
సాక్షి,గుంటూరు:అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో మంగళవారం(అక్టోబర్8)జరిగింది.కుటుంబ కలహాల నేపధ్యంలో అత్త నాగమణి,కోడలు పావని మధ్య ఘర్షణ మొదలైంది.
ఈ ఘర్షణలోనే అత్త చెవిని కోడలు పావని కొరికింది. బలంగా కొరకడంతో అత్త చెవిలోని ఒక ముక్క ఊడిపడింది.ఊడిపడిన చెవి ముక్కను తీసుకుని అత్త నాగమణి గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చింది.చెవి ముక్క తెగిపోయి సమయం ఎక్కువవడంతో తిరిగి అతికించడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు.
ఇదీ చదవండి: ధర్మవరం సీఐ కిడ్నాప్ ఆపై హత్య