juvinal home
-
‘నన్ను మా దేశానికి పంపండి’
సాక్షి, హిమాయత్‌నగర్: ‘‘నన్ను చిన్నప్పుడే మద్రాస్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మా అమ్మ ఎలా ఉందో.. మా నాన్న ఎలా ఉన్నాడో.. ఇంత వరకు చూడలేదు. నన్ను శ్రీలంక పంపండంటూ’’ ఓ యువకుడు బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారు అడ్డుకుని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా జాయ్ మాట్లాడుతూ ‘‘మేము శ్రీలంక దేశం ఫిషర్ బోర్డ్ సమీపంలో నివాసం ఉండే వాళ్లం. నా ఆరేళ్ల వయస్సప్పుడు ‘ఎల్టీటీఈ’ ఉద్యమం జరిగిందని, ఆ అల్లర్లలో నేను తప్పిపోయి షిప్లో భారత దేశంలోని నాగాలాండ్‌కు వచ్చాను’’ అన్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి క్యాంప్‌లో ఉండకపోయే సరికి అరెస్ట్ చేసి మద్రాస్ జువైనల్ హోంలో ఉంచారని, తనకు 16 ఏళ్లు నిండాక హోం నుంచి బయటకు వచ్చానన్నాడు. మద్రాస్‌లోని ఓ చర్చి ఫాదర్ తనను కొంతకాలం చేర దీశాడని, ఆ తర్వాత ఢిల్లీ హైకమీషన్‌లోని శ్రీలంక ఎంబసీని కూడా కలిశానని అన్నాడు. వెళితేనే కదా గుర్తు పట్టేది.. ‘‘శ్రీలంక ఎంబసీ వాళ్లు అక్కడ ఎవరు ఉన్నారు అడ్రాస్ చెప్పు అంటున్నారు. 6 ఏళ్ల వయస్సుప్పుడు తప్పిపోయాను. అక్కడ అడ్రస్ చెప్పమంటే ఎలా చెబుతాను. నన్ను మా దేశానికి పంపించేస్తే నా తల్లిదండ్రులను కలుసుకుంటాను కదా. నన్ను ఎందుకిలా వేధిస్తున్నారు. నా ఫొటోను శ్రీలంక పత్రికల్లో వేసి అక్కడి వాళ్లకు సమాచారం ఇవ్వండి. నాకు సాయం చేసే వాళ్లు ఎవరైనా ఉంటారేమోనని అన్ని రాష్ట్రాలు తిరిగాను. నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు. ఫుట్‌పాత్‌ల మీద పడుకుని, అడుక్కుని తిని ఉండలేకపోతున్నాను. మా నాన్న, అమ్మ గుర్తుకు వస్తుంటే ఏడుపు ఆగట్లేదు. కమిషనర్ సార్‌ని కలిస్తే ఆయన పెద్ద వాళ్లతో మాట్లాడి నన్ను శ్రీలంక పంపిస్తారనే ఆశతో ఇక్కడకు వచ్చాను. లోపలికి వెళ్లనివ్వట్లేదని ధైర్యం లేకపోయినా ఇలా పెట్రోల్ పోసుకుని చచ్చిపోవడానికి ప్రయత్నించాను. దయచేసి నన్ను మా శ్రీలంకకు పంపేయండి’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. నచ్చచెప్పి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి జాయ్ విషయం చేరవేస్తున్నట్లు అడ్మిన్ ఎస్సై కర్ణాకర్ రెడ్డి తెలిపారు. చదవండి: నడి సంద్రంలో నాలుగు రోజులు, అంతా సేఫ్! -
బాలమిత్ర పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తాం
సాక్షి, విజయవాడ: జువైనల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననుండగా.. డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెబినార్ ద్వారా పాల్గొన్నారు. పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి గల కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేదానిపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. వీధి బాలలను రక్షించడం పోలీసుల విధి నిర్వహణలో భాగం అని స్పష్టం చేశారు గౌతమ్ సవాంగ్. (చదవండి: ఆ దాడి చేసింది టీడీపీ కార్యకర్తే) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అనేక మంది చిన్నారులకు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలమిత్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సెమినార్లో అనేక అంశాలు చర్చించాము. చర్చించిన ప్రతి అంశాన్ని పరిష్కారం అయే విధంగా చర్యలు తీసుకుంటాం అని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. -
సమాజం నా కుటుంబాన్ని వెలి వేసింది...
ముంబై : ‘నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను...కానీ కొందరు మాత్రం పదే పదే నా గతాన్ని గుర్తు చేస్తూ వారి నేరాలకు నన్ను బాధ్యుడ్ని చేయాలిని చూస్తున్నారు...ఎందుకంటే ఇదివరకే నేను ‘గ్యాంగ్ రేప్’ కేసులో నేరస్తుడిగా శిక్ష అనుభవించాను కాబట్టి...’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ‘శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్’ నేరస్తుల్లో ఒకడైన ఆకాశ్ జాధవ్. 2013లో శక్తిమిల్స్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ నేరంలో మైనర్ కావడంతో జువైనల్ హోంలో మూడు ఏళ్ల శిక్ష అనుభవించాడు ఆకాశ్. మహాలక్ష్మి ధోబి ఘాట్ ప్రాంతంలో నివసిస్తున్న ఆకాశ్ జాధవ్ 2013, జులై 31న తన స్నేహితులతో కలిసి ఓ పద్దేనిమిదేళ్ల యువతిపై శక్తి మిల్స్ కాంప్లెక్స్ ప్రాంతంలో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆకాశ్ వయసు 17 సంవత్సరాలు. దాంతో ముంబై జువైనల్ జస్టిస్ బోర్డు ఆకాశ్‌తో పాటు గ్యాంగ్ రేప్లో పాల్గొన్న మరో మైనర్ నేరస్తుడిని మూడేళ్ల పాటు ‘నాశిక్ బోర్స్టల్’ పాఠశాలకు పంపించింది. 2017, జులైలో వీరిద్దరు తమ శిక్షాకాలం ముగించుకుని బయటకు వచ్చారు. ఆకాశ్ నేరం చేసేముందు వరకూ అతని కుటుంబం మహలక్ష్మి ధోబి ఘాట్ ప్రాంతంలో నివసిస్తుండేది. కానీ ఆకాశ్ మీదం నేరం రుజువై, అతడు జువైనల్ హోమ్‌కు వెళ్లిన తర్వాత అతని కుటుంబం ఆ ప్రాంతంలో ఉండలేక కనైర్మార్గ్ ప్రాంతానికి వెళ్లారు. జువైనల్ హోం నుంచి బయటకు వచ్చిన ఆకాశ్ మాత్రం తాను గతంలో నివసించిన మహాలక్ష్మి ప్రాంతంలోని ‘సాత్ రస్తా’లోనే నివాసం ఉండాలని భావించి అక్కడే ఉంటున్నాడు. అక్కడ ఆకాశ్‌కు వ్యతిరేకంగా ఉండే మరి కొందరు ఆకాశ్ గతాన్ని గుర్తు చేస్తూ సూటిపోటి మాటలనడమే కాక...ఆ ప్రాంతంలో ఏ చిన్న నేరం జరిగిన ఆకాశ్‌ను అనుమానిస్తూ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా గతంలో ఆకాశ్ గ్యాంగ్‌రేప్ కేసులో జువైనల్ హోం కు వెళ్లి వచ్చాడు కాబట్టి ఈ నేరాలు కూడా చేసి ఉంటాడనే ఉద్ధేశంతో అతని మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 2017, జులై నుంచి 2018, మార్చ్ వరకూ ఆకాశ్ మీద హత్యాయత్నం, కిడ్నాప్, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి పలు నేరాలతో సంబంధం ఉన్నట్లుగా 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటి గురించి ఆకాశ్ ‘నా శత్రువులు కావాలనే నా మీద ఇలాంటి నేరారోపణలు చేస్తున్నారు. వారు పదేపదే నా గతాన్ని గుర్తు చేస్తూ నన్ను గేలి చేస్తున్నారు. నా మీద ఇంతకు ముందే రేప్ కేస్ ఉండటం వల్ల పోలీసులు కూడా వారి మాటలను నమ్ముతున్నార’న్నాడు. అంతేకాక ‘నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటుంటే నా శత్రువులు మాత్రం నన్ను బాధపెడుతునే ఉన్నారు. వారు నా మీద అసత్య ఆరోపణలు చేస్తుండటంతో నేను వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే ఒకరిని చితకబాదాన’న్నాడు. ‘సమాజం, ఈ ప్రపంచం...నన్నువెలి వేసినా నా కుటుంబం మాత్రం నాకు అండగా ఉంది. నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించాను...కాని సమాజం మాత్రం నా కుటుంబాన్ని, నన్ను ఇంకా శిక్షిస్తూనే ఉంది. నా చెల్లికి పెళ్లి కావడంలేదు. సమాజం నా కుటుంబాన్ని వెలివేసిం’దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
మృగాళ్ల పాపం : 11 ఏళ్లకే తల్లిగా..
రాజ్‌కోట్ : మహిళా దినోత్సవాలు, స్త్రీ సాధికారత మీద ఉపన్యాసాలు కేవలం అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి. ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పురాక నిర్భయలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజ్‌కోట్‌లో చోటు చేసుకున్న దారుణమే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే ఇరుగుపొరుగు ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే, ఆ అమ్మాయి పనిచేస్తున్న ఇళ్లల్లోని ఓ ఆరుగురు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. గత 9 నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. అయితే, నిజం చెబితే తనను ఏదైనా చేస్తారేమో అనే భయంతో ఆ బాలిక ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. అయితే, క్రమంగా బాలిక ఆరోగ్యంలో మార్పులు రావడం గుర్తించిన ఆమె తల్లి మార్చి 8న ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే 8 నెలల గర్భవతి అని నిర్దారణ అయింది. ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఆమె తల్లి ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు 60 ఏళ్ల వృద్దులతోపాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలిసింది. తల్లి క్షేమం.. చావుబతుకుల్లో చిన్నారి ఇదిలా ఉండగా, ఆ బాధిత బాలిక ఈ నెల 17న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలికను కాపాడటానికి సిజేరియన్ చేయాల్సి వచ్చిందని రాజ్‌కోట్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు కమల్ గోస్వామి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి క్షేమంగా ఉందని, ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. వెన్నెముక లోపం, పక్షవాతం రావడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆమె బతకాలి.. కానీ మాకొద్దు తమ బిడ్డ జన్మనిచ్చిన శిశువు బతకాలని కోరుకుంటున్నామని, అయితే, ఆ శిశువును మాత్రం తాము చేరదీయలేమని బాధితురాలి బంధువులు చెబుతున్నారు. -
పాచి పనికి పంపొద్దు..చదువుకుంటాను
ఓ బాలికకు ఇంటి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఓ చర్చి ఫాదర్, సమతా సొసైటీ సభ్యుల చొరవతో ఆమె పాచిపని భారం నుంచి బయటపడింది. తనకు పనిచేయాలని లేదని, చదువుకోవాలని ఉందని చెప్పడంతో రావికమతం ఎస్ఐ ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించారు. రావికమతం(చోడవరం): చాకిరీ నుంచి విముక్తి కల్పించండి, చదువుకుంటానని ఓ గిరిజన బాలిక వినతి మేరకు ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించినట్టు రావికమతం ఎస్ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జీకే వీధి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కొర్రా అనిత(14) తల్లి కొన్నాళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి వెంకటరావు మరో వివాహం చేసుకున్నాడు. ఆపై అనితను సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో నర్సీపట్నంలో ఏఎన్ంగా పనిచేస్తున్న అనిత మేనత్త సుబ్బలక్ష్మి ఆమెను నర్సీపట్నం తీసుకువచ్చి గాంధీ అనే ఒక లారీ డ్రైవర్ ఇంట్లో పాచి పనికి నియమించింది. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్న ఆ ఇంటి యజమానులు అనితను కొట్టడం, తిట్టడమే కాక మానసికంగా వేధించడంతో రెండు సార్లు అనిత ఇంటి నుంచి పరారైంది. మేనత్త మళ్లీ వెతికించి అక్కడే పనికి నియమించింది. అనిత మేనత్త సుబ్బలక్ష్మికి ఇటీవల డుంబ్రిగుడకు బదిలీ కాగా, అనితను అక్కడే వదిలి ఆమె వెళ్లిపోయింది. అయితే ఇంటి యజమాని పెట్టే బాధలు భరించలేని అనిత బుధవారం పారిపోయి రావికమతం వచ్చి ఒక చర్చి ఫాదర్‌ను ఆశ్రయించింది. ఆయన స్థానికంగా ఉన్న ఏపీ మహిళ సమత సొసైటీ సభ్యులైన పుష్ప, నాగమణిలకు అప్పగించారు. వారు వివరాలు తెలుసుకుని రావికమతం ఎస్ఐ రామకృష్ణకు అప్పగించారు. ఆయన నర్సీపట్నంలోని ఇంటి యజమాని గాంధీ దంపతులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే తాము పనులు చేయించలేదని, మా ఇంట్లో వారు అద్దెకు ఉండేవారని వివరించారు. అదంతా అబద్ధమని, తాను ఆ ఇంటికి వెళ్లబోనని, చదువుకోవాలని ఉందని ఎక్కడికైనా పంపించేయండంటూ అనిత కోరడంతో విశాఖలోని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు ఎస్ఐ రామకృష్ణ వివరించారు. -
నలుగురు బాల నేరస్తులు పరారు
నిజామాబాద్: నిజామాబాద్‌లోని జువైనల్ హోం నుంచి నలుగురు బాల నేరస్తులు పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు బాధ్యులైన హెడ్ సూపర్వైజరు ప్రభాకర్, సూపర్వైజర్ నాగావేందర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హెడ్ సూపర్వైజర్, సూపర్వైజర్ ఈ నెల 2వ తేదీన సాయంత్రం బ్యారక్ తెరిచి లోపలకు వెళ్లారు. అదే సమయంలో వారి కళ్లుగప్పి ఓ బాల నేరస్తుడు బ్యారక్ నుంచి బయటికి వచ్చాడు. దీంతో సూపర్వైజర్లు బ్యారక్గేట్ను మూసివేయకుండానే బాలుడి కోసం వెతికేందుకు బయటికి వెళ్లారు. ఇదే అదనుగా బ్యారక్‌లోని మరో ముగ్గురు బాలనేరస్తులు కూడా తప్పించుకుని పోయారు. విషయం బయటకు పొక్కక ముందే బాలురను పట్టుకునేందుకు అధికారులు విఫలయత్నం చేశారు.