జైపూర్: సీఎం పదవిని వదిలేద్దామనుకున్నా.. కానీ అదే తనను వదలట్లేదని అన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలని చెప్పారు. 2018లో ఎన్నికల సందర్భంగా సీఎం పదవి కోసం సచిన్ పైలెట్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న గహ్లోత్.. ఈ మేరకు మాట్లాడారు. పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.
'సీఎం పదవిని వదిలేయాలని అనుకున్నా.. కానీ నేను ఎందుకు వదలాలి? ఆ పోస్టే నన్ను వదలట్లేదు.హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఏదైనా అంగీకారమే. సోనియా గాంధీ నన్ను మూడు సార్లు సీఎంను చేశారు.' అని గహ్లోత్ అన్నారు.
రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్‌కు, సచిన్ పైలెట్‌కు మధ్య ఇటీవల మళ్లీ వార్ నడిచింది. కానీ అధిష్ఠానం మరోసారి చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే.. తాజాగా జైపూర్‌లో నిర్వహించిన సమావేశంలో.. మరోసారి కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎంను అని గహ్లోత్ తెలిపారు. 2030 విజన్‌కు పిలుపునిచ్చారు. బలమైన రాజస్థాన్‌ను నిర్మిద్దామని అన్నారు.
'2030 గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు. విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు, రవాణా, రహదారులు వంటి రంగాల్లో విశేషమైన సేవ చేశాను. ఎందుకు నేను మరోసారి ముందుకు పోకూడదు అనిపించింది.' అని గహ్లోత్ అన్నారు.
గత సెప్టెంబర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గహ్లోత్‌ను కూడా పోటీలో నిలిచారు. గహ్లోత్ కేంద్ర స్థాయిలో ఉంటే.. సచిన్‌ను రాష్ట్ర స్థాయిలో ప్రధాన నాయకునిగా మారనున్నారని పుకార్లు వచ్చాయి. అయితే.. రాజస్థాన్‌లో సీఎంగా తాను మాత్రమే ఉండాలని ఎమ్మెల్యేలు పట్టుబడగా.. తప్పక ఉండాల్సి వచ్చిందని గహ్లోత్ చెప్పారు.
ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్‌డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్..
Comments
Please login to add a commentAdd a comment