడు ఆనంద్. నిజానికి అది బయటి చెవి మాత్రమే. శబ్ద తరంగాలను లోపలికి పంపడానికి ఒక ద్వారంలా మాత్రమే అది పని చేస్తుంది. అక్కడి నుంచి కాస్త ఒంపు తిరుగుతూ లోపలికి ఒక డ్రమ్లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఇయర్ డ్రమ్ అంటారు. నా లోపలి అవయవాలను రక్షించడం కోసమే ఆ ఒంపు. ఈ డ్రమ్ పొడవు రెండు సెంటీమీటర్లుంటుంది. ఈ ఒంపు వద్ద సన్నటి వెంట్రుకల కుచ్చుల్లాంటి నిర్మాణాలతో పాటు దాదాపు 4,000 మైనపు గ్రంథులు ఉంటాయి. పురుగూపుట్రా, క్రిములూ గట్రా, దుమ్మూధూళి చెవి లోపలికి వెళ్లకుండా ఈ మైనపు పొర దగ్గరే అన్నీ అంటుకుపోయి ఆగిపోతాయి. ఇక ఆనంద్ ఎప్పుడైనా ఈత కొడితే ఆ నీళ్లలోని మురికి నా లోనికి చేరకుండా ఈ మైనమే కాపాడుతుంది. ఎప్పుడైనా నాలోని మైనం ఎక్కువైతే ఆనంద్ చేత్తో కాస్త తొలగించడానికి చూస్తాడు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే మరింత ఎక్కువ మైనం వస్తుంది. ఎక్కువైన మైనాన్ని నేనే తొలగించుకుంటూ ఉంటా. వినికిడి జ్ఞానం ఆరంభమయ్యేది ఇయర్‌డ్రమ్ దగ్గరే. వినికిడి ప్రక్రియను తేలిగ్గా వివరించడానికి ఒక పోలిక చెప్పాలి. ఒక బిగుతైన డప్పు మీద కర్రతో కొట్టినప్పుడు కలిగే ప్రకంపనలా... శబ్దాల వల్ల ఇయర్ డ్రమ్ చివరన ఉన్న ఎముకల గొలుసు కుదులుతుంది. ఒక గుసగుస వల్ల ప్రకంపనలో ప్రతిస్పందించే ఈ ఇయర్‌డ్రమ్ ఒక సెంటీమీటరులోని పదిలక్షల వంతు పక్కకు జరిగేంత స్పందిస్తుంది. దాంతోనే గుసగుస కూడా మనకు నిపిస్తుంది. ఇలాంటి స్పందనల పరంపర అదేపనిగా కొనసాగుతూ అర్థవంతమైన శబ్దాల్లా ఆనంద్‌కు వినిపిస్తాయి. ఈ ఇయర్ డ్రమ్ చివరి నుంచి అతడిలో మధ్య చెవి భాగం మొదలవుతుంది. అది ఒక చిక్కుడు గింజ పరిమాణమంత ఉంటుంది. ఈ మధ్య చెవిలో ఒక దాన్ని తాకుతూ మరొకటిగా మూడు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అవి... ఆన్విల్, హ్యామర్, స్టర్రప్ (దీన్నే స్టెపీస్ అని కూడా అంటారు). ఆనంద్‌కు వినిపించిన శబ్దాలను ఎన్నో రెట్లు అధికంగా చేసి, స్టర్రప్ (స్టెపీస్) చివరన ఉండే ఓవల్ విండో నుంచి ‘లోపలి చెవి’ అని పిలిచే భాగంలోకి పంపడం ఈ చిన్న ఎముకల బాధ్యత. వినికిడిలో లోపలి చెవి కీలకం... ఇక ‘లోపలి చెవి’ ఇక్కడ మొదలవుతుంది. ఇదొక కోటలాంటి నిర్మాణం. ఒక బలమైన ఎముక అనే కోటలో ఈ లోపలి చెవి ఉంటుంది. ఇందులో నీటిలాంటి ద్రవం ఉంటుంది. దీని వెనక నత్తపైన ఉండే లోపలివైపునకు తిరిగిన స్ప్రింగ్ లాంటి ‘కాక్లియా’ అనే భాగం ఉంటుంది. దీని నిండే అత్యంత సూక్ష్మమైన వేలాది నర్వ్ కణాలు ఉంటాయి. అది ఒక్కొక్కటి ఒక్కో లాంటి కంపనానికి (వైబ్రేషన్‌కు) ప్రతిస్పందిస్తూ ఒక్కో శబ్దాన్ని గుర్తు పడుతుంటాయి. అలా అవి మనకు వినికిడి జ్ఞానాన్ని ఇస్తుంటాయి. ఉదాహరణకు మధ్య చెవిలోని స్టర్రప్ (స్టెపీస్) తన వెనకే ఉన్న ఓవల్ విండోలోకి శబ్దాలను పంపించగానే, దాని వెనకే ఉన్న నీళ్ల లాంటి ఆ ద్రవంలో ఒక అలలాంటిది పుడుతుంది. నీళ్లపై బెండులా తేలే గడ్డీగాదం కదులుతున్నట్లే శబ్దం వచ్చినప్పుడల్లా ఆ అలలాంటిది ఆ శబ్దానికి అనుగుణంగా పైకి కిందికి కదులుతూ ఉంటుంది. అలా కదిలే అల వల్ల కాస్త విద్యుత్ తరంగం లాంటిది ముందుకు పాసవుతూ వినికిడి నరానికి (ఆడిటరీ నర్వ్‌కు) తాకుతుంది. ఒక పెన్సిల్ లోపలి లెడ్ అంత సైజ్‌లో ఉండే ఆ నరంలో దాదాపు 30,000కు పైగా సర్క్యూట్స్ ఉంటాయి. అది ఆనంద్ మెదడు నుంచి కేవలం రెండు సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. కాక్లియాలో అనేక వేల శబ్ద జ్ఞాపకాలు ఎలక్ట్రిక్ మెసేజెస్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. మనకు వినిపించగానే గత జ్ఞాపకాలతో ఆ శబ్దజ్ఞానం మనకు తెలుస్తుంది. ఇలా అర్థవంతమైన శబ్దాలన్నీ మనకు ఒక భాషగా ఆనంద్ మెదడుకు చేరుతూ ఉంటాయి. ఇలా వినికిడి ఏర్పడుతుంది. ఇప్పటివరకూ గాలి తరంగాల వల్ల నాలోకి వచ్చే శబ్ద జ్ఞానం గురించి చెప్పాను. ఇక కొన్ని సందర్భాల్లో దవడ ఎముక ద్వారా కొన్ని శబ్దాలు నేరుగా లోపలి చెవిలోకి చేరుతాయి. అయితే ఆ శబ్దాలన్నీ నేరుగా చెవికి వినిపించే శబ్దాలకంటే భిన్నంగా ఉంటాయి. ఈ భిన్నత్వం వల్లనే తన సొంత గొంతునే టేప్ రికార్డర్‌పై రికార్డు చేసి విన్నప్పుడు ఆనంద్‌కు అది తానే మాట్లాడానా అని సందేహిస్తూ, తన గొంతుక కాదేమోనని పొరబడుతుంటాడు. వినికిడికి మాత్రమే కాదు... బ్యాలెన్స్ కోసం కూడా ఇక వినడం అన్నది లోపలి చెవి చేసే ఒక అత్యధ్భుతమైన ప్రక్రియ అయితే ఇది ప్రదర్శించే మహాద్భుతం ఇంకొకటి ఉంది. అదే ఆనంద్ నిటారుగా ఉంచడం. ఒకరకం ద్రవం నిండిన మూడు సెమీ సర్క్యులర్ నాళాలు కాక్లియాతో పాటు ఉంటాయి. ఆనంద్ నిటారుగా ఉండటానికి, తన బ్యాలెన్స్ నిలుపుకోడానికి ఈ ట్యూబ్‌లు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆనంద్ అకస్మాత్తుగా ఏదైనా కుదుపునకు గురైతే ఈ సెమీ సర్క్యులర్ నాళాలలో ఉండే ద్రవం కూడా కదులుతుంది. బకెట్‌ను కదిలించగానే అందులోని నీళ్లూ కదిలినట్లుగా ఈ ద్రవమూ కదులుతుంది. అలా కదిలినప్పుడు ఈ ద్రవానికి మెదడుకు ఉండే అనుసంధానం తొలగిపోతుంది. ఫలితంగా కుదుపు కారణంగా తాను తూలి పడిపోతున్నాననీ, తనను తాను నిలబెట్టుకోవాలనే సహజాత జ్ఞానం (ఇన్స్టింక్ట్) ఆనంద్‌కు కలుగుతుంది. దాంతో అతడు నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా తన కండరాలను బిగించడం, నిటారుగా ఉండటానికి ప్రయత్నించడం వంటివి చేస్తాడు. ఆనంద్ పడిపోకుండా ఎప్పుడూ బ్యాలెన్స్‌తో ఉండటానికీ, ఒకవేళ పడిపోబోతుంటే నిలువరించడానికి నేను చేసే నిత్యకృత్యమిది. జాగ్రత్తలు అవసరం ఆనంద్ అప్పుడప్పుడూ అగ్గిపుల్లలు, ఇయర్‌బడ్స్‌ను చెవుల్లో దూర్చుతుంటాడు. వాటి వల్ల చెవులు శుభ్రం కావు సరికదా. మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నా మేలు కోరే వాడైతే ఆనంద్ ఆ పనులు చేయకూడదు. ఆనంద్ పూర్వీకుల విషయంలో అతడు వేటాడే నాడు అతడికి పెద్దగా వినిపించే శబ్దాలైన సింహగర్జనలు, ఉరుముల శబ్దాలతో అతడికి ప్రమాదం ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు ఆనంద్ రోజూ హైపిచ్ జెట్ ఇంజన్ల శబ్దాల తీవ్రతను అనుభవిస్తున్నాడు. ఇది భవిష్యత్తులో అతడి వినికిడిని దెబ్బతీస్తుంది. అతడి లోపలి చెవి ఆరోగ్యం బాగుండాలంటే పొగతాగడం పూర్తిగా మానేయాలి. చెవికి అపాయకరమైన కొన్ని రకాల మందులు (ఒటోటాక్సిక్ డ్రగ్స్)ను నిపుణులైన డాక్టర్ సలహా మేరకే వాడాలి. అలాగే కాఫీని చాలా పరిమితంగా తీసుకోవాలి. అది ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలు ముడుచుకొనిపోయి లోపలి చెవికి అందాల్సిన పోషకాలు అందవు. అతడు క్రమం తప్పకుండా ఈఎన్టీ నిపుణుల వద్దకు వెళ్లి నన్ను పరీక్షించుకుంటూ ఉంటే మేలు. సమస్యలూ... చికిత్సలూ నాలోని సంక్లిష్టతల వల్ల కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి మధ్య చెవి చివర ఉండే పొర చిరిగిపోవడం చాలా తరచూ జరిగే ప్రక్రియ. ఇలా జరిగినప్పుడు సాధారణంగా నన్ను నేనే రిపేర్ చేసుకుంటూ ఉంటా. కానీ ఒక్కోసారి ఇలా డ్రమ్ చివరన ఉండే పొర చిరిగిపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇక కొందరిలో చెవిలో ‘గుయ్య్య్’ అనే శబ్దం వినిపిస్తుంది. దీన్ని టినైటస్ అంటారు. కొందరిలో ఇది యాంటీబయాటిక్స్ వాడకం వల్ల, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, జ్వరం, రక్తప్రసరణలో మార్పులు, నాలోని అకాస్టిక్ నర్వ్ మీద కణుతులు రావడం వంటివి జరగవచ్చు. దీనికి అసలు కారణాన్ని గుర్తుపట్టి, దాన్ని తొలగించగలిగితే, ఈ సమస్య తగ్గిపోతుంటుంది. మధ్య చెవి సమస్యలు కూడా ఒక్కోసారి వినికిడి శక్తి కోల్పోవడానికి కారణం కావచ్చు. మధ్య చెవిలోంచి గొంతులోకి వెళ్లే యూస్టేషియన్ ట్యూబ్ మార్గం ద్వారా ఒక్కోసారి హానికారక క్రిములు చెవికి సోకవచ్చు. అందుకే ఒక్కోసారి ఆనంద్‌కు జలుబు చేసినప్పుడు అతడి చెవిలోనూ నొప్పి వస్తుంది. ఆనంద్‌కు పెద్దగా అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి గట్టిగా ముక్కు చీదుతూ ఉంటాడు. దాంతోనూ గొంతులోని కాలుష్యాలు నాలోకి చేరే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మధ్య చెవిలోని ఎముకలు కాస్త పెరిగి అవి జామ్ అవుతాయి. దాంతో మధ్యచెవిలోని ఎముకల కదలికలు లేకపోవడంతో ఆనంద్‌కు వినపడదు. దీన్ని కండక్టివ్ డెఫ్నెస్ అంటారు. దీనివల్ల ఆనంద్ కొంత వినికిడి కోల్పోడానికి అవకాశం ఉంటుంది. సరైన సమయంలో మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా వినికిడి శక్తిని మళ్లీ మామూలుగా చేసే అవకాశం ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోయే వినికిడి ఆనంద్ పుట్టిననాటి నుంచి అతడి వినికిడి శక్తి తగ్గిపోతూనే ఉంటుంది. అతడి లోపలి కణజాలం తాలూకు సాగే గుణం (ఎలాస్టిసిటీ) తగ్గుతుండటం, వెంట్రుకల్లాంటి అతి సన్నటి కణాలు క్యాల్షియమ్ డిపాజిట్ల వల్ల గట్టిబారతుండటంతో అతడి వినికిడి తగ్గుతుంటుంది. ఆనంద్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ప్రతి సెకన్‌కు 30,000 కంపనాలు (వైబ్రేషన్స్) వినేవాడు. పదహారేళ్ల వయసులో తన సొంత శరీరం శబ్దాలు కూడా వినగలిగే వాడు. టీన్స్ దాటాక ప్రతి సెకన్‌కు 20,000 కంపనాలు మాత్రమే వినగలడు. అలాగే ఆనంద్ తన 80వ ఏట కేవలం 4000 కంపనాలు/సెకన్ మాత్రమే నినగలడు. అంటే ఆ సమయంలో చుట్టూ నిశ్శబ్దంగా ఉంటేనే తప్ప ఇతరులు మాట్లాడే విషయాలు కష్టంగా వినగలడన్నమాట. - డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
శబ్దంతో ఇబ్బంది పెట్టే జబ్బు!
మెడిక్షనరీ చెవిలో జోరీగ చేసే శబ్దం ఎంత చిరాగ్గా అనిపిస్తుంది! అకస్మాత్తుగా ఎవరైనా ఈల వేసినా, టీ వంటి ద్రవపదార్థాలను జుర్రుకునే శబ్దాలు చేసినా, గట్టిగా బ్రేవుమంటూ తేన్చినా, కాళ్లు టపటపా కొడుతూ నడిచినా, ఎవరైనా గురకపెడుతున్నా ... ఆ చప్పుళ్లు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇది అందరికీ ఉండే చాలా సాధారణమైన సహజాతం (ఇన్స్టింక్ట్). కానీ కొందరికి చిన్న చిన్న చప్పుళ్లే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తాయి. దాన్నే వైద్య పరిభాషలో ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’ అంటారు. అమెరికాకు చెందిన నరాలపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు (న్యూరోసైంటిస్టులు) పావెల్ జెస్టర్ఫాబ్, మార్గరెట్ జస్టర్ఫాబ్ ఆ జబ్బుకు ఈ పేరు పెట్టారు. దీన్నే సాధారణంగా ‘మీసోఫోనియా’ అంటారు. అంటే శబ్దాలను అసహ్యించుకోవడం అని అర్థం. ఇలాంటి జబ్బు ఉన్నవాళ్లు టూత్ బ్రష్ చేసే చప్పుళ్లనూ, తుమ్ములనూ, దగ్గునూ, టైపింగ్ శబ్దాలనూ, ఆవలింతలనూ, పెద్దగా నవ్వడాన్ని, చివరకు మింగుతున్నప్పుడు వచ్చే శబ్దాలనూ తట్టుకోలేరు. ఈ జబ్బు ఉన్నవాళ్లకు శబ్దాలు వినగానే ఒళ్లంతా చెమటలు పెట్టడం, గుండెవేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివాళ్లకు ముందుగా ఫ్యాన్ శబ్దంతో మొదలుపెట్టి నెమ్మదిగా నెమ్మదిగా శబ్దాలను తట్టుకునేలా వారికి రకరకాల శబ్దాలు అలవాటు చేస్తారు. కొందరికి 6-12 వారాల పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) చేస్తారు. -
ఉదయం వేళల్లో తలనొప్పి వస్తుందా..?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65. ఆవిడకు తరచు తల తిరిగినట్టు ఉంటుంది. అలాగే చెవిలో హోరు, చెవి నొప్పితో రాత్రిళ్లు సరిగా నిద్రలేక బాధపడుతున్నారు. దయచేసి ఆమె సమస్యలకు సరైన హోమియో మందు సూచించగలరు. - సూర్య, హైదరాబాద్. చెవిలో ముఖ్యంగా మూడుభాగాలుంటాయి. అవి 1. చెవి వెలుపలి పొర 2. మధ్య పొర 3. లోపలి పొర. ఈ మూడు పొరలకు ఇన్ఫెక్షన్స్ లేదా ఏమైనా వ్యాధులు వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవడం వల్ల వచ్చి తగ్గుతుంటాయి. ఒక్కోసారి ఇవి దీర్ఘకాలికంగా కూడా రావచ్చు. త్వరితంగా వచ్చేవాటిని ఎక్యూట్ సప్పురేటివ్ ఒటైటిస్ మీడియా, దీర్ఘకాలికంగా వచ్చే వాటిని క్రానిక్ సప్పురేటివ్ ఒటైటిస్ మీడియా అంటారు. మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎలర్జీ వల్ల ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ముఖ్యలక్షణాలు: చెవినొప్పి, సరిగ్గా వినిపించకపోవడం, చెవి పట్టేసినట్లుగా అనిపించడం, జ్వరం, తల దిమ్ము, ఏ పనీ చేయాలనిపించకపోవడం. తల తిరగడం: తల తిరగడాన్ని వెర్టిగో అంటారు. పడుకున్నప్పుడు లేదా పడుకుని అకస్మాత్తుగా లేచినా, పైకి చూసినా వెర్టిగో వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. మినియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో తల తిరగడం, సరిగా వినిపించకపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఎకోస్టిక్ న్యూరోమా: దీనిలో చెవి లోపల కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరు, నడిచేటప్పుడు సరిగా బ్యాలెన్స్ లేకపోవడం, ముఖం నిండా తిమ్మిరి రావడం లక్షణాలు కనిపిస్తాయి. ల్యాబరెంత్రైటిస్, వెస్టిబ్యూల్ న్యూరైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో తల తిరుగుడు, వికారం, వినికిడి లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితోబాటు ఓటోస్కిలోరిసిస్, టినిటస్ లాంటి సమస్యలు కూడా సాధారణమే. చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యల వల్ల రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల, మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది. హోమియో చికిత్స: పాజిటివ్ హోమియోపతిలో వ్యాధి మూలకారణాలను విశ్లేషించి, రోగి శారీరక, మానసిక తత్వాలను బట్టి జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, వ్యాధికి శాశ్వత నివారణ జరుగుతుంది. న్యూరో సర్జికల్ కౌన్సెలింగ్ ఉదయం వేళలలో తలనొప్పి వస్తుందా..? నా వయసు 35. నేను కాల్సెంటర్లో పని చేస్తున్నాను. ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తుంటాను. నాకు ఇటీవల బాగా తలనొప్పి వస్తుంది. తల బాగా బరువెక్కినట్లు ఉంటుంది. ఒక్కోసారి తలనొప్పి ప్రారంభమై క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా తలనొప్పే కదా అంతగా పట్టించుకోలేదు. కానీ నెలరోజులుగా తలనొప్పి నన్ను బాధిస్తోంది. అప్పుడప్పుడు తగ్గి మళ్లీ వస్తోంది. తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతున్నాను. ఏకాగ్రతతో ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. - సంతోష్ కుమార్, హైదరాబాద్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీలో మెదడు సంబంధిత సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. మీకు ఉదయం లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు వాంతులు అవుతున్నాయా చూసుకోండి. ఒకవేళ ఉదయం తలనొప్పితో పాటు వాంతులు అవుతుండటం, వాంతి చేసుకోగానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం వంటి లక్షణాలు కనిపిస్తే దానిని బ్రెయిన్ ట్యూమర్‌గా అనుమానించాలి. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే వాంతి చేసుకున్న తర్వాత తలనొప్పి తగ్గి, సాధారణంగా అనిపిస్తుంది. దాంతోపాటు చూపులో కూడా తేడా వస్తుంది. మనకు కనిపించే వస్తువులు కూడా అస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోండి. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారణ అయినా మీరు ఆందోళన చెందకండి. ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్‌కు అందుబాటులో అత్యాధునిక వైద్యప్రక్రియలో సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. వ్యాధి దశను బట్టి చికిత్స ఉంటుంది. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగానీ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఉంటే కనుక బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పల్మనాలజీ కౌన్సెలింగ్ మా బ్రదర్‌ని మా ఊరు హాస్పిటల్లో చేర్చాము. ‘ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలో ఉంచాల’న్నారు. ఒక రోజు తర్వాత ‘సీరియస్‌గా ఉంది, హయ్యర్ సెంటర్‌కి తీసుకెళ్లమ’న్నారు. హాస్పిటల్ మార్చాం. రోజుకయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. కౌంటర్లో అడిగితే ఇది అన్ని సౌకర్యాలున్న హైఎండ్ ఐ.సి.యు. అన్నారు. మాకు ఏం జరుగుతుందో సరిగా అర్థం కావడం లేదు. మంచి ఐ.సి.యు. అంటే ఏమిటి? ఖర్చులో అంత తేడా ఎందుకుంది? - వి.ఆర్. వసంత్, కోదాడ ఐ.సి.యు. రెండు రకాలు. ఓపెన్ అని, క్లోజ్డ్ అని. పాశ్చాత్య దేశాలలో సాధారణంగా క్లోజ్డ్ ఐ.సి.యు.లు ఉంటాయి. ఓపెన్ అంటే ఏ కన్సల్టెంట్ అయినా తన పేషెంట్‌ను ఐ.సి.యు.లో డెరైక్ట్‌గా చేరుకోవచ్చు. అవసరాన్ని బట్టి స్పెషలిస్ట్‌ని పిలిచి చూపిస్తారు. క్లోజ్డ్ అంటే, క్రిటికల్ కేర్‌తో క్వాలిఫికేషన్ ఉండి, పేషెంటు సీరియస్‌గా ఉన్నప్పుడు అవసరమైన ఏ స్పెషాలిటీకి సంబంధించిన నిర్ణయమైనా తీసుకొనగలిగి, మరియు ఏ స్పెషాలిటీకి సంబంధించిన అత్యవసరమైన ప్రొసీజర్స్ వెంటనే చేయగలిగిన సమర్థమైన డాక్టర్లు ఐ.సి.యు.లో 24 గంటలూ ఉంటారు. అందువల్ల పేషెంటు బ్రతికే ఛాన్సు క్లోజ్డ్ ఐ.సి.యు.లో ఎక్కువ. అంతేకాకుండా మంచి ఐ.సి.యు. అంటే లెవెల్-3 ఐ.సి.యు. అంటారు. ఇవి సాధారణంగా టెరిషియరీ కేర్ / రిఫరల్ సెంటర్స్‌లోనే ఉంటాయి, అంటే పేషెంటుకు కావలసిన యంత్రాలు, ఇతర పరికరాలు, మానిటర్లు ప్రతి పేషెంటుకి 24 గంటలు ఒక ట్రైన్డ్ నర్స్ ఉండాలి. సాధారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంటుకి చాలా లైన్లు, ట్యూబులు, శరీరంలోకి, రక్తనాళాలలోకి, ఊపిరితిత్తులలోకి ఉంటాయి. అందువల్ల ఐ.సి.యు.లో అనుకోని ఘటనలు (యాక్సిడెంట్స్) జరగకుండా, పేషెంటుకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, వీటివల్ల ప్రాణహాని కలుగకుండా ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు, ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకొనే జాగ్రత్తలు అన్నిటి వల్ల ఖర్చు పెరుగుతుంది. ఇక మీ బ్రదర్ విషయానికొస్తే అతడికి ఎ.ఆర్.డి.ఎస్. అంటే (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్). ఇది లంగ్స్‌కు వచ్చే చాలా సీరియస్ జబ్బు. ఇలాంటి పేషెంట్లు ప్రపంచంలో 100లో 40 మంది దాకా చనిపోతుంటారు. ముందుగా సరిపడా మందులు (యాంటీబయాటిక్స్) మొదలుపెట్టి, పేషెంట్‌కి కావలసిన ఇతర సపోర్ట్స్ అన్నీ సమకూర్చి; జబ్బు వచ్చినప్పుడు ఏ ఇతర అవయవ వ్యవస్థలు ప్రభావితం కాకుండా ఉండి, ఇతర సమస్యలు (అంటే బి.పి., షుగరు, కిడ్నీ, లివర్ జబ్బులు వంటివి) లేకుండా ఉంటే బ్రతికే చాన్సులు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లను అడగండి. వివరిస్తారు. -
చెవి గురించి చిత్రమైన సంగతులు!
పిల్లల కోసం ప్రత్యేకం ⇒ మన శరీరంలోని అత్యంత చిన్న కండరం మధ్య చెవిలో ఉంటుంది. దీని పేరు స్టెపీడియస్. దీని పొడవు 1.27 మిల్లీ మీటర్లు మాత్రమే. ఇది మన శరీరంలోని అత్యంత చిన్న ఎముక అయిన స్టెపీస్ను నియంత్రిస్తుంది. శబ్ద తరంగాలను మెదడుకు చేరవేసేందుకు ఈ స్టెపీస్ ఎముక మరో రెండు ఎముకలతో కలిసి పనిచేస్తుంది. ఆ ఎముకల పేర్లే మెలియస్, ఇన్‌కస్. ⇒ మనకు కనిపించే చెవి కేవలం బాహ్య చెవి మాత్రమే. ఈ చెవితో పోలిస్తే లోపల ఉండే భాగం పరిమాణమే చాలా ఎక్కువ. ⇒ ఎవరు మాట్లాడే మాటలను వారు... గాలి ద్వారా వచ్చే తరంగాల కంటే ముఖంలోని ఎముకల ద్వారా ప్రసరించే తరంగాల ద్వారానే ఎక్కువగా గ్రహిస్తుంటారు. అందుకే ఎవరి మాటల్ని వారు టేప్ చేసి విన్నప్పుడు అవి తమ మాటల్లాగా అనిపించడం లేదని ఫిర్యాదు చేయడం ఎక్కువ. ⇒ వినడంతో పాటు చెవిలో ఉండే ద్రవం వల్ల మనిషి నిటారుగా ఉండటం సాధ్య మవుతుంది. బ్యాలెన్స్‌గా నిలబడేందుకు చెవిలోని ఈ ద్రవం తోడ్పడుతుంది. -
పిల్లలూ...వింటున్నారా?
కన్ను తర్వాత పరిసరాల గురించి అత్యంత ఎక్కువ సమాచారం దొరికేది వినికిడి జ్ఞానంతోనే. అందుకే పంచేంద్రియాల్లో చెవికి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనిది. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు ఉపకరించేది చెవే. కాబట్టి పాఠశాల పిల్లల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే ఈ చెవినీ, దాని వల్ల వచ్చే పరిజ్ఞానాన్ని విస్మరించడానికి వీల్లేదు. సాధారణంగా పిల్లలకు చెవుల విషయంలో కనిపించే సమస్యలను ఇప్పుడే తెలుసుకుంటే ప్రస్తుతం ఉన్న సెలవుల్లోనే వాటిని చక్కదిద్దుకొని స్కూలుకు వెళ్లే సమయానికి హాయిగా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే ముఖ్యమైన సమస్యల్లో శాశ్వత వినికిడి లోపం ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో పుట్టే ప్రతి వెయ్యిమంది పిల్లల్లో నలుగురు వినికిడి లోపంతో జన్మిస్తున్నారని అంచనా. వినికిడి లోపం కారణంగా భవిష్యత్తులో మాట్లాడటం కూడా రాకపోవచ్చు. అందుకే పుట్టీపుట్టగానే వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి తగిన వైద్యం చేసి, ఆ లోపాలను సరిదిద్దవచ్చు. ఇక బాల్యంలో స్యూలుకు వెళ్లే సమయంలోనూ పిల్లల్లో చెవికి సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. వినికిడి సమస్యల వల్ల మనం ఇతరులతో సమచారాన్ని రాబట్టుకోవడం, పంచుకోవడం కష్టమవుతుంది. చెవితో పాటు గొంతు, ముక్కు సమస్యలు కూడా పిల్లలను సమస్యలకు లోను చేస్తాయి. ఇలాంటివారు తమ చెవితో పాటు, సంబంధిత ఇతర సమస్యలను చక్కదిద్దుకోడానికే ఈ కింది సూచనలు. 1.మనలో చాలామంది తరచూ చేసే తప్పు... చెవులను శుభ్రపరచడం. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రమయ్యేలా ప్రకృతి వాటిని డిజైన్ చేసింది. మనం చెవులను శుభ్రం చేయడానికి ఉపయోగించే ‘ఇయర్ బడ్స్’ వల్ల మన చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. చెవిలోని గువిలిని ఇంకా లోపలికి నెడుతున్నాం. చెవిలోకి ఏదైనా వస్తువుగానీ, పురుగుగానీ ప్రవేశించినప్పుడు వాటినుంచి చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి ఎక్కువ స్రవిస్తుంది. ఆ గువిలిని శుభ్రం చేయడం కోసం మనం పుల్లలను ఉపయోగించడం వల్ల చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవించేలా చేసి సమస్య తీవ్రత అధికమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఇయర్‌బడ్స్, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటివి చెవుల్లో పెట్టుకొని శుభ్రం చేసుకోకూడదు. 2.చెవులను శుభ్రం చేయడానికి కొబ్బరి నూనె, ఆముదం లాంటివి వేయడం వల్ల కొత్త సమస్యలు మొదలువుతాయి. కాబట్టి ఆ పని ఎప్పుడూ చేయకూడదు. 3.చెవులలో చీముకారడం మరొక ముఖ్యమైన చెవికి సంబంధించిన సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే నిపుణులైన ఈఎన్టీ వైద్యులకు కలిసి సరైన చికిత్స, మందులు తీసుకోవాలి. సమస్యను బట్టి అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయించాల్సి రావచ్చు. 4.పిల్లలు ముఖ్యంగా వేసవికాలం సెలవుల్లో ఈత నేర్చుకోవడం కోసం నీటి కుంటలు, చెరువుల వంటి చోట్లకు వెళ్తుంటారు. ఆ సమయంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు నీళ్లలో దిగిన సమయంలో పరిశుభ్రమైన నీళ్లలోకి దిగాలి. ఈత కొట్టే సమయంలో ఇయర్ ప్లగ్స్ ధరించడం ద్వారా ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. 5.తరచూ జలుబు చేసే పిల్లల్లో కూడా ముక్కు మూసుకుపోవడం వల్ల చెవి మధ్యభాగంలో గాలి ప్రసరణ జరగకపోవడం వల్ల వీరిలో చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. అందువల్ల తరచూ జలుబు చేసేవారిలో అందుకు సంబంధించిన కారణాలు కనుక్కొని తగిన చికిత్స తీసుకోవాలి. ఈమధ్యకాలంలో పిల్లల్లో అలర్జీలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి వల్ల కూడా పిల్లల్లో తరచూ జలుబు కనిపిస్తోంది. ఇలా తరచూ జలుబు కనిపిస్తున్న పిల్లలను శ్రద్ధగా గమనిస్తూ ఏది తింటే సరిపడకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి, దాని నుంచి వారిని దూరంగా ఉంచడం, లేదా సరిపడని వాతావరణంలోకి వారిని తీసుకెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 6.గట్టి శబ్దాలను ఎక్కువసేపు వినడం, సంగీతం వినే సమయంలో ఎక్కువ తీవ్రతతో వినడం మొదలైన వాటి వల్ల పిల్లల్లో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుకే పిల్లలు పెద్ద పెద్ద శబ్దాలను గట్టిగా వినడం సరికాదు. మ్యూజిక్‌ను పెద్దగా సౌండ్ పెట్టుకొని వినడం, గట్టిగట్టిగా పేలే టపాకాయ శబ్దాలను వినడం వారిలో వినికిడి సమస్యలు రావడానికి కారణం కావచ్చు. 7.కొంతమంది పిల్లలు చెవిలో పుల్లలు, పెన్నులు, పిన్నులు, పిన్నీసులు వంటి వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటుంటారు. దీనివల్ల ఒక్కోసారి వాళ్ల కర్ణభేరికి దెబ్బతగలవచ్చు. ఇలా జరగడం వల్ల కూడా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. 8.శుభ్రమైన తాగు నీరు తీసుకోకపోవడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఐస్‌క్రీములు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడంతో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ తర్వాత ఇవే ఇన్ఫెక్షన్లు చెవులకూ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చెవి, ముక్కు, గొంతు... ఈ మూడు కీలక అవయవాల్లో ఏ భాగంలో ఆరోగ్య సమస్య తలెత్తినా అది ఇతర భాగాలకు వ్యాపించే ఆస్కారం ఉంది. అవన్నీ వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి చెవి, గొంతు, ముక్కు... ఈ మూడు కీలక అవయవాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా, దాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ముఖ్యంగా పిల్లల్లో ఆ ఇన్ఫెక్షన్లను అస్సలు విస్మరించకూడదు. 9.చెవిలో ఎక్కువ గువిలి వస్తున్నా, చెవి నుంచి చీము కారుతున్నా, చెవిలో నొప్పి వస్తున్నా, చెవిపోటు అనిపించినా, రాత్రి సమయాల్లో చెవిలో గుయ్ మనే శబ్దం వినిపిస్తున్నా, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నా, మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతున్నా... ఈ లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. వీలైతే ఈ సెలవుల్లోనే పిల్లలను ఈఎన్టీ నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. తగిన సలహా, చికిత్స తీసుకోండి. బడికి వెళ్లే సమయానికల్లా వారి సమస్యలు దూరమవుతాయి. - డాక్టర్ ఈసీ వినయకుమార్, హెచ్ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్ -
వాహనం నడిపేటప్పుడు తల దిమ్మెక్కితే!
లోపలి చెవి నుంచి మెదడుకు అనుసంధానంగా ఉండే వెస్టిబ్యూలార్ సిస్టమ్‌లో తేడా వస్తే తల దిమ్ముగా ఉండడం, తల తిరిగినట్లయి పడిపోవడం జరుగుతుంది. దేహం కదలికలకు అనుగుణంగా తలలో వెస్టిబ్యూలార్ వ్యవస్థ స్పందిస్తూ ఉంటుంది. అందులో తేడా వస్తే రొటేషన్ మోషన్ క్రమం తప్పుతుంది. దీనిని ‘వర్టిగో’ అంటారు. ఉన్నట్లుండి కళ్ల ముందు వలయాకారంగా తిరుగుతున్నట్లు అనిపించడం, వాంతి వచ్చినట్లు ఉండడం, వాహనం నడవలేకపోవడం, చూపు మసకబారడం (బ్లర్డ్ విజన్), చెవులు వినిపించకపోవడం, చెవిలో హోరు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఏంచేయాలంటే... ఉన్న చోటనే కూర్చోవాలి. వీలయితే పడుకోవాలి. దగ్గర ఉన్న వారిని సహాయానికి పిలవాలి. వాహనం నడుపుతుంటే వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు తీసుకుని ఆపేయాలి. దుస్తులు వదులు చేసుకుని దేహానికి బాగా గాలి తగలనివ్వాలి. లైట్లు తీసేసి సాధారణ వెలుతురు ఉండేలా చూడాలి లేదా గదిని చీకటిగా ఉంచాలి. దాహంగా ఉంటే నీరు తాగాలి. తేరుకున్న తర్వాత డాక్టర్‌ను సంప్రదించి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి. వర్టిగో పేషెంట్లు పూర్తిగా కోలుకునే వరకు ఒంటరిగా బయటకు వెళ్లరాదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మరో వ్యక్తి సహాయంగా కనిపెట్టుకునే ఉండాలి. బాత్రూములోకి వెళ్లినప్పుడు తలుపు గడియ పెట్టుకోకపోవడమే మంచిది. -
చెవిలో గుయ్‌ఁ మని ఒకటే హోరు..?
నా వయసు 30 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా చెవిలో విపరీతమైన శబ్దం వస్తోంది. ఏ పనీ చేయలేకపోతున్నాను. రాత్రి సమయాల్లో హోరు ఎక్కువగా ఉంటోంది. వైద్యులను సంప్రదిస్తే నరాల బలహీనత ఉంది అని కొన్ని మందులు ఇచ్చారు. కానీ అంతగా ఫలితం లేదు. ఈ సమస్యతో ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. నాకు హైబి.పి కూడా ఉంది. ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలియచేయగలరు. - ఎస్. వినోద్, హైదరాబాద్ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్యను‘టినైటస్’ అంటారు. ఇలా చెవిలో శబ్దాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. టినైటస్ చాలా వరకు వినికిడికి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల వస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్లు ఒటోస్ల్కెరోసిస్ వంటి కారణాల వల్ల కూడా వస్తుంది. వీటితోపాటుగా వినికిడి వ్యవస్థలోని లోపలి భాగమైన కాక్లియా సంబంధిత భాగాలకు రక్తసరఫరా సరిగా జరగకపోవడం, వినికిడి నరంలో లోపం, కాక్లియాకు సంబంధించిన ఇతర లోపాల వలన కూడా టినైటస్ రావచ్చు. మీకు అధిక రక్తపోటు ఉందంటున్నారు కాబట్టి వాస్కులర్ సిస్టమ్‌లో లోపాల వలన కూడా మీకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. మీరు వెంటనే నిపుణులైన ఇ.ఎన్.టి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆడియాలజిస్టునూ, న్యూరాలజిస్టునూ సంప్రదించి వారి సలహా మేరకు వినికిడి పరీక్షలు చేయించుకోండి. సాధారణంగా మీకు టినైటస్ ప్రశ్నావళి, లిపిడ్ ప్రొఫైల్, ఎం.ఆర్ఐ (బ్రెయిన్, ఐఎసి) మొదలైన పరీక్షలు (అన్నీ కాని లేదా వీటిలో కొన్ని) అవసరం కావచ్చు. స్వయంగా పరీక్షించిన డాక్టరు సూచన మేరకు చేయించుకున్న పరీక్షల నివేదిక ఆధారంగా మీ సమస్య పట్ల కచ్చితంగా ఒక నిర్ధారణకు రావచ్చు. ఆ తర్వాత మీకు చికిత్స పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ఈ సమస్య మందులతో నయమవుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. చాలామందికి టినైటస్ రీ ట్రైనింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఉపయోగం ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి మిషన్ల ద్వారా ఉపశమనం కలుగుతుంది. - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఇ.ఎన్.టి. నిపుణులు -
మూలకణ చికిత్సతోవినికిడి శక్తి...
న్యూయార్క్: లోపలి చెవిలో సమస్య కారణంగా వినికిడి లోపంతో బాధపడుతున్న రోగులకు ఇకపై మూలకణ చికిత్సతో తిరిగి వినికిడి శక్తిని పునరుద్ధరించవచ్చు. చెవిలోని కాక్లియా నుంచి శబ్దాన్ని మెదడుకు చేరవేసే స్పైరల్ గాంగ్లియన్ అనే నాడీకణాల క్షీణత వల్ల చాలా మంది వినికిడి జ్ఞానాన్ని కోల్పోతుంటారు. పరిణతి చెందిన ఈ నాడీకణాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాకపోవడంతో చాలామంది చెవిటివారిగానే మిగులుతున్నారు. అయితే మూలకణాల ద్వారా పరిణతి చెందిన గాంగ్లియన్ నాడీకణాలను సైతం తిరిగి ఉత్పత్తి చేయవచ్చని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో తాజాగా స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని కృత్రిమంగా ప్రయోగశాలలో పునరుత్పత్తి చేయవచ్చని తేలిన నేపథ్యంలో భవిష్యత్తులో లోపలిచెవిలోని నాడీకణాల మార్పిడికి మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
వినికిడి సమస్యలకు వీడ్కోలు...
జ్ఞానేంద్రియాలలో కన్ను తర్వాత అంతటి ప్రాధాన్యత చెవిదే. అందుకే చెవులు సరిగా వినిపించకపోతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు సరిగా వినిపించకపోవడం అన్నది ఒక సమస్యే కాదు. ఎందుకంటే... బయటకు కనిపించకుండా, కేవలం చెవుల లోపలి భాగాల్లో, చెవిలోకి శబ్దతరంగాలను తీసుకెళ్లే నాళం (కెనాల్) లో, వెంట్రుకల మాటున అమర్చగలిగే అనేక ఉపకరణాలు (హియరింగ్ ఎయిడ్స్) అందుబాటులో ఉన్నాయి. చిన్నప్పుడు, పెద్దయ్యాక వచ్చే అనేక వినికిడి సమస్యలు, కారణాలు, పరిష్కారాలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొందరిలో వినికిడి సమస్యలు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదలుకొని ఏ దశలోనైనా రావచ్చు. పిల్లల్లో వినికిడి సమస్యలకు కారణాలు... గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి రుబెల్లా అనే వైరల్ఇన్ఫెక్షన్ సోకడం బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే అమైనోగ్లైకోసైట్స్ వంటి మందుల వల్ల బిడ్డ పుట్టగానే ఏడ్వకపోవడం (బర్త్ అనాక్సియా) బిడ్డ పుట్టగానే వచ్చే నియోనేటల్ జాండీస్ (కామెర్ల)లో బిలురుబిన్ పాళ్లు ఎక్కువగా ఉండటం నెలలు నిండకుండానే బిడ్డపుట్టడం (ప్రీ-మెచ్యూర్ బర్త్) పుట్టిన బిడ్డను నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లో 48 గంటలకు పైగా ఉంచి చికిత్స చేయాల్సి రావడం... మీజిల్స్, మంప్స్, మెనింజైటిస్ వంటి జబ్బులకు గురయ్యే పిల్లల్లో మేనరికపు వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లల్లో ... పెద్దల్లో వచ్చే వినికిడి సమస్యలకు కారణాలు: ప్రమాదాలలో తలకు/చెవికి దెబ్బతగిలిన వారిలో డయాబెటిస్ ఉన్నవారిలో రక్తపోటు ఉన్నవారిలో అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా లోపలి చెవి దెబ్బతిన్న వారిలో (ఉదా: లాబ్రింథైటిస్) కొన్ని మందులు వాడిన వారిలో వాటి దుష్ర్పభావంతో (ఉదా: అమికాసిస్ అనే మందును కొద్దిరోజులు వాడిన వారిలో) కొన్నిరకాల జబ్బులు ఉన్నవారికి మూత్రవిసర్జన ఎక్కువగా అయ్యేందుకు ఇచ్చే మందుల (డై-యూరెటిక్స్)తో మధ్య చెవి సమస్యలు ఉన్నవారిలో మధ్య చెవిలో వినికిడికి ఉపయోగపడే మూడు ఎముకల్లో చివరిదైన స్టెపీస్ స్పందించకుండా ఫిక్స్ అయ్యే సమస్య అయిన ఆటో స్ల్కిరోసిస్ ఉన్నవారిలో. వయసు పైబడిన వారిలో... చాలామందిలో వయసు పైబడ్డ తర్వాత వినికిడి శక్తి తగ్గడం సాధారణం. విదేశాల్లో సాధారణంగా 60, 65 ఏళ్ల వయసు తర్వాత వచ్చే ఈ సమస్య మన దేశంలో మాత్రం చాలా త్వరగా కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 52-55 ఏళ్లలో కనిపిస్తే, మహిళల్లో మరింత త్వరగా అంటే 48-50 ఏళ్ల వయసులోనే వస్తోంది. ఇలా వయసుతో పాటు కనిపించే ఈ సమస్యను ‘ప్రెస్బై ఎక్యూసిస్’ అంటారు. వినికిడి సమస్యలు ప్రధానంగా రెండు రకాలు. అవి.... కండక్టివ్ హియరింగ్ లాస్: శబ్దతరంగాలు చెవిని, చెవి లోపలి భాగాలను సరిగా చేరకుండా ఉండటంతో వచ్చే సమస్యను కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. దీన్ని వైద్యచికిత్సతోనూ, శస్త్రచికిత్సలతోనూ సరిచేయవచ్చు. ఉదా: శబ్దతరంగాలు చెవి లోపలికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు టింపనోప్లాస్టీ, స్టేపిడెక్టమీ వంటి శస్త్రచికిత్సలతో మెరుగుపరచవచ్చు. సెన్సోరీ-న్యూరల్ డెఫ్నెస్: ఇవి జ్ఞానేంద్రియ పరమైన లేదా నరాలకు సంబంధించిన సమస్యలై ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పిల్లల్లోనూ, పెద్దల్లోనూ వాళ్లు వాడదగిన వినికిడి ఉపకరణాల (హియరింగ్ఎయిడ్స్) ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఉపకరణాలు... సెన్సోరీ-న్యూరల్ సమస్యలతో వినికిడి సమస్య వచ్చిన వారికి వినికిడి ఉపకరణాల (హియరింగ్ ఎయిడ్స్)తో మంచి ఫలితం ఉంటుంది. అయితే చెవిటి మిషిన్ పెట్టుకోవడం వల్ల కొందరికి తమ లోపాన్ని తెలియజెప్పినట్లుగా ఉండటంతో ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి వారికోసం బయటికి కనిపించకుండా చెవి లోపలి భాగంలో, చెవి నుంచి శబ్దతరంగాలను తీసుకెళ్లే కెనాల్లో అమర్చే డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక కొందరిలో చెవి వెనక భాగంలో అమర్చుకునే తరహా వినికిడి ఉపకరణాలూ అందుబాటులో ఉన్నాయి. కొందరిలో వినికిడి శక్తి కాస్త తగ్గి... అది మరింతగా తగ్గకుండా అలా స్థిరంగా ఉన్న సందర్భాల్లో కొన్ని ఇంప్లాంటబుల్ హియరింగ్ ఎయిడ్స్ (శస్త్రచికిత్స ద్వారా లోపల అమర్చదగిన వినికిడి ఉపకరణాలు) కూడా వాడవచ్చు. ఇలాంటి సమయాల్లో దానికి అవసరమైన ప్రాసెసర్‌ను (తరంగాలను గ్రహించి పెద్దగా వినబడేలా చేసే బయటి ఉపకరణం) తలవెంట్రుకల భాగంలో కనిపించకుండా అమర్చడానికి అవకాశం ఉంది. ఈ ఉపకరణాన్ని శస్త్రచికిత్స ద్వారా ఈఎన్టీ సర్జన్లు అమర్చుతారు. - నిర్వహణ : యాసీన్ డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి, హెచ్ఓడీ, సీనియర్ ఈఎన్టీ నిపుణులు, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్