Physical attack
-
Yes Means Yes: రేప్ అర్థం మారిందక్కడ!
మీ పక్కన ఒకరు ఉన్నారు. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సు నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండావాళ్ల ఇంట్లోకి వెళ్లలేం కదా!.. అత్యాచారం విషయంలోనూ అంతే!. సోమవారం స్విట్జర్లాండ్ పార్లమెంట్లో లైంగిక నేరాల చట్టంపై చర్చ సందర్భంగా 32 ఏళ్ల ఓ మహిళా చట్ట సభ్యురాలు ప్రస్తావించిన అంశం ఇది. స్విట్జర్లాండ్‌లో రేప్(అత్యాచారం) నిర్వచనం మారింది. కొన్ని పరిమితులుగా ఉన్న అర్థాన్ని విస్తరించి.. లైంగిక నేరాల చట్టంలో కొత్త నిర్వచనం అందించింది అక్కడి చట్ట సభ. సోమవారం దిగువ సభలో నాటకీయ పరిణామాల నడుమ జరిగిన ఓటింగ్‌లో స్వల్ఫ మెజార్టీతో ఆమోదం పొందింది ఇది. బలవంతంగా స్త్రీ జననాంగంలోకి పురుషాంగాన్ని చొప్పించడం.. లైంగిక దాడి సమయంలో బాధితురాలు ఒక నిర్దిష్ట స్థాయి ప్రతిఘటన ఎదుర్కొంటేనే ఇక నుంచి స్విట్జర్లాండ్‌లో అత్యాచారంగా పరిగణిస్తారు. సాధారణంగా.. రేప్ కేసుల్లో బాధితురాలి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ అఘాయిత్యానికి ఓ నిర్దిష్టత అంటూ ఇవ్వలేకపోతుంటారు. అత్యాచారం ఎలా జరిగింది? బాధితులు ఎవరు?.. వాళ్లు ఏ స్థాయిలో ప్రతిఘటించారు?.. ఇలాంటివేం పట్టించుకోరు. అలాగే.. స్విట్జర్లాండ్‌లో ఇంతకు ముందు అన్ని రకాల లైంగిక దాడుల నేరాలను.. అత్యాచారం కింద పరిగణలోకి తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై ఒక నిర్దిష్టమైన కొలమానాన్ని ఇవ్వబోతున్నారు. పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యలను కూడా అత్యాచారాలుగా చూపించడం, అవతలి వాళ్లను ఇరికించే యత్నాల కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఏ నేరమూ చేయని వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే.. అత్యాచారానికి ఒక నిర్దిష్టత ఇవ్వాలని అక్కడి చట్ట సభ భావించింది. అయితే సమ్మతిని ఎలా కొలవాలనే దానిపై స్విట్జర్లాండ్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘‘నో మీన్స్ నో’’ అనే విధానం కోసం వాదించారు కొందరు. ఒకరు స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అది అత్యాచారంగా పరిగణించబడుతుంది అనేది ఈ వాదనకు అర్థం. అయితే.. కొత్త నిర్వచనం వల్ల నేరంపై సంక్లిష్టత నెలకొంటుందని చెప్తున్నారు. పార్లమెంటు ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఈ ఏడాది ప్రారంభంలో ఈ విధానానికి ఓటు వేసింది. కానీ దిగువ నేషనల్ కౌన్సిల్ సోమవారం ఓటు వేసినప్పుడు, లైంగిక చర్యలకు స్పష్టమైన సమ్మతి అవసరమయ్యే మరింత తీవ్రమైన మార్పును ఎంచుకుంది. అంటే.. పరస్పర అంగీకారం ఉంటే అదసలు అత్యాచారం ఎలా అవుతుందనేది.. ఇక్కడ ప్రధాన చర్చ. తాజా సోమవారం ‘యస్ మీన్స్ యస్’(ఒక రకంగా పరస్పర ఆమోదం.. అంగీకారం అన్నట్లే!) చట్టానికి 99 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. 88 మంది వ్యతిరేకంగా, ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక సోమవారం చర్చా వేదిక సందర్భంగా దిగువ సభ హీటెక్కింది. మీ పక్క వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సుల నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండా వాళ్ల ఇంట్లోకి ప్రవేశించలేరు కదా! బలవంతం చేస్తే తప్ప.. అంటూ 32 ఏళ్ల పార్లమెంటేరియన్ తమారా ఫునిసియెల్లో ప్రసంగించారు. నా ఒంటి కంటే.. ఇళ్లు, వ్యాలెట్‌నే ఎందుకు అంత భద్రంగా దాచుకోవాలి.. అంటూ ప్రశ్నించారామె. ఇక గ్రీన్స్ ఎంపీ రాఫెల్ మహిమ్ సైతం తమారాతో ఏకీభవించారు. ఇతరుల శరీరం ఎప్పుడూ ఓపెన్ బార్ కాదు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారామె. ఇదిలా ఉంటే.. స్విస్ పీపుల్స్ పార్టీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. ఇది గందరగోళానికి దారి తీయడం మాత్రమే కాదు.. ఆచరణలోనూ కష్టతరమని వాదించారు వాళ్లు. ఇదిలా ఉంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్విట్జర్లాండ్ ఓటింగ్ పరిణామాలను అభినందించింది. అయితే.. రేప్ నిర్వచనం చట్టంలో మార్పు రావడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. పార్లమెంట్ ఇరు సభలు దీనిపై ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఆపై అది ప్రజా ఓటింగ్‌కు వెళ్తుంది. స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్ మరియు బెల్జియంతో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా అత్యాచారాన్ని ‘‘స్పష్టమైన అనుమతి లేకుండా లైంగిక చర్య’’గా నిర్వచించే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
లిఫ్ట్ ఇచ్చి.. అత్యాచారం చేసి పారిపోయారు
కదులుతున్న కారులో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఉత్తర ప్రదేశ్ జైసింగ్‌పూర్ ఏరియా సుల్తానాపూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 23 ఏళ్ల యువతి.. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మీద నిల్చుంది. అయితే సెలవుల సీజన్ కావడంతో ఎంతకీ బస్సులు రాలేదు. దీంతో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్‌వాహనాన్ని ఆపి లిఫ్ట్ అడిగింది. ఈ క్రమంలో ఆమెను ఎక్కించుకున్నాక.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వెనకాలకు వచ్చాడు. ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి కారును నడుపుతుండగా.. యువతిపై కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు దుండగుడు. అనంతరం ఆమెను దగ్గర్లో ఉన్న కాలువ వద్ద పడేసి.. ఆ ఇద్దరూ పారిపోయారు. గాయాలతో కంటపడ్డ ఆమెను.. ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు పోలీసులు. వైద్య నివేదిక ప్రకారం. అత్యాచారం జరిగిందని నిర్దారించుకున్న పోలీసులు.. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: పాపం.. వృద్ధురాలి కాలిని నరికేసి ఘోరం -
రక్తపు మడుగులో ఆయన్ని చూశాకే.. ఘోరం తెలిసొచ్చింది!
న్యూయార్క్: సుప్రసిద్ధ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడిని సాహిత్య లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఘోరమైన దాడి నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని.. అయితే పూర్తిస్థాయి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడేం చెప్పలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్తున్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి, దాడిలో గాయపడ్డ హెన్రీ రెస్సే.. సల్మాన్ రష్డీపై దాడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. న్యూయార్క్‌లో గత శుక్రవారం ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరైన సల్మాన్ రష్డీపై దాడి జరిగింది. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న తరుణంలో.. దుండగుడు వేదికపైకి దూకి రష్డీపై విచక్షణా రహితంగా గొంతులో పొడిచి దాడి చేశాడు. ఆ సమయంలో ఆ ఈవెంట్ నిర్వాహకుడు, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్న సిటీ ఆఫ్ అసైలం ఎన్జీవో ప్రెసిడెంట్ హెన్రీ రెస్సే.. సైతం దాడిలో గాయపడి కోలుకున్నారు. ‘అసలు ఆరోజు అక్కడ ఏం జరిగిందో అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. సల్మాన్ రష్డీకి ప్రాణ హని ఉందన్న చర్చ గత కొన్నేళ్లుగా నడుస్తోంది. ఈ క్రమంలో మమ్మల్ని ఆటపట్టించేందుకు ప్రాంక్‌కు పాల్పడి ఉంటారని భావించాం. ఆ ఘటనను సైతం ప్రాంక్ స్టంట్ ఏమో అనుకున్నాం. కానీ, రక్తపు మడుగులో రష్డీగారిని చూశాకే.. అదొక వాస్తవ ఘటన అని అర్థమైంది. అప్పటికే అక్కడంతా గందరగోళం నెలకొంది. నాపైనా దాడి జరిగింది’ అని రెస్సే గుర్తు చేసుకున్నారు. సల్మాన్ రష్డీపై జరిగింది భౌతిక దాడి మాత్రమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిత్య లోకం మీదే జరిగినట్లు లెక్క. దీనిని ముక్తకంఠంతో మేం ఖండిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. 1997లో ఆయన ప్రసంగం చూశాక.. మా ఎన్జీవో ఈవెంట్‌కు ఆయన అర్హుడని భావించాం. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఈ లోపే ఈ ఘటన జరగడం బాధాకరం. ఘటన జరిగిన సమయంలో దుండగులు సిబ్బందితో పాటు ఈవెంట్‌కు హాజరైన వాళ్లతో సైతం పెనుగులాడాడు. చివరికి సిబ్బందిని అతన్ని కట్టడి చేయగలిగింది అని రెస్సే తెలిపారు. పెన్సిల్వేనియాలోని ఓ ఆస్పత్రిలో సల్మాన్ రష్డీ చికిత్స పొందుతున్నారు. Full Video- Author Salman Rushdie was stabbed after taking stage at a Chautauqua Institute event.#SalmanRushdie #सलमान_रुश्दी #SarTanSeJuda #Rushdie #Iran #newyork #salmanrushdieattacked #salmanrushdiestabbed #Newyorkpic.twitter.com/6q1YDs6fb0 — Anil Kumar Verma (@AnilKumarVerma_) August 12, 2022 ఇదీ చదవండి: ఈ నవల రక్తాన్ని కళ్ల చూస్తోంది.. ఎందుకో తెలుసా? -
విదేశీ యువతిని వివస్త్రను చేసి..
బెంగళూరులో టాంజానియా యువతిపై దారుణం బాధ్యులపై చర్యలకు సుష్మ ఆదేశాలు సాక్షి, బెంగళూరు: ఓ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఓ విదేశీ యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి స్థానికులు భౌతిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, వారి స్నేహితులు, స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం... టాంజానియాకు చెందిన 21 ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థిని. ఆదివారం సాయంత్రం అద్దె కారులో వెళ్తుండగా హెసరగట్టకు చేరుకోగానే అదుపుతప్పి 35 ఏళ్ల యువతికి ఢీ కొంది. దీంతో ఆమె మరణించింది. కారు నడుపుతున్న సుందరేషన్ పరారయ్యాడు. వెనుక కూర్చున్న విద్యార్థి కిందికి దిగగానే స్థానికులు అక్కడికొచ్చి ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. తాను చెబుతున్నది వినిపించుకోక ఆ యువతి టీ షర్టును చించి వేశారు. ఎలాగో తప్పించుకుని నెమ్మదిగా కదులుతున్న బీఎంటీసీ బస్సు ఎక్కడానికి ప్రయత్నించినా వెంటబడి రోడ్డుపై వేసి చితకబాదారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థిని స్నేహితుల్లో ఒకరు బాధితురాలికి టీ షర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించడంతో యువతితో పాటు ఆమెకు సాయం చేయడానికి వచ్చిన వారిపై కూడా భౌతిక దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా యువతి ప్రయాణిస్తున్న వాహనాన్ని తగులబెట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తమను రక్షించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదని బాధితురాలి స్నేహితులు వాపోయారు. ఇదిలా ఉండగా ఆఫ్రికా దేశపు విద్యార్థులు తరుచూ మద్యం మత్తులో వాహనాలు నడపి ప్రాణాలమీదకు తెస్తున్నారని, తమతో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటున్నారని స్థానికులు వాపోతుండటం గమనార్హం. అయితే.. టాంజానియా హై కమిషనర్, విదేశాంగ మంత్రి సుష్మకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సుష్మ స్వరాజ్ కూడా కర్ణాటక సీఎం, ఇతర అధికారులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.