Vaishali Takkar: నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు | Case Filed Against Actress Vaishali Takkar Ex Boyfriend And His Wife | Sakshi
Sakshi News home page

వైశాలి టక్కర్ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. కాబోయే భర్తకు ఫోటోలు, వీడియోలు పంపడంతో..

Published Mon, Oct 17 2022 7:16 PM | Last Updated on Mon, Oct 17 2022 7:43 PM

Case Filed Against Actress Vaishali Takkar Ex Boyfriend And His Wife - Sakshi

బుల్లితెర నటి వైశాలి టక్కర్‌ ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే  నిందితున్ని గుర్తించిన పోలీసులు అతనితో పాటు భార్యపై కూడా కేసు నమోదు చేశారు. ఆమె నివాసంలో దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల‍్చారు. ఈ దారుణానికి రాహుల్ నవ్‌లాని భార్య దిశ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

(చదవండి: విషాదం.. ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య)

రాహుల్ నవ్‌లాని గురించి వైశాలి కుటుంబానికి కూడా తెలుసని పోలీసులు గుర్తించారు. వైశాలి టక్కర్‌తో అతనికి సంబంధమున్నట్లు రూమర్లు సృష్టించి ఆమెకు కాబోయే వరుడితో చెప్పేవాడని నటి కుటుంబం పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. అంతే కాకుండా ఆమెకు కాబోయే భర్తకు వైశాలి ఫోటోలు, వీడియోలు పంపినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.  అతని వల్లే వైశాలి నిశ్చితార్థం రద్దైయినట్లు వెల్లడించారు.  

ఆమె 2016లో రాజన్ షాహి నిర్మించిన లాంగ్-రన్ షో ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’తో  టీవీలో అరంగేట్రం చేసింది వైశాలి.  అందులో సంజనా సింగ్ పాత్రను పోషించింది. ‘ససురల్ సిమర్ కా’, ‘సూపర్ సిస్టర్స్‌’,‘మన్మోహిని 2’ లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించారు.  చివరిసారిగా బిగ్ బాస్ 14 ఫేమ్ నిశాంత్ మల్కాని ‘రక్షాబంధన్ ’షోలో కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement