Yes Means Yes: రేప్‌ అర్థం మారిందక్కడ! | Switzerland Rape Law: Definition Of Rape Changed | Sakshi
Sakshi News home page

రేప్‌ అర్థం మారిందక్కడ.. సంచలన నిర్ణయం తీసుకున్న స్విస్‌ పార్లమెంట్‌

Published Tue, Dec 6 2022 9:08 AM | Last Updated on Tue, Dec 6 2022 9:17 AM

Switzerland Rape Law: Definition Of Rape Changed - Sakshi

మీ పక్కన ఒకరు ఉన్నారు. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సు నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండావాళ్ల ఇంట్లోకి వెళ్లలేం కదా!.. అత్యాచారం విషయంలోనూ అంతే!.  సోమవారం స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌లో లైంగిక నేరాల చట్టంపై చర్చ సందర్భంగా 32 ఏళ్ల ఓ మహిళా చట్ట సభ్యురాలు ప్రస్తావించిన అంశం ఇది. 

స్విట్జర్లాండ్‌లో రేప్‌(అత్యాచారం) నిర్వచనం మారింది. కొన్ని పరిమితులుగా ఉన్న అర్థాన్ని విస్తరించి.. లైంగిక నేరాల చట్టంలో కొత్త నిర్వచనం అందించింది అక్కడి చట్ట సభ. సోమవారం దిగువ సభలో నాటకీయ పరిణామాల నడుమ జరిగిన ఓటింగ్‌లో స్వల్ఫ మెజార్టీతో ఆమోదం పొందింది ఇది. 

బలవంతంగా స్త్రీ జననాంగంలోకి పురుషాంగాన్ని చొప్పించడం.. లైంగిక దాడి సమయంలో బాధితురాలు ఒక నిర్దిష్ట స్థాయి ప్రతిఘటన ఎదుర్కొంటేనే ఇక నుంచి స్విట్జర్లాండ్‌లో అత్యాచారంగా పరిగణిస్తారు. 

సాధారణంగా.. రేప్‌ కేసుల్లో బాధితురాలి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ అఘాయిత్యానికి ఓ నిర్దిష్టత అంటూ ఇవ్వలేకపోతుంటారు. అత్యాచారం ఎలా జరిగింది? బాధితులు ఎవరు?.. వాళ్లు ఏ స్థాయిలో ప్రతిఘటించారు?.. ఇలాంటివేం పట్టించుకోరు. అలాగే.. 

స్విట్జర్లాండ్‌లో ఇంతకు ముందు అన్ని రకాల లైంగిక దాడుల నేరాలను.. అత్యాచారం కింద పరిగణలోకి తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై ఒక నిర్దిష్టమైన కొలమానాన్ని ఇవ్వబోతున్నారు.

పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యలను కూడా అత్యాచారాలుగా చూపించడం, అవతలి వాళ్లను ఇరికించే యత్నాల కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఏ నేరమూ చేయని వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే.. అత్యాచారానికి ఒక నిర్దిష్టత ఇవ్వాలని అక్కడి చట్ట సభ భావించింది. 

అయితే సమ్మతిని ఎలా కొలవాలనే దానిపై స్విట్జర్లాండ్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘‘నో మీన్స్ నో’’ అనే విధానం కోసం వాదించారు కొందరు. ఒకరు స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అది అత్యాచారంగా పరిగణించబడుతుంది అనేది ఈ వాదనకు అర్థం. అయితే.. కొత్త నిర్వచనం వల్ల నేరంపై సంక్లిష్టత నెలకొంటుందని చెప్తున్నారు. 

పార్లమెంటు ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఈ ఏడాది ప్రారంభంలో ఈ విధానానికి ఓటు వేసింది.  కానీ దిగువ నేషనల్ కౌన్సిల్ సోమవారం ఓటు వేసినప్పుడు, లైంగిక చర్యలకు స్పష్టమైన సమ్మతి అవసరమయ్యే మరింత తీవ్రమైన మార్పును ఎంచుకుంది. అంటే.. పరస్పర అంగీకారం ఉంటే అదసలు అత్యాచారం ఎలా అవుతుందనేది.. ఇక్కడ ప్రధాన చర్చ. 

తాజా సోమవారం ‘యస్‌ మీన్స్‌ యస్‌’(ఒక రకంగా పరస్పర ఆమోదం.. అంగీకారం అన్నట్లే!) చట్టానికి 99 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. 88 మంది వ్యతిరేకంగా, ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక సోమవారం చర్చా వేదిక సందర్భంగా దిగువ సభ హీటెక్కింది. 

మీ పక్క  వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సుల నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండా వాళ్ల ఇంట్లోకి ప్రవేశించలేరు కదా! బలవంతం చేస్తే తప్ప.. అంటూ 32 ఏళ్ల పార్లమెంటేరియన్‌ తమారా ఫునిసియెల్లో ప్రసంగించారు. నా ఒంటి కంటే.. ఇళ్లు, వ్యాలెట్‌నే ఎందుకు అంత భద్రంగా దాచుకోవాలి.. అంటూ ప్రశ్నించారామె. ఇక గ్రీన్స్‌ ఎంపీ రాఫెల్‌ మహిమ్‌ సైతం తమారాతో ఏకీభవించారు. ఇతరుల శరీరం ఎప్పుడూ ఓపెన్ బార్ కాదు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారామె. 

ఇదిలా ఉంటే.. స్విస్‌ పీపుల్స్‌ పార్టీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. ఇది గందరగోళానికి దారి తీయడం మాత్రమే కాదు.. ఆచరణలోనూ కష్టతరమని వాదించారు వాళ్లు. ఇదిలా ఉంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ స్విట్జర్లాండ్‌ ఓటింగ్‌ పరిణామాలను అభినందించింది.  అయితే.. రేప్‌ నిర్వచనం చట్టంలో మార్పు రావడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. పార్లమెంట్‌ ఇరు సభలు దీనిపై ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఆపై అది ప్రజా ఓటింగ్‌కు వెళ్తుంది. 

స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్ మరియు బెల్జియంతో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా అత్యాచారాన్ని ‘‘స్పష్టమైన అనుమతి లేకుండా లైంగిక చర్య’’గా నిర్వచించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement