ఘోరం: రైలుపట్టాలపై వ్యక్తి, కాపాడబోయిన.. | MP Crime News: Man Ends Life by Jumping Train Son Also Killed | Sakshi
Sakshi News home page

ఘోరం: దూసుకొస్తున్న రైలుకి ఎదురెళ్లి సూసైడ్‌, కాపాడబోయి ప్రాణం పొగొట్టుకున్నాడు

Published Mon, Nov 14 2022 7:51 AM | Last Updated on Mon, Nov 14 2022 7:58 AM

MP Crime News: Man Ends Life by Jumping Train Son Also Killed - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

క్రైమ్‌: మధ్యప్రదేశ్‌ భిండ్‌లో ఘోరం చోటు చేసుకుంది. రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా.. అతన్ని కాపాడబోయి ఓ యువకుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఇద్దరూ తండ్రీకొడుకులు కావడం గమనార్హం​. 

భిండ్‌ రైల్వే స్టేషన్‌ సమీప కాలనీలో నివసించే హరి సింగ్‌ నరవరియా(55) రోజూ ఇంట్లో వాళ్లతో గొడవ పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. ఆదివారం ఉదయం మరోసారి గొడవ జరగడంతో తాను బతకనంటూ ఇంట్లోంచి పరుగులు తీశాడు. 

కాసేపటికి తన తండ్రి రైలు పట్లాల మధ్యలో నిల్చుని ఉండడం గమనించాడు కొడుకు మున్నేష్‌. వెంటనే పరుగులు తీసి ఆయన్ని కాపాడబోయాడు. పక్కకి తప్పించే క్రమంలో.. రైలు వేగంగా దూసుకురావడంతో ఢీకొట్టి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న భిండ్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మోసపోయాను.. నన్ను క్షమించండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement