మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా.. | Madhya Pradesh Shivpuri Incident Shocking Details Out | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..

Published Fri, Feb 28 2025 3:57 PM | Last Updated on Fri, Feb 28 2025 4:13 PM

Madhya Pradesh Shivpuri Incident Shocking Details Out

మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమె చావుబతుకుల మధ్య  కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్‌ శివపురి(Shivpuri District) జిల్లాలో జరిగిన పాశవికమైన ఘటన వివరాల్లోకి వెళ్తే..

ఆ చిన్నారి ఓ యువకుడు జరిపిన లైంగికదాడి(Sexual Assault)లో తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే.. ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి, ఒంటి నిండా పంటి గుర్తులు పడ్డాయి. పెద్ద పేగు చిధ్రమైంది. ఆఖరికి ప్రైవేటు భాగం రెండుగా చీల్చేసి ఉంది. కనీసం మంచంపై పక్కకు కూడా తిరగలేని స్థితిలో.. కొన ఊపిరితో ఉందా చిన్నారి.  

ఫిబ్రవరి 22వ తేదీన దినార(Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి.. హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే.. పక్కింటి భయ్యా చాక్లెట్‌ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. కాసేపటికి ఆ కాలనీకి పక్కనే ఉన్న  ఓ పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై.. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్‌ కమలారాజ్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

అత్యంత దారుణంగా..
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు గంటలపాటు అత్యవసర సర్జరీలు చేశారు వైద్యులు. గాయాలకు చికిత్సతో పాటు చిధ్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్‌ పార్ట్‌కు 28 కుట్లు వేశారు.  అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

మైనర్‌గా చూపించి..
ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినటట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. అతని వయసు 17 ఏళ్లుగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్‌గా చూపించి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే..

పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా.. జువైనల్‌ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement