కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్‌ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్‌కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు.
"దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్‌ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్‌కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
ఓపెన్‌ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ.. ఓపెన్‌ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్‌కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు. GPT-4, ఓపెన్‌ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.
After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…
— Ilya Sutskever (@ilyasut) May 14, 2024
Comments
Please login to add a commentAdd a comment