ఇన్‌క్రెడ్‌మనీ సీఈవో విజయ్ కుప్పా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు–మూడేళ్లలో రూ. 5,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) సాధించాలని నిర్దేశించుకున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాం ఇన్‌క్రెడ్‌మనీ సీఈవో విజయ్ కుప్పా తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1,250 కోట్ల స్థాయిలో ఉందని, సుమారు రెండు లక్షల మంది యూజర్లు ఉన్నారని వివరించారు. వచ్చే రెండేళ్లలో బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నామని, ఇప్పటికే లైసెన్స్ కూడా పొందామని ఆయన తెలిపారు.
దేశీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పాన్‌కార్డ్‌హోల్డర్ల సంఖ్య 6–7 కోట్ల స్థాయిలో ఉండగా వచ్చే పదేళ్లలో ఇది 20 కోట్లకు చేరే అవకాశం ఉందని విజయ్ చెప్పారు. ప్రజలు క్రమంగా పొదుపు నుంచి ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లుతుండటం ఇందుకు దోహదపడగలదని ఆయన వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వారి కోసం 24 ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయని విజయ్ చెప్పారు. బాండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడుల మేళవింపుతో ఒకవైపు పెట్టుబడి భద్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు అధిక రాబడులను కూడా అందించే విధంగా ఈ ప్రోడక్టులు ఉంటాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment