![Priyanka Chopra has shared a bunch of pictures from daughter Malti playdate - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/09/17/pryanka-2.jpg.webp?itok=m93f-Zvl)
దృశ్యం:1
ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్‌క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్‌తో ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు.
దృశ్యం: 2
అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్‌ల లైక్‌లను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment