Broking Company
-
హైదరాబాద్ లో డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కాం ప్రకంపనలు
-
రూ. 5,000 కోట్ల ఏయూఎం లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు–మూడేళ్లలో రూ. 5,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) సాధించాలని నిర్దేశించుకున్నట్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఇన్‌క్రెడ్‌మనీ సీఈవో విజయ్ కుప్పా తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1,250 కోట్ల స్థాయిలో ఉందని, సుమారు రెండు లక్షల మంది యూజర్లు ఉన్నారని వివరించారు. వచ్చే రెండేళ్లలో బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నామని, ఇప్పటికే లైసెన్స్ కూడా పొందామని ఆయన తెలిపారు. దేశీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పాన్కార్డ్హోల్డర్ల సంఖ్య 6–7 కోట్ల స్థాయిలో ఉండగా వచ్చే పదేళ్లలో ఇది 20 కోట్లకు చేరే అవకాశం ఉందని విజయ్ చెప్పారు. ప్రజలు క్రమంగా పొదుపు నుంచి ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లుతుండటం ఇందుకు దోహదపడగలదని ఆయన వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వారి కోసం 24 ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయని విజయ్ చెప్పారు. బాండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడుల మేళవింపుతో ఒకవైపు పెట్టుబడి భద్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు అధిక రాబడులను కూడా అందించే విధంగా ఈ ప్రోడక్టులు ఉంటాయని ఆయన తెలిపారు. -
బ్రోకింగ్ స్టాక్స్ మారథాన్
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలోఈక్విటీల వైపు వస్తుండడంతో బ్రోకింగ్ స్టాక్స్ గడిచిన కొన్నేళ్లలో మంచి రాబడులు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్లో కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు అడుగులు వేసేలా చేశాయని చెప్పుకోవాలి. దీంతో ట్రేడింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. కరోనా వైరస్ సమసిపోయి, ఇంటి నుంచే పని విధానం కూడా కనుమరుగు అవుతున్నప్పటికీ, మరోవైపు ఈక్విటీ మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ట్రేడింగ్ పరిమాణం గణనీయంగా నమోదవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏంజెల్ వన్, 5పైసా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, చాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్స్ ర్యాలీ రిటైల్ ఇన్వెస్టర్ల జోరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ఏంజెల్ వన్ స్టాక్ ఏడాది కాలంలో 90 శాతం రాబడులను ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ 77 శాతం పెరిగింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సైతం 21 శాతం రాబడిని ఇచి్చంది. లిస్టెడ్ బ్రోకరేజీ సంస్థల విలువ వృద్ధి వెనుక రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రధానంగా చెప్పుకోవాలని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ భవీక్ పాటిల్ తెలిపారు. డీమ్యాట్ ఖాతాల్లో భారీ వృద్ధి కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాల్లో గణనీయ వృద్ధి కనిపించింది. అంతేకాదు భవిష్యత్తులోనూ వీటి పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బ్రోకరేజీ పరిశ్రమకు అనుకూలమని, టెక్నాలజీలో వచి్చన పురోగతి నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థలు మరింత మంది క్లయింట్లకు సేవలు అందించగలవని స్టాక్స్‌బాక్స్ సీఈవో వంశీ కృష్ట పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో కనిపించిన నిరంతరాయ ర్యాలీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.22 కోట్లకు చేరింది. వీటిల్లో అధిక శాతం గడిచిన 11 నెలల కాలంలో ప్రారంభమైనవే కావడం గమనించొచ్చు. ఒకవైపు స్టాక్ మార్కెట్ ర్యాలీకితోడు, మరోవైపు ఐపీవోల బంపర్ లిస్టింగ్ మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాలూ అనుకూలమే సెపె్టంబర్ త్రైమాసికంలో బ్రోకరేజీ కంపెనీలు మంచి సానుకూలతలను చూసినట్టు ఎం.స్టాక్ (మిరే అస్సెట్) రిటైల్ స్ట్రాటజీ హెడ్ ధర్మేంద్ర లోహర్ చెప్పారు. సూచీలు సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకోవడం, ఐపీవో ఇష్యూలు పెరగడాన్ని ప్రస్తావించారు. ‘‘సంప్రదాయ, బ్యాంక్ బ్రోకర్లు ఎక్కువగా లబ్ధి పొందారు. ఎందుకంటే వీరి ఆదాయం ప్రధానంగా ఈక్విటీల నుంచే ఉంటుంది. ఇది ఆయా సంస్థల లాభాలు, ఆదాయం వృద్ధికి దారితీశాయి’’అని ధర్మేంద్ర లోహర్ తెలిపారు. ‘‘కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. దీంతో గడిచిన కొన్నేళ్లలో బ్రోకరేజీ సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది’’అని స్టాక్స్‌బాక్స్ కృష్ణ చెప్పారు. ఏంజెల్ వన్ సెపె్టంబర్ త్రైమాసికంలో 42 శాతం అధికంగా రూ.305 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. ఒకే త్రైమాసికంలో అత్యధికంగా 21 లక్షల మంది క్లయింట్లకు పెంచుకుంది. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లాభం సైతం 52 శాతం పెరిగింది. -
పేటీఎంపై రూ.30కే రూ.10వేల కవరేజీ
ముంబై: పేటీఎం పేరిట చెల్లింపులు, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సహా సమగ్ర ఆర్థిక సేవల్లోని వన్97 కమ్యూనికేషన్స్.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ‘పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్’ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది గ్రూపు ఇన్సూరెన్స్ ప్లాన్. యూపీఐ ద్వారా యాప్‌లు, వ్యాలెట్ల నుంచి నిర్వహించే అన్ని రకాల లావాదేవీలకు ఇది రక్షణ కల్పిస్తుందని పేటీఎం తెలిపింది. ఏడాదికి కేవలం రూ.30 చెల్లించడం ద్వారా.. రూ.10,000 వరకు కవరేజీ పొందొచ్చని పేర్కొంది. యూపీఐ లావాదేవీల్లో మోసాల వల్ల నష్టపోయిన వారికి ఈ ప్లాన్ కింద గరిష్టంగా రూ.10వేల పరిహారం లభించనుంది. త్వరలోనే ఇదే ప్లాన్ కింద రూ.లక్ష వరకు రక్షణ కవరేజీని ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. పరిశ్రమలో ఈ తరహా ఉత్పత్తి ఇదే మొదటిది అని, డిజిటల్ చెల్లింపుల పట్ల నమ్మకాన్ని పెంచడంతోపాటు, డిజిటల్ చెల్లింపులను మరింత మందికి చేరువ చేయడం ఈ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొంది. -
ఇన్వెస్టర్లకు బ్రోకింగ్ సంస్థల గాలం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి మెగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో పాలసీదారులు, ఇన్వెస్టర్లను మార్కెట్ వైపు మళ్లించడంపై బ్రోకింగ్ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఇనాక్టివ్ ఖాతాలను మళ్లీ పునరుద్ధరించేలా మదుపుదారులను ప్రోత్సహించడం మొదలుకుని క్యూఆర్ కోడ్‌తో అప్పటికప్పుడు డీమ్యాట్ ఖాతాలను తెరవడం, వినూత్న ఆఫర్లు ఇవ్వడం వరకూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎల్ఐసీ ఐపీవోకి దరఖాస్తు చేసుకోవడానికి .. సంక్లిష్టమైన బ్యాŠంకు లావాదేవీతో సంబంధం లేకుండా, అత్యంత సంపన్న ఇన్వెస్టర్లకు (హెచ్ఎన్ఐ) యూపీఐ ద్వారా చెల్లింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతున్నాయి. దేశీయంగా అతి పెద్ద బ్రోకింగ్ సంస్థ జిరోధా, ఈ మధ్యే బ్రోకింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన పేటీఎం మనీ ఇప్పటికే దీన్ని అమల్లోకి తేగా, మిగతా సంస్థలు అదే బాట పట్టనున్నాయి. తమ దగ్గరే డీమ్యాట్ ఖాతాలు తెరిచేలా డిజిటల్, సంప్రదాయ బ్రోకింగ్ సంస్థలు పలు స్కీములు, గిఫ్ట్ వోచర్లతో పాలసీదారులను ఊరిస్తున్నాయి. కొత్త క్లయింట్లకు ఏంజెల్ వన్ బ్రోకింగ్ సంస్థ రూ. 15,000 విలువ చేసే వోచర్లు ఆఫర్ చేస్తోంది. చాలా మటుకు బ్రోకరేజీలు ఇప్పటికే రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు ఐపీవోకి దరఖాస్తు చేసుకునేందుకు ’ప్రీ–అప్లై’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల వారు కూడా దరఖాస్తు చేసుకోవడంలో తోడ్పడేందుకు ఫిన్‌టెక్ సంస్థ స్పైస్ మనీ తాజాగా రెలిగేర్ బ్రోకింగ్‌తో జట్టు కట్టింది. మూణ్నెల్లలో 91 లక్షల ఖాతాలు.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ (సీడీఎస్ఎల్) గణాంకాల ప్రకారం జనవరి–మార్చి మధ్య కాలంలో కొత్తగా 91 లక్షల డీమ్యాట్ ఖాతాలు వచ్చాయి. దీంతో 2022 మార్చి 31 నాటికి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8.06 కోట్ల నుంచి (గతేడాది డిసెంబర్ ఆఖర్లో) 8.97 కోట్లకు పెరిగింది. ఎల్ఐసీ ఐపీవోపై రిటైల్ ఇన్వెస్టర్లలో భారీగా ఆసక్తి నెలకొందని యాక్సిస్ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీవో కోసమే గత నెలలో 45,000 పైచిలుకు ఖాతాలు తెరిచామని, వీరిలో 40 శాతం మంది కస్టమర్లు .. మార్కెట్‌కు కొత్త వారేనని వివరించాయి. మే 4న ప్రారంభమయ్యే ఐపీవోలో భాగంగా ఎల్ఐసీలో ప్రభుత్వం 3.5 శాతం వాటాలు (22.13 కోట్ల షేర్లు) విక్రయిస్తోంది. ఉద్యోగులకు షేరు ధరపై రూ. 45, పాలసీదారులకు రూ. 60 మేర డిస్కౌంట్ లభించనుంది. 2008లో రిలయన్స్ పవర్‌కి రికార్డు స్థాయిలో వచ్చిన 48 లక్షల పైచిలుకు దరఖాస్తులకు మించి ఎల్ఐసీ ఐపీవోకి బిడ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 21,000 కోట్లు సమీకరించనుంది. తద్వారా దేశీయంగా ఇది అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఎల్ఐసీ ఐపీవో బిడ్‌కు పేటీఎం రూటు క్యూఆర్ కోడ్ స్కానర్‌తో డీమ్యాట్ ఖాతా వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) అనుబంధ సంస్థ అయిన పేటీఎం మనీ ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వారి కోసం ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్లు, పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్‌ను ఏర్పాటు చేశామని.. జీవిత కాలం ఎటువంటి చార్జీల్లేని డీమ్యాట్ ఖాతాను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. ఎవరైనా తమ ఫోన్ నుంచి క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా డీమ్యాట్ ఖాతాను తమ వద్ద తెరవొచ్చని సూచించింది. ఖాతా తెరిచిన అనంతరం ఎల్ఐసీ ఐపీవోకు బిడ్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 4 నుంచి ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అవుతుండగా.. 9న ముగియనుంది.‘‘ గత కొన్ని ఏళ్లుగా క్యాపిటల్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరుగుతుండడాన్ని చూస్తున్నాం. ఎల్ఐసీ ఐపీవోతో ఇది మరింత పెరగనుంది. దేశవ్యాప్తంగా పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా ఉచిత డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించొచ్చు’’అని పేటీఎం మనీ అధికార ప్రతినిధి తెలిపారు. పేటీఎం మనీ హోమ్‌స్క్రీన్‌లో ఐపీవో సెక్షన్‌కు వెళ్లి అక్కడ అడిగిన వివరాలు ఇవ్వడం ద్వారా డీమ్యాట్ ఖాతా తెరవొచ్చు. -
ఈ షేర్లు... తారాజువ్వలు!
ఇన్వెస్టర్లకు సంవత్ 2077 బంపర్‌గా గడిచింది. ప్రజలను కరోనా భయాలు వెంటాడుతున్నా.. దేశీ మార్కెట్లు మాత్రం తారాజువ్వల్లాగా దూసుకెళ్లిపోయాయి. స్మాల్, మిడ్.. లార్జ్ క్యాప్ అనే భేదం లేకుండా అన్ని విభాగాల్లోని షేర్లూ గణనీయంగా పెరిగాయి. గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది అక్టోబర్ దాకా చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 40 శాతం రాబడులు అందించగా.. మిడ్‌క్యాప్ సూచీలు 60 శాతం, స్మాల్‌క్యాప్ సూచీలు 79.7 శాతం మేర రాణించాయి. కరోనా కేసుల కారణంగా అంతటా నిస్పృహ, నిరాశ నెలకొన్న పరిస్థితుల్లో ఊహకు కూడా అందని విధంగా స్టాక్ మార్కెట్లు ఎగిశాయి. కారణాలు అంతర్జాతీయంగా నిధుల లభ్యత పెరగడం, ఆర్థిక విధానాలు సానుకూలంగా ఉండటం, ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు (2021లో 2 కోట్ల పైచిలుకు) తెరవడం, టీకాలతో మహమ్మారిని కొంత కట్టడి చేయగలగడం, ఇంధన ధరలు పెరగడం, రిస్క్ సామర్థ్యాలు పెరగడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లో జోష్‌కి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్ 2078లోనూ మార్కెట్లు మరింత ఎగిసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే రాబడులు తగ్గడం, దేశీ ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలు పెరగడం, జీడీపీ వృద్ధి మెరుగుపడుతుండటం, టీకా ప్రక్రియ పుంజుకుంటూ ఉండటం ఇందుకు దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రంగాల్లో ట్రావెల్, టూరిజం, రియల్ ఎస్టేట్ దాని అనుబంధ రంగాలు మొదలైనవి మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. మరోవైపు, హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాలు ఆశావహంగా ఉండగలవని యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్‌లో మెరిసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని బ్రోకరేజి సంస్థలు సూచిస్తున్న స్టాక్స్ కొన్ని మీకోసం. బ్రోకింగ్ సంస్థ: ఎస్బీఐ సెక్యూరిటీస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,721 వృద్ధి: 33% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 4.8 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్, అసెట్ క్వాలిటీ, మెరుగైన మార్జిన్లు, రాబడులు దీనికి సానుకూల అంశాలు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ మొండి బాకీలు మరింత తగ్గగలవు. వ్యయాలు తగ్గించుకునే దిశగా డిజిటల్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రతి నెలా డిజిటల్ మాధ్యమం ద్వారా 5 లక్షల పైచిలుకు కస్టమర్లను చేర్చుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించడం, లాక్డౌన్లు విధిస్తే రిటైల్ సెగ్మెంట్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం, ఫిన్‌టెక్ కంపెనీల నుంచి పోటీ వంటివి బాంకుకు ప్రతికూలాంశాలు కాగలవు. .. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుత ధర రూ. 292 టార్గెట్ ధర రూ. 358 వృద్ధి: 22% వివిధ మౌలిక రంగ ప్రాజెక్టుల అభివృద్ధిలో రెండు దశాబ్దాలపైగా అనుభవం. పటిష్టమైన ఇన్‌హౌస్ ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సేవలు) విభాగం. ఇన్ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థలతో సత్సంబంధాల కారణంగా సంయుక్తంగా బిడ్డింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మెరుగైన అవకాశాలు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,786 టార్గెట్ ధర రూ. 2,151 వృద్ధి: 20% ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన కంపెనీ. దేశీయంగా విస్కస్ స్టేపుల్ ఫైబర్ (వీఎస్ఎఫ్), లినెన్, ఇన్సులేటర్స్ తయారీ సంస్థ. అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి అనుబంధ సంస్థలున్నాయి. డెకరేటివ్ పెయింట్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో వ్యాపారాలపై రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆకర్షణీయమైన వేల్యుయేషన్‌లో లభిస్తోంది. చైనా నుంచి సరఫరాపరమైన ఆటంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్, ముడి వస్తువులు..విద్యుత్, ఇంధనాల ఖర్చులు పెరగడం తదితర రిస్కులు పొంచిఉన్నాయి. .. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 612 టార్గెట్ ధర రూ.774 వృద్ధి: 26% ఇది మురుగప్పా గ్రూప్‌లో భాగమైన ఆర్థిక సేవల విభాగం. గృహ, వాహన రుణాలు, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సేవలు మొదలైనవి అందిస్తోంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 67000 కోట్ల పైగా ఉంది. దాదాపు 16.6 లక్షల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏయూఎం వార్షికంగా 7 శాతం వృద్ధి నమోదు చేసింది. మహమ్మారి కారణంగా వసూళ్లపై అనిశ్చితి,హామీగా పెట్టుకున్న వాటి విలువలో అత్యధిక శాతం రుణం ఇవ్వడం తదితర అంశాలు ప్రధానమైనరిస్కులు. సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ.836 టార్గెట్ రూ.1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్రోకింగ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.100 టార్గెట్ ధర రూ.135 వృద్ధి: 35% పేరొందిన పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. బ్యాంక్ మొత్తం అసెట్స్ రూ. 2.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు రూ. 1.72 లక్షల కోట్లుగా, ఇచ్చిన రుణాలు రూ. 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రొవిజనింగ్ తగ్గింది. అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.1582 టార్గెట్ ధర రూ.1,859 వృద్ధి: 17% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం. డిపాజిట్లు రూ. 14 లక్షల కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 12 లక్షల కోట్లుగాను ఉన్నాయి. రిటైల్ రుణాల వాటా 46 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో ఎన్పీఏలు తగ్గడంతో ఊహించిన దానికన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అసెట్ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, ద్వితీయార్ధం వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండటం తదితర అంశాలు ఈ స్టాక్‌కు సానుకూలమైనవి. సుప్రజిత్ ఇంజినీరింగ్ ప్రస్తుత ధర రూ.373 టార్గెట్ ధర రూ.425 వృద్ధి: 13% సుప్రజిత్ ఇంజినీరింగ్ దేశీయంగా ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్యాసింజర్ వాహనాల సంస్థలకు ఆటోమోటివ్ కేబుల్స్ సరఫరా చేస్తోంది. ఉత్పత్తులను చౌకగా అందించడం ద్వారా మార్కెట్ షేరును పెంచుకోవడంతో పాటు ప్రస్తుత కస్టమర్ల నుంచి మరింతగా ఆర్డర్లు దక్కించుకుంటోంది. వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచుకునే కొద్దీ సుప్రజిత్ కూడా గణనీయంగా ప్రయోజనాలు పొందగలదు. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర రూ.143 టార్గెట్ ధర రూ.175 వృద్ధి: 22% దేశీయంగా వాణిజ్య వాహనాల విభాగ దిగ్గజాల్లో ఒకటి. మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాల మార్కెట్లో సుమారు 28 శాతం వాటా ఉంది. సీవీ సెగ్మెంట్ కోలుకునే కొద్దీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలగే సత్తా ఉంది. స్క్రాపేజీ పాలసీ వల్ల కూడా కంపెనీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పీఐ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ.2733 టార్గెట్ ధర రూ.3,950 వృద్ధి: 44% అంతర్జాతీయ ఆగ్రోకెమికల్ కంపెనీలకు కస్టమ్ సింథసిస్, తయారీ సొల్యూషన్స్ (సీఎస్ఎం) అందిస్తోంది. కంపెనీ ఆదాయాల్లో ఈవిభాగం వాటా 70 శాతం పైగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కెమికల్స్, ఫార్మా ఏపీఐ, ఫ్లోరో కెమికల్స్ మొదలైన వాటిల్లోకి విస్తరిస్తోంది. బ్రోకింగ్ సంస్థ: యాక్సిస్ సెక్యూరిటీస్ ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ధర రూ. 2,420 టార్గెట్ ధర రూ. 2,570 వృద్ధి: 6% వ్యయాల తగ్గింపు చర్యలు, ఉత్పత్తులకు భారీ డిమాండ్, మెరుగైన ధర మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు. ప్రస్తుతం ఈ రంగంలోని మిగతా సంస్థలతో పోలిస్తే షేరు ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. సైయంట్ ప్రస్తుత ధర రూ.1,105 టార్గెట్ ధర రూ.1,300 వృద్ధి: 17% దీర్ఘకాలిక కోణంలో కంపెనీ వ్యాపార స్వరూపం పటిష్టంగా మారింది. అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు సంస్థ చేతిలో ఉన్నాయి. రూపాయి మారకం తక్కువ స్థాయిలో ఉంటడం, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గటం వంటి కారణాలతో సమీప భవిష్యత్తులో సైయంట్ ఆదాయాలు మరింత మెరుగుపడవచ్చు. మైండ్‌ట్రీ ప్రస్తుత ధర రూ.4,627 టార్గెట్ ధర రూ.5,100 వృద్ధి: 10% ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించగలగడంతో పాటు ప్రాజెక్టులను సమర్ధంగా పూర్తి చేయగలిగే ట్రాక్ రికార్డు కంపెనీకి సానుకూలాంశం. రూపాయి క్షీణత, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గుతుండటం కలిసొచ్చే అంశాలు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర రూ.744 టార్గెట్ ధర రూ.940 వృద్ధి: 26% నవీకరించిన కొత్త వ్యాపార విధానం ఊతంతో తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతో పాటు మార్కెట్ వాటాను కూడా పెంచుకోగలిగే అవకాశం ఉంది. బ్రాండ్ రీకాల్, వివిధ రకాల కస్టమర్లకు వినూత్న ఆఫర్లు అందిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ధర రూ.1,178 టార్గెట్ ధర రూ.1,350 వృద్ధి: 14% ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఎస్బీఐ లైఫ్‌కు అత్యంత విస్తృతమైన బ్యాంక్ఎష్యూరెన్స్ నెట్వర్క్ ఉంది. కార్యకలాపాలను స్వల్ప వ్యవధిలో విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యయాలకు సంబంధించిన నిష్పత్తులు అత్యంత తక్కువగా ఉండటం వల్ల వ్యాపా రం నెమ్మదించినా మార్జిన్లపై ఎక్కువగా ప్రభావం పడకపోవడం, లాభదాయక పాలసీలపై దృష్టి పెడుతుండటం సంస్థకు సానుకూలాంశం. బ్రోకింగ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ. 836 టార్గెట్ రూ. 1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ధర రూ. 101 టార్గెట్ ధర రూ. 120 వృద్ధి: 18% క్రమంగా కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలను ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం తదితర అంశాల ఊతంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుంది. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడంతో ఎన్పీఏల భారం తగ్గుతుంది. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రావాల్సిన బాకీలు కూడా క్రమంగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రస్తుత ధర రూ. 253 టార్గెట్ ధర రూ. 300 వృద్ధి: 18% మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ రంగ పరికరాల వ్యాపారం పటిష్టంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు–నాలుగేళ్లలో 35–30 శాతం పెరగవచ్చని అంచనా. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీకి ఇది సానుకూలాంశం. బాటా ఇండియా ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,380 వృద్ధి: 17% వ్యయాలను తగ్గించుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగించడం, ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు మొదలైనవి కంపెనీకి లాభించగలవు. అలాగే భారం పెంచుకోకుండా ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ నెట్‌వర్క్‌ను క్రమంగా పెంచుకుంటూ ఉండటం సంస్థకు సానుకూల అంశం. మహీంద్రా లైఫ్‌స్పేస్ ప్రస్తుత ధర రూ. 283 టార్గెట్ ధర రూ. 325 వృద్ధి: 14% పటిష్టమైన మాతృ సంస్థ తోడ్పాటు, కార్యకలాపాల స్థాయిని విస్తరించడంపై మేనేజ్మెంట్ మరింతగా దృష్టి పెడుతుండటం కంపెనీకి సానుకూల అంశాలు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలాలతో రెసిడెన్షియల్ వ్యాపారాన్ని కూడా పెంచుకోవడానికి తోడ్పడగలదు. మధ్యకాలికంగా షేర్ టార్కెట్‌ను తాకవచ్చు. -
ఫోన్‌పేకు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లైసెన్స్
న్యూఢిల్లీ: చెల్లింపుల సేవల్లోని ప్రముఖ కంపెనీ ఫోన్‌పే.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నుంచి బీమా బ్రోకింగ్ లైసెన్స్ లభించినట్టు సోమవారం ప్రకటించింది. కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్‌తో బీమా వ్యాపారంలోకి ఫోన్‌పే గతేడాదే ప్రవేశించింది. నిబంధనల కింద ఒక్కో విభాగంలో మూడు కంపెనీలతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఉంటుంది. కానీ, ఇప్పుడు నేరుగా బ్రోకింగ్ లైసెన్స్ లభించడంతో అన్ని బీమా కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే అనుమతులు లభించినట్టయింది. దీంతో బీమా బ్రోకింగ్ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ సంస్థకు 30 కోట్లకుపైగా యూజర్ల బేస్ ఉంది. భారీ సంఖ్యలోనున్న యూజర్లకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయగలదు. -
కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల రాకతో బ్రోకరేజ్ షేర్లకు గిరాకీ
కరోనా ప్రేరేపిత లాక్డౌన్లో రిటైల్ ఇన్వెస్టర్లు భారత స్టాక్మార్కెట్లోకి భారీ సంఖ్యలో వచ్చారు. రిటైల్ ఇన్వెస్టర్ల రాకతో బ్రోకింగ్ సంస్థల షేర్లకు అధిక డిమాండ్ నెలకొంది. ఈ ఏడాదిలో బ్రోకరేజ్ సంస్థలైన ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిడెట్ షేర్లు 17శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో ఎస్అండ్పీ బీఎస్ఈ ఫైనాన్స్ ఇండెక్స్ 26శాతం నష్టాన్ని చవిచూడటం గమనార్హం. డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ 5పైసా లిమిటెడ్ షేరు ఈ ఏడాదిలో దాదాపు రెట్టింతల లాభాల్ని ఆర్జించింది. ఈ కంపెనీ స్థాపించి 4ఏళ్ల తర్వాత ఈ షేరు తొలిసారిగా ఈజూన్ క్వార్టర్లో లాభాల్ని ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘స్టాక్ మార్కెట్లో 1984 నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను. ఇంత స్థాయిలో రిటైల్ ఇన్వెస్టర్ల యాక్టివిటీ గతంలో ఎన్నడూ చూడలేదు. క్యాష్ మార్కెట్లో గడచిన 3-4నెలల్లో రిటైల్ వాల్యూమ్స్ రికార్డు స్థాయిలో రెట్టింపు అయ్యాయి. రిటైల్ ట్రేడింగ్ గేమింగ్ యాక్టివిటీగా మారుతోంది. చాలామంది యువకులు, గేమ్స్‌లు ఆడటానికి బదులు స్టాక్ మార్కెట్లో ఆడుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ సీఈవో సీజే జార్జ్ తెలిపారు. అగ్రరాజ్యమైన అమెరికా ఉద్దీపన ప్రకటనలు భారీ ప్రకటించడంతో అన్ని దేశాలకు చెందిన ఈక్విటీ మార్కెట్లు కనిష్టస్థాయి నుంచి రికవరిని సాధించాయి. అలాగే మనదేశంలో లాక్డౌన్ పొడగింపుతో ఇతర అసెట్స్ క్లాసెస్‌లో రాబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో భారత్ స్టాక్మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్టర్ల రాక గతంలో కంటే భారీగా పెరిగింది.కొత్త ఇన్వెస్టర్లు అనుభవలేమితో తక్కువ ధరలకు లభించే, ప్రమాదస్థాయిని అధికంగా కలిగిన పెన్నీ స్టాకుల్లో అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లను మించి ఈపెన్నీ స్టాకులు రాణిస్తున్నాయి. కేవలం క్లయింట్లు మాత్రమే పెరగడం కాకుండా విస్తృత స్థాయిలో పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఈ కొత్త ఇన్వెస్టర్లు ధీర్ఘకాలం పాటు మార్కెట్లో కొనసాగి సంపద వృద్ధికి తోడ్పడతారు అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ చీఫ్ విజయ్ చందక్ అభిప్రాయపడ్డారు. 1.9 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే భారత మార్కెట్ మార్చి కనిష్టం స్థాయి నుంచి ఆసియాలోకెల్లా అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూ 40శాతం రికవరిని సాధించింది. ఈ మొత్తం రికవరిలో 10శాతం ఈ జూలైలో సాధించడం విశేషం. అలాగే ఆసియాలో అధికంగా పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్ల భారీ స్థాయిలో పెట్టుబడులను పెట్టడం, ఔత్సాహిక ఇన్వెస్టర్లు స్టాక్‌లో రావడం తదితర కారణాలు మార్కెట్ రివకరికి కారణమయ్యాని నిపుణులు భావిస్తున్నారు. -
ఏడాది కాలానికి 8 మిడ్ క్యాప్స్!
ప్రభుత్వ చర్యలు, కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలు కలగలసి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో తాజాగా అమెరికన్ ఇండెక్స్ నాస్డాక్ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు వీలుగా మార్చి కనిష్టం నుంచి 45 శాతం ఎగసింది. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం మార్చి 23న నమోదైన కనిష్టం నుంచి 34 శాతం ర్యాలీ చేశాయి. దీంతో బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 31 శాతం పురోగమించింది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించడంతో మార్చి నెలలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. అయితే పలు దేశాలు భారీ స్థాయిలో లిక్విడిటీని పంప్చేయడంతో నెల రోజుల్లోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. మధ్యలో కొంతమేర ఆటుపోట్లు చవిచూసినప్పటికీ గత రెండు వారాలుగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ పరుగు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకింగ్ సంస్థలు 8-12 నెలల కాలానికి కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లను సూచిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. యూపీఎల్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఇటీవల కొంతమేర నికర రుణ భారాన్ని తగ్గించుకుంది. కంపెనీ పనితీరుపై లాక్‌డవున్ ప్రభావం తక్కువే. రూ. 630 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో యూపీఎల్ షేరు రూ. 426 వద్ద ట్రేడవుతోంది. సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాంలో కంపెనీ అతిపెద్ద తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కోవిడ్-19 పెద్దగా ప్రభావం చూపలేదు. కాఫీకి డిమాండ్ కొనసాగుతోంది. సప్లై చైన్ మెరుగుపడనుంది. ఇకపైనా ప్రొడక్టులకు పటిష్ట డిమాండ్ కనిపించనుంది. రూ. 315 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సీసీఎల్ ప్రొడక్ట్స్ షేరు రూ. 226 వద్ద ట్రేడవుతోంది. -ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ పీఐ ఇండస్ట్రీస్ పటిష్ట ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలను కలిగిన కంపెనీ 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. ఆశావహ రుతుపవనాల కారణంగా మార్జిన్లు మెరుగుపడే వీలుంది. అగ్రికెమికల్స్తోపాటు ఇతర విభాగాలలోనూ విస్తరిస్తోంది. రూ. 1840 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఐ ఇండస్ట్రీస్ షేరు 1620 వద్ద ట్రేడవుతోంది. గుజరాత్ గ్యాస్ గత కొన్నేళ్లలో కొత్తగా 12వరకూ జిల్లాలలో కార్యకలాపాలు విస్తరించింది. రౌండ్ 9,10లో భాగంగా 7 కొత్త ప్రాంతాలలో హక్కులను సొంతం చేసుకుంది. తద్వారా మరో 5-7ఏళ్లపాటు సిటీగ్యాస్ పంపిణీలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన కంపెనీగా కొనసాగనుంది. చౌక ఎల్ఎన్జీ ధరలు, నియంత్రణ సంస్థల మద్దతుతో అమ్మకాల పరిమాణం పెరిగే వీలుంది. రూ. 315 టార్గెట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గుజరాత్ గ్యాస్ షేరు రూ. 292 వద్ద కదులుతోంది. -సెంట్రమ్ బ్రోకింగ్ టాటా కన్జూమర్ దేశీ వినియోగ రంగ వేగాన్ని అందిపుచ్చుకునే సన్నాహాల్లో ముందుంది. ఇందుకు వీలుగా టాటా కెమికల్స్ నుంచి కన్జూమర్ బిజినెస్‌ను విడదీసి విలీనం చేసుకుంది. తద్వారా టాటా కన్జూమర్గా ఆవిర్భవించింది. పటిష్ట బ్యాలన్స్‌షీట్, బ్రాండ్లు, క్యాష్‌ఫ్లో, బలమైన యాజమాన్యం వంటి అంశాలు కంపెనీకి సానుకూలం. రూ. 431 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం టాటా కన్జూమర్ షేరు రూ. 384 వద్ద ట్రేడవుతోంది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గతేడాది పటిష్ట పనితీరు చూపింది. ముఖ్యమైన డీల్స్‌ను సైతం గెలుచుకుంది. డిజిటల్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందునిలిచే అవకాశముంది. తద్వారా ఈ ఏడాది సైతం మెరుగైన పనితీరు చూపనుంది. రూ. 2060 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు రూ. 1897 వద్ద కదులుతోంది. -మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ కెమికల్ బిజినెస్‌లో కంపెనీకి పట్టుంది. ప్రధానంగా ఫ్లోరోకెమికల్స్ విభాగం అదనపు బలాన్నిస్తోంది. పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యం ద్వారా ఫ్లోరోకెమికల్స్ అప్లికేషన్స్‌లో అగ్రభాగాన నిలుస్తోంది. తద్వారా అవకాశాలను ముందుగానే అందిపుచ్చుకుంటోంది. రూ. 4,000 టార్గెట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్ఆర్ఎఫ్ షేరు రూ. 3,660 వద్ద కదులుతోంది. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది తొలి రెండు నెలల్లో(జనవరి, ఫిబ్రవరి) కంపెనీ చూపిన వృద్ధి అంతర్గత పటిష్టతను చూపుతోంది. లాక్‌డవున్ తదుపరి పీవీసీ పైపుల పరిశ్రమలో కన్సాలిడేషన్‌కు దారిచూపవచ్చు. భవిష్యత్‌లో పరిశ్రమను మించి వేగవంత వృద్ధిని సాధించే వీలుంది. కంపెనీకున్న సామర్థ్యం రీత్యా మార్కెట్ వాటాను మరింత పెంచుకునే అవకాశముంది. రూ. 1100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఆస్ట్రల్ పాలీ షేరు 898 వద్ద ట్రేడవుతోంది. -ఎడిల్వీజ్ బ్రోకింగ్ -
చీకట్లో చిరుదివ్వెలు...
మన స్టాక్ మార్కెట్ ఈ ఏడాది ఎన్నడూ చూడనంత తీవ్రమైన ఒడిడుదుకులను చవిచూస్తోంది. ఆగస్టు వరకూ ఆకాశమే హద్దుగా చెలరేగి రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకిన దేశీ సూచీలు... ఆ తర్వాత హఠాత్తుగా కుప్పకూలి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం రూపంలో మార్కెట్లను తాకిన సునామీ దెబ్బకి బ్లూచిప్స్ షేర్లు కూడా 20–50 శాతం దాకా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లలో మరింత ఇన్వెస్ట్ చేయాలా? మార్కెట్లు కోలుకుంటాయా లేక బేరిష్ ధోరణిలోకి జారిపోతాయా? అన్న ప్రశ్నలు ఇన్వెస్టర్లను తొలిచేస్తున్నాయి. అంతంతమాత్రం రుతుపవనాలు, ఎన్నికల సీజన్, భయపెడుతున్న వాణిజ్య, ద్రవ్య లోటులు, క్రూడ్ ధరల జోరు, బలహీన రూపాయి, వాణిజ్య యుద్ధ మేఘాలు మొదలైన అంశాలు కలవరపెడుతున్నాయి. అదే సమయంలో వినియోగం పెరుగుతుండటం, ఇన్ఫ్రా.. వ్యాపారాలు మెరుగుపడుతుండటం, పట్టణీకరణ, ఉద్యోగాల కల్పన పెరుగుతుండటం తదితర అంశాలు ఈక్విటీ మార్కెట్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దీపావళి సందర్భంగా బ్రోకింగ్ సంస్థలు కొన్ని ఆశావహ షేర్లను సూచిస్తున్నాయి. మార్కెట్లు మరింత బలహీనపడినా మిగతా వాటితో పోలిస్తే ఇవి కొంత స్థిరంగా ఉంటాయన్నది వాటి అభిప్రాయం. వచ్చే దీపావళి టార్గెట్‌గా నిపుణులు సూచిస్తున్న పటాకా షేర్లు మీకోసం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అపోలో హాస్పిటల్స్: ప్రస్తుత ధర: రూ. 1,151 టార్గెట్ ధర: రూ. 1,368 బహుముఖ హెల్త్‌కేర్ డెలివరీ వ్యాపార విధానాలతో తన రంగంలో అగ్రగామి స్థానంలో ఉంది. ఆస్పత్రుల విస్తరణ, వాటి నుంచి వచ్చే ఆదాయాలు, వృద్ధి అవకాశాలు మెరుగుపడుతుండటం, నిర్వహణ నష్టాలు తగ్గుతుండటం కంపెనీకి సానుకూలం. ప్రస్తుత ధర దగ్గర తీసుకోవచ్చు. ఒకవేళ తగ్గిన పక్షంలో రూ. 974–982 దాకా మరికొన్ని షేర్లను జోడించుకోవచ్చు. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 769 టార్గెట్ ధర: రూ. 817 జనరేటర్లలో ఉపయోగించే డీజిల్ ఇంజిన్లను తయారు చేసే అమెరికన్ కంపెనీకి భారత్‌లో అనుబంధ సంస్థ ఇది. ఎనిమిది తయారీ కేంద్రాలు ఉన్నాయి. పారిశ్రామిక, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటుండటం ఈ సంస్థకు సానుకూలాంశాలు. వ్యయ నియంత్రణ చర్యలు, కొత్త ఉత్పత్తులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటుండటం తదితర అంశాలు కమిన్స్‌కు లాభించనున్నాయి. స్టాక్ తగ్గిన పక్షంలో రూ. 597–605 మధ్యలో మరికొన్ని కొనుగోలు చేయొచ్చు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ధర: రూ. 2,422 టార్గెట్ ధర: రూ. 2,952 దేశీ ఫార్మా దిగ్గజాల్లో ఒకటి. దువ్వాడ ప్లాంటుకు సంబంధించి ఎఫ్‌డీఏ అభ్యంతరాల పరిష్కారం; సుబాక్సోన్, నువారింగ్, కొపాక్సోన్ ఉత్పత్తుల వివాదాలను పరిష్కరించడం కీలకం కానున్నాయి. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆశావహ దేశీ, అమెరికాయేతర మార్కెట్లు ఆదాయాల వృద్ధికి దోహదపడగలవు. చైనా మార్కెట్లోకి విస్తరించడం, దేశీ బ్రాండెడ్ మార్కెట్లో టాప్–10 (ప్రస్తుతం 16వ స్థానం)లోకి చేరుకోవడం కంపెనీ లక్ష్యాలుగా పెట్టుకుంది. షేరు తగ్గిన పక్షంలో రూ. 2,210–2,230 దాకా మరిన్ని కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 354 టార్గెట్ ధర: రూ. 411 ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం. నాయకత్వపరమైన ఒత్తిళ్లు సద్దుమణుగుతుండటం, అసెట్ క్వాలిటీని.. రుణ వృద్ధి, ఆదాయాలను మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా స్టాక్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫలితంగా అనలిస్టులు, ఇన్వెస్టర్లు ఈ షేరు వైపు మళ్లీ చూడొచ్చు. ప్రస్తుత రేటు దగ్గర కొన్నతర్వాత ఒకవేళ తగ్గితే రూ. 290–295 దాకా మరిన్ని కొనుగోలు చేయొచ్చు. సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) ప్రస్తుత ధర: రూ. 619 టార్గెట్ ధర: రూ. 748 ఐటీ ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న సంస్థ. క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, సరైన సమయానుకూలమైన కొనుగోళ్లతో ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చు కుంటూ ఉండటం, తక్కువ రుణభారంతో పటిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండటం కంపెనీకి సానుకూల అంశాలు. పలు డీల్స్ చర్చల దశల్లో ఉన్నాయి. ప్రస్తుత ధర వద్ద దీన్ని కొనవచ్చు. తగ్గితే రూ. 545–555 దాకా మరిన్ని కొనుగోలు చేయొచ్చు. ఆనంద్ రాఠీ ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ధర: రూ. 1,246 టార్గెట్ ధర: రూ. 1471 పట్టణీకరణ వేగవంతంగా జరుగుతుండటం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతుండటం, అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంవైపు ప్రజలు మళ్లుతుండటం మొదలైన అంశాలు ఏషియన్ పెయింట్స్‌కు సానుకూలాంశాలు. మార్కెట్ లీడర్ అయిన ఏషియన్ పెయింట్స్‌కు విస్తృతమైన నెట్వర్క్ కూడా ఉంది. దీంతో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,947 టార్గెట్ ధర: రూ. 2,420 ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధన పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రైవేట్ బ్యాంకులకు అపార అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ షేరును పెంచుకునేందుకు, బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో మరింత వృద్ధికి ఈ సంస్థకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ. 1,674 టార్గెట్ ధర: రూ. 2,042 తయారీ తదితర రంగాలన్నింటిలోనూ డిజిటల్ సాంకేతికత వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఇలాంటి సర్వీసులకు డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా సొల్యూషన్స్ అందించే ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ లబ్ధి పొందే అవకాశం ఉంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రస్తుత ధర: రూ. 352 టార్గెట్ ధర: రూ. 406 దేశీ ఉక్కు మార్కెట్, ఆదాయాలు మెరుగుపడుతుండటం ఈ సంస్థకు సానుకూలాంశం. అలాగే ఇన్ఫ్రా రంగం నుంచి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుని, వ్యయాలను నియంత్రించుకుని, నిర్వహణను మెరుగుపర్చుకునేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వగలవని అంచనా. సుందరం ఫాసెనర్స్ ప్రస్తుత ధర: రూ. 531 టార్గెట్ ధర: రూ. 760 పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 200–300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఇంద్రప్రస్థ గ్యాస్ ప్రస్తుత ధర: రూ. 282 టార్గెట్ ధర: రూ. 319 దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణ కాలుష్య నివారణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఆంక్షల నేపథ్యంలో పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఇలాంటి అంశాలు ఇంద్రప్రస్థ గ్యాస్‌కు సానుకూలంగా తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. సెంట్రమ్ వెల్త్ కేర్ రేటింగ్స్ ప్రస్తుత ధర: రూ. 1,067 దేశీయంగా రెండో అతి పెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇది. గత కొన్నాళ్లుగా అధిక లాభాల మార్జిన్లతో రేటింగ్స్ వ్యాపారం లాభసాటిగానే ఉంటోంది. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ తదితర సంస్థలకు క్రెడిట్ రేటింగ్‌ల అవసరం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో రుణ కార్యకలాపాలు మందగించే అవకాశం మొదలైన వాటితో రేటింగ్స్ సంస్థలకు కొంత ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. కానీ మొత్తం మీద రుణ వృద్ధి మెరుగుపడుతుండటం, పటిష్టమైన క్లయింట్స్ పోర్ట్‌ఫోలియో వంటి అంశాలు కేర్‌కు సానుకూలమైనవిగా భావించవచ్చు. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) ప్రస్తుత ధర: రూ. 239 షేర్లను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపర్చుకునేందుకు, సెక్యూరిటీస్ లావాదేవీల నిర్వహణకు అనువైన సర్వీసులను అందిస్తోంది. తన విభాగంలో అగ్రగామిగా ఉంది. పోటీ సంస్థకు 276 మంది డిపాజిటరీ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉండగా.. సీడీఎస్ఎల్కు ఏకంగా 594 మంది డీపీలు ఉన్నారు. 2017–18లో లాభంలో దాదాపు 19 శాతం వృద్ధి సాధించింది. సెక్యూరిటీలు కాకుండా ఇతర పెట్టుబడి సాధనాల వైపు ఇన్వెస్టర్లు మళ్లే అవకాశాలు, టెక్నాలజీపై అధికంగా ఆధారపడటం, నియంత్రణ సంస్థలపరమైన రిస్కులు ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుండటం సానుకూలాంశం.. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ధర: రూ. 387 లాభసాటిగా ఉన్న కొద్ది లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఇది కూడా ఒకటి. టాప్ 5 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితాలో ఇది కూడా ఉంది. ప్రధానంగా బ్యాంకెష్యూరెన్స్ తదితర విధానాల్లో పాలసీల విక్రయం ఉంటోంది. అయితే, బ్యాంకెష్యూరెన్స్ విధానాల్లో ప్రతికూల మార్పులేమైనా చోటు చేసుకున్న పక్షంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో తీవ్రమైన పోటీ కూడా కంపెనీపై ప్రభావం చూపొచ్చు. కానీ, అసెట్ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, వైవిధ్యమైన విక్రయ విధానాలు ఈ సంస్థకు సానుకూలాంశాలు. జాగరణ్ ప్రకాశన్ ప్రస్తుత ధర: రూ. 107 దినపత్రికలు మొదలుకుని ఎఫ్ఎం రేడియో, డిజిటల్ మీడియా తదితర విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 13 రాష్ట్రాల్లో 5 భాషల్లో 8 దినపత్రికలను ప్రచురిస్తోంది. అత్యధిక ప్రజాదరణ ఉన్న దైనిక్ జాగరణ్, 7 కోట్ల పైగా రీడర్షిప్ ఊతంతో టాప్‌లో ఉంది. ప్రింట్‌తో పోలిస్తే అధిక మార్జిన్లు ఉండే రేడియో విభాగం ఆదాయాలు పెరుగుతున్నాయి. అలాగే న్యూస్‌ప్రింట్ ధరలు కాస్త దిగి వస్తుండటం కూడా సంస్థకు సానుకూల అంశాలు. ద్వితీయార్థంలో ఎన్నికల నేపథ్యంలో బడా సంస్థల నుంచి ప్రకటనలు పెరగొచ్చని, తద్వారా ఆదాయాలు మెరుగుపడొచ్చని అంచనా. పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర: రూ. 988 అడ్హెసివ్స్, సీలెంట్స్, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాలు మొదలైన వాటిని పిడిలైట్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేస్తోంది. కన్జూమర్ ఉత్పత్తులు (ఆదాయంలో 84 శాతం వాటా), పారిశ్రామికోత్పత్తులు (15 శాతం), ఇతరత్రా ఉత్పత్తుల (1 శాతం) విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. దేశీయంగా 23 ప్లాంట్లు, 3 ఆర్అండ్డీ సెంటర్లు ఉన్నాయి. 80 పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. డీమోనిటైజేషన్, జీఎస్టీ ప్రభావాలు తగ్గుతుండటం, దేశీయంగా డిమాండ్ పెరుగుతుండటం సంస్థకు సానుకూలాంశాలు. కొన్ని ప్రతికూలతలు ఉన్నా.. మార్కెట్ లీడర్‌గా కొనసాగుతుండడం గమనార్హం. -
ట్రేడింగ్ వేళల పెంపుపై సందిగ్ధత
ముంబై: ట్రేడింగ్ వేళలను పదిహేను గంటల దాకా పొడిగించేందుకు స్టాక్ ఎక్సే ్చంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ అనుమతించినప్పటికీ .. అది ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో సాధ్యపడేలా కనిపించడం లేదు. బ్రోకింగ్ సంస్థలు ఇంత సుదీర్ఘ ట్రేడింగ్ వేళలకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఎకాయెకిన 15 గంటలు కాకుండా ముందుగా 12 గంటల పాటు అమలు చేసి .. ఆ తర్వాత మార్కెట్ స్పందనను బట్టి పొడిగించవచ్చన్నది బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. ట్రేడింగ్ వేళల పొడిగింపుపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈ మరికొన్ని వారాల్లో తమ తమ ప్రణాళికలను సెబీకి సమర్పించనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈక్విటీ క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్స్‌కి సంబంధించి స్టాక్ ఎక్సే ్చంజీల్లో ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 3.30 గం. దాకా ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. రోజంతా నడిచే అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసే ఉద్దేశంతో దేశీయంగా ట్రేడింగ్ వేళలను పెంచాలని సెబీ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గతంలో క్యాష్ మార్కెట్ల సమయాన్ని సాయంత్రం 5 గం. దాకా పొడిగించుకునేందుకు ఎక్సే ్చంజీలకు అనుమతించినప్పటికీ పలు కారణాలతో అవి అమలు చేయలేదు. అయినప్పటికీ.. తాజాగా డెరివేటివ్స్ విభాగం ట్రేడింగ్‌ను రాత్రి 11.55 గం. దాకా పొడిగించుకునేందుకు ఈ ఏడాది మేలో స్టాక్ ఎక్సే ్చంజీలను అనుమతించిన సంగతి తెలిసిందే. ఆయా ఎక్సే ్చంజీల సంసిద్ధతను బట్టి అక్టోబర్ 1 నుంచి కొత్త వేళలు అమల్లోకి రావాల్సి ఉంది. బ్రోకింగ్ సంస్థల అభ్యంతరాలివి.. ట్రేడింగ్ పరిమాణం ఎంత స్థాయిలో ఉంటుందో తెలియకుండా .. ముందు నుంచే అర్ధరాత్రి దాకా వేళలను పొడిగించడం సరికాదని బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. వేళల పొడిగింపు ప్రతిపాదన ముఖ్యంగా చిన్న సంస్థలను కలవరపరుస్తోంది. దీనికోసం అదనంగా సిబ్బందిని తీసుకోవాల్సి రానుండటం, ఫలితంగా నిర్వహణ వ్యయాలు పెరగనుండటం వాటికి ఆందోళన కలిగిస్తోంది. బ్రోకరేజి సంస్థలు ప్రతి రోజు ట్రేడింగ్ వేళలను ముగిసిన తర్వాత స్టాక్ ఎక్సే ్చంజీలకు అసంఖ్యాకంగా నివేదికలను పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం బోలెడు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ అర్ధరాత్రి దాకా ట్రేడింగ్‌ను అనుమతించిన పక్షంలో తెల్లవారి మార్కెట్ ప్రారంభమయ్యేలోగా ఈ పనులన్నీ పూర్తి చేయడం కష్టసాధ్యమైన విషయం. రాత్రి వేళ ముఖ్యంగా 9 దాటిన తర్వాత ట్రేడింగ్ పరిమాణం ఎలా ఉంటుందనేది అటు స్టాక్ ఎక్సే్చంజీలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. దీంతో అర్ధరాత్రి 11.55 గం. దాకా కాకుండా రాత్రి 8 గం. లేదా 9 గం. దాకా మాత్రమే ట్రేడింగ్ వేళలను పొడిగించేలా ప్రతిపాదనలు ఇచ్చే యోచనలో ఉన్నాయవి. ఒకవేళ ట్రేడింగ్ వాల్యూమ్స్ గణనీయంగా ఉన్న పక్షంలో ఆ తర్వాత దశలో వేళలను పొడిగించవచ్చని భావిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధనాలపైనా..: ట్రేడింగ్ వేళలను పొడిగించినా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వంటి కొన్ని సాధనాలనే అనుమతించడం శ్రేయస్కరమని బ్రోకింగ్ సంస్థలు లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లకు రిస్క్ మేనేజ్మెంట్ సాధనాలను అందుబాటులోకి తేవడమే సెబీ ఉద్దేశమైనప్పుడు.. ఇండెక్స్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ వంటి ప్రాథమిక హెడ్జింగ్ సాధనాల ట్రేడింగ్‌కు అనుమతిస్తే సరిపోతుందని బ్రోకింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటిదాకా ఎఫ్ఐఐలకే అనుకూలం.. డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్ వేళలను పెంచడం వల్ల దేశీ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకి రిస్కులను తగ్గించుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం అమలవుతున్న ట్రేడింగ్ వేళలు.. దేశీ సంస్థలతో పోలిస్తే విదేశీ సంస్థలకే ఎక్కువ అనుకూలంగా ఉంటున్నాయి. భారత్‌లో పరిమిత సమయంపాటే ట్రేడయ్యే దేశీ సూచీలు ఎస్‌జీఎక్స్, సీఎంఈ వంటి అంతర్జాతీయ ఎక్సే ్చంజీల్లో మాత్రం రోజంతా ట్రేడవుతూనే ఉంటాయి. దీంతో భార త్లో ట్రేడింగ్ వేళలు ముగిసిన తర్వాత అకస్మాత్తుగా ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే సదరు రిస్కుల నుంచి పోర్ట్‌ఫోలియోలను హెడ్జింగ్ చేసుకునేందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) ఎక్కువ వెసులుబాటు ఉంటోంది. -
త్వరలో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ విధివిధానాలు
♦ బ్రోకింగ్ కమీషన్లపై నియంత్రణ తీసేయలేం ♦ 2025కి 4 లక్షల కోట్లకు సాధారణ బీమా ♦ ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా బ్రోకింగ్ కంపెనీలకు ఇచ్చే కమీషన్లపై నియంత్రణలను తొలిగించే ఆలోచన లేదని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏ) స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం ఇస్తున్న కమీషన్లపై వున్న పరిమితిని పెంచే యోచనలో ఉన్నామని, దీనికి సంబంధించి బ్రోకర్లతో కలసి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 12వ ఇన్సూరెన్స్ బ్రోకర్ల సమావేశానికి విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంరక్షణను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కమీషన్లు తీసుకునే అవకాశాన్ని కల్పించలేమన్నారు. కమీషన్లు అధికంగా పెంచడంవల్ల మొత్తం వ్యాపారమే దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. కానీ ఇక నుంచి ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కో కమీషన్ రేటును నిర్ణయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నాయని, మార్చిలోగా తుది బ్రోకరేజ్ నిబంధనలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. గరిష్టంగా 15 శాతం వరకు కమీషన్ తీసుకోవడానికి అనుమతిస్తూ నిబంధనలు ఉండే అవకాశం ఉందని సూత్రప్రాయంగా వెల్లడించారు. అంతకుముందు విజయన్ ఎర్నెస్ట్ యంగ్ విడుదల చేసిన విజన్ 2025 నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐబీఏఐ ప్రెసిడెంట్ సంజయ్ కేడియా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కమీషన్ల రేట్లపై పరిమితులు ఉండకూడదని, వీటిని మార్కెట్ రేట్లకే వదిలిపెట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఐఆర్‌డీఏని కోరారు. ప్రస్తుతం సాధారణ బీమా వ్యాపారంలో 27% బ్రోకింగ్ సంస్థల నుంచే వస్తోం దని, ఇది వచ్చే పదేళ్లలో 40 శాతం చేరుతుందన్నారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం వచ్చే పదేళ్లలో దేశీయ సాధారణ బీమా వ్యాపారం రూ. 83,048 కోట్ల నుంచి రూ. 4,00,000 కోట్లకు చేరుతుందని, ఈ విధంగా చూస్తే బ్రోకింగ్ వ్యాపారం రూ. 20,000 కోట్ల నుంచి రూ. 1.60 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ఐఆర్‌డీఏని కోరినట్లు తెలిపారు.