Vaishali Thakkar Suicide Case: Police Arrests Rahul Navlani - Sakshi
Sakshi News home page

Vaishali Thakkar : నటి వైశాలి సూసైడ్‌ కేసులో నిందితుడు రాహుల్‌ అరెస్ట్‌

Published Thu, Oct 20 2022 10:28 AM | Last Updated on Thu, Oct 20 2022 11:56 AM

Police Arrest Rahul Navlani In Vaishali Thakkar Suicide Case - Sakshi

బుల్లితెర నటి వైశాలి టక్కర్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.వైశాలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు రాహుల్‌ నవ్లానీని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే రాహుల్ నవ్లానీతో పాటు అతని భార్య దిశపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసి పోలీసులు నిందితుల సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.5 వేల రివార్డును సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా సూసైడ్‌ నోట్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చారు. ఈ దారుణానికి రాహుల్ నవ్‌లాని భార్య దిశ కూడా సహకరించినట్లు గుర్తించారు.వైశాలి పెళ్లి జరుగకుండా రాహుల్‌ నవ్లానీ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.అంతే కాకుండా ఆమెకు కాబోయే భర్తకు వైశాలి ఫోటోలు, వీడియోలు పంపాడని, దీనివల్ల నిశ్చితార్థం కూడా రద్దయిందని పేర్కొన్నారు.

ఇప్పుడు ఇంకొకరితో వివాహం చేసేందుకు ప్రయత్నం చేయగా మళ్లీ అవే ట్రిక్స్‌ ప్లే చేశాడని కుటుంబీకులు పేర్కొన్నారు. 2016లో రాజన్ షాహి నిర్మించిన లాంగ్-రన్ షో ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’తో  టీవీలో అరంగేట్రం చేసిన వైశాలి ‘ససురల్ సిమర్ కా’, ‘సూపర్ సిస్టర్స్‌’,‘మన్మోహిని 2’ లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement