బుల్లితెర నటి ఆత్మహత్య కేసులో కీలక మలుపు! | Police Declares Actress Vaishali Tucker Accused by Neighbour who is Absconding Her | Sakshi
Sakshi News home page

Vaishali Tacker Suicide: బుల్లితెర నటి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. నిందితుడు అతనే..!

Published Sun, Oct 16 2022 9:24 PM | Last Updated on Sun, Oct 16 2022 10:25 PM

Police Declares Actress Vaishali Tucker Accused by Neighbour who is Absconding Her - Sakshi

నటి వైశాలి టక్కర్‌ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని తన నివాసంలో ఇవాళ ఉరేసుకుని చనిపోగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ నటి నివాసంలో దొరికిన సూసైడ్‌ నోట్‌ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు పొరుగున ఉండే రాహుల్ వేధింపులు తట్టుకోలేకే నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇండోర్ ఏసీపీ ఎం. రెహమాన్ తెలిపారు. 

వైశాలి టక్కర్ ఈ-గాడ్జెట్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్ ఏసీపీ ఎం. రెహమాన్ వెల్లడించారు. రాహుల్ ఆమెను వేధింపులకు గురి చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఆమె మరో ‍వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని రాహుల్‌కు తెలియడంతో ఆటంకాలు కలిగించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నాడని ఏసీపీ రెహమాన్ పేర్కొన్నారు.

(చదవండి: ఉరేసుకుంటానని అప్పుడే హింటిచ్చిన నటి! వీడియో వైరల్‌)

కెన్యాలో పనిచేసే అభినందన్ సింగ్ అనే సర్జన్‌తో వైశాలి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని మహిద్‌పూర్ పట్టణం. గత రెండేళ్లుగా వైశాలి టక్కర్ ఇండోర్‌లో నివసిస్తున్నారు. 2015లో 'యే రిష్తా క్యా కెహ్లతా హై'తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 'సూపర్ సిస్టర్స్', 'మన్మోహిని 2' వంటి షోలలో కూడా పనిచేసింది. ఆమె చివరిగా 'రక్షాబంధన్' సీరియల్‌లో కనిపించింది. అంతేకాకుండా, ఆమె 'యే హై ఆషికి'లోని  కొన్ని ఎపిసోడ్‌లలో కూడా భాగమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement