ప్రభాస్ ను రక్షించిన రమ్యకృష్ణ! | Ramya Krishna saves Prabhas Life | Sakshi
Sakshi News home page

ప్రభాస్ ను రక్షించిన రమ్యకృష్ణ!

Published Thu, Jul 10 2014 6:21 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

ప్రభాస్ ను రక్షించిన రమ్యకృష్ణ!

ప్రభాస్ ను రక్షించిన రమ్యకృష్ణ!

హీరో ప్రభాస్ ను సీనియర్ నటి రమ్యకృష్ణ రక్షించింది. నిజజీవితంలో కాదు తెరపై. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా రాజమాత పాత్రలో ఆమె నటిస్తోంది. చిన్నప్పుడు శివుడు(ప్రభాస్)ను శత్రువుల బారి నుంచి కాపాడుతుంది. తమ రాజ్యంపై దాడి చేసిన శత్రువుల బారి నుంచి శివుడు(ప్రభాస్)ను రక్షించేందుకు రాజమాత అతడిని తీసుకుని పారిపోతోంది. ఈ క్రమంలో ఒకచోట నది దాటాల్సిరాగా, తన ప్రాణాలన్ని ఫణంగా పెట్టి కొడుకుని కాపాడుతుంది.

తర్వాత పెరిగి పెద్దవాడైన శివుడు ఏవిధంగా శత్రువులపై పగ తీర్చుకున్నాడనేది బాహుబలి 2వ భాగంలో చూడొచ్చు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా, దగ్గుబాటి రానా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement