Viral Video: Doctor Numerous Attempts To Remove Snake From Ear - Sakshi
Sakshi News home page

Viral Video: బాబోయ్‌! చెవిలో ఇరుక్కుపోయిన పాము

Published Mon, Sep 12 2022 11:27 AM | Last Updated on Mon, Sep 12 2022 11:56 AM

Viral Video: Doctor Numerous Attempts To Remove Snake From Ear - Sakshi

పలు రకాల వైరల్‌ వీడియోలు చూశాం. కొన్ని రకాల వైరల్‌ వీడియోలు చూస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఊహజనితమైన వైరల్‌ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో ఒక పాము మహిళ చెవిలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ పామును తీసేందుకు డాక్టర్‌ శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. పాపం వైద్యుడు చేతికి గ్లోవ్స్‌ ధరించి చెవి నుంచి పామును తొలగించే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.

కానీ ఆ వీడియోలో చివరకు పాము చెవి నుంచి బయటకు వచ్చిందో లేదా అనేది సస్సెన్స్‌లో ఉండిపోతుంది. ఈ వీడియోని చందన్‌సింగ్‌ అనే ఫేస్‌బుక్‌ వినియోగదారుడు 'పాము చెవి లోపలికి వెళ్లింది' అనే క్యాప్షన్‌తో సోషల్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోకి 80 లక్షలకు పైగా వ్యూస్‌, దాదాపు 100 లైక్‌లు రాగా, నెటిజన్లు కొంతమంది పాము చెవిలోకి ఎలా దూరిందని, మరోకరు ఇది నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. 

(చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement