leaving
-
మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న మహిళా ఉద్యోగులు..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో వింత ధోరణి కనిపిస్తోంది. సంస్థను వీడుతున్న ఉద్యోగుల్లో అత్యధికం మహిళలే ఉంటున్నారు. నిష్క్రమిస్తున్న వారిలో లాటిన్స్, నల్ల జాతీయులు ఉండటంతో కంపెనీ శ్రామికశక్తి వైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ అండ్ ఇన్‌క్లూషన్ నివేదిక ప్రకారం.. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీని వీడివెళ్లిన ఉద్యోగుల్లో మహిళలు 32.7% మంది ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోల్చితే 31% పెరిగింది. స్వచ్ఛంద నిష్క్రమణలు, తొలగింపులు అన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన ఈ రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేశారు.దెబ్బతింటోన్న వైవిధ్యంఅమెరికాకు సంబంధించిన నిష్క్రమణలలో నల్లజాతి కార్మికులు 10% ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఇది 8.7 శాతంగా ఉండేది. ఇక లాటిన్ అమెరికన్ల నిష్క్రమణలు 8% నుండి 9.8 శాతానికి పెరిగాయి. ఇక పురుషులు, ఆసియన్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇది విరుద్ధంగా ఉంది. 2023లో కంటే గతేడాది వీరి నిష్క్రమణలు తక్కువగా నమోదయ్యాయి.ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమలో చాన్నాళ్లకు మారిన పరిస్థితులుప్రత్యర్థి కంపెనీలు అవలంభిస్తున్న పోకడలే ఇందుకు కారణంగా మైక్రోసాఫ్ట్ పేర్కొంటోంది. అలాగే తమ భౌతిక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారాలలో మార్పులు కూడా కొంత మేరకు కారణమైన ఉండచ్చొని చెబుతోంది. పెద్దగా ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఉద్యోగులను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కొనసాగిస్తోందని, అయితే వారిని నిలుపుకోవడానికి మరింత చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే-రే మెక్‌ఇంటైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. -
స్వీడన్‌ను వీడి స్వదేశానికి
స్వీడన్.. ఐరోపాలో ఐదో పెద్ద దేశం. అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి. అయినప్పటికీ చాలామంది భారతీయులు స్వీడన్‌ను వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య 2024లో జనవరి–జూన్ మధ్య ఏకంగా 171% పెరగడం విశేషం! 1998 తర్వాత ఇంత భారీగా భారతీయులు స్వీడన్ వీడి రావడం ఇదే తొలిసారి. ఇందుకు కారణాలను తెలుపుతూ స్వీడన్లో ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వీడన్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ అంకుర్ త్యాగి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సామాజిక అనైక్యత... స్వీడన్లో సాంస్కృతిక, భాషా అవరోధాల వల్ల స్థానికులతో భారతీయులు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు. స్వదే శంలో ఉండగా బాగా అలవాటైన బలమైన సామాజిక బంధాలను కోల్పోతున్నారు. స్వీడిష్ సమాజంలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారు. ఒంటరితనం, స్నేహితుల లేమివ వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు తోడుగా, కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తిరిగి వచ్చేస్తున్నారు. కఠినమైన స్వీడిష్ వాతావరణం, అధిక జీవన వ్యయం కూడా ముఖ్యమైన సమస్యలే. సాంస్కృతిక సవాళ్లు... స్వీడన్లో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అర్హతలు, పని అనుభవం ఉన్నా స్వీడిష్ భాషా నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. సరీ్వస్ అపార్ట్మెంట్ల కొరతతో వసతి కూడా సమస్యగా మారుతోంది. వీటికి తోడు భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో అక్కడ అవకాశాలు అపారంగా పెరుగుతుండటమూ మనవాళ్లు స్వదేశీ బాట పట్టేందుకు ప్రధాన కారణమని త్యాగి పేర్కొన్నారు. నిపుణులకు భారత్‌లో మెరుగైన అవకాశాలు, మంచి వేతనాలు, ఉత్తేజకరమైన కెరీర్ ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. కొవిడ్ తర్వాత... కొవిడ్ మహమ్మారి అనంతరం పలు రంగాల్లో ఎక్కడి నుంచైనా పని చేయడానికి వీలుండటం కూడా మనవాళ్లు స్వీడన్ వీడేందుకు కారణంగా మారుతోంది. భారత్‌కు తిరిగి వచ్చి ఇక్కడినుంచే పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ దేశానికి వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో జని్మంచిన స్వీడిష్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి స్వీడిష్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద ప్రస్తుతం 10,000 స్వీడిష్ క్రౌన్లు (సుమారు 960 డాలర్లు), వారు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను అందిస్తోంది. ఇది కూడా ఓ కారణమై ఉంటుందని, అయితే దేనిని అంచనా వేయాలన్నా ఏడాదిపాటు వలసలను అధ్యయనం చేయాలని స్వీడన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ, సెక్రటరీ జనరల్ రాబిన్ సుఖియా చెబుతున్నారు.గత ఆర్నెల్లలో 2,461 మంది వెళ్లారు! నిజానికి స్వీడన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. 2024లో ఇప్పటిదాకా స్వీడన్‌కు వలస వెళ్లినవారిలో ఉక్రేనియన్ల తరువాత ఎక్కువమంది భారతీయులే. గత జనవరి నుంచి జూన్ దాకా 2,461 మంది మనవాళ్లు స్వీడన్ బాటపట్టారు. అయితే గత ఆరేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2020, 2021 కోవిడ్ సంవత్సరాలను మినహాయిస్తే 2017–2024 మధ్య ఒక ఏడాదిలో ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు స్వీడన్ వెళ్లడం ఇదే తొలిసారి. – న్యూఢిల్లీ -
పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024 -
యాపిల్‌కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్ డిజైనర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్లు, యాపిల్ వాచీల డిజైన్‌ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు. కీలకమైన టాన్ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్ వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌కి వెల్లడించాయి. యాపిల్‌కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు. మరిన్ని నాయకత్వ మార్పులు కంపెనీకి చెందిన ఇతర మ్యాక్ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్‌వేర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి. -
'సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ..?'
జైపూర్: సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ అదే తనను వదలట్లేదని అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలని చెప్పారు. 2018లో ఎన్నికల సందర్భంగా సీఎం పదవి కోసం సచిన్ పైలెట్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న గహ్లోత్.. ఈ మేరకు మాట్లాడారు. పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. 'సీఎం పదవిని వదిలేయాలని అనుకున్నా.. కానీ నేను ఎందుకు వదలాలి? ఆ పోస్టే నన్ను వదలట్లేదు.హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఏదైనా అంగీకారమే. సోనియా గాంధీ నన్ను మూడు సార్లు సీఎంను చేశారు.' అని గహ్లోత్ అన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్‌కు, సచిన్ పైలెట్‌కు మధ్య ఇటీవల మళ్లీ వార్ నడిచింది. కానీ అధిష్ఠానం మరోసారి చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే.. తాజాగా జైపూర్‌లో నిర్వహించిన సమావేశంలో.. మరోసారి కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎంను అని గహ్లోత్ తెలిపారు. 2030 విజన్‌కు పిలుపునిచ్చారు. బలమైన రాజస్థాన్‌ను నిర్మిద్దామని అన్నారు. '2030 గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు. విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు, రవాణా, రహదారులు వంటి రంగాల్లో విశేషమైన సేవ చేశాను. ఎందుకు నేను మరోసారి ముందుకు పోకూడదు అనిపించింది.' అని గహ్లోత్ అన్నారు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గహ్లోత్‌ను కూడా పోటీలో నిలిచారు. గహ్లోత్ కేంద్ర స్థాయిలో ఉంటే.. సచిన్‌ను రాష్ట్ర స్థాయిలో ప్రధాన నాయకునిగా మారనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే.. రాజస్థాన్‌లో సీఎంగా తాను మాత్రమే ఉండాలని ఎమ్మెల్యేలు పట్టుబడగా.. తప్పక ఉండాల్సి వచ్చిందని గహ్లోత్ చెప్పారు. ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్.. -
విదేశాలకు వలసల్లో మనమే టాప్.. దేశాన్ని వీడిన 1.80 కోట్ల మంది..
సాక్షి, అమరావతి: మెరుగైన జీవనం కోసం వలస వెళ్లడం మానవ చరిత్రలో సహజ ప్రక్రియ. ఆధునికకాలంలో విదేశాలకు వలస వెళ్లడం మరింత పెరుగుతోంది. విదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు విదేశాలకు వెళుతున్నారని ఐక్య రాజ్యసమితి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్(యూఎన్ డీఈఎస్ఏ) ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్’ పేరిట ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో జన్మించి 2020 నాటికి విదేశాల్లో స్థిరపడినవారు 1.80కోట్లమంది ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వలసల వివరాలను వెల్లడించిన ఈ నివేదికలో భారతీయులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. 2020నాటికి 1.80కోట్లమంది వలస... జన్మించిన దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఉన్నవారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటిస్థానంలో ఉన్నారు. ఈ విధంగా 2020నాటికి 1.80కోట్లమంది భారతీయులు విదేశాల్లో స్థిరపడ్డారు. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ 2020లో 7.20లక్షలమంది, 2021లో 8.30లక్షలమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్లారు. 2020లో జూలై నాటికే 13లక్షలమంది విదేశాలకు వలస వెళ్లడం గమనార్హం. విదేశాలకు వలస వెళుతున్నవారిలో భారతీయుల తర్వాత మెక్సికన్లు (1.10కోట్ల మంది), రష్యన్లు(1.10కోట్లమంది), చైనీయులు (కోటిమంది), సిరియన్లు (80లక్షల మంది) వరుస స్థానాల్లో ఉన్నారు. యూఏఈ, అమెరికా, సౌదీ వైపే మొగ్గు.. భారతీయులు అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మొదటిస్థానంలో ఉంది. 2020నాటికి యూఏఈలో 35లక్షలమంది భారతీయులు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 27లక్షలమంది, మూడో స్థానంలో నిలిచిన సౌదీ అరేబియాలో 25లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్ దేశాలు ఉన్నాయి. వలస వెళుతున్న భారతీయుల్లో 15శాతం మంది గమ్యస్థానం ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ (ఈసీఆర్) దేశాలే. అన్‌స్కిల్డ్ కార్మికులు ఎక్కువగా ఉపాధి కోసం ఈ 18 ఈసీఆర్ దేశాలకు వెళుతున్నారు. ఆ జాబితాలో బహ్రెయిన్, ఖతర్, ఒమన్, ఇండొనేషియా, సౌదీ అరేబియా, ఇరాక్, సుడాన్, జోర్డాన్, దక్షిణ సుడాన్, కువైట్, సిరియా, లెబనాన్, థాయిలాండ్, లిబియా, యూఏఈ, మలేషియా, యెమెన్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. విద్యార్థులూ ఎక్కువే... ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంది. కరోనా వ్యాప్తికి ముందు 2019లో 5.9లక్షలమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. కరోనా ప్రభావంతో 2020లో 2.6లక్షలమంది మాత్రమే విదేశాలకు వెళ్లగా... 2021లో 4.4లక్షలమంది విదేశాల్లోని విద్యాసంస్థల్లో చేరారు. 2022లో విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022 జూన్ నాటికే 2.50లక్షలమంది విదేశాలకు వెళ్లారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు వెళుతున్న దేశాల్లో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో శాశ్వతంగా స్థిరపడేందుకు భారతీయులు గణనీయంగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. చదవండి: మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్.. షెడ్యూల్ విడుదల -
బాబోయ్! చెవిలో ఇరుక్కుపోయిన పాము: వీడియో వైరల్
పలు రకాల వైరల్ వీడియోలు చూశాం. కొన్ని రకాల వైరల్ వీడియోలు చూస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఊహజనితమైన వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక పాము మహిళ చెవిలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ పామును తీసేందుకు డాక్టర్ శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. పాపం వైద్యుడు చేతికి గ్లోవ్స్ ధరించి చెవి నుంచి పామును తొలగించే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఆ వీడియోలో చివరకు పాము చెవి నుంచి బయటకు వచ్చిందో లేదా అనేది సస్సెన్స్‌లో ఉండిపోతుంది. ఈ వీడియోని చందన్‌సింగ్ అనే ఫేస్బుక్ వినియోగదారుడు 'పాము చెవి లోపలికి వెళ్లింది' అనే క్యాప్షన్‌తో సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి 80 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 100 లైక్‌లు రాగా, నెటిజన్లు కొంతమంది పాము చెవిలోకి ఎలా దూరిందని, మరోకరు ఇది నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. (చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం) -
పీకల్లోతు కష్టాల్లో కాంగ్రెస్.. ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు
కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. రోజుకొక పరిణామం ఆ పార్టీ నాయకత్వానికి కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ నేతలు బాధ్యతలు మాకొద్దు బాబో అని తప్పుకుంటున్నారు. పార్టీ కీలక పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు సీనియర్లు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే ఆనంద్ శర్మ ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పుకోవడం పార్టీకి పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ కు కాంగ్రెస్ సిద్ధం మవుతున్న దశలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెబుతున్నారు. ఆనంద్‌శర్మ, ఆజాద్ ఇద్దరూ... జీ-23 గ్రూపులో కీలక సభ్యులుగా ఉన్నారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు తేవాలని.. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు ఎన్నికైన కార్యవర్గాలు ఉండాలని కొంతకాలంగా జీ-23 గ్రూప్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచింది. ఈమేరకు రెండేళ్ల క్రితమే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి ఈ గ్రూపు నేతలు లేఖలు కూడా రాశారు. పార్టీలో అవమానం జరిగిందని.. తన గౌరవానికి భంగంకలిగితే సహించేదిలేదంటూ... సోనియాకు రాసిన రాజీనామా లేఖలో ఆనంద్‌శర్మ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించడం కొసమెరుపు. అయితే పార్టీని ధ్వంసం చేయడానికి కాంగ్రెస్‌లోనే అంతర్గత కుట్ర జరుగుతోందని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్‌శర్మ చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇద్దరు గాంధీలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం కావాలా? అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై ఎటాక్ చేశారు. గత కొన్నాళ్లుగా ఎంతోమంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. సుమారు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో అనుబంధమున్న కపిల్ సిబల్ లాంటి వారు కూడా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఎస్పీ మద్దతులో స్వతంత్ర అభ్యర్ధిగా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్రశాఖ చీఫ్ సునీల్ జాఖడ్ కూడా 50 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరారు. కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి అశ్వనీకుమార్, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కూడా హస్తం పార్టీలో ఇమడలేమంటూ బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కూడా పార్టీతో కటీఫ్ చేసుకున్నారు. ప్రజల సెంటిమెంట్లను కాంగ్రెస్ గౌరవించలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్ గత ఏడాది పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బతీసింది. పంజాబ్ లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. అధికారాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద కూడా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్‌సభకు ఎన్నికలున్నాయి. కీలకమైన ఈ తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నాయి. పార్టీని ఎలా దారిలో పెట్టాలో కూడా కాంగ్రెస్‌కు సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కొన్నాళ్లుగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోరంగా విఫలమవుతుండడం కూడా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు. -బొబ్బిలి శ్రీధరరావు, సాక్షి ప్రతినిధి -
భూమ్మిదే మనుషులు సృష్టించిన మార్స్.. ఎక్కడంటే..
అవును.. భూమ్మీదే మార్స్.. మనుషులే దాన్ని సృష్టించేశారు.. ఎక్కడ అంటే.. ఇజ్రాయెల్‌లోని నెగేవ్ ఎడారిలో.. ఇంతకీ ఎందుకిలా చేశారు.. అక్కడ స్పేస్ సూట్స్ వేసుకుని వీళ్లంతా ఏం చేస్తున్నారు? వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే.. చలో ఇజ్రాయెల్... భవిష్యత్ సంక్షోభాల దృష్ట్యా ప్లానెట్ ‘బి’ సృష్టించడం కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అంగారకుడి మీద కొంత అనుకూల వాతావరణం కనిపిస్తున్నా... ఇప్పటి దాకా జీవం ఉన్న దాఖలాలు లేవు. రెడ్‌ప్లానెట్ మీద మానవులు జీవించడానికి ఏ మాత్రం అవకా శం ఉందనే పరిశోధనలకోసం నాసా 2030లో మార్స్ మీదకు వ్యోమగాములను పంపనుంది. ఆ ప్రయోగం కోసమే అంగారక గ్రహం భౌగోళిక స్థితులను పోలిన ఇజ్రాయిల్‌లోని ‘నెగేవ్’ ఎడారిలో రెడ్‌ప్లానెట్ నమూనాను తయారు చేసింది. ఇక్కడ ఆరుగురు వ్యోమగాములు, నాలుగు వారాలపాటు నివసించనున్నారు. ఏఎమ్ఏడి ఈఈ–20గా పిలుచుకునే ఈ బృందంలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఆ నమూనా ఎలా ఉంటుంది? మార్స్ బేస్ లోపలి వాతావరణాన్ని పోలిన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ఉండటం కోసం ఏర్పాటు చేసినట్లుగానే ఈ ఆవాసం ఉంటుంది. అంగార కుడి మీద ప్రయోగాలకోసం ఉన్న సానుకూలత లను, పరిమితులను కూడా అర్థం చేసుకునే విధంగా ఈ ఆవాసాన్ని తయారు చేశారు. బయటికి వచ్చినప్పుడు స్పేస్‌సూట్స్ అంతే కాదు... రోవర్లు, డ్రోన్లతోపాటు ఇతర పరిక రాలన్నింటినీ ఈ అంగారకుడిమీద పరీక్షించనున్నారు ఆస్ట్రోనాట్స్. జీవం ఉండేందుకు ఉన్న అవ కాశాలు, వ్యోమగాముల ఆరోగ్యపరిస్థితులు, వాళ్ల మానసిక స్థితిగతులు, మార్స్ మీద పరిస్థితులు, ఇంజనీరింగ్ విభాగాల్లో 20కిపైగా ప్రయోగాలను 4 వారాలపాటు నిర్వహించనున్నారు. మార్స్ మీద బయటకు వెళ్లినప్పుడు ధరించినట్టుగా నే ఇక్కడా ఆ ఆవాసం నుంచి బయటికి వచ్చిన ప్పు డు, రోవర్స్, డ్రోన్స్ నిర్వహించేప్పుడు వ్యోమ గా ములు తప్పనిసరిగా స్పేస్ సూట్స్‌ను ధరిస్తారు. తీసుకునే ఆహారం, పీల్చేగాలి... వ్యోమగాములు తీసుకునే ఆహారం, పీల్చేగాలి పూర్తిగా మార్స్పైన బేస్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి. వ్యర్థాల రీసైక్లింగ్, నీటిబుడగలకు అనువైన ఉన్నట్టుగానే అసాధారణ పరిస్థితులను సృష్టించి ఒంటరిగానూ, ఇద్దరు ముగ్గురు కలిసి సహకరించుకుంటూ ప్రయోగాలు చేస్తారు. ఇతర గ్రహాల మీద ఉన్న దుమ్ము, ధూళి వ్యోమగాములకు శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగించడమే కాదు... యంత్రాలను పనిచేయకుండా చేసే అవకాశం ఉంది. అందుకే దుమ్ము, ధూళిని శుభ్రం చేసే టెక్నాలజీని సైతం ఇక్కడ పరీక్షించనున్నారు. నాలుగువారాలపాటు ఐసోలేషన్... మార్స్ మిషన్ కోసం ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఔత్సాహికుల నెట్‌వర్క్‌తో ఏర్పాటైన ఆస్ట్రియన్ స్పేస్ ఫోరమ్ నిర్వహిస్తున్న 13వ అనలాగ్ ఆస్ట్రోనాట్ మిషన్ ఇది. ఇందుకు అవసరమైన క్రూ, పరికరాలు, సౌకర్యాలను ఇజ్రాయేల్ స్పేస్ ఏజెన్సీ సమకూర్చింది. సోమవారం ప్రారంభమైన ఈ ఐసోలేషన్ దశ అక్టోబర్ 31తో ముగియనుంది. అప్పటివరకు మిషన్ కంట్రోల్‌తో మాత్రమే వ్యోమగాములు మాట్లాడతారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ నిధులు అందిస్తున్న అతి పెద్ద ప్రయోగం ఇది. ఈ మిషన్‌లో 25 దేశాల నుంచి 200 మంది పరిశోధకులు పాలుపంచుకున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
8 లక్షల మంది చదువులకు దూరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. కరోనా కారణంగా ప్రత్యక్ష విద్యా బోధన లేకుండానే గత విద్యా సంవత్సరం గడిచిపోగా.. ఈసారి విద్యా సంవత్సరం మొదలై నెల దాటినా అదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యాశాఖ తేల్చిన అధికారిక లెక్కల ప్రకారమే.. 72 వేల మంది విద్యార్థులకు టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటివేవీ లేవు. ఈ సదుపాయం ఉన్నా వివిధ సమస్యల కారణంగా మరో 4 లక్షల మంది పాఠాలు వినడం లేదు. ఒకటి రెండు తరగతుల విద్యార్థులు 3 లక్షల మందికి ఎలాంటి తరగతులూ నిర్వహించడం లేదు. ఏదో ఒక సమస్యతో.. ►రాష్ట్రంలో గురుకులాలు మినహా 27,257 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 18,43,589 మంది చదువుతున్నారు. కరోనా కారణంగా బడులు తెరవకపోవడంతో విద్యాశాఖ డిజిటల్ బోధన ప్రారంభించింది. రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (సైట్) గతేడాది రూపొందించిన వీడియో పాఠాలనే టీ–శాట్, దూరదర్శన్ (యాదగిరి) చానెళ్ల ద్వారా ప్రసారం చేస్తోంది. ఇదికూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే. ఒకటో, రెండో తరగతి విద్యార్థుల విషయాన్నే పక్కన పెట్టేసింది. దీంతో 3 లక్షల మంది చదువుకు దూరమయ్యారు. ►3–10వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల్లో 1,00,459 మం దికి డిజిటల్ పాఠాలు వినేందుకు అవసరమైన టీవీలు లేవు. ఇందులో సుమారు 27,257 మందికి గ్రామ పంచాయతీల్లో టీవీ చూసే ఏర్పాటు చేసింది. ఇందులోనూ 10 వేల మంది మాత్రమే హాజరవుతున్నారు. అంటే మిగతా 90 వేల మంది చదువులకు దూరమయ్యారు. ►ఇక ఇంటర్నెట్ సదుపాయం లేక, టీవీలో పాఠాలు ఎప్పుడు వస్తాయో తెలియక, ఆన్లైన్ క్లాసులు అర్థంకాక మరో 4 లక్షల మంది పాఠాలు వినడం లేదని అంచనా. ►మరోవైపు ఇప్పటికే ఏపీ, యూపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు స్కూళ్లలో ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయి. మన రాష్ట్రంలోనూ ప్రత్యక్ష బోధన చేపట్టాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. -
భర్త తిట్టాడనే మనస్తాపంతో!
కొత్తకోట రూరల్: పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన కొమ్ము నర్సమ్మ(60) సోమవారం భర్త తిట్టాడని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల దగ్గర వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం, ఆమె భర్త చంద్ర య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్ 94407 95727కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పేర్కొన్నారు. చదవండి: పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు! -
ప్రత్యేక విమానంలో జర్మన్ల తరలింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చిక్కుకున్న 38 మంది జర్మన్ దేశస్తులను తిరిగి ఆ దేశానికి పంపించేందుకు జర్మనీ కాన్సులేట్ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మంగళవారం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారిని జర్మనీకి తీసుకెళ్లారు. వీరిలో 19 మంది మహిళలు, 17 మంది పురుషులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. జర్మన్లను తరలించేందుకు చెన్నై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ (బోయింగ్ బీ787–8) విమానం ఏఐ– 3005 ఉదయం 7.32 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న జర్మన్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఆ విమానంలో చెన్నై నుంచి వచ్చిన మరికొందరు జర్మన్లు ఉన్నారు. ఉదయం 9.22 గంటలకు ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి ముంబైకు బయల్దేరింది. అక్కడ మరికొంత మంది ప్రయాణికులను తీసుకుని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌కు వెళ్లనుంది. ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఇండిగో విమాన సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రెస్క్యూ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయం నుంచి పంపించారు. మార్చి 28 మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానంలో ఎనిమిది మంది ఇండిగో సిబ్బంది ఇక్కడ దిగారు. హైదరాబాద్‌లో చిక్కుకున్న ఐదుగురు ఇండిగో సిబ్బంది చెన్నైకు బయల్దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందికి స్క్రీనింగ్ నిర్వహించి, వారి సమాచారాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులతో నగరంనుంచి కార్గో సేవలు కొనసాగుతున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. -
హాస్టళ్లను ఖాళీ చేయాలని...
-
వెటర్నరీ వర్సిటీ ముందే ప్రాణం విడిచిన గేదె
రాజేంద్రనగర్: అక్కడ మూగ జీవాలకు ప్రాణం పోసే ఆస్పత్రి ఉంది. దాని పక్కనే రాష్ట్రంలోని మూగ జీవాలకు సోకే రోగాలకు మందులను తయారు చేసే డాక్టర్ల బృందం ఉండే కార్యాలయమూ ఉంది. కానీ, అదే కార్యాలయం ముందు ఒక మూగ జీవం రోడ్డు ప్రమాదంలో గాయపడి నరకయాతన పడి మృతి చెందింది. పదుల సంఖ్యలో డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఆ దారి గుండా వెళ్లారు తప్ప ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రాణం పోసే ఆస్పత్రి ముందే ప్రాణం విడిచింది ఆ జీవి. వివరాలు.. రాజేంద్రనగర్ రేడియల్ రోడ్డు ప్రాంతంలో పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఇందుకు సంబంధించిన కళాశాల, ఆస్పత్రి, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాన రహదారిపైనే ఈ భవనాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ గేదెను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలకు గురైన ఆ గేదె.. డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ కార్యాలయం గేటు ముందే పడి విలవిల్లాడింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచింది. ఉదయం ఈ కార్యాలయానికి శాస్త్రవేత్తలు, డాక్టర్లు వచ్చారు తప్ప అక్కడే ఉన్న గేదెను మాత్రం పట్టించుకోలేదు. మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన శాస్త్రవేత్తలు, డాక్టర్లకు నిలయమైన వారి కార్యాలయం ముందే మూగ జీవి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గేదె మృతిచెందిన ప్రాంతానికి కూతవేటు దూరంలో జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఉన్నా గేదె కళేబరాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. -
సిరియాకు తరలుతున్నమహిళలు, పిల్లలు!
బ్రిటన్ మహిళలు, బాలికలు జిహాదీలుగా మారుతున్నారు. యుద్ధ భూమిగా మారిన సిరియాకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కౌంటర్ టెర్రరిజమ్ పోలీసులు తాజాగా విడుదల చేసిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాల్ఫేట్ లోని జీవితంపై ఐఎస్ ప్రచారానికి.. వీరంతా ఆకర్షితులౌతుండటంపై కౌంటర్ టెర్రరిజం జాతీయ సమన్వయకర్త హెలెన్ బాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2014 సంవత్సరంలో నలభైమూడు మంది మహిళలు సిరియాకు వెళ్ళగా అది గత సంవత్సరం పదమూడు పెరిగి 56 కు చేరినట్లు తాజా గణాంకాలు వివరిస్తున్నాయి. 2015 లో బ్రిటన్ నుంచి దాదాపు ఏభై ఆరు మంది మహిళలు, బాలికలు సిరియాకు పారిపోయారని లెక్కలు చెప్తున్నాయి. ముగ్గురు సిరియన్ శరణార్థులు వీడియోలో చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ఈ తాజా గణాంకాలను వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల్లో చేరేందుకు సిరియా వెడుతున్నవారందరినీ ఈ వీడియో (షార్ట్ ఫిల్మ్) హెచ్చరిస్తోంది. సిరియా వెళ్ళేందుకు ఎంతోమంది మహిళలు, బాలికలే కాక అనేక కుటుంబాలు కూడ ఇష్టం చూపిస్తున్నాయని, ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని ఓ మహిళ చెప్తుండగా... అలా ఆకర్షితులై వచ్చిన వారికి వాస్తవాలు తెలియకపోవడం వల్ల అనేక అనర్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయని మరో మహిళ హెచ్చరిస్తోంది. నిజానికి ఆ యుద్ధ భూమిలో నివసించే మహిళలు, పిల్లలకు జీవితం ఎంతో కఠినంగా ఉందని ఆ మహిళల మాటలను బట్టి తెలుస్తోంది. అయితే వారంతా అక్కడి మహిళలకు సహాయం అందించేందుకు వెడుతున్నట్లు భావిస్తున్నారని, వారు చేస్తున్నది తప్పు అన్న విషయం వారికి అర్థమైతే వారు వెళ్ళే అవకాశం ఉండదని హెలెన్ బాల్ అంటున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే లక్ష్యంతో ప్రచారాన్ని ప్రారంభించిన ప్రివెంట్ ట్రాజెడీస్ వెబ్ సైట్ కు ఆ ముగ్గురు మహిళలు స్వయంగా బహిరంగ లేఖలు కూడ రాసిచ్చారు. అంతేకాదు ఓ తల్లి తన భర్తను కాల్చి చంపేశారని కూడ చెప్పింది. తన కథను వారి వారి కూతుళ్ళకు వివరించమని, సిరియా ఎంతో ప్రమాదకరమైన ప్రాంతమని పిల్లలతో నివసించదగ్గ ప్రాంతం కాదని ఆమె లేఖలో హెచ్చరించింది. లండన్ కు మించిన స్వేచ్ఛ కలిగిన ప్రాంతం సిరియా కాదని, ఐఎస్ ఐఎస్ అధీనంలోని సిరియా అత్యంత ప్రమాదకరమని పిల్లలకు వివరించమంటోంది. ఐఎస్ ఐఎస్ నిజానికి ఇస్లాంను పాటించడం లేదని, వారు ముస్లింలు కాదని కూడ ఆమె ఆవేశంగా చెప్తోంది. ఇస్లాం పేరున ప్రజలను మోసగించి ఉగ్రవాదంలోకి దింపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవలి కాలంలో హై ప్రొఫైల్ కేసుల్లోని 15 ఏళ్ళ షర్మినా బేగం, అమీరా అబాసేలు ఒకే పాఠశాల్లోని స్నేహితులని, అలాగే 16 ఏళ్ళ కడీజా సుల్తానా సహా అందరూ లండన్ బెథ్నాల్ గ్రీన్ ప్రాంతం నుంచి వచ్చిన వారేనని ఆమె చెప్తోంది. అయితే ఫిబ్రవరి ప్రాంతంలో సిరియాకు చేరిన వీరు.. ఇప్పుడు ఐఎస్ ఐఎస్ ఫైటర్లను వివాహమాడేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన సహాయం ఏమిటంటే సిరియాకు, అటువంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్ళేవారిని అడ్డుకోవడమేనని కౌంటర్ టెర్రరిజం అసిస్టెంట్ ఛీఫ్ కానిస్టేబుల్ ఏంజెలా విలియమ్స్ అంటున్నారు. పిల్లలు సహా ఎవరైనా అటువంటి ప్రమాదానికి దగ్గరౌతుంటే వారిలో అవగాహన కల్పించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని తల్లులు... వారి పిల్లలు సిరియా ప్రయాణంపట్ల ఇష్టాన్ని చూపుతున్నా, అటువంటి సమస్యలున్నా వారు ముందుకు రావాలని సందేశం సూచిస్తున్నారు. -
కరీబియన్‌తో కటీఫ్!
ముంబై: వెస్టిండీస్ జట్టు అర్ధంతరంగా పర్యటన నుంచి నిష్ర్కమించడం బీసీసీఐకి మింగుడు పడటం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కరీబియన్లతో కఠినంగా వ్యవహరించాలని బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలో కనీసం ఐదేళ్ల పాటు ఆ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడరాదనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘విండీస్ తప్పుకోవడం వల్ల మేం భారీగా నష్టపోయాం. కాబట్టి దానికి పరిహారం కోరతాం. అదే విధంగా ఐసీసీ ముందు కూడా విషయాన్ని ఉంచుతాం. తదుపరి చర్యలు, విండీస్‌తో భవిష్యత్తులో సంబంధాల విషయంపై చర్చించేందుకు వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం. ఆలోగా న్యాయపరమైన సలహా కూడా తీసుకుంటాం’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. పర్యటన రద్దు కావడంలో ఆటగాళ్ల తప్పు లేదని, వారిని శిక్షించడం సరైంది కాదని కూడా బోర్డులో కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. మాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు: ఆటగాళ్లు సమ్మెకే మొగ్గు చూపడంతో పర్యటన రద్దు చేసుకోవడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) వెల్లడించింది. సిరీస్ మధ్యలో తప్పుకున్నందుకు బీసీసీఐ, స్పాన్సర్లు, అభిమానులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించింది. ఆటగాళ్లతో చర్చించేందుకు ఈ నెల 20న వెస్టిండీస్ నుంచి ప్రత్యేక బృందం భారత్‌కు రావాల్సి ఉండగా, ఆలోపే అవాంఛనీయ ఘటనలు జరిగాయని పేర్కొంది. ‘బ్రేవో నాయకత్వంలోని జట్టు ఇకపై పర్యటన కొనసాగించరాదని నిర్ణయించుకొని ఆ విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ ద్వారా మాకు తెలియజేసింది. దాంతో టూర్ రద్దు మినహా మేమేం చేయగలం? ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని భావించినా దానికి బీసీసీఐ అంగీకరించకపోయేదని మాకు తెలుసు’ అని విండీస్ బోర్డు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.