
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, రాజమాత మాధవి రాజే సింధియా కన్ను మూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆమె బుధవారం ఉదయం 9.28 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
“రాజమాత ఇక లేరు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత మాధవి రాజే సింధియా గత రెండు నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు వారాలుగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఉదయం 9:28 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. ఓం శాంతి” అని ఒక పత్రికా ప్రకటనలో ఢిల్లీ ఎయిమ్స్ పేర్కొంది.
రాజమాత మాధవి రాజే సింధియా కుమారుడు, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈసారి సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment