Rajamatha
-
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, రాజమాత మాధవి రాజే సింధియా కన్ను మూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆమె బుధవారం ఉదయం 9.28 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.“రాజమాత ఇక లేరు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత మాధవి రాజే సింధియా గత రెండు నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు వారాలుగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఉదయం 9:28 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. ఓం శాంతి” అని ఒక పత్రికా ప్రకటనలో ఢిల్లీ ఎయిమ్స్ పేర్కొంది. రాజమాత మాధవి రాజే సింధియా కుమారుడు, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈసారి సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. -
ప్రభాస్ ను రక్షించిన రమ్యకృష్ణ!
హీరో ప్రభాస్ ను సీనియర్ నటి రమ్యకృష్ణ రక్షించింది. నిజజీవితంలో కాదు తెరపై. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా రాజమాత పాత్రలో ఆమె నటిస్తోంది. చిన్నప్పుడు శివుడు(ప్రభాస్)ను శత్రువుల బారి నుంచి కాపాడుతుంది. తమ రాజ్యంపై దాడి చేసిన శత్రువుల బారి నుంచి శివుడు(ప్రభాస్)ను రక్షించేందుకు రాజమాత అతడిని తీసుకుని పారిపోతోంది. ఈ క్రమంలో ఒకచోట నది దాటాల్సిరాగా, తన ప్రాణాలన్ని ఫణంగా పెట్టి కొడుకుని కాపాడుతుంది. తర్వాత పెరిగి పెద్దవాడైన శివుడు ఏవిధంగా శత్రువులపై పగ తీర్చుకున్నాడనేది బాహుబలి 2వ భాగంలో చూడొచ్చు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా, దగ్గుబాటి రానా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.