నిజామాబాద్: నిజామాబాద్‌లోని జువైనల్ హోం నుంచి నలుగురు బాల నేరస్తులు పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు బాధ్యులైన హెడ్ సూపర్‌వైజరు ప్రభాకర్, సూపర్‌వైజర్ నాగావేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హెడ్ సూపర్‌వైజర్, సూపర్‌వైజర్ ఈ నెల 2వ తేదీన సాయంత్రం బ్యారక్ తెరిచి లోపలకు వెళ్లారు. అదే సమయంలో వారి కళ్లుగప్పి ఓ బాల నేరస్తుడు బ్యారక్ నుంచి బయటికి వచ్చాడు.
దీంతో సూపర్‌వైజర్లు బ్యారక్‌గేట్‌ను మూసివేయకుండానే బాలుడి కోసం వెతికేందుకు బయటికి వెళ్లారు. ఇదే అదనుగా బ్యారక్‌లోని మరో ముగ్గురు బాలనేరస్తులు కూడా తప్పించుకుని పోయారు. విషయం బయటకు పొక్కక ముందే బాలురను పట్టుకునేందుకు అధికారులు విఫలయత్నం చేశారు.
నలుగురు బాల నేరస్తులు పరారు
Published Sat, Feb 7 2015 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement