ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్‌స్కేవర్ కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనరేటివ్ ఏఐకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీలే ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. నేను స్థాపించిన కొత్త కంపెనీ ‘సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్’ సురక్షితమైన ఏఐ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అమెరికాలోని పాలో ఆల్టో, టెల్ అవీవ్‌ల్లో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. మా వ్యాపార నమూనా సేఫ్టీ, సెక్యూరిటీ, పురోగతి వంటి కీలక అంశాలపై ఆధారపడుతుంది’ అన్నారు.
గత ఏడాది నవంబర్‌లో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌తోపాటు సట్స్‌కేవర్‌ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సామ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్‌తో చర్చలు జరిపారు. కానీ నాటకీయ పరిణామాల తర్వాత తిరిగి ఓపెన్‌ఏఐలోని కొనసాగుతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. కానీ సామ్‌తో పాటు ఉద్యోగం నుంచి తొలగించబడిన సట్స్‌కేవర్‌ను తిరిగి బోర్డులో చేర్చుకోలేదు. దాంతో ఆయన కొత్త కంపెనీ పనులు ప్రారంభించారు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రకటన చేశారు.
ఇదీ చదవండి: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..
సట్‌స్కేవర్‌తో పాటు మాజీ ఓపెన్‌ఏఐ సైంటిస్ట్ డేనియల్ లెవీ, ‘క్యూ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, యాపిల్‌లో మాజీ ఏఐ లీడ్‌గా వ్యవహరించిన డేనియల్ గ్రాస్ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్‌లుగా చేరారు.
Comments
Please login to add a commentAdd a comment