Incredible
-
ఒళ్లు గగుర్పొడిచే తెలుగోడి విన్యాసం : శిక్షణ లేకుండా, ఎవరూ ట్రై చేయొద్దు!
సామాన్య వ్యక్తినుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన 'డ్రిల్ మ్యాన్' గుర్తు ఉన్నాడా? అబ్బరపరిచే సాహస విన్యాసాలకు మారుపేరు ఈ డ్రిల్ మ్యాన్. తాజాగా మరో ఒళ్లు గుగుర్పొడిచే సాహసంతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడు. ఆ సాహసం పేరే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అలియాస్ డ్రిల్‌మ్యాన్.57 విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్ల నాలుకతో ఆపి, ఇన్క్రెడిబుల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం ఒకే ఒక్క నిమిషాంలో ఈ ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అసాధారణమైన టైటిల్ కోసం అద్భుతమైన ప్రయత్నం డ్రిల్‌మ్యాన్ సాహసం ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపివేసి దృశ్యం ప్రేక్షకులను అబ్బురపర్చింది. ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూడటం అక్కడున్న ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల వంతైంది. 60 సెకన్లు గడిచిన తర్వాత, లో షో డీ రికార్డ్ అనౌన్సర్ "ఆపు" అనేంత వరకు ఆయన ప్రయత్నం కొనసాగింది. ఈ విషయంలో గతంలో తాను సృష్టించిన రికార్డును తానే అధిగమించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఫీట్‌ను మరోసారి నిర్ధారించుకున్న న్యాయనిర్ణేతలు డ్రిల్మాన్కు సర్టిఫికేట్ అందించారు. ఈ టైటిల్‌ను సాధించిన తర్వాత డ్రిల్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.2024లో అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపగలరు అన్న టాస్క్‌లో నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపి రికార్డు సాధించాడు. అంతేనా రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపాడు. ఇదే కత్తికి కట్టిన తాడు సాయంతో 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనాన్ని ఐదు మీటర్లు లాగాడు. ఇందులో ఎనిమిది మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అరవై సెకన్లలో నాలుగు అంగుళాల 22 మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీశాడు. ఇతగాడి జైత్రయాత్ర ఇంకా ఉంది. సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం అనేఫీట్లో. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను తీసి గిన్నిస్ రికార్డులను సృష్టించాడు . ఇలా గతంలోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచాడు క్రాంతి కుమార్. తాజా ఫీట్‌తో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.Most electric fan blades stopped using the tongue in one minute 👅 57 by Kranthi Drillman 🇮🇳 pic.twitter.com/dsH8FULHxW— Guinness World Records (@GWR) January 2, 2025 -
రూ. 5,000 కోట్ల ఏయూఎం లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు–మూడేళ్లలో రూ. 5,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) సాధించాలని నిర్దేశించుకున్నట్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఇన్‌క్రెడ్‌మనీ సీఈవో విజయ్ కుప్పా తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1,250 కోట్ల స్థాయిలో ఉందని, సుమారు రెండు లక్షల మంది యూజర్లు ఉన్నారని వివరించారు. వచ్చే రెండేళ్లలో బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నామని, ఇప్పటికే లైసెన్స్ కూడా పొందామని ఆయన తెలిపారు. దేశీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పాన్కార్డ్హోల్డర్ల సంఖ్య 6–7 కోట్ల స్థాయిలో ఉండగా వచ్చే పదేళ్లలో ఇది 20 కోట్లకు చేరే అవకాశం ఉందని విజయ్ చెప్పారు. ప్రజలు క్రమంగా పొదుపు నుంచి ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లుతుండటం ఇందుకు దోహదపడగలదని ఆయన వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వారి కోసం 24 ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయని విజయ్ చెప్పారు. బాండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడుల మేళవింపుతో ఒకవైపు పెట్టుబడి భద్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు అధిక రాబడులను కూడా అందించే విధంగా ఈ ప్రోడక్టులు ఉంటాయని ఆయన తెలిపారు. -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్‌తో ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్‌లను దక్కించుకుంది. -
సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!
సడన్‌గా చూస్తే.. సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోంది కదూ.. నిజానికిది పూర్తిగా కట్టేసిన బిల్డింగ్.. దీని డిజైనే అంత.. ఇలాంటి వింత డిజైన్ సృష్టికర్త నెదర్లాండ్స్‌కు చెందిన ఎంవీఆర్‌డీవీ సంస్థ. ఆమ్స్టర్డంలో 75 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మూడు భవంతుల సముదాయాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. దూరం నుంచి అలా కనిపిస్తోంది గానీ.. దగ్గర్నుంచి చూస్తే.. దేనికది బ్లాక్స్లాగ కట్టినట్లు ఉంటుంది. అంతేకాదు.. వీటిపైనే ఎక్కడికక్కడ మొక్కలు, చెట్లను పెంచుతారట. మొత్తం 13 వేల రకాల మొక్కలు, చెట్లకుఇది నిలయంగా మారుతుందని చెబుతున్నారు. ఈ భవంతుల సముదాయంలో వాణిజ్య కార్యాలయాలతోపాటు 200 అపార్టుమెంట్లు, రూఫ్ గార్డెన్, స్కైబార్ ఉంటాయి. -
నీటిలో తేలియాడే కృత్రిమ దీవి
సాక్షి, న్యూఢిల్లీ : ఒకరు పనికి రాదని పడేసిన చెత్త, మరొకరికి విలువైనదిగా పనికొస్తుందంటే ఇదే! సముద్రపు ఒడ్డున పర్యాటకులు తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఫ్రెంచ్ కంప్యూటర్ ఇంట్రిప్రీనర్ ఎరిక్ బెకర్ ఏరుకున్నారు. వందలు కాదు, వేలు కాదు, అలా ఏడు లక్షల బాటిళ్లను ఏరి వాటితోని నీటి మీద తేలియాడే కృత్రిమ దీవిని నిర్మించారు. ముందుగా దానిపై తాను ఉండేందుకు ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ దీవిని కూడా ఎందుకు వ్యాపారానికి ఉపయోగించుకోకూడదని అనుకున్నారో, ఏమో! ఆ దీవిపై ఒక హోటల్‌ను, ఓ బార్‌ను, రెండు కృత్రిమ స్విమ్మింగ్ పూల్స్‌ను, రాత్రి బసకు రెండు మూడు షెడ్లను నిర్మించి పర్యాటకులకు స్వాగతం పలికారు. అంతే ప్రకతి ప్రేమికులు, పర్యావరన పరిరక్షణ కార్యకర్తలు, ప్లాస్టిట్ వేస్ట్‌ను ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు కృత్రిమ దీవికి క్యూలు కట్టారు. ఈ దీవిపై ఒక రోజు గడపడానికి వంద డాలర్లు వసూలు చేస్తున్నారు. ఈ దీవిపై ఆకర్షణీయంగా చెట్లు, పొదలను కూడా పెంచారు. ఈ దీవి వెయ్యి చదరపు మీటర్లు ఉంటుంది. పర్యాటకులు దీనికి పడవపైనే రావాల్సి ఉంటుంది. ఊరికే పగలు చూసి పోవడానికైతే 25 డాలర్లు వసూలు చేస్తారు. రాత్రికి భోజనం, బస చేయాలంటే వంద డాలర్లు వసూలు చేస్తారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని అబిద్జాన్ పట్టణ శివారులో సముద్రం పక్కన నీటి మడుగులో ఈ కృత్రిమ తేలియాడే దీవిని నిర్మించారు. వారానికి వంద మంది పర్యాటకులు వస్తున్నారని, వారితో తనకు అంతో ఇంతో డబ్బు రావడమే కాకుండా, ప్లాస్టిక్ వేస్టేజ్‌ని కొంతైనా సద్వినియోగం చేశానన్న సంతప్తి ఉందని ఆయన ఏఎఫ్‌పీ మీడియాతో వ్యాఖ్యానించారు. -
సిసలైన సమ్మర్ సీజన్!
‘బ్లాక్‌పాంథర్’ వచ్చి సూపర్ హిట్ అయింది. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ రిలీజయి బ్లాక్‌బస్టర్ అయింది. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. జూన్ వచ్చేసింది. తొలకరి పలకరించేసింది. ఇంకేం.. హాలీవుడ్ సినిమాల జోరు తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటే! హాలీవుడ్ అసలు సిసలు హంగామా ఇప్పుడే మొదలవుతుంది. జూన్ నెల్లోనే. అమెరికాలో సమ్మర్ సీజన్ జూన్‌లో మొదలై ఆగష్టు చివరి వారం వరకూ ఉంటుంది. సమ్మర్లో మొదటి నెలైన జూన్‌లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలు హంగామా చేస్తాయి. ఈ జూన్‌లో ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’, ‘ఇంక్రెడిబుల్స్ 2’, ‘ఓషన్స్ 8’ లాంటి భారీ అంచనాలున్న సినిమాలు విడుదలవుతున్నాయి.. జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్ 2001తో ‘జురాసిక్ పార్క్’ కథ ముగిసింది. అప్పటికి ఇండియన్ సినిమాకు హాలీవుడ్ వచ్చిందంటే అది ‘జురాసిక్ పార్క్’ సిరీస్ వల్లనే! జురాసిక్ పార్క్ కథ ముగిశాక మళ్లీ దాన్ని కొత్తగా పరిచయం చేయాలన్న ఆలోచనతో పుట్టిందే ‘జురాసిక్ వరల్డ్’. 2015లో జురాసిక్ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మొదటి సినిమా వచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు సినిమాలు ప్లాన్ చేశారు. ఇప్పుడు జూన్ 7న మన ముందుకు వస్తోంది రెండో భాగం. పేరు ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’. అమెరికా కంటే రెండు వారాల ముందు ఇండియాలో విడుదలవుతోంది. ‘‘మీరిప్పటి వరకూ చూసిన డైనోసర్లు ఒక ఎత్తు. ఈ సినిమాలో చూసే డైనోసర్లు మరో ఎత్తు’’ అంటున్నాడు చిత్రదర్శకుడు జె.ఎ.బయోనా. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ భావిస్తోంది. ఇండియాలో హాలీవుడ్ సినిమా రికార్డులను ఫాలెన్ కింగ్డమ్ తిరగరాస్తుందని అందరూ భావిస్తున్నారు. పిల్లలకు ఈ సినిమా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లస్ హోవార్డ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇన్‌క్రెడిబుల్స్ 2 2004లో వచ్చిన ‘ది ఇన్‌క్రెడిబుల్స్’ గుర్తుంది కదా. ఈ కంప్యూటర్ యానిమేటెడ్ సూపర్ హీరో ఫిల్మ్‌కు అప్పట్లో కాసుల వర్షం కురిసింది. సూపర్ హీరో జానర్లో ఈ ప్రయోగానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘ఇన్‌క్రెడిబుల్స్ 2’. మన సూపర్ హీరోలు మిష్టర్ ఇన్క్రెడిబుల్, ఎలాస్టిగర్ల్ చేసే హంగామా ఈ సీక్వెల్లో మామూలుగా ఉండదట. ట్రైలర్ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. జూన్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఓషన్స్ 8 స్టీవెన్ సోడర్బర్గ్ ‘ఓషన్స్’ సిరీస్‌కు రీబూట్ ఈ ‘ఓషన్స్ 8’. జూన్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గ్యారీ రోస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా హాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. ఆద్యంతం అదిరిపోయే థ్రిల్స్‌తో సాగుతుందట. జైలు నుంచి బయటికొచ్చాక సింపుల్ లైఫ్ బతుకుతానని చెప్పి, ఓషన్ అతిపెద్ద రాబరీలు చేస్తూ ఉంటుంది. ఈ కథ ఏయే మలుపులు తిరుగుతుందన్నది సినిమా. ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా సాగిపోయే ఈ సినిమాలో సాండ్రా బుల్లక్ రోల్, ఆమె యాక్టింగ్ మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయని టాక్. ఈ మూడు సినిమాలూ హాలీవుడ్ సమ్మర్‌కు గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తాయని ట్రేడ్ భావిస్తోంది. ఏయే సినిమాలు ఎలా ఆడతాయో చూడాలి మరి!! . -
విమానం కన్నా వేగంగా రైలులో...
లాస్ వెగాస్: విమానంకన్నా వేగంగా రైల్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారా? వినూత్న ఆవిష్కారంతో హైపర్ లూప్ మార్గం.. ఇప్పుడు మీకు అందుబాటులోకి రానుంది. గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో.. విస్మయపరిచే ప్రయాణ అనుభవాన్ని మీకు అందిచనుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి వస్తోంది. 1100 కిలోమీటర్ల విమానానికి మించిన వేగంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. హైపర్ లూప్ సంస్థ దీనికి సంబంధించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ వెగాస్ ఎడారి ప్రాంతంలో హైపర్ లూప్ టెక్నాలజీస్ కి సంబంధించిన హైపర్ లూప్ వన్ మొదటిసారి తమ కొత్త రవాణా సిస్టమ్ పై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్... లారెన్స్ లివేర్మోర్ నేషనల్ లాబొరేటరీ నుంచి ఇండక్ ట్రాక్ పేరిట తన నూతన ఆవిష్కారానికి సాంకేతిక లైసెన్సును కూడ పొందింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే హైపర్ లూప్ స్వంత ఆవిష్కారం త్వరలో మనముందు సాక్షాత్కరించి, అత్యంత వేగవంతమైన మార్గాన్ని సుగమం చేయనుంది. -
బాధితులకు సృజనాత్మక సహాయం!
మనసుంటే మార్గం దొరుకుతుందంటారు. తమిళనాడులో వర్షం, వరద బాధితులను జనం ఆదుకుంటున్న తీరు చూస్తే సరిగ్గా అదే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతి త్వరగా బాధితులను ఎలా ఆదుకోవచ్చన్న విషయాన్ని ఆలోచించి ఆ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. కొందరు డబ్బు, ఆహారం వంటివి అందిస్తుంటే...మరి కొందరు ఉడతాభక్తిగా తమ సృజనను ఉపయోగించి, స్వచ్ఛందంగా సహాయపడుతున్నారు. వరద ముప్పు నుంచి బాధితులను ఒడ్డున పడేయడమే కాక... సౌకర్యాలను కల్పించి ఆదుకుంటున్నారు. ఇళ్ళలోసైతం నీరు చేరిన పరిస్థితుల్లో వారిని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం, ఇతర సంస్థలు పడవలను అందుబాటులోకి తెచ్చినా... అవి లేని ప్రాంతాల్లో స్థానికంగా, సులభంగా దొరికే డ్రమ్ములు, వెదురు కర్రలను వినియోగించి కొందరు సాయపడుతున్నారు. ఇళ్లు కూలి ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకోడానికి వారికి వెదురుతో గుడిసెలు కట్టి పునరావాసం కల్పిస్తున్నారు. గూడు కోల్పోయి రోడ్డున పడ్డవారికి 'సేలం సిటిజెన్స్ ఫోరమ్' ఈ వెదురు ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది. 96 చదరపు అడుగుల వైశాల్యం, సోలార్ లైట్లతో నిర్మించే ఈ ఇంట్లో నలుగురు నివాసం ఉండొచ్చు. అలాగే కరెంటు అందుబాటులో లేని ప్రదేశాల్లో.. ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేక మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఛార్జింగ్ చేసేందుకు కొందరు తమ సృజనను వినియోగిస్తున్నారు. సిల్వర్ నాణేలు, బ్యాటరీలు అందుబాటులోకి తెచ్చి మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నారు. అలాగే చీకట్లో దీపాలుగా కొవ్వొత్తులకు బదులు క్రేయాన్స్ స్టిక్స్ ను అందిస్తున్నారు. ఇవి కనీసం ఇరవై నిమిషాలపాటు నిలకడగా వెలగడంతో బాధితులకు తక్షణ అవసరం తీరుతోంది. మరోవైపు వరద కారణంగా ఎటువంటి ఇన్ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ముందుజాగ్రత్తగా ఔషధ మూలికలు, ఆకులతో తయారుచేసిన సిద్ధ వైద్యానికి సంబంధించిన నీలవెంబు కషాయాన్నిబాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక బ్యాంకుల్లో బ్యాలెన్సులున్నా డబ్బు తీసుకునేందుకు ఏటీఎంలు పనిచేయక ఇబ్బందులు పడుతున్న వారి కోసం కొన్ని బ్యాంకులు మొబైల్ ఏటీఎంలను ఏర్పాటుచేశాయి. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతూ అవసరానికి డబ్బును అందిస్తున్నాయి. -
ఐకమత్యమే కాపాడింది!
ఐకమత్యమే మహా బలము అనే సామెత మనకు తెలిసిందే. సౌతాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో జరిగిన ఘటన ఇప్పుడా ఆ సామెతను నిజం చేస్తోంది. కలిసి పనిచేయగలగడం (టీమ్ వర్క్) సత్ఫలితాలనిస్తుందన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. పార్క్ లో సుమారు రెండు, మూడు నెలల వయసున్న ఏనుగు పిల్ల బురద మట్టిలో ఇరుక్కుంది. చిన్న వయసు కావడంతో ఎంత ప్రయత్నించినా బుజ్జి గున్న పైకి రాలేకపోయింది. తన బిడ్డను రక్షించుకునేందుకు తల్లి ఏనుగు తొండంతో, రెండు కాళ్ళతో లాగుతూ, ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ తల్లీ బిడ్డల కష్టాన్ని ఏనుగుల మందలోని మరో గజరాజు గమనించింది. సహాయం చేసేందుకు సంఘటనా స్థలానికి పరుగున వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న పెద్ద ఏనుగుతోపాటు రెండు ఏనుగులూ కలసి తొండాలను చుట్టి ఎట్టకేలకు చిన్నారి ఏనుగును బురద నుంచి సురక్షితంగా బయటకు లాగాయి. క్రుగేర్ పార్క్ లో కనిపించిన ఈ దృశ్యం... ఇప్పుడు సంఘటిత శక్తి సత్ఫలితాలనిస్తుందన్న మాటను నిరూపిస్తోంది. తల్లి ప్రేమనూ ప్రత్యక్షంగా ప్రతిబింబించింది. -
యూట్యూబ్ ను ఏలుతున్న 'ఎడ్వర్డా' బీట్స్...
లయబద్ధమైన బీట్.. ముఖంలో తొణకని విశ్వాసం.. ఆ చిన్నారి డ్రమ్స్ వాయించిందంటే సంగీత ప్రియులే కాదు...చూసినవారంతా అడుగులు కదపాల్సిదే... అప్పుడప్పుడే పాఠశాల మెట్లు ఎక్కాల్సిన ఐదేళ్ళ వయసులోనే ... ఆమె చేయి తిరిగిన ప్రజ్ఞను ప్రదర్శించింది. ఎటువంటి లోపాలు లేకుండా డ్రమ్స్ వాయిస్తూ, స్టేజ్ షోలు, టీవీ షోలతో దూసుకుపోతోంది. ఆణిముత్యంలా ఆకట్టుకుంటున్న ఆ బాల కళాకారిణి ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా ప్లే చేసిన వీడియోలు... ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రెజిల్.. జాయిన్విల్లే నగరంలో నివసించే ఆరేళ్ళ ఎడ్వర్డా తన బీట్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. ఇంతకు ముందే ఎన్నో లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ లో ప్రతిభను చాటిన బాలిక.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ సంవత్సరం క్రితం ఐదేళ్ళ అతి చిన్న వయసులో వాయిద్యాన్నిమొదలుపెట్టిన చిన్నారి... చేయి తిరిగిన విద్వాంసురాలిలా డ్రమ్స్ వాయించడం చూపరులను విస్మయ పరుస్తోంది. అతి సుతారంగా కర్రలు తిప్పుతూ చాకచక్యంగా బీట్స్ వేసే ఆమె... వాద్య పరికరాల వెనుక నవ్వుతూ నిలబడినట్లే కనిపిస్తుంది. ట్రాక్ తో పాటు గొంతెత్తి పాడుతూ శక్తివంతంగా తన పరాక్రమాన్ని చాటుతోంది. ప్రదర్శన ముగించే మూడు నిమిషాలకు ముందు ఈలలు, చప్పట్లతో ఆమెకు వచ్చే రెస్సాన్స్ ఓ ప్రముఖ విద్యాంసుడికి కూడా రాదేమో అనిపిస్తుంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూడటమే కాదు, ఎందరో ఆమెను అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ''నిజానికి ఓ ఐదేళ్ళ చిన్నారి ఇంత అద్భుతంగా డ్రమ్స్ వాయించడం ఆశ్చర్యపరుస్తోంది.", "డ్రమ్స్ వాయిస్తూ పాటను కూడ పాటడం నిజంగా ఆశ్చర్యం" అంటూ వచ్చిన కామెంట్లు ఇప్పుడు ఆమె ప్రతిభకు పట్టం కడుతున్నాయి. -
ఆమె చేతుల్లో అద్భుతాలు..
ఆమె... ప్రకృతి కళా రూపాలకు జీవాన్ని పోస్తోంది. అరచేతిలో అద్భుతాలు సృష్టిస్తోంది. శారీరక వైకల్యాన్ని అధిగమించి.. ఆశావహ ధృక్పధంతో ముందుకు సాగుతోంది. పెయింట్లు, డిజైన్లతో తన మనసులోని భావాలు ప్రతిబింబింపజేస్తూ.. ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఎందరో కళాభిమానుల మనసు దోచుకుంటోంది. చేతివేళ్ళపై చిత్రలేఖనంతో ఆకట్టుకుంటున్నఆమె పేరు... లంతా నాయకర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇరవై ఆరేళ్ళ ఆ కళాకారిణి.. తన ఎడమ చేతిలో జీవకళ ఉట్టిపడే త్రీడీ కళారూపాలను చిత్రిస్తూ ప్రత్యేతను చాటుతోంది. పుట్టుకతో చెవుడు సంక్రమించినా.. అధైర్య పడని.. ఆ డర్బన్ ఆర్టిస్ట్.. యాక్రిలిక్ రంగులు, జెల్ పెన్ లను ఉపయోగించి పలు చిత్రాలు, ప్రకృతి దృశ్యాలను అరచేతిలో సాక్షాత్కరింపజేస్తోంది. సీతాకోక చిలుకలు, బాతులు, గొరిల్లాలు వంటి విభిన్న చిత్రాలను గీసేందుకు ప్రత్యేక టెక్నిక్ ఉపయోగించి, నిజంగానే ఆమె చేతులో ఆ జంతువులు నిలబడ్డాయా అన్న సహజత్వాన్ని కల్పిస్తోంది. నీటిలో తేలే చేపలు.. సముద్ర జీవులు నాయకర్ చేతి ఉపతితలంపైనే తేలియాడుతున్న భావన కలుగుతుంది. కొత్త కోణంలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ.. ఆమె గీసే చిత్రాలు ఎందరో కళాకారులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. -
నలుగురు బాల నేరస్తులు పరారు
నిజామాబాద్: నిజామాబాద్‌లోని జువైనల్ హోం నుంచి నలుగురు బాల నేరస్తులు పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు బాధ్యులైన హెడ్ సూపర్వైజరు ప్రభాకర్, సూపర్వైజర్ నాగావేందర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హెడ్ సూపర్వైజర్, సూపర్వైజర్ ఈ నెల 2వ తేదీన సాయంత్రం బ్యారక్ తెరిచి లోపలకు వెళ్లారు. అదే సమయంలో వారి కళ్లుగప్పి ఓ బాల నేరస్తుడు బ్యారక్ నుంచి బయటికి వచ్చాడు. దీంతో సూపర్వైజర్లు బ్యారక్గేట్ను మూసివేయకుండానే బాలుడి కోసం వెతికేందుకు బయటికి వెళ్లారు. ఇదే అదనుగా బ్యారక్‌లోని మరో ముగ్గురు బాలనేరస్తులు కూడా తప్పించుకుని పోయారు. విషయం బయటకు పొక్కక ముందే బాలురను పట్టుకునేందుకు అధికారులు విఫలయత్నం చేశారు.