బాలీవుడ్ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ నవ్‌లానీతో పాటు అతని భార్య దిశను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఆత్మహత్యపైసహనటుడు నిశాంత్ సంచలన విషయాలు బయటపెట్టాడు. వైశాలి సూసైడ్ చేసుకునేలా రాహుల్ చిత్రహింసలకు గురిచేశాడని నిశాంత్ మల్ఖానీ ఆరోపించారు. రాహుల్‌తో వైశాలి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బహిర్గతం చేస్తానని పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. వైశాలి ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిశాంత్ అన్నారు. ఆమె తనతో వ్యక్తిగత విషయాలను పంచుకునేదని వెల్లడించారు. నిశాంత్ మల్ఖానీ కథానాయకుడిగా నటించిన రక్షాబంధన్ - రసల్ అప్నే భాయ్ కి ధాల్ షోలో వైశాలి కూడా భాగమైంది.
('చదవండి: నటి వైశాలి సూసైడ్ కేసులో నిందితుడు రాహుల్ అరెస్ట్)
రాహుల్ పెళ్లి చేసుకున్నా కూడా ఆమెను వేధిస్తూనే ఉన్నాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిశాంత్ మల్ఖానీ తెలిపారు. వైశాలి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. వైశాలికి కాబోయే భర్తకు మెసేజ్‌లు పంపి ఆమెను మానసికంగా హింసించేవాడని వెల్లడించారు. రాహుల్ వేధింపులకు తట్టుకోలేక డిప్రెషన్‌లో ఉన్న వైశాలి మానసిక వైద్యుడిని కూడా సంప్రదించిందని అన్నారు. రాహుల్ వైశాలితో ఉన్న సన్నిహిత చిత్రాలను కాబోయే భర్తకు చూపిస్తానని బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకుందని నిశాంత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment