Shivpuri
-
అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక 19 యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భోపాల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాజోర్ గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికాస్ శర్మ అనే యువకుడు తన ఇంటి లోపల ఉరి వేసుకుని చనిపోయాడు. సూసైడ్ నోట్, యువకుడి మరణ వాంగూల్మంతో కూడిన వీడియో క్లిప్‌ను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వివరాలు వెల్లడించారు. (టిక్‌టాక్.. ఎంత పని చేసింది?) చేతి పంపు నుంచి లోటాతో గుడిలోకి వికాస్ నీళ్లు తీసుకెళుతుండగా కొన్ని చుక్కలు మనోజ్ కొలి, తారావతి కోలి, ప్రియాంక కోలిలకు చెందిన పాత్రలపై ఒలికాయి. దీంతో ఆగ్రహం చెందిన ఈ ముగ్గురు వికాస్‌ను జుట్టుపట్టుకుని విచక్షణారహితంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా లోటాలో మూత్రం నింపి తాగాలని బలవంతం చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చిన తర్వాత వికాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇద్దరు మహిళలతో సహ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. (కొడుకు పెళ్లిని ఫోన్లో చూసిన తల్లిదండ్రులు) -
చుట్టుపక్కల వాళ్లు వదల్లేదు!
శివపురి: ప్రాణాంతక వైరస్‌పై పోరులో దేశమంతా సమైక్యతా స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కొంతమంది కారణంగా సమైక్యతా స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. కరోనా మహమ్మారి బారినపడి, చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఓ యువకుడు తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఇరుగుపొరుగు వారు తనను దూరంగా పెట్టడంతో అతడు ఆవేదనకు గురై ఈ కఠిన నిర్ణయంతీసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురి పట్టణంలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల ఈ వ్యక్తి మార్చి 18న దుబాయి నుంచి వచ్చాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మార్చి 24న ఆసుపత్రిలో చేరాడు. ఏప్రిల్ 4న డిశ్చార్జి అయ్యాడు. ఇంటికి చేరిన అతడిని ఇరుగుపొరుగు ప్రజలు సామాజికంగా బహిష్కరించారు. ఎవరూ మాట్లాడేవారు కాదు. అంతేకాకుండా పాలు, కూరగాయలు అమ్మేవారిని కూడా యువకుడి ఇంటి వైపు రానిచ్చేవారు కాదు. ఇదంతా చూసి అతడు విసుగెత్తిపోయాడు. తన ఇంటిని అమ్మేసి, మరో చోటుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. కరోనాపై గెలిచిన తనను చుట్టుపక్కల ప్రజల వైఖరి ఓడించిందని బాధాతప్త హృదయంతో చెప్పాడు. దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని శివపురి ఎస్పీ రాజేశ్ సింగ్ చందల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకుని వచ్చిన యువకుడితో ఇరుగు పొరుగు వారు వాగ్వాదానికి దిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కోవిడ్ బాధితులను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హోమ్ క్వారంటైన్ ఉన్న యువకుడి కుటుంబానికి అవసరమైన నిత్యవసర సరుకులు తామే అందజేస్తామన్నారు. (కరోనా కట్టడికి 7 సూత్రాలు చెప్పిన మోదీ) -
కోడిపుంజుపై కేసు!
భోపాల్ : ఇదేం విచిత్రం.. కోడిపుంజుపై కేసు పెట్టడం ఏంటని షాకవుతున్నారా? నిజమండీ బాబూ.. ఐదేళ్ల చిన్నారి బుగ్గపై కోడి పొడిచిందట. బుగ్గకు గాయమై రక్తం కూడా వచ్చిందని.. తల్లిదండ్రులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెళ్లి కోడిపుంజును తీసుకొచ్చి కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ విచిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. శివపురీకి చెందిన పప్పు జాటవ్, లక్ష్మీ దంపతులకు సంతానం లేదు. దీంతో ఐదేళ్ల క్రితం ఓ కోడిపుంజును తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. ఎంతైనా కోడి కదా.. రోజూ చుట్టుపక్కల ఉన్న ఇళ్లవెంట తిరిగేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పప్పు పొరిగింట్లో ఉండే ఐదేళ్ల చిన్నారి రాధిక రోడ్డుపై ఆడుకుంటోంది. ఈ లోపే ఈ కోడిపుంజు కూడా అటుగా వెళ్లింది. ఏం జరిగిందో ఏమో.. కోడిపుంజు చిన్నారి చెంపపై పొడిచింది. దీంతో చిన్నారి బుగ్గకు గాయమై, రక్తం కూడా వచ్చింది. గాయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగ్గా.. కోడి పొడిచిందని చెప్పింది. దీంతో వారు పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు పప్పు ఇంటికి వెళ్లి, స్టేషన్‌కు తీసుకొచ్చి జైల్లో పెట్టారు. చివరకు లక్ష్మి బతిమాలితే.. ఇద్దరిని కూర్చోబెట్టి కేసును పరిష్కరించారు. -
మహిళా మంత్రి కాళ్లు పట్టుకున్న కాంట్రాక్టర్
శివపురి: మహిళా మంత్రిగారిని శాంతింపజేయడానికి ఆమె కాళ్లపై పడ్డాడో కాంట్రాక్టర్. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఐటీఐ విద్యార్థుల కోసం 120 పడకలతో శివపురిలో నిర్మించిన హాస్టల్ భవనాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జశోధర రాజె సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్టల్ భవనాన్ని పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయంటూ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సెల్ ఫోన్ తో భవనం లోపలి ఫొటోలు తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. పక్కాగా నిర్మాణ పనులు చేయించాలని ఆదేశించారు. తాజాగా చేసిన ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రిని శాంతింపజేసేందుకు కాంట్రాక్టర్ ఆమె కాళ్లపై పడ్డాడు. అయినా ఆమె శాంతించలేదు. తాము మంజూరు చేసిన నిధులకు అనుగుణంగా హాస్టల్ నిర్మించకుంటే ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు.