అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణం | Madhya Pradesh Teen Allegedly Ends Life Self | Sakshi
Sakshi News home page

మూత్రం తాగమన్నారని.. ఆత్మహత్య

Published Fri, May 15 2020 1:38 PM | Last Updated on Fri, May 15 2020 1:41 PM

Madhya Pradesh Teen Allegedly Ends Life Self - Sakshi

తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక 19 యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక 19 యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భోపాల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాజోర్ గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికాస్ శర్మ అనే యువకుడు తన ఇంటి లోపల ఉరి వేసుకుని చనిపోయాడు. సూసైడ్‌ నోట్, యువకుడి మరణ వాంగూల్మంతో కూడిన వీడియో క్లిప్‌ను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సూసైడ్‌ నోట్ ఆధారంగా పోలీసులు వివరాలు వెల్లడించారు. (టిక్‌టాక్‌.. ఎంత పని చేసింది?)

చేతి పంపు నుంచి లోటాతో గుడిలోకి వికాస్ నీళ్లు తీసుకెళుతుండగా కొన్ని చుక్కలు మనోజ్‌ కొలి, తారావతి కోలి, ప్రియాంక కోలిలకు చెందిన పాత్రలపై ఒలికాయి. దీంతో ఆగ్రహం చెందిన ఈ ముగ్గురు వికాస్‌ను జుట్టుపట్టుకుని విచక్షణారహితంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా లోటాలో మూత్రం నింపి తాగాలని బలవంతం చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చిన తర్వాత వికాస్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇద్దరు మహిళలతో సహ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. (కొడుకు పెళ్లిని ఫోన్‌లో చూసిన తల్లిదండ్రులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement