law
-
ఒరిజినల్ ప్రామిసరీ నోటు ఉంటే మంచిది ..!
నా భర్త ఆరేళ్ల క్రితం తన కజిన్‌కి 7 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. నెలవారీ వడ్డీ చెల్లించేలా ప్రామిసరీ నోటు కూడా రాయించుకున్నాము. ఆయన కొంతకాలం వడ్డీ ఇచ్చారు కానీ తర్వాత కట్టడం ఆపేశారు. దాంతో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కేసు నడుస్తుండగానే నా భర్త చనిపోయారు. మా వద్ద అప్పు తీసుకున్న వారి తండ్రికి భూములు ఉన్నాయి. మావారు కాలం చేసిన తర్వాత మాకు రావలసిన బాకీ గురించి అడిగాను. అందుకు వారు అంగీకరించకపోగా ‘‘కోర్టులో తేల్చుకుంటాము’’ అంటున్నారు. ప్రామిసరీ నోటు నా పేరు మీదే ఉంది కానీ ప్రస్తుతం నా వద్ద ఒరిజినల్ లేదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రామిసరీ నోటు ఒరిజినల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ప్రామిసరీ నోటుపై ఉన్న సాక్షులు కూడా ఇప్పుడు డబ్బులు తీసుకున్న వారి వైపే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు సలహా ఇవ్వగలరు. – లత, సత్యసాయి జిల్లాప్రామిసరీ నోటు మీ పేరు మీదే ఉంది అంటున్నారు కాబట్టి కోర్టులో కేసు మీరు నడిపించవచ్చు. మీకు మీ డబ్బులు తిరిగి పొందే హక్కు – వీలూ రెండూ ఉన్నాయి. ఒరిజినల్ ప్రామిసరీ నోటు చాలా ముఖ్యమైన ఆధారం. అయితే అది లేనంత మాత్రాన మీ కేసు తేలకుండా పోదు. వేరే ఆధారాల మీద మీరు కేసు నడిపించాలి. ప్రామిసరీ నోటును ద్వితీయ సాక్ష్యం (సెకండరీ ఎవిడెన్స్)గా తీసుకునే వీలు ఉందా లేదా అనే అంశాన్ని మీ కేసు పూర్వాపరాలు సమీక్షించిన మీ లాయర్ మాత్రమే చెప్పగలరు. మీరు డబ్బులు ఇచ్చారనడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వంటి ఏదో ఒక సాక్ష్యం ఉన్నా సరిపోతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు. అంతమొత్తంగా డబ్బులు మీకు చెందినవే అనే అంశాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్కమ్ టాక్స్ డిక్లరేషన్ చేశారా లేదా ప్రభుత్వానికి మీ వద్ద ఉన్న నగదు గురించి డిక్లేర్ చేశారా లేదా అనే అంశాలపై అవతలవారు కేసు నడిచే క్రమంలో అడగవచ్చు. దానికి సమాధానాలు ఇచ్చేందుకు మీరు సిద్ధపడి ఉండాలి. మీరు ఒకవేళ ప్రభుత్వానికి సదరు లావాదేవీ గురించి డిక్లేర్ చేసి ఉన్నట్లయితే ఎలాంటి భయం అవసరం లేదు. ఇదంతా ఎందుకనుకుంటే మధ్యవర్తి ద్వారా మరోసారి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగిగా మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎటువంటి అమ్మకాలు/ కొనుగోలు చేసినా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి డిక్లేర్ చేయవలసి ఉంటుంది. అధికమొత్తంలో నగదు సేవింగ్స్ రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సి ఉంటుంది. మీకు వేరే ఆదాయం ఉంటే అది కూడా డిక్లేర్ చేయడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్థిక లావాదేవీలు అధిక మొత్తంలో చేసినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMకు మెయిల్ చేయవచ్చు. ) -
ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకం
అదానీ గ్రూప్ ఇటీవల అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలను న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈమేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్క్లాండ్ & ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ & సుల్లివాన్ ఎల్ఎల్పీ అనే న్యాయ సంస్థలను అదానీ గ్రూప్ నియమించింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ తాజాగా రెండు సంస్థలను నియమించింది. ఇవి కంపెనీపై వచ్చిన ఆరోపణలపై న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానం చెప్పనున్నాయి.కేసు నేపథ్యంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?న్యాయ సంస్థల గురించిషికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న కిర్క్టాండ్ & ఎల్లిస్ అధికంగా వాణిజ్య వివాదాలు, మేధో సంపత్తి వ్యాజ్యాలు, వైట్-కాలర్ కేసుల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇప్పటికే జాన్సన్ & జాన్సన్, వోక్స్ వ్యాగన్ వంటి ప్రధాన సంస్థలకు ఈ సంస్థ సేవలందించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్విన్ ఇమ్మాన్యుయేల్ సెక్యూరిటీస్ లిటిగేషన్, ప్రొడక్ట్ లయబిలిటీ, రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్ల్లో ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీకి గూగుల్, యాపిల్, ఉబెర్ వంటి క్లయింట్లు ఉన్నారు. -
ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్లకూ చట్టాలు
-
యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశాల్లో డైవర్స్ కేసు వేస్తే..!
నాకు పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలవుతోంది. నా భర్త అమెరికాలో ఉద్యోగి. పెళ్లి అయిన తర్వాత నేను కూడా అమెరికాకు వెళ్లాను. అమెరికాలోనే ఒక కొడుకు పుట్టాడు. తర్వాత మాకు మనస్పర్ధలు వచ్చాయి. నన్ను నానారకాల హింసలు పెట్టి అత్తింటి వాళ్లు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. అమెరికాలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. తప్పని పరిస్థితులలో తిరిగి భారతదేశానికి వచ్చేశాను. నా భర్త అమెరికాలో డైవర్స్ కేసు వేశారు అని నాకు నోటీసు వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కేసు వాదించే ఆర్థిక పరిస్థితులలో లేను. నాకు డైవర్స్ వద్దు. తగిన సలహా ఇవ్వగలరు. – సరళ, విజయవాడమీ పరిస్థితి నాకు అర్థం అయింది. మీరు అమెరికాకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీ పెళ్లి భారత దేశంలో జరిగింది అని చె΄్పారు. పెళ్లి తర్వాత కొంతకాలం అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో కూడా డైవర్స్ కేసు వేయవచ్చు అనేది సాధారణ చట్టం. కానీ ఆ డ్డైవర్స్ ఇండియాలో చెల్లాలి అంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీ కేసులో మీరు అమెరికా ΄పౌసత్వం తీసుకోలేదు అని అనుకుంటున్నాను. మీరు ఇరువురు భారతీయ ΄పౌరులు అయి ఉండి, భారతీయ చట్టాల ప్రకారం మీ వివాహం జరిగి ఉంటే, అదనంగా రిజిస్టర్ కూడా చేయబడి ఉంటే కనుక భారతదేశంలో తగిన చర్యలు తీసుకునే వీలు ఉంది. మీ దగ్గరలోని న్యాయవాదిని కలిసి ‘యాంటీ సూట్ ఇంజక్షన్’ వేయమని అడగండి. అయితే మీ కేసులో యాంటీ సూట్ ఇంజక్షన్ వేయవచ్చా లేదా అనేది కేసు పూర్వపరాలు చూసిన తర్వాత నిర్ణయించవలసి ఉంటుంది. ఆ కేసు ద్వారా, మీ భర్తపై భారతీయ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. అతను వేరే ఏ దేశంలో కూడా మీ వివాహానికి సంబంధించిన కేసులు వేయడానికి లేదు అని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. అయితే, తాత్కాలికమైన ఆదేశాలు లభించినప్పటికీ, శాశ్వతంగా మీరు కేవలం భారతదేశ కోర్టులో మాత్రమే కేసులు వేయాలి అని అన్నివేళలా కోర్టులు చెప్పకపోవచ్చు. అందుకే మీ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతానికి మీరు మీ భర్తని డైవర్స్ కేసు వేయకుండా ఆపడానికి, యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు వేయండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: టీన్ప్రెన్యూర్స్: తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగకపోయినా..!) -
చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..?
డాక్టర్ గారూ! నా సమస్య మీకు వింతగా అనిపించవచ్చు. గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా నవలలు, వీక్లీలు... ఒకటేమిటి... ఏ పుస్తకం కనబడినా చదవడం అలవాటైంది. క్లాసు పుస్తకాలు చదువుతుంటే నేను చదివిన నవలల్లోని పాత్రలు, సన్నివేశాలు కళ్ళ ముందు మెదిలి చదవలేక΄ోతున్నాను. దానివల్ల ఆ చదువు ముందుకెళ్ళడం లేదు. ఏదైనా కొత్త పుస్తకం కనబడితే, వెంటనే మొత్తం చదవక΄ోతే, ఏదో పోగొట్టుకున్న భావన కలుగుతుంది. ఆఖరుకు చెత్త కుండీలోని పేపరు ముక్కలు కూడా తీసి చదవందే మనసు నిలకడగా ఉండడం లేదు. ఈ అలవాటును ఎంత మానుకుందాం అనుకున్నా మానలేకపోతున్నాను. దీనివల్ల నేను బీటెక్ పూర్తి చేయలేనేమోనని భయంగా ఉంది. సలహా ఇవ్వగలరు. – చందన, విజయనగరంపుస్తకాలు, నవలలు చదవడం మంచి అలవాటే! కానీ ఏ అలవాటైనా అతిగా చేయడం మంచిదికాదు. కొత్త పుస్తకం కనబడిన వెంటనే మొత్తం చదవాలనే తపన, చదవక΄ోతే ఏదో తెలియని అలజడి ఇవన్నీ ఒక ఎత్తైతే, చివరకు చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా ఏరుకుని చదవందే ఉండలేక΄ోవడమనేది ఖచ్చితంగా ఒక మానసిక రుగ్మతే! ‘ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అనే మానసిక జబ్బుకు లోనైనవారే ఇలా ప్రవర్తిస్తారు. అలా అతిగా చదవాలనే తపన పడటం, ఆ అలవాటును మీరు మానుకోవాలనుకున్నా మానుకోలేకపోవడం ఈ మానసిక సమస్య ముఖ్య లక్షణం. మెదడులోని ‘సెరొటోనిన్’ అనే ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు, మీరు చెప్పిన లాంటి లక్షణాలు బయటపడతాయి. ‘క్లోమిప్రెమిన్ ప్లూ ఆక్సిటెన్’ అనే మందుల ద్వారాను, ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారానూ ఈ సమస్య నుంచి మిమ్మల్ని పూర్తిగా బయట పడేయవచ్చు. మీరు వెంటనే మంచి సైకియాట్రిస్ట్ట్ను కలిస్తే మీ సమస్యకు తగిన చికిత్స చేస్తారు. మీరు మీ బీటెక్ చదువు త్వరలోనే విజయవంతంగా పూర్తి చేయగలరు. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్!ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: ఇదేం నిరసన..!'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’) -
Iraq: బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు ప్రతిపాదన
అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు.కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లు ఆమోదం పొందితే, 9 ఏళ్లలోపు బాలికలు మరియు 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు, ఇది పెరిగిన బాల్య వివాహాలు మరియు దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు.మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకారం, ఇఆరక్లో 28శౠతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలుజరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
వక్ఫ్ బోర్డులోకి మహిళలు, ముస్లిమేతరులు !
న్యూఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులకు కేంద్రం నడుంబిగించింది. ఇందులోభాగంగా వక్ఫ్ బోర్డుల పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లి మేతరులకు చోటు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం,1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్,1995గా మార్చుతూ వక్ఫ్ (సవరణ)బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సంబంధిత బిల్లు వివరాలు మంగళవారం లోక్‌సభ సభ్యులకు అందాయి. ఆ బిల్లులోని అభ్యంతరాలు, అందుకు కారణాల జాబితా ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని తొలగించనున్నారు. ఏదైనా ఆస్తి వక్ఫ్‌కు చెందినదిగా నిర్ణయించే అధికారం ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఇంతటి అపరిమిత అధికా రాలను తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో భిన్న వర్గాలకు, ముస్లిం పురుషులతోపాటు మహిళలు, ముస్లిమేత రులకూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ముస్లింలలో బోరా, అగాఖనీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ ఔఖాఫ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కనీసం ఐదేళ్లుగా ఇస్లామ్ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తిని దానంగా ఇస్తేనే దానిని ‘వక్ఫ్’గా పేర్కొనాలని ‘వక్ఫ్’ పదానికి బిల్లు కొత్త నిర్వచనం ఇచ్చింది. -
పోటీ పరీక్షలు.. ప్రమాణాలు పాతాళంలో
దేశంలో ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్ మార్కులు తగ్గించుకుంటూపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో రాజీ పడుతున్నారు. జీరో మార్కులు వచ్చిన వారు కూడా ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో అడ్మిషన్ పొందే పరిస్థితి ఉంది. సీట్ల భర్తీ కోసం కటాఫ్‌లు తగ్గించుకుంటూ పోవడం వల్ల ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతాయి. ఇది దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రొఫెషనల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కనీస ప్రమాణాలు పాటించాలని చెబుతున్నారు.. కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోర్సుల్లో పడిపోతున్న ప్రమాణాలపై ఆయన అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) కటాఫ్‌ను తగ్గించేందుకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏఐబీఈ కటాఫ్‌ను తగ్గించడం వల్ల న్యాయ విద్యలో ప్రమాణాలు పడిపోతాయని పేర్కొంది. ‘‘పరీక్ష నిర్వాహకులు.. ఏఐబీఈ జనరల్ కేటగిరీ కటాఫ్ 45 మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు కటాఫ్ 40 మార్కులుగా నిర్ణయించారు.ఆ మాత్రం కూడా స్కోర్ చేయకుంటే లాయరుగా ఎలా రాణించగలరు. మీరు దాన్ని ఇంకా 40, 35కు తగ్గించాలని కోరుతున్నారు.. దయచేసి చదవండి’’ అంటూ ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తి మనందరి తరఫున మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల్లో పడిపోతున్న ప్రమాణాలు, అర్హత మార్కులు, తగ్గుతున్న ఉత్తీర్ణత ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నేషనల్ లా యూనివర్సిటీలు2022 సర్క్యులర్‌లో నేషనల్ లా యూనివర్సిటీల కన్సారి్టయం ప్రతి కే టగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు ఐదు రెట్ల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. దీని అర్థమేమిటంటే.. వారు కనీస ప్రమాణాలను కూడా వదిలేసి ప్రతి సీటుకు ఐదుగురిని పిలవాలని నిర్దేశించారు. ప్రవేశానికి కనీస మార్కులు నిర్దేశించకపోవడం వల్ల కనీసం నాణ్యత లేని విద్యార్థి కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. 2023లో 40 వేల కంటే ఎక్కువ ర్యాంకు వచి్చన విద్యార్థులు సైతం ఎన్ఆర్ఐ కోటాలో నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే వీలు కలిగింది. 150కు 15–17 మార్కుల(10 శాతం మార్కులు)మధ్య వచి్చన విద్యార్థులు కూడా జాతీయ లా వర్సిటీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా అడ్మిషన్ పొంది.. ఈ దేశంలో లాయర్‌గా మారే అవకాశం ఏర్పడింది. నీట్ పీజీ 2023 2023లో నీట్ పీజీకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య.. 2,00,517. ఆ ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 47,526. మొత్తం 800 మార్కులకు పరీక్ష జరిగింది. 2023లో తొలుత కటాఫ్ 291 మార్కులు(36 శాతం). ఆ తర్వాత కౌన్సెలింగ్ కొనసాగుతున్న కొద్దీ కటాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చి.. చివరకు జీరోగా నిర్ణయించారు. అంటే.. పరీక్షకు హాజరైతే చాలు.. మెడికల్ పీజీలో ప్రవేశం పొందొచ్చన్నమాట! ఇది ఒకరకంగా ప్రవేశ పరీక్షను చంపివేయడంలాంటిదే!! ప్రస్తుతం పలు మెడికల్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థుల్లో జీరో మార్కులు వచి్చన వారుకూడా ఉండొచ్చు. నీట్ యూజీ ⇒ 2020లో మొత్తం 13,66,945 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరైతే.. కటాఫ్ 147( మొత్తం 720 మార్కులకు(20.4 శాతం)గా నిర్ణయించారు. ఆ సంవత్సరం మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 93,470. కానీ డెంటల్ సీట్లు భర్తీ కాకపోవడంతో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ ఏడాది కటాఫ్‌ను 113కు తగ్గించింది. దీంతో 15.7 శాతం మార్కులు వచి్చన వారికి కూడా సీటు లభించింది. ⇒ అదే విధంగా 2021లో మొత్తం 15,44,273 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం మెడికల్ సీట్లు 99,695 ఉన్నాయి. ఆ ఏడాది కటాఫ్ 138(19.2 శాతం). కాని ఆయుష్ సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ కటాఫ్‌ను 122కు తగ్గించింది. అంటే 17% మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సీటు పొందొచ్చు. ఇలా సీట్లు భర్తీ చేయడం కోసం కటాఫ్ తగ్గిస్తూ నాణ్యత విషయంలో రాజీపడుతున్నారు. నీట్ ఎండీఎస్ 2023ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్.. ఎండీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 960. మొత్తం సీట్లు 6,937. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23,847. దీనికి కూడా సీట్ల భర్తీ కోసం 2021 నుంచి కటాఫ్ తగ్గించుకుంటూ వస్తున్నారు. నీట్ సూపర్ స్పెషాలిటీదేశంలో నీట్ సూపర్ స్పెషాలిటీలో మొత్తం సీట్ల సంఖ్య 4,243. ఈ పరీక్షకు 2023లో వచ్చిన దరఖాస్తులు 19,944. 2023లో మొదటి రౌండ్లో కటాఫ్ 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్లు భర్తీకాలేదు. దీంతో రెండో రౌండ్లో కటాఫ్‌ను 20 పర్సంటైల్‌కు తగ్గించారు. అయినా సీట్లు నిండలేదు. ఇక చివరగా స్పెషల్ రౌండ్లో అర్హతను జీరో పర్సంటైల్‌గా నిర్ణయించారు.మెడికల్, లాకే పరిమితం కాలేదు..వాస్తవానికి ఈ అర్హత మార్కులు తగ్గింపు అనేది లా, మెడికల్‌కే పరిమితం కాలేదు. 2018 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఐఐటీల్లో ప్రతి విభాగం, ప్రతి కేటగిరీకి సంబంధించి సీట్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు అందుబాటులో ఉండేలా కటాఫ్‌ను తగ్గించాలని ఆదేశించింది. అంటే.. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 10వేల సీట్లకు 20 వేలమంది విద్యార్థులను జోసా కౌన్సెలింగ్ పిలుస్తారు. దీనికోసం అడ్మిషన్ బోర్డు అర్హత మార్కులను 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఏకంగా 10 శాతం తగ్గించారు. దీంతో తొలుత మెరిట్ లిస్ట్‌లో 18,138 మంది మాత్రమే ఉండగా.. కొత్తగా 13,842 మంది విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇలా మొత్తంగా పదివేల సీట్ల కోసం 31,980 మంది విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. -
నూతన చట్టాలతో సత్వర న్యాయం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ కొత్త చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలంగాణ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ బి.నర్సింహ శర్మ అన్నారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉలూం లా కాలేజీలో అన్లాకింగ్ ‘కొత్త దిశలు–భారత దేశం క్రిమినల్ చట్టాలు’ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు చాలా బాగున్నాయన్నారు.ఇవి సామాన్యులకు సత్వర న్యాయం జరిగే విధంగా రూపొందించడం అభినందనీయమన్నారు. గత చట్టాల్లో లేని ఎన్నో అంశాలను ప్రస్తుత చట్టాల్లో ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ప్రస్తుతం చట్టాల్లో ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. టెర్రరిస్టు యాక్టివిటీలు, ఆర్గనైజ్డ్ క్రైం చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు.ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రస్తుతం సెక్షన్లలో ప్రమాదానికి కారణమై బాధితులను ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి శిక్ష తగ్గుతుందని.. అలా కాకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయే వారికి కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఓయూ లా కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జీబీ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణమాచారి, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (లాసెట్)లో ఈ ఏడాది 72.66 శాతం మంది అర్హత సాధించారు. మూడేళ్ల కాలపరిమితి ఉన్న లా కోర్సులో 73.27 శాతం, ఐదేళ్ల లా కోర్సులో 65.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పోస్టు–గ్రాడ్యుయేషన్ లాసెట్ (పీజీఎల్‌సెట్)లో 84.65 శాతం మంది అర్హత సాధించారు. లాసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా లాసెట్ కన్వినర్ బి.విజయలక్ష్మి మాట్లాడుతూ, మూడేళ్ల లా కోర్సుకు 27,993 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 25,510 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఐదేళ్ల కోర్సుకు 8,412 మంది హాజరుకాగా, 5,478 మంది ఉత్తీర్ణులయ్యారని, పీజీఎల్‌సెట్‌కు 3,863 మంది హాజరుకాగా, 3,270 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. లాసెట్, పీజీఎల్‌సెట్‌కు ఈసారి మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకోగా, 40,268 మంది హాజరయ్యారని చెప్పారు.వారిలో 29,258 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి లాసెట్‌కు ఐదుగురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు హాజరైన నలుగురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ జి.బి.రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వి.వెంకటరమణ, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. టాపర్లు వీరే.. మూడేళ్ల లా కోర్సులో హైదరాబాద్‌కు చెందిన పీజీఎం అంబేడ్కర్ 97.49 మొదటి ర్యాంకు, గచ్చిబౌకి చెందిన ప్రత్యూష్ సరస 96.65 రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తల్లూరి నరేష్ 95.74 మార్కులతో మూడు ర్యాంకు సాధించారు. అలాగే ఐదేళ్ల లా కోర్సులో మియాపూర్‌కు చెందిన శ్రీరాం బొడ్డు 87 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, కామారెడ్డికి చెందిన పిప్పిరిశెట్టి దినేష్ 87 మార్కులతో రెండో ర్యాంకు, మల్కాజిగిరికి చెందిన ఆర్పీ విజయనందిని 84 మార్కులతో మూడు ర్యాంకు పొందారు. పీజీఎల్‌సెట్‌లో సికింద్రాబాద్‌కు చెందిన పెరి బాలసాయి విష్ణువర్ధన్ 76 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన అభినీతి జాసన్ 70 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిమన్ సిన్హా 67 మార్కులతో మూడో ర్యాంక్ సాధించారు. -
‘శెభాష్ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం
న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు. సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో మాస్టర్స్ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్షిప్ లభించింది. ఆమె తండ్రి అజయ్ సమాల్ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. -
సుప్రీంకోర్టులో వంటమనిషి కుమార్తె ప్రతిభ : ప్రశంసల వెల్లువ
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వంట మనిషి పుత్రికోత్సాహంతో మునిగి తేలు తున్నారు. తనను చదివించడానికి నాన్న కష్టాన్ని గమనించిన ఆయన కుమార్తె ప్రగ్యా పట్టుదలతో చదివింది. అమెరికాలోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదవడానికి ఎంపిక అయింది. అంతేకాదు స్కాలర్షిప్ కూడా సాధించింది. దీంతో ప్రగ్యా తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రగ్యా తల్లిదండ్రులను సత్కరించారు. ప్రగ్యా ప్రతిభను కొనియాడారు. ఆమెకు స్వీట్లు అందించారు. దీంతో అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో ఆమెను అభినందించారు. ఉన్నత చదువులకు కష్టపడి ముందుకు వెళ్లాలను కుంటే, అందుకున్న సంబంధిత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. VIDEO | Chief Justice of India DY Chandrachud felicitates Pragya, who is daughter of a cook in the Supreme Court. She recently got a scholarship to study masters in law in two different universities in the US. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/0S8RVMOxjN — Press Trust of India (@PTI_News) March 13, 2024 -
ఆమె మదర్ ఆఫ్ 'పిల్'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!
మనం తరుచుగా న్యాయవ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) గురించి వింటుంటాం. అసలు ఇది ఎలా వచ్చింది? దీన్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసా?. ఈ పిల్ మన దేశ న్యాయవ్యస్థ గతినే మార్చేసింది. చెప్పాలంటే న్యాయవ్యవస్థలో ఓ మూలస్థంభంగా ఉంది. ఈ రెండు అక్షరాల 'పిల్' అనే పదం ఎంతోమందికి న్యాయం చేకూర్చడమే గాక, సమాజంలో గొప్ప మార్పుకి నాంది పలకింది. ఈ 'పిల్' ఓ మహిళ న్యాయవాది మహోన్నత కృషి. ఆమె కథ ఎందరో యువ న్యాయవాదులకు స్ఫూర్తి. తన జీవితమంతా న్యాయం కోసం అర్పించిన ఆ స్ఫూర్తి ప్రదాత గాథ ఏంటంటే.. భారత న్యాయవాది పుష్ప కపిలా హింగోరాణిని 'మదర్ ఆఫ్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(పిఐఎల్)' లేదా 'ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం' తల్లిగా పిలుస్తారు. ఆమె 1927 నైరోబీలో జన్మించింది. విద్యాభ్యాసం అంతా కెన్యా, యూకేలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత 1947లో న్యాయవాద వృత్తిని అభ్యసించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ క్రమంలోనే 1979లో బీహార్‌లోని అండర్ ట్రయల్ ఖైదీల దుస్థితి గురించి వచ్చిన వార్తపత్రక కథనాలను చూసి చలించిపోయింది. ఈ చట్టాలన్నీ బాధితులు లేదా వారి బంధువులు మాత్రమే పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతిస్తున్నాయనే విషయం ఆమెకు తెలిసింది. దీని కారణంగా అభాగ్యులు, బలహీన వర్గాల ప్రజలు ఎలా చట్టపరమైన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారనేది గమనించారు. ఈ అంతరాన్ని పరిష్కరించేలా బిహార్ జైళ్లలోని అమానవీయ పరిస్థితులను సవాలు చేస్తూ అండర్ ట్రయల్ ఖైదీల తరుపును హింగోరాణి తొలిసారిగా ఈ 'పిల్'ని దాఖలు చేశారు. ఇది హుస్సేనారా ఖాటూన్ కేసుగా భారతీయ న్యాయ చరిత్రలో ఓ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆ 'పిల్' కాస్తా సామాజిక న్యాయం కోసం ఒక శక్తిమంతమైన సాధనంగా అవతరించింది. ఇది ఎందరో అభాగ్యులకు వరమై చట్టపరమైన పరిహారం పొందేలా చేసింది. క్రమంగా ఆ పిల్ న్యాయవ్యవస్థలో కీలక మూలస్థంభంగా మారిపోయింది. ఈ పిల్‌తోనే ఎన్నో సమస్యలను పరిష్కరించారు హింగోరాణి. ఈ 'పిల్'తో వాదించిన కేసులు మహిళల హక్కులు: లింగ సమానత్వం కోసం పోరాడారు. అలాగే వరకట్నం వంటి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. పర్యావరణ పరిరక్షణ: ఆమె కాలుష్యనికి కారణమయ్యే పరిశ్రమలను సవాలు చేస్తూ..సహజ వనరుల పరిరక్షణ కోసం వాదించింది. జైలు సంస్కరణలు: ఆమె ఖైదీల హక్కులు, జైలు పరిస్థితుల కోసం కూడా వాదించారు శిశు సంక్షేమం: ఆమె బాలల రక్షణ కోసం పోరాడటమే గాక బాల కార్మిక పద్ధతులను సవాలు చేశారు. సమాచార హక్కు: ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం వాదించారు. తమ గోడును చెప్పుకోలేక, న్యాయం పొందలేని బలహీన వర్గాల వారికి హింగోరాణి శక్తిమంతమైన గొంతుగా మారారు. ఆమె అవిశ్రాంతంగా న్యాయం కోసం నిబద్ధతగా నిలిబడి సాగించిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సంత్కరించి ప్రశంసించింది. హింగోరాణి కథ సమాజంలో తెచ్చే శక్తిమంతమైన మార్పుకి నిదర్శనం. అంతేగాదు న్యాయం కోసం ఎలా నిబద్ధతగా వ్యవహరించి పోరాడాలో అనేందుకు కూడా ఆమె ఒక ప్రేరణ. (చదవండి: ఎవరీ సోమా మండల్? ఆమె వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్‌గా..! -
దానం ధర్మం
దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది. దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట. ‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు. ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది. కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి. ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి. మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
సమస్య తొమ్మిది నెలలేనా?
ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్‌కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి. అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్‌కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్‌పార్టమ్ సైకోసిస్‌కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్‌ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది. తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్‌కు తగిన కారణాలని చెప్పాలి. అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం. అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్‌కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్‌లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం. గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం. మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి. అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి. గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అబార్షన్‌ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్‌కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా? -వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) బోధకులు -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
వ్యక్తిగత డేటా సేఫ్‌గానే ఉందా?.. తెలియాలంటే..
వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్‌మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత డిజటల్ హక్కులలో... యాక్సెస్ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే... ఆన్లైన్ షాపింగ్: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్ నెంబర్, క్రెడిట్‌కార్డ్ వివరాలు, ప్రొడక్ట్ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. డేటింగ్ యాప్‌లు... పేరు, జెండర్, వయసు, సెక్కువల్ ఓరియెంటేషన్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ చాట్, పొలిటికల్ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్ డివైజ్ సమాచారం, ఐపీ అడ్రస్.. ఈ యాప్ ద్వారా బహిర్గతం అవుతాయి. సెర్చ్ ఇంజిన్లు.. ఆన్లైన్ సెర్చింగ్, బ్రౌజింగ్ హిస్టరీ, ఆన్లైన్ ఆసక్తులు, షాపింగ్ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, పరికర సమాచారం, డౌన్లోడ్ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్ యాడ్–ఆన్లు.. ద్వారా జరుగుతుంటుంది. సోషల్ మీడియా.. పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, ఫైల్స్, ఫోన్ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్ గ్రూప్, గ్రూప్ చాట్స్, పోస్టులు, ట్యాగ్ చేసిన ఫొటోలు అండ్ వీడియోలు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతుంటాయి. గుర్తించదగిన సమాచారం.. మీ పుట్టిన రోజు లేదా ఫోన్ నెంబర్ వంటివి పబ్లిక్ రికార్డ్‌లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సురక్షిత చర్యలు.. చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి. భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్ 69 బి) సెక్షన్ 69ఎ సి) సెక్షన్ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్ వర్డ్స్ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఫిషింగ్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయరాదు. డేటా కేర్ సాఫ్ట్వేర్/యాప్స్‌ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ∙ మీ బ్రౌజర్‌ని అప్డేట్ మోడ్‌లో ఉంచాలి. https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయాలి https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్ పూర్తి హెడర్‌ను చెక్ చేయాలి మీ యాప్‌లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్ చేయాలంటే.. మీ ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ల్లో సెర్చ్ చేయచ్చు. (a) https://amibeingpwned.com (b) https://snusbase.com (c) https://leakcheck.net (d) https://leaked.site (e) https://leakcorp.com/login (f) https://haveibeensold.app. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..) -
తినే హక్కు గురించి కదా అడగాలి?
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్‌లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం. పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే. వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు? ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు. అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ -
జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామ్‌లో టాపర్‌గా పాన్‌షాప్ యజమాని కూతురు!
సామాన్యుల పిల్లలు అసామాన్య ప్రతిభతో టాప్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలతో పోటీ పడి విజేతలయ్యారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. సాధించాలనే తపన ఉంటే ఎవ్వరైన విజయం సాధించొచ్చు అని చూపిన ఘటనలు అవి. అదే కోవకు చెందింది ఉత్తరప్రదేశ్‌కి చెందిన నిషి గుప్తా. ఆమె ప్రతిష్టాత్మకమైన జ్యూడీషియల్ సర్వీసెస్‌లో సత్తా చాటి టాపర్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన నిషి గుప్తా పాన్ షాప్ యజమాని కూతురు. ఆమె బుధవారం ప్రకటించిన ప్రోవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్‌లో సత్తా చాటింది. ఏకంగా ప్రథమ స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకుంది నిషి గుప్తా. తొలి ప్రయత్నంలోనే నిషి ఈ పరీక్షలో ఉత్తీర్ణ సాధించడం విశేషం. లాలో గ్రాడ్యుయేట్ చేసినవారందరూ ఈ పరీక్షకు అర్హులు. ఇది జడ్డిలుగా ఎంపిక చేయడానికి పెట్టే ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్. ఆ పరీక్షలో నిషి గుప్తా ప్రథమ స్థానం దక్కించుకుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని జిల్లా, మెజిస్ట్రేట్, అటర్నల్ జనరల్, సబ్ మెజిస్ట్రేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితరాలుగా ఎంపిక అవ్వుతారు. వీరిని హైకోర్టు ఎంపిక చేస్తుంది. ఇక నిషి పాఠశాల విద్యను ఫాతిమా కాన్వెంట్లో పూర్తి చేసింది. ఇక గ్రాడ్యేయేషన్ని 2020లో పూర్తి చేసింది. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్య యోగినాథ్ ఉత్తరప్రదేశ్ ప్రోవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన తమ రాష్ట్ర అభ్యర్థులందర్నీ అభినందించారు. ఈ పరీక్షలో 55 శాతం మంది బాలికలు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. కుమార్తెలు మమ్మల్ని గర్విచేలా చేశారని అభినందించారు కూడా. (చదవండి: ఆ ఏజ్‌లో లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను చూసి.. షాకవ్వడం ఖాయం!) -
ఢిల్లీ చట్టంపై మళ్లీ రగడ
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మళ్లీ గ్యాప్‌ను పెంచుతోంది. దేశ రాజధానిలో పోస్టింగ్‌లు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పక్కకు పెడుతూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచచింది. దీనిపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీ సెషన్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కొత్త చట్టాలను తీసుకురావడంపై ఆప్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేశాయి. ఈ బిల్లును సుప్రీంకోర్టులోనూ సవాలు చేసింది ఆప్. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సెషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ సక్సేనా ఆగష్టు 11నే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖను పంపించారు. ఈ లేఖకు సంబంధించిన ఓ కాపీని ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసెంబ్లీకి సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలు నియమాలకు అనుగణంగానే జరుగుతన్నాయని రాఖీ బిర్లా తెలిపారు. ఎప్పుడు సమావేశం కావాలనేది పూర్తిగా విధాన సభ విశేషాధికారమని పేర్కొన్నారు. క్యాబినెట్ పిలుపు మేరకే చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఎల్జీ సక్సేనా ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం పాలసీపై కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిన సందర్భంలోనూ గత ఏప్రిల్‌లో అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు కూడా ఎల్జీ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. ఇదీ చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్‌బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్‌కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్‌ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్‌లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
స్వదేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.! పాకిస్థాన్ కొత్త చట్టం..
పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మళ్లీ తన సొంత దేశానికి రావడానికి మార్గం సుగమం అయింది! చట్టసభ్యుల అనర్హతపై కాలపరిమితిని నిర్ణయిస్తూ పాక్ కేంద్ర అసెంబ్లీ చట్టం తీసుకువచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ మేరకు చట్టం తీసుకురావడం గమనార్హం. చట్ట సభ్యులపై ఐదేళ్లకు మించి అనర్హత వేటు వేయడానికి అవకాశం లేనివిధంగా చట్టాన్ని సవరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ సవరణపై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధికీ సంజ్రాణి సంతకం కూడా చేసి ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అయితే.. హజ్ యాత్రలో ఉన్న అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ లేని సమయంలో ఈ చట్టం తీసుకురావడం గమనార్హం. ఇదీ చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే.. బ్రిటన్‌లో నవాజ్ షరీఫ్.. అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే.. 2019లో ఆరోగ్య రీత్యా బెయిల్‌పై విడుదలయిన నవాజ్ షరీఫ్.. బ్రిటన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పాక్ రాజకీయాలను బ్రిటన్ నుంచే తెరవెనక ఉండి శాసిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు. మళ్లీ రాజకీయాల్లోకి.. గతేడాది విశ్వాస పరీక్షలో ఓడి ఇమ్రాన్ ఖాన్ పదవీత్యుడయ్యాక.. నవాజ్ షరీఫ్ సోదరుడు సెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, తన సోదరున్ని స్వదేశానికి తీసుకురావాలని సెహబాజ్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని అధికార PML-N పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ రాజకీయంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్ -
మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక: కర్ణాటకాలో కొత్తగా కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. జులైలో ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'కేబినెట్లో మతమార్పిడి బిల్లుపై చర్చ జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. జులై 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టనున్నాము'అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. మోసపూరిత మార్గాల ద్వారా మత మార్పిడీకి పాల్పడకుండా 'మతమార్పిడి నిరోధక చట్టాన్ని' బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 2021 డిసెంబర్లో తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రలోభానికి గురిచేసి మత మార్పిడీకి పాల్పడకుండా అడ్డుకట్ట వేసింది అప్పటి ప్రభుత్వం. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టాలను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
చట్ట ప్రకారం చట్టానికి తూట్లు.. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇదే..
రామోజీరావు మార్గదర్శిలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఆయన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వెల్లడించారు. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తూ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా రామోజీ చూశారని వివరించారు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలు ఆయన మాటల్లోనే.. 2,600 మంది కస్టమర్ల సొమ్ముని వెంటనే కట్టాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికప్పుడు సొమ్ములు తిరిగి వెనక్కు తీసుకురాలేని తరుణంలో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో రామోజీరావు చర్చలు జరిపారు. అయితే అంత పెద్దమొత్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రామోజీ.. చంద్రబాబుని సంప్రదించారు. ఆయన రిలయన్స్ని, నిమేష్ అంబానీ అనే బ్రోకర్ని పట్టుకున్నారు. రామోజీ సంస్థల షేర్లు ఒక్కోటి రూ.500గా ఉంటే రూ.5 వేలుగా చూపించి నిధులు తెచ్చారు. తద్వారా 2,600 మంది కస్టమర్లలో కొంతమందికి చెల్లించారు. అయితే ఎంతమందికి ఇచ్చామనే వివరాల్ని ఇప్పటికీ రామోజీ బయటపెట్టలేదు. పైగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదిస్తుంటారు. అంత పెద్ద వ్యక్తిపైన ఫిర్యాదు చేస్తే.. తమ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే డిపాజిటర్లు వెనకడుగు వేశారు. అది కూడా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్రమత్తమవ్వడంతోనే కొంతమందికి చెల్లించారు. మూడో వ్యక్తికి తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు.. మార్గదర్శిలో మేనేజర్లు అకౌంట్స్ చేయడం, రిజిస్టర్స్ నిర్వహించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. వారందర్నీ రామోజీ డమ్మీలుగా చేసేశారు. ఏ బ్రాంచ్‌లో డబ్బులు వచ్చినా ప్రధాన కార్యాలయానికి పంపించాలనే హుకుం జారీ చేశారు. వివిధ జిల్లాల్లో వసూలైన చిట్స్ డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. ఏ జిల్లాలో ఎన్ని డిఫాల్టులుఉన్నాయి.. ఎంత మొత్తం వస్తుంది.. అనేది ఎవరికీ తెలీదు. రామోజీ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా చూశారు. ఇందులో ఏం జరుగుతుందనేది మూడో వ్యక్తికి కూడా తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే.. బ్రేక్ ది లా.. లాఫుల్లీ. అంటే.. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తుంటారు. చదవండి: కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు? -
డాక్టర్ చదువుల్లో సమానం!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో మహిళలు దూసుకెళ్తున్నారు. కొన్ని కోర్సుల్లో యువకులను మించి యువతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక 2022 వెల్లడించింది. దేశంలో 1,59,69,571 మంది యువకులు, 1,50,77,414 మంది యువతులు ఉన్నత విద్య అభ్యసిస్తుండగా ఆర్ట్స్, సైన్స్, మెడికల్, సోషల్ సైన్స్ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉంది. కామర్స్, ఐటీ, కంప్యూటర్స్, మేనేజ్మెంట్, న్యాయవాద విద్యలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ♦ బీఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు (పురుషులు) 109 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఈడీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 182 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఎస్సీ (నర్సింగ్‌లో)లో అత్యధికంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 308 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంబీబీఎస్‌లో పురుషులతో సమానంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 100 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థినులున్నారు. ♦ మ్‌కాంలో ప్రతి వంద మంది విద్యార్థులకు 198 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎమ్మెస్సీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 156 మంది విద్యార్థినులున్నారు. ♦ బీటెక్‌లో ప్రతి వంద మంది విద్యార్థులకు అత్యల్పంగా 40 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎల్ఎల్బీలో కూడా యువతులు తక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది విద్యార్థులకు 49 మంది విద్యార్థినులున్నారు. -
వేరబుల్ గ్యాడ్జెట్స్‌కి నిబంధనలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టం విధి విధానాలకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తొలిసారిగా పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు నిర్వహించారు. స్పై కెమెరా గ్లాసెస్, వేరబుల్ డివైజ్‌లు వంటి గ్యాడ్జెట్లు సేకరించే డేటాను హ్యాండిల్ చేయడానికి సంబంధించి నిబంధనలపైనా చర్చించారు. వీటిని విక్రయించే దశలోనే కేవైసీ (కస్టమర్ల వివరాల సేకరణ) నిబంధనలను వర్తింపచేయడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మరో రెండు విడతల సంప్రదింపుల తర్వాత డిజిటల్ ఇండియా చట్టం ముసాయిదా పూర్తి కాగలదని, ఏప్రిల్‌లో దీన్ని జారీ చేసే అవకాశం ఉందని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సుమారు 45–60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత జూలై నాటికల్లా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని మంత్రి చెప్పారు. -
లంచగొండి అధికారులకు శిక్షలు పడాల్సిందే
న్యూఢిల్లీ: అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లంచగొండి అధికారికి వ్యతిరేకంగా నేరుగా సాక్ష్యాలు లేని సందర్భాల్లో ఇతరత్రా సాక్ష్యాధారాలతో శిక్ష ఎలా ఖరారుచేయాలనే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పై విధంగా స్పందించింది. లంచం తీసుకున్న కేసులో అవినీతి ప్రభుత్వ అధికారి అక్రమంగా లబ్ధి పొందాడనే బలమైన సాక్ష్యాలు, డాక్యుమెంట్లు లేకున్నా ఆ నేరంలో అతడికి ప్రమేయముందని తెలిపే నమ్మదగ్గ సాక్ష్యాలుంటే సరిపోతుందని, అతనిని దోషిగా నిర్ధారిస్తామని జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బీఎస్ నాగరత్నల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి అధికారులకు శిక్ష పడేలా చేసేందుకు ఫిర్యాదుదారులు, ప్రభుత్వ లాయర్లు అంకితభావంతో కృషిచేయాలని కోర్టు సూచించింది. లంచగొండి అధికారులను పక్కకు తప్పిస్తేనే అవినీతిరహిత పాలన సాధ్యమవుతుందని ధర్మాసనం పేర్కొంది. ‘ప్రాథమిక, బలమైన సాక్ష్యాలు, ఆధారాల లేని పక్షంలో, ఫిర్యాదుదారులు, బాధితుడు మరణించినా లేదా భయంతో ఫిర్యాదుదారు విచారణ సమయంలో సాక్ష్యం చెప్పలేకపోయినా నిందితుడికి నేరంలో ప్రమేయముందని తెలిపే మౌఖిక, నమ్మదగ్గ ఇతరత్రా సాక్ష్యాలు ఉన్న సరిపోతుంది. ఆ అధికారిని దోషిగా తేలుస్తాం. కేసు విచారణలో ప్రభుత్వ అధికారిని శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ ఆ అధికారి లంచం అడగడానికి, లబ్ధి పొందడానికి పూర్తి అవకాశం ఉందనేది మొదట నిరూపించగలిగితే చాలు’ అని కోర్టు పేర్కొంది. -
Yes Means Yes: రేప్ అర్థం మారిందక్కడ!
మీ పక్కన ఒకరు ఉన్నారు. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సు నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండావాళ్ల ఇంట్లోకి వెళ్లలేం కదా!.. అత్యాచారం విషయంలోనూ అంతే!. సోమవారం స్విట్జర్లాండ్ పార్లమెంట్లో లైంగిక నేరాల చట్టంపై చర్చ సందర్భంగా 32 ఏళ్ల ఓ మహిళా చట్ట సభ్యురాలు ప్రస్తావించిన అంశం ఇది. స్విట్జర్లాండ్‌లో రేప్(అత్యాచారం) నిర్వచనం మారింది. కొన్ని పరిమితులుగా ఉన్న అర్థాన్ని విస్తరించి.. లైంగిక నేరాల చట్టంలో కొత్త నిర్వచనం అందించింది అక్కడి చట్ట సభ. సోమవారం దిగువ సభలో నాటకీయ పరిణామాల నడుమ జరిగిన ఓటింగ్‌లో స్వల్ఫ మెజార్టీతో ఆమోదం పొందింది ఇది. బలవంతంగా స్త్రీ జననాంగంలోకి పురుషాంగాన్ని చొప్పించడం.. లైంగిక దాడి సమయంలో బాధితురాలు ఒక నిర్దిష్ట స్థాయి ప్రతిఘటన ఎదుర్కొంటేనే ఇక నుంచి స్విట్జర్లాండ్‌లో అత్యాచారంగా పరిగణిస్తారు. సాధారణంగా.. రేప్ కేసుల్లో బాధితురాలి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ అఘాయిత్యానికి ఓ నిర్దిష్టత అంటూ ఇవ్వలేకపోతుంటారు. అత్యాచారం ఎలా జరిగింది? బాధితులు ఎవరు?.. వాళ్లు ఏ స్థాయిలో ప్రతిఘటించారు?.. ఇలాంటివేం పట్టించుకోరు. అలాగే.. స్విట్జర్లాండ్‌లో ఇంతకు ముందు అన్ని రకాల లైంగిక దాడుల నేరాలను.. అత్యాచారం కింద పరిగణలోకి తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై ఒక నిర్దిష్టమైన కొలమానాన్ని ఇవ్వబోతున్నారు. పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యలను కూడా అత్యాచారాలుగా చూపించడం, అవతలి వాళ్లను ఇరికించే యత్నాల కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఏ నేరమూ చేయని వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే.. అత్యాచారానికి ఒక నిర్దిష్టత ఇవ్వాలని అక్కడి చట్ట సభ భావించింది. అయితే సమ్మతిని ఎలా కొలవాలనే దానిపై స్విట్జర్లాండ్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘‘నో మీన్స్ నో’’ అనే విధానం కోసం వాదించారు కొందరు. ఒకరు స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అది అత్యాచారంగా పరిగణించబడుతుంది అనేది ఈ వాదనకు అర్థం. అయితే.. కొత్త నిర్వచనం వల్ల నేరంపై సంక్లిష్టత నెలకొంటుందని చెప్తున్నారు. పార్లమెంటు ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఈ ఏడాది ప్రారంభంలో ఈ విధానానికి ఓటు వేసింది. కానీ దిగువ నేషనల్ కౌన్సిల్ సోమవారం ఓటు వేసినప్పుడు, లైంగిక చర్యలకు స్పష్టమైన సమ్మతి అవసరమయ్యే మరింత తీవ్రమైన మార్పును ఎంచుకుంది. అంటే.. పరస్పర అంగీకారం ఉంటే అదసలు అత్యాచారం ఎలా అవుతుందనేది.. ఇక్కడ ప్రధాన చర్చ. తాజా సోమవారం ‘యస్ మీన్స్ యస్’(ఒక రకంగా పరస్పర ఆమోదం.. అంగీకారం అన్నట్లే!) చట్టానికి 99 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. 88 మంది వ్యతిరేకంగా, ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక సోమవారం చర్చా వేదిక సందర్భంగా దిగువ సభ హీటెక్కింది. మీ పక్క వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సుల నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండా వాళ్ల ఇంట్లోకి ప్రవేశించలేరు కదా! బలవంతం చేస్తే తప్ప.. అంటూ 32 ఏళ్ల పార్లమెంటేరియన్ తమారా ఫునిసియెల్లో ప్రసంగించారు. నా ఒంటి కంటే.. ఇళ్లు, వ్యాలెట్‌నే ఎందుకు అంత భద్రంగా దాచుకోవాలి.. అంటూ ప్రశ్నించారామె. ఇక గ్రీన్స్ ఎంపీ రాఫెల్ మహిమ్ సైతం తమారాతో ఏకీభవించారు. ఇతరుల శరీరం ఎప్పుడూ ఓపెన్ బార్ కాదు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారామె. ఇదిలా ఉంటే.. స్విస్ పీపుల్స్ పార్టీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. ఇది గందరగోళానికి దారి తీయడం మాత్రమే కాదు.. ఆచరణలోనూ కష్టతరమని వాదించారు వాళ్లు. ఇదిలా ఉంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్విట్జర్లాండ్ ఓటింగ్ పరిణామాలను అభినందించింది. అయితే.. రేప్ నిర్వచనం చట్టంలో మార్పు రావడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. పార్లమెంట్ ఇరు సభలు దీనిపై ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఆపై అది ప్రజా ఓటింగ్‌కు వెళ్తుంది. స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్ మరియు బెల్జియంతో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా అత్యాచారాన్ని ‘‘స్పష్టమైన అనుమతి లేకుండా లైంగిక చర్య’’గా నిర్వచించే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
అ‘న్యాయం’గా ఫీజులు పెంపు!
సాక్షి, హైదరాబాద్: పేదవిద్యార్థులకు న్యాయవిద్య ఫీజులు భారంగా మారాయి. ఫలితంగా వారు న్యాయవిద్యకు దూరమవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మునుపెన్నడూ లేనంతగా ఫీజులు పెంచిందని న్యాయశాస్త్ర విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఐదేళ్ల న్యాయవిద్య కోర్సు వార్షిక ఫీజును రూ.5,460 నుంచి రూ.16 వేలకు పెంచారు. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఎల్ఎల్ఎం ఫీజును రూ.4,500 నుంచి రూ.20,100కు పెంచారు. ఎంఎల్ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రెండింతలు పెరిగాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.15 వేల నుంచి రూ.33,000 పెంచారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఉస్మానియా లా కోర్సుల్లో ఫీజులు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల బెంబేలుతో చేరని విద్యార్థులు లా కోర్సు చదువుదామనుకున్న విద్యార్థులు భారీ ఫీజుల కారణంగా కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా పేద విద్యార్థులు వెనక్కు తగ్గుతు న్నారు. ఈ విద్యాసంవత్సరం 6,724 సీట్లు అందుబాటులో ఉండగా, 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 5,747 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో సీట్లు పొందారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో 4,064 సీట్లు అందుబాటులో ఉండగా, 3,598 సీట్లు కేటాయించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీలో 1,784 సీట్లకు 1,440 సీట్లు కేటాయించారు. 876 ఎల్ఎల్ఎం సీట్లకు 709 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. గడువు ముగిసే నాటికి దాదాపు వెయ్యి మంది వరకూ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రకటన లేకుండానే పెంపు వర్సిటీ అధికారులు ఇష్టానుసారంగా ఫీజుల పెంచారనే విమర్శలొస్తున్నాయి. కోవిడ్ తర్వాత కాలేజీలకు ఖర్చు పెరిగిందని, ప్రభుత్వం నుంచి ఇందుకు తగ్గట్టుగా నిధులు రావడం లేదని, అందుకే ఫీజులు పెంచాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. లాసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఓయూ న్యాయ కళాశాలలో సీట్లు పొందుతారు. ఇప్పుడు సాధారణ ర్యాంకులతో ప్రైవేట్ కాలేజీల్లో చేరినవారు, ఓయూ కళాశాలలో సీట్లు పొందినవారు దాదాపు సమానంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉస్మానియా వర్సిటీ న్యాయ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సుల ఫీజు పెరగడాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షుడు కురవ విజయ్‌కుమార్ ఖండించారు. ఫీజులపెంపు వల్ల ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు న్యాయవిద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన లా కోర్సుల ఫీజులను తగ్గిస్తూ ఓయూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా...సవరింపు చట్టం
హాంకాంగ్: లింగ వివక్ష, లైంగిక వేధింపుల నుంచి చైనాలో మహిళలకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంతో చట్టాన్ని సవరించింది. విస్తృతమైన ప్రజాభిప్రేయ సేకరణ, పలు సవరణలు తదనంతరం ఈ చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పించింది. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా, ప్రభుత్వం వారికి తగిన గౌరవం దక్కేలా చేయడం, అబార్షన్ పట్ల వస్తున్న నిర్భంధ వైఖరి తదితరాలపై కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో ఈ చట్టం వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత చైనా మహిళల రక్షణ చట్టాన్ని సవరించడం ఇదే తొలిసారి. ఈ మేరకు మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ చట్టం ముసాయిదాను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) స్టాండింగ్ కమిటీకి సమర్పించింది. ఐతే ఈ ముసాయిదాను ఇంకా అమలు చేయలేదు. సుమారు 10 వేల మంది ప్రజల సలహాలు, సూచనల కోసం పంపినట్లు ఎన్పీసీ తెలిపింది. ఈ ముసాయిదా చట్టం వెనుకబడిన, పేద, వృద్ధ, వికలాంగ మహిళల హక్కుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేస్తోందని స్థానిక జిన్హుహ వార్త సంస్థ పేర్కొంది. ఈ చట్టం ప్రకారం....మహిళల శ్రమ, సామాజిక భద్రత హక్కుల ప్రయోజనాలను ఉల్లంఘిస్తే సదరు యజమానులను శిక్షిస్తుంది. మహిళల అక్రమ రవాణ, కిడ్నాప్, రక్షణను అడ్డుకోవడం తదితరాలను నేరాలుగా పరిగణిస్తుంది. అలాగే అక్రమ రవాణాకు గురైన లేదా కిడ్నాప్‌కి గురైన మహిళలను రక్షించే బాధ్యత అధికారులపై ఉంటుందని స్పష్టం చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం.. యాపిల్ కంపెనీకి పెద్ద దెబ్బే!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి ఇకపై కామన్ ఛార్జింగ్ పోర్ట్ ఉండాలంటూ కొత్త నిబంధనలతో కూడిన చట్టాన్ని ఆమోదించింది. 2024 కల్లా ఈ నిబంధన పూర్తిగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇకపై ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపించనున్నాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్ ఛార్జర్లే అన్ని డివైజ్లకీ ఉండాలి. వీటితో పాటు ఇ-రీడర్లు, ఇయర్ బడ్స్‌తో పాటు ఇతర సాంకేతిక పరికరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ (Apple iPhone)లతో పాటు పలు సంస్థలు కూడా వారి ఛార్జింగ్ పోర్ట్‌ను మార్చవలసి ఉంది. యూరోపియన్ కస్టమర్లకు ఎలక్ట్రానిక్ పరికరాలను అందించే సంస్థలలో యాపిల్ ప్రధాన సరఫరాదారుడు, దీంతో ఈ నిర్ణయం ఐఫోన్ కంపెనీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ నిబంధన ఎందుకంటే! కస్టమర్లు డివైజ్ కొనుగోలు చేసిన ప్రతీసారి కంపెనీలు కొత్త ఛార్జర్లను కూడా ఇస్తుంటాయి. దీంతో పాతది వాడకుండా వ్యర్థంగా మారడం సహజంగా మారుతోంది. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించడంతో పాటు, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై ఈయూలో చాలా ఏళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగిల్ ఛార్జర్ వినియోగించడం వల్ల దాదాపు EUR 250 మిలియన్లు (దాదాపు రూ. 2016 కోట్లు) ఆదా అవుతుందని యూరోపియన్ కమిషన్ అంచనా. 2018లో మొబైల్ ఫోన్లతో విక్రయించిన సగం ఛార్జర్లు USB మైక్రో-USB కనెక్టర్‌ను కలిగి ఉండగా, 29 శాతం USB టైప్-సి కనెక్టర్‌ను కలిగి ఉన్నారు. 21 శాతం మంది లైట్నింగ్ కనెక్టర్ చార్జర్‌ను కలిగి ఉన్నారు. చదవండి: Youtube: యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా! -
Tele-Communications Bill 2022: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ సేవలకూ లైసెన్స్
-
చట్టానికి దొరక్కుండా... ఆన్లైన్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: కలర్ ప్రిడెక్షన్ గేమ్.. లోన్ యాప్స్.. నిర్వహణలో ఉన్న లోపాల కారణంగానే విషయం పోలీసు కేసుల వరకు వెళ్లిందని చైనీయులు భావిస్తున్నారా? అంటే అవుననే జవాబు చెబుతున్నారు సైబర్ క్రైమ్ అధికారులు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ విషయంలో చట్టానికి దొరక్కుండా వ్యవహారాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న ఆన్లైన్ గేమ్స్‌లో అత్యధికం చైనీయులకు సంబంధించినవే అని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ గేమింగ్ యాప్స్‌పై చర్యలకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. గెలిపిస్తూ బానిసలుగా మార్చి.. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న వాళ్లు (ప్రధానంగా యువత) వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. మొదట వాటిని ఫ్రీగా ఇచ్చి.. ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన వారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. ఆడే వ్యక్తి వీటికి అలవాటుపడిన తర్వాత యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ సందేశాలు పంపిస్తారు. వాటికి అవసరమైన రుసుం డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లించాలని షరతు పెడతారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న వాళ్లు తప్పనిసరై డబ్బు చెల్లించి ముందుకు వెళ్తున్నారు. ఆ గేమ్ ఉచితం కావడంతో... ఇలా భారీ మొత్తాలు కోల్పోయిన అనేక మంది బాధితులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. వీరి ఫిర్యాదులతో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ చర్యలకు మాత్రం ఆస్కారం ఉండట్లేదు. గేమ్ ఆడటానికి డబ్బు వసూలు చేస్తే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవచ్చు. అందుకే గేమ్‌ను ఉచితంగా అందిస్తున్న చైనా కంపెనీలు యూసీ పాయింట్ల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ గేమ్ ప్రారంభంలో ఎక్కడా ఈ చెల్లంపుల విషయం ఉండదు. ఈ నేపథ్యంలోనే కొన్ని గేమింగ్ యాప్స్‌పై గేమింగ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండట్లేదు. జీపీఎస్ మార్చడంతో ఇబ్బంది ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. దీంతో వీటికి బానిసలుగా మారిన అనేక మంది ఫేజ్ జీపీఎస్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: నష్టాలకు సాకు... బస్సులకు బ్రేక్) -
ఫలించిన కల.. ఆఫీస్‌బాయ్ నుంచి.. ఏపీపీ స్థాయికి
సాక్షి, రామగుండం(కరీంనగర్): అంతర్గాం మండలంలో మారుమూల గ్రామమైన రాయదండికి చెందిన యువకుడు పట్టుదలతో ముందుకెళ్లి అనుకున్నది సాధించాడు. ఆఫీస్‌బాయ్‌గా పనిచేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. గ్రామానికి చెందిన అర్ధ చంద్రయ్య, వరలక్ష్మి దంపతుల రెండో కొడుకు కుమార్. అబాది రామగుండం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి, గోదావరిఖనిలో ఇంటర్, డిగ్రీ చదివాడు. ఖర్చుల కోసం ప్రైవేటు పాఠశాలలో పార్ట్‌టైం ఉపాధ్యాయుడిగా, పేపర్ బాయ్‌గా, కార్యాలయాల్లో గుమాస్తాగా పనిచేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ సీటు సాధించాడు. 2004 నుంచి గోదావరిఖని, హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. సహకరించిన అర్ధాంగి కుమార్‌కు పెద్దంపేటకు చెందిన తోట రాంచందర్, భాగ్య కూతురు రజితతో 2008లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. ఎంఎస్సీ పూర్తిచేసిన రజిత 2014లో వీఆర్ఏగా అదే గ్రామంలో ఉద్యోగం సాధించింది. అప్పటినుంచి కుమార్‌ను ప్రోత్సహిస్తోంది. ఆమె సహకారంతో 2021 అక్టోబర్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవేశ పరీక్ష రాశాడు కుమార్. నవంబర్‌లో వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ పీపీగా ఎంపికైనట్లు ఉత్తుర్వులు వెలువడ్డాయి. దీంతో అతడి కుటుంబంలో ఆనందం నెలకొంది. పట్టుదలతోనే ముందుకు.. ఏపీపీ ప్రవేశ పరీక్షకు ముందు అనేక జర్నల్స్ చదివా. విజయ శిఖరాలకు చేరినవారిని ఆదర్శంగా తీసుకున్నా. ప్రతిరోజూ 8 గంటలపాటు చదివా. న్యాయవాది వృత్తిలో కొనసాగాలనేది నా కల. పేదలకు సేవ చేయాలన్న తలంపుతోనే ఈ వృత్తిలోకి వచ్చా. – అర్ధ కుమార్ చదవండి: ‘రెండు గుంటలు’.. రెండు హత్యలు -
న్యాయ వ్యవస్థలోకి చిట్టీ.. ది రోబో
దేశంలో కోర్టు కేసులంటే ఏళ్ల తరబడి సాగుతాయన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ పరిస్థితిని మార్చేసే అవకాశాన్ని కృత్రిమ మేధ (ఏఐ) కల్పించనుంది! కేసుల నిర్వహణ, చట్టాల ఆన్లైన్ సమాచారం,అల్గారిథం ఆధారిత సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా న్యాయస్థానాల పనితీరు మెరుగుపరచడంలో ఏఐ దోహదపడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా పేర్కొన్నారు. అంటే మంత్రి వ్యాఖ్యలను మరో విధంగా చెప్పాలంటే న్యాయవ్యవస్థలోకి చిట్టీ ది రోబోని ప్రవేశపెడతారన్నమాట. ఎంత పెద్ద పనులైనా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సత్వరం చేస్తూ న్యాయ ప్రకియలో వేగం పెరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిజిటైజేషన్ బాట పట్టిన భారత న్యాయ వ్యవస్థకు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఏఐ ఏ రకంగా సాయపడగలదో ఓసారి పరిశీలిద్దాం. ప్రపంచ దేశాల్లో న్యాయస్థానాలకు కృత్రిమ మేధ (ఏఐ) అవసరం అవుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాతోపాటు కొన్ని ఇతర పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రధానంగా ఆరు రకాలుగా న్యాయ, చట్ట వ్యవస్థలకు ఉపయోగపడుతోంది. అవి ఏమిటంటే ఈ–డిస్కవరీ, ఆటోమేషన్, లీగల్ రీసెర్చ్, డాక్యుమెంట్ మెనేజ్మెంట్, కాంట్రాక్ట్ అండ్ లిటిగేషన్ డాక్యుమెంట్ అనలటిక్స్ అండ్ జనరేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్. వాటి గురించి క్లుప్తంగా... చిటికెలో దశాబ్దాల వివరాలు... కొన్ని దశాబ్దాలపాటు కోర్టుల్లో నమోదైన కేసులు.. వాటి తాలూకూ సూక్ష్మస్థాయి వివరాలను వెతకడం ఆషామాషీ కాదు. కానీ కృత్రిమ మేధ మాత్రం ఈ పనులను చిటికెలో చేసిపెడుతుంది. డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి కేసుకు సంబంధించిన గత తీర్పులు, వాదనలను గుర్తించి అందించేందుకు ఈ–డిస్కవరీ ఉపయోగపడుతుంది. న్యాయవాదుల కంటే ఈ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మెరుగైందట! కళ్లముందే నిపుణుల అభిప్రాయాలు... ఏదో ఒక కేసులో నిపుణుడు ఇచ్చిన వివరాలు న్యాయస్థానాల రికార్డుల్లో ఉండే ఉంటాయి. కేసును బట్టి ఆయా అంశాలకు సంబంధించిన నిపుణుల అభిప్రాయాలు, వివరాలను అవసరమైనప్పుడు అందుకొనేందుకు వీలుగా ఎక్స్పర్టీస్ ఆటోమేషన్‌ను ఉపయగిస్తున్నారు. ఇప్పటికే దీన్ని వీలునామాల తయారీలో ఉపయోగిస్తున్నారు కూడా. అంతేకాకుండా లాయర్ అవసరం లేకుండానే కోర్టులో కేసులు వేసేందుకు, కేసు వివరాలను సరైన రీతిలో పొందుపరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒప్పందాల విశ్లేషణలో ప్రత్యేక ముద్ర... వ్యక్తులు, కంపెనీలు, సంస్థల మధ్య కుదిరే అనేక రకాల కాంట్రాక్టుల్లో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా.. సమస్యలు రావడం, కోర్టు కేసులకు దారితీయడం కద్దు. ఈ పరిస్థితి రాకుండా.. కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా విశ్లేషించి, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులేవీ రాకుండా జాగ్రత్త పడేందుకూ ఏఐని ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఇటీవలి కాలంలో వీటి వినియోగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిపోతోంది. తీర్పుల అంచనాకూ దోహదం.. ఫలానా కేసులో తీర్పు ఎలా వస్తుందో ఊహించడం కష్టమే. న్యాయసూత్రాలు పక్కాగా తెలియడంతోపాటు కేసు పూర్వాపరాలపై కచ్చితమైన అంచనాలు అవసరమవుతాయి. కానీ కొన్ని ఏఐ సాఫ్ట్వేర్లు ఇప్పుడు తీర్పులను కూడా ముందుగానే అంచనా వేస్తున్నాయి. వాటి కచ్చితత్వం ఎంత అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియకున్నా ఆ ప్రయత్నమైతే జరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్ న్యాయ పరిశోధనలోనూ తనదైన ముద్ర... దేశం మొత్తమ్మీద ఒకే రకమైన న్యాయసూత్రాలు ఉండటం కష్టమే. కొన్ని విషయాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం, నిబంధనలు ఉంటాయి. ఈ తేడా దేశాలకూ వర్తిస్తుంది. ఈ వివరాలన్నీ అవసరానికి తగ్గట్టు మీకు అందించేందుకు లీగల్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో లేదా ప్రశ్న, జవాబుల రూపంలోనూ అవసరమైన వివరాలను అందించడం దీని ప్రత్యేకత. లక్షల గంటలు పట్టే పని సెకన్లలోనే... కోర్టు కేసుల్లో మాత్రమే కాదు.. కంపెనీల్లోనూ కాంట్రాక్ట్‌ల రూపంలో బోలెడన్ని దస్తావేజులు ఉంటాయి. వాటి సక్రమ నిర్వహణ ఎంతో అవసరం. ఇందుకు సరిగ్గా సరిపోయే ఏఐ సాఫ్ట్వేర్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్. ఇటీవల జేపీ మోర్గాన్ అనే సంస్థ ఇలాంటి సాఫ్ట్వేర్ సాయంతో న్యాయవాదులు 3.6 లక్షల గంటల్లో చేసే పనిని సెకన్లలో పూర్తి చేసేసింది. -
కొత్త చట్టం.. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదు!
బీజింగ్: పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మొదటగా వాళ్ల తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదన్న మాటే వినిపిస్తుంది. ఎందుకgటే పిల్లల మనస్తత్వం ఎలా ఉన్నా అంతెందుకు వాళ్లు చెడు మార్గంలో పయనించిన, లేదా ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ క్రెడిట్ మొత్తం తల్లిదండ్రులకే దుక్కతుంది. ఇది సర్వ సాధారణం. అయితే ఇవి ఇప్పటివరకు మాటల వరకే పరిమితంగా ఉండేవి కానీ వీటినే చట్టంగా మార్చి శిక్ష కూడా వేస్తామంటోంది చైనా ప్రభుత్వం. చైనా తీసుకువస్తున్న ఈ చట్ట ప్రకారం.. పిల్లలు తప్పు చేస్తే.. ఇక నుంచి వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారట. అందుకోసం చైనాలో సరికొత్త చట్టం రూపొందుతోంది. ఆ చట్టం ప్రకారం.. పిల్లల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకున్నా, వాళ్లలో చెడు ప్రవర్తన ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను అందించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బిల్లును చైనా ప్రభుత్వం రివ్యూ కూడా చేస్తోంది. ఈ చట్టం ఏం చెప్తోందంటే.. తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కాసేపు సమయం కేటాయించాలి. సమాజం గురించి చెప్పాలి. సామాజిక బాధ్యత గురించి తెలియజేయడంతో పాటు ఆచరించేలా ప్రోత్సాహించాలి. చట్టాల మీద అవగాహన కూడా తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ రకంగా పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలిని ఆ బిల్లులో పేర్కొంది. ఆ దేశ పిల్లలు ఇటీవల ఆన్లైన్ గేమింగ్ వ్యసనంగా మారడంతో గత కొన్ని నెలలుగా, చైనా విద్యా మంత్రిత్వశాఖ మైనర్లకు పరిమిత గేమింగ్ గంటలను మాత్రమే వీలు కల్పించింది. దీని ప్రకారం శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్లైన్ గేమ్‌లు ఆడటానికి మాత్రమే వీలుంటుంది. చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి.. -
పిజి లా సెట్ ప్రవేశ పరీక్ష
-
మాల్యా, మోదీ, మెహుల్‌కు నిర్మలాజీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల బ్యాంకింగ్ కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనడానికి భారత్‌కు రప్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గురువారం స్పష్టం చేశారు. బీమా సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి బ్యాంకింగ్‌ను దాదాపు రూ.9000 కోట్ల మేర మోసం చేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యాను ఆ దేశం నుంచి రప్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో దాదాపు రూ.14,500 కోట్లకుపైగా రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన 49 సంవత్సరాల నీరవ్ మోదీ లండన్ పారిపోయారు. అయితే ఈడీ, సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను 2019లో అక్కడి అధికారులు తమ అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ, నీరవ్ మోదీకి మేనమామ. చోక్సీ భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మోదీ, చోక్సీలకు చెందిన దాదాపు రూ.2,600 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి విదితమే. బీమాలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి: రాజ్యసభలో బిల్లు ఆమోదం కాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా (సవరణ) బిల్లు, 2021పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇస్తూ, దేశంలోకి బీమా రంగం సేవలు మారుమూలకు విస్తరించడానికి ఈ చొరవ దోహదపడుతుందని తెలిపారు. సంబంధిత వర్గాలతో బీమా రంగం రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సమగ్ర చర్చల అనంతరమే ఈ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2015లో అప్పటికి 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడం జరిగింది. జీవిత బీమా సేవలు దేశంలో మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవిత బీమా ప్రీమియం ప్రస్తుతం 3.6 శాతంగా ఉంది. అంతర్జాతీయగా చూస్తే దీని సగటు 7.13 శాతం. ఇక జనరల్ ఇన్సూరెన్స్ చూస్తే, ప్రపంచ సగటు 2.88 శాతంకాగా, భారత్ జీడీపీలో కేవలం 0.94 శాతం. 2015లో 49 శాతానికి పరిమితులు పెంచిన తర్వాత దేశీయ బీమా రంగంలోకి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ.26,000 కోట్లని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీమా కంపెనీలు ద్రవ్యపరమైన (లిక్విడిటీ) ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి తాజా నిర్ణయం దోహదపడుతుందన్నారు. -
పోటాపోటీగా ‘లైవ్‌లా, బార్ అండ్ బెంచ్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేనిక్కడ మీకొకటి చెప్పదల్చుకున్నాను. ఈ పిటిషన్లన్నింటిని ఇక్కడ పరిశీలించడం కన్నా, వీటిని ‘లైవ్‌లా’ వెబ్సైట్లోనో, మరో చోటనో పరిశీలించడమో మంచిది’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. విశేష ప్రజాదరణ పొందుతున్న న్యాయ వెబ్సైట్ ‘లైవ్‌లా’ గురించి న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ‘లైవ్‌లా’తో పాటు ‘బార్ అండ్ బెంచ్’ వెబ్సైట్ వివిధ కోర్టుల్లో కొనసాగుతున్న వివిధ కేసులు, పిటిషన్ల విచారణ సహా కోర్టు సర్వ కార్యకాలాపాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నాయి. కోర్టుల తీర్పులు, ఉత్తర్వులే కాకుండా పిటిషన్లు, విజ్ఞప్తులు, వాటికి సంబంధించిన పూర్వ సమాచారాన్ని దాదాపు లైవ్‌గా అందిస్తున్నాయని చెప్పవచ్చు. కోర్టు లోపలకి టీవీ కెమేరాలను అనుమతించరు కనుక, కెమేరాలు లేకుండానే ఈ వెబ్సైట్లు ప్రత్యక్ష ప్రసారాలను చేస్తున్నాయని చెప్పవచ్చు. ఏ ముఖ్యమైన కేసుకు సంబంధించి అయినా సరే కోర్టు తీర్పు చెబుతుండగానే ‘ట్వీట్ల’ రూపంలో ఈ వెబ్సైట్లు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇంతవరకు తీర్పులే బయటకు వచ్చేవి. పిటిషన్లు, పిటిషన్లలోని అంశాలు ఒక్క న్యాయవాదులకే అందుబాటులో ఉండేవి. ఇప్పుడవన్నీ కూడా ఈ వెబ్సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ రెండు వెబ్సైట్లను జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులే వీక్షిస్తున్నారనుకుంటే పొరపాటే. కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు, సామాజిక కార్యకర్తలు, లా విద్యార్థులతోపాటు ఆసక్తిగల సామాన్యులు కూడా వీక్షిస్తున్నారు. సమాజంలో కోర్టుల ఆవశ్యకతను, వాటి పాత్రను సముచితంగా అర్థం చేసుకొని పారదర్శకంగా సమాచారాన్ని అందిస్తుండడంతోనే ఈ రెండు వెబ్సైట్లకు అంత ఆదరణ పెరిగింది. ‘బార్ అండ్ బెంచ్’ సహ వ్యవస్థాపకురాలు పల్లవి సాజులా, ‘లైవ్‌లా’ ప్రతినిధి ఎంఏ రషీద్ 2010 నుంచి కోర్టు తీర్పుల అప్లోడింగ్ భారత్‌లో వివిధ కోర్టుల తీర్పులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం చాలా ఆలస్యంగా 2010లో ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఈ రెండు వెబ్సైట్లు కక్షిదారులకు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. తమ కేసుల విచారణకు కోర్టులకు హాజరైన వారికి అక్కడి వాదనలు ఏమిటో ఓ మానాన అర్థం అయ్యేవి కావు. ఈ వెబ్సైట్ల రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘లైవ్‌లా లేదా బార్ అండ్ బెంచ్’ వెబ్సైట్లను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చూస్తామని ఇద్దరు హైకోర్టు జడ్జీలు చెప్పడం విశేషం. ఈ మధ్య వీటిని చూస్తున్న న్యాయవాదులే కాకుండా లిటిగెంట్లు కూడా న్యాయపరమైన పాయింట్లను లేవనెత్తుతున్నారని, అది ఒకరకంగా ఇబ్బందిగా ఉంటుందని, అందుకని తాము కూడా రోజూ చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెండు వెబ్సైట్లు ఇతర భాషల్లో కూడా వస్తే బాగుండని పాఠకులు సూచిస్తున్నారు. 2018లో సుప్రీం కోర్టు లోపలికి మొబైల్స్ అనుమతి బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ 2010లోనే తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటికీ 2015లో ట్వీట్ల ద్వారా పాపులర్ అయింది. ఆ సైట్‌కు సంబంధించిన లీగల్ రిపోర్టర్లు ట్వీట్ల ద్వారా కేసుల వివరాలు బయటకు తెలియజేసేవారు. 2018 వరకు సుప్రీం కోర్టులో లీగల్ రిపోర్టర్ల మొబైల్ ఫోన్లను అనుమతించేవారు కాదు. వారి బాధలను అర్థం చేసుకున్న అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పరిస్థితి మారిపోయింది. ఆవిర్భావం వెనక మిత్రులు బెంగళూరులోని జాతీయ న్యాయ కళాశాలలో చదువుకున్న శిశిర రుద్రప్ప, బిపుల్ మైనాలి, అభిషేక్ పర్శీరా అనే మిత్రులు ‘బార్ అండ్ బెంచ్’ పత్రికను 2009లో స్థాపించారు. 2010 తర్వాత అది ఆన్లైన్ వెబ్‌సైట్‌గా మారింది. బార్ అండ్ బెంచ్ స్థాపించిన మూడేళ్లకు ‘లైవ్‌లా’ వెబ్‌సైట్‌ను ఎంఏ రషీద్, రఘుల్ సుదీశ్, రిచా కచ్వాహను 2012లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ రెండు వెబ్సైట్లకు మూడు లక్షల మంది ట్విటర్ ఫాలోవర్లు ఉన్నారు. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌పై సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు) -
లవ్ జిహాద్: హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘లవ్ జిహాద్’పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. మతాంతర వివాహాలకు విరుద్ధంగా చట్టాల రూపకల్పనకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మాయ్ ‘‘లవ్ జిహాద్’ అనేది ఓ దుష్టశక్తి అని.. ఇందుకు విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదించిందని.. త్వరలోనే చట్టం రూపొందిస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, హరియాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మేరకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయం గురించి ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించాం. ఆ నిర్ణయాల మేరకు కొత్త చట్టాన్ని రూపొందిస్తాం’ అన్నారు. కాగా లవ్ జిహాద్ అనే పదాన్ని రైట్ వింగ్స్ గ్రూపులు వాడుకలోకి తెచ్చాయి. ఇది ముస్లిం అబ్బాయి, హిందూ యువతి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ బంధంలో ఆడపిల్లలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మాయ్ మాట్లాడుతూ.. ‘అలహాబాద్ హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటకలో కూడా ఓ చట్టం తీసుకురాబోతున్నాం. కేవలం వివాహం కోసం మతం మార్చుకోవడం అంగీకారం కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. అదే విధంగా.. మరో ట్వీట్లో ముస్లిం యువకులను జిహాదీలతో పోల్చారు బొమ్మాయ్. వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. మతాంతర వివాహం చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) -
ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!
సాక్షి, ముంబై : దివంగత బాలీవుడు నటుడు సుశాంత్‌సింగ్ ఆత్మహత్యతో రగిలిన వివాదం, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అనూహ్య అరెస్టు తరువాత మరోసారి రాజుకుంది. బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తాజాగా అర్నాబ్ గోస్వామి అరెస్టుపై వస్తున్న విమర్శలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. తమ హయాంలో ప్రతీకారం అనే సమస్యే ఉండదనీ, చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో అర్నాబ్ అరెస్టు చట్ట ప్రకారమే చోటు చేసుకుందని వివరించారు. తగిన ఆధారాలుంటే ఎవరిపైనైనా పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. అంతేకాదు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) మరోవైపు గతంలో మూసివేసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించిన 2018 కేసును విషయంలోనే అర్నాబ్ గోస్వామిని అరెస్టుచేశామని మహారాష్ట్ర హోంమంత్రి ధృవీకరించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుదర్యాప్తు, టీఆర్పీ కుంభకోణంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, అర్నాబ్‌పై రెండేళ్ల కేసును తిరిగతోడారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్ ఇలా స్పందించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసుల చర్యను పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అర్నాబ్ అరెస్టు సిగ్గు చేటని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అటు మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అర్నాబ్ గోస్వామికి మద్దతుగా నిలిచారు. అర్నాబ్ గోస్వామి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు. మౌనంగా ఉంటే అణచివేతకు మద్దతిచ్చినట్టేననిఆమె ట్వీట్ చేశారు. అటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా సేన ప్రభుత్వంపై మండిపడింది. (అర్నాబ్ అరెస్టు, పత్రికా స్వేచ్ఛపై దాడి: కేంద్రమంత్రి) Those in the free press who don’t stand up today in support of Arnab, you are now tactically in support of fascism. You may not like him, you may not approve of him,you may despise his very existence but if you stay silent you support suppression. Who speaks if you are next ? — Smriti Z Irani (@smritiirani) November 4, 2020 -
జాతీయ భద్రతా చట్టం : మీడియా మొఘల్ అరెస్ట్
హాంకాంగ్ : కొత్త భద్రతా చట్టం ప్రకారం హాంకాంగ్ ప్రభుత్వం మీడియా మొఘల్ ను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. జాతీయ భద్రతా చట్టం కింద హాంకాంగ్ దిగ్గజ వ్యాపారవేత్త, నెక్ట్స్ డిజిటల్ మీడియా అధినేత జిమ్మీ లై (71), ఇతర ముఖ్యులను అరెస్టు చేసింది. భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఏడుగురిని అరెస్టు చేసినట్లు హాంకాంగ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య అనుకూల విధానాలతో హాంకాంగ్‌లో జరిగిన అల్లర్లకు జిమ్మీ మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ విదేశీ శక్తులతో జతకట్టాడన్నఆరోపణలపై జిమ్మీని అరెస్టు చేశారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు మీడియా సంస్థలోకి ప్రవేశించి గందరగోళ సృష్టించారని లై ప్రధాన వారసుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్క్ సైమన్ ట్వీట్ చేశారు. ఈ రోజు వస్తుందని ముందే ఊహించానని, ఆపిల్ డైలీ జర్నలిస్టు ఒకరు ఆందోళనవ్యక్తం చేశారు. హాంకాంగ్ ప్రభుత్వానికి, బీజింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడే మీడియాను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రధానంగా ఆపిల్ డైలీని మూసి వేయడం, ఇతర మీడియా సంస్థలను బెదిరించడం లక్ష్యంగానే ఈ దాడి అని మండిపడ్డారు. ఇది పత్రికా స్వేచ్ఛకు ముగింపు అని వ్యాఖ్యానించారు. జూలై 1 నుండి అమల్లోకి వచ్చేలా చైనా వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం దోషులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అలాగే మీడియా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలను శోధించడం, మీడియా సంస్థలతో సహా సర్వర్లను స్వాధీనం చేసుకునే విస్తృత అధికారాలను ఇస్తుంది. కాగా 1995లో జిమ్మీ లై స్థాపించిన నెక్స్ట్ డిజిటల్ మీడియాకు ఆపిల్ డైలీ మాతృ సంస్థ. తొలుత వస్త్ర వ్యాపారం నిర్వహించిన ఆయన ఆ తరువాత ఆపిల్ డైలీ అనే పత్రికతో మీడియా రంగంలోకి ప్రవేశించారు. కాలక్రమంలో ఇది హాంకాంగ్, చైనా ఆధిపత్యాన్ని విమర్శించే ప్రజాస్వామ్య అనుకూల వార్తా సంస్థగా ఖ్యాతి గడించింది. సుమారు వంద కోట్ల డాలర్లు ఆస్తి ఆయన సొంతం. ఉగ్రవాదం, విదేశీ శక్తులతో కలిసి పని చేయడం లాంటి అనేక ఇతర ఆరోపణలను ఇప్పటికే లై ఎదుర్కొంటున్నారు. తాజాగా అతని కుమారులు, ప్రచురణ బృందంలోని పలువురు ముఖ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. -
లాయర్లకు న్యాయం లా నేస్తం
-
లాక్డౌన్లో ‘లా’...
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సరదాగా గడుపుతుంటే ఒలింపిక్ రజత పతక విజేత, భారత స్టార్ షూటర్ విజయ్ కుమార్ చదువుపై దృష్టి కేంద్రీకరించాడు. 2017లో ఇండియన్ ఆర్మీ నుంచి రిటైరయ్యాక హిమాచల్‌ప్రదేశ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా చేరిన విజయ్ ఈ ఖాళీ సమయాన్ని ‘లా’ చదివేందుకు వినియోగించుకుంటున్నాడు. ఆన్లైన్ తరగతుల సహాయంతో న్యాయవిద్యను అభ్యసిస్తున్నట్లు విజయ్ తెలిపాడు. ‘డీఎస్పీ ట్రెయినింగ్‌లో భాగంగా శారీరక వ్యాయామాలు, న్యాయవిద్య తరగతులకు హాజరు కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా డోరాలోని ట్రెయినింగ్ సెంటర్లో జరగాల్సిన శారీరక శిక్షణ వాయిదా పడింది. కానీ ఆన్లైన్లో ‘లా’ తరగతులకు హాజరు అవుతున్నా’ అని 34 ఏళ్ల విజయ్ కుమార్ తెలిపాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో విజయ్ రజతం సాధించాడు. -
ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయసదస్సు
-
మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి
సాక్షి, బిక్కవోలు(తూర్పు గోదావరి): సాంకేతికంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతున్నా దేశంలో ఆడపిల్లలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండాపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు స్త్రీ బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. హత్యలే వీటికి కారణం, చట్టాలు పటిష్టంగా ఉన్నా నిందితులకు శిక్షలు సత్వరం పడేలా చేసినప్పుడే అందరికీ భయం ఉంటుందని మహిళాలోకం అభిప్రాయపడుతోంది. చట్టాల గురించి మహిళలంతా తెలుసుకుని ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో ధైర్యంగా ఫిర్యాదు చేయాలంటున్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఆపదలో ఉన్న సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్లు, 100, 1098, 112 ఏ విధంగా ఉపయోగపడతాయి.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అనే విషయం యువతకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. చట్టం ప్రకారం సహాయం అందిస్తాం అమ్మాయిలు కూడా ఆత్మ విశ్వాసంతో పాటు, ఆత్మరక్షణ పద్ధతులను కచ్చితంగా నేర్చుకోవాలి. చట్టం పరమైన సహాయం అందించడానికి ముందుగా ఉంటాము. సెల్‌ఫోన్ అవసరమైనపుడు తప్ప ఎక్కువగా ఉపయోగించరాదు. – ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దార్, బిక్కవోలు మంచి చెడులు చెప్పాలి తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుంచే మంచీ చెడుల గురించి చెప్తుండాలి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి తిరిగి వచ్చే సమయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. సమాజంలో జరిగే పరిస్థితులను ఎప్పుటికప్పుడు వివరిస్తుండాలి. పిల్లలు బయటకు వెళ్లిన సమయంతో ఎప్పటికçప్పుడు సమాచారం ఇచ్చేలా పిల్లలకు అవగాహన కలి్పంచాలి. ఏదైనా ఆపద సమయంలో పోలీసు వారి హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే సృందించడం జరుగుతుంది. – పి.వాసు, ఎస్సై, బిక్కవోలు యువతులు మోసపోవద్దు నైతికత లేని కుటుంబాల నుంచి వచ్చినవారు.. పర్సనాలిటీ సమస్యలు కలిగిన పిల్లలు.. పెద్దల్లో లైంగిక వాంఛలు ఎక్కువగా ఉండటం వల్ల వారి కోరికలు తీర్చుకోవడానికి దేనికైనా తెగిస్తారు. మగవారి రూపాన్ని చూసి, మాటలు పొగడ్తలను చూసి యువతులు మోసపోవద్దు. ఎవరి జాగ్రత్తలు, హద్దుల్లో వారుండాలి. జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువలను గుర్తుంచుకోవాలి. – శివాజీ, పీహెచ్సీ వైద్యుడు, కొంకుదురు మహిళలంతా అప్రమత్తంగా ఉండాలి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లోను ముందుంటున్నారు. వృత్తి ధర్మంలో భాగంగా బయటకు వెళ్లే మహిళలపై జరిగే దాడులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆత్మరక్షణ చిట్కాలపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలు, శిక్షలపై మెళకువ కలిగి ఉండాలి. – కేటికే పద్మశ్రీ, సచివాలయ కార్యదర్శి, పందలపాక తల్లిదండ్రులు గమనించాలి యువతీ యువకుల ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి వాటి వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు వినియోగించే ఫోన్లను వారు ఏ విధంగా వినియోగిస్తున్నారో గమనిస్తుండాలి. దీంతో పాటు పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా హుందాగా వ్యవహరించాలి. – మట్టపర్తి అనుపమ, ఎంపీడీవో, బిక్కవోలు -
డిగ్రీ తర్వాత ఇంటర్ పూర్తి..!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మూడేళ్ల డిగ్రీ చేసిన విద్యార్థి నికి లా కోర్సులో అడ్మిషన్ కల్పించాలని, అయితే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన వారికి న్యాయవిద్య చదివేందుకు అర్హత ఉందో లేదో తాము వెలువరించే తుది ఉత్తర్వులకు లోబడి అడ్మిషన్ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉండే పి.సరిత పదోతరగతి చదివారు. పెళ్లి అయ్యాక ఓపెన్ వర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. తర్వాత లాసెట్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేయలేదని లాసెట్ కన్వీనర్ తోసిపుచ్చారు. దీంతో ఇంటర్మీడియట్ కూడా చదివి లాసెట్ రాసి లా అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. మూడేళ్ల డిగ్రీ చేశాక ఇంటర్ పూర్తి చేశారనే కారణంతో అధికారులు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సరిత హైకోర్టును ఆశ్రయించడంతో పైవిధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. -
పాఠ్యాంశంగా ట్రిపుల్ తలాక్
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బరైలీలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. వర్శిటీ లా డిపార్ట్మెంట్ అధిపతి అమిత్ సింగ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టానికి (2019) సంబంధించిన సిలబస్‌ను చేర్చినట్టు చెప్పారు. పాత సిలబస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు వివరించారు. యూనివర్శిటీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. చట్టంలోని నిబంధనలను తెలుసుకోవడంతో పాటు కేస్ స్టడీస్‌కు కూడా ఈ అంశం ఉపకరిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు మంచి లాయర్లుగా మారి, ప్రజలకు మరింత న్యాయం చేకూర్చగలరని ఆశిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల్లో ఒకరు ట్రిపుల్ తలాక్‌పై డాక్టరేట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త సిలబస్ పట్ల తామెంతో ఆసక్తిగా ఉన్నట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. -
ఇంజనీరింగ్ 75,000, లా పట్టా 2,00,000
ముంబై: కాలేజీకి వెళ్లే అవసరం లేదు..పరీక్షలు రాయాల్సిన పని అంతకన్నా లేదు.. రూ.75వేలు పెడితే ఇంజినీరింగ్ డిగ్రీ, రూ.2 లక్షలు మనవి కావనుకుంటే లా డిగ్రీ చేతికి అందుతుంది. ఒక్క 45 రోజులు ఓపిక పడితే ఏకంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు చేతికి వచ్చేస్తాయి. న్యూస్18 రహస్య ఆపరేషన్‌లో ఈ చీకటి దందా వెలుగు చూసింది. 2016లో పూర్తి చేసినట్లుగా బీఏ డిగ్రీ పట్టా ఇచ్చేందుకు న్యూస్18 మీడియా వ్యక్తులతో నవీ ముంబైలోని కోపర్ఖైరానీ ప్రాంతానికి చెందిన కీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన ఏజెంట్ స్వప్నిల్ గైక్వాడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డిగ్రీని యూజీసీ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రముఖ వర్సిటీలు యశ్వంత్రావ్ చవాన్ యూనివర్సిటీ నుంచి గానీ సోలాపూర్ యూనివర్సిటీ నుంచి గానీ ఇస్తానన్నాడు. ఇందుకు 45 రోజుల సమయం పడుతుందని, 30 రోజుల తర్వాత డిగ్రీపట్టా జిరాక్స్ ప్రతులు, మరో 15 రోజుల తర్వాత ఒరిజినల్ పత్రాలను అందజేసేందుకు అంగీకరించాడు. ‘వర్సిటీకి గానీ, క్లాసులకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగానే సంబంధిత పత్రాల్లో ఉంటుంది. వర్సిటీ రికార్డుల్లో కూడా ఇవి జత పరిచి ఉంటా యి. ఇవి ఎక్కడా తనిఖీల్లో పట్టుబడేం దుకు అవకాశం లేదు’ అని అతడు భరోసా ఇచ్చాడు. ఇంజినీరింగ్, ఎల్ఎల్బీతోపాటు వివిధ వర్సిటీల్లో పీహెచ్డీ చేసినట్లుగా కూడా సర్టిఫికెట్లు ఇస్తాం కానీ, ఫీజులు వేర్వేరుగా ఉంటాయన్నాడు. మూడేళ్ల ఇంజినీరింగ్ పట్టాకైతే రూ.75 వేలు, ఇందులో సగం ముందుగా, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చాక మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. పీహెచ్డీ డిగ్రీలైతే ఆంధ్రా వర్సిటీ నుంచి ఇస్తామని చెప్పాడు. థీసిస్, సినాప్సిస్ కూడా అందజేస్తానన్నాడు. యూపీలోని ఓ వర్సిటీ నుంచి పొందినట్లుగా ఉండే లా డిగ్రీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని గైక్వాడ్ చెప్పాడు. వర్సిటీల సంఖ్య పెరగడంతో తమ మార్కెట్ కూడా పెరిగిందని గైక్వాడ్ అన్నాడు. ప్రతి వర్సిటీకి టార్గెట్లున్నాయి. వాటి లక్ష్యం నెరవేరేందుకు మాలాంటి వారిని అవి ఆశ్రయిస్తున్నాయి. వర్సిటీలకు అడ్మిషన్లు కావాలి, మాకేమో డబ్బులు కావాలి’ అని తెలిపాడు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పోఖ్రియాల్ ప్రకటించారు. -
వేధిస్తే.. ‘లా’గి కొట్టడమే..!
► ఈ ఏడాది జూన్ 24వ తేదీ ఒడిశాలోని జోడా ప్రాంతం. పదో తరగతి చదువుతున్న బాలిక తమ బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం వరకూ అక్కడే గడిపి తిరుగు ప్రయాణమైంది. ఒంటరిగా వెళ్తున్న, ఆమెను ఐదుగురు యువకులు గమనించి వెంటాడారు. నిర్జన ప్రదేశంలోకి చేరుకోగానే అపహరించుకెళ్లి అత్యాచారం చేశారు. ► ఈ ఏడాది జూన్ 6వ తేదీ ఒంగోలులోని బస్టాండులో ఒంటరిగా బస్సు దిగిన పదో తరగతి విద్యార్థినిపై ఓ దివ్యాంగుడు కన్నేశాడు. తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్న ఆమెను మాటలతో లోబర్చుకున్నాడు. ఆ స్నేహితుడు తనకు తెలుసునని నమ్మించి బస్టాండు సమీపంలోని గదికి పిలుచుకెళ్లాడు. ఆ రాత్రి అక్కడ తన మిత్రుడితో కలిసి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను మరో గదికి తరలించి, అక్కడ ఉంటున్న నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి పైశాచికంగా అత్యాచారం చేశారు. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు బాలికను గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళల్లో ఉన్న నిరక్షరాస్యత కారణంగా వారిలో ప్రశ్నించే తత్త్వం లేకపోవడంతో వారిపై ఆకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పదునైన చట్టాలు ఎన్ని ఉన్నా.. అవేవీ బాధితులను ఆదుకోలేకపోతున్నాయి. చట్టాలపై కనీస అవగాహన లేకపోవడంతో అవి కాస్త దుర్వినియోగమవుతున్నాయి. ‘ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో... అక్కడ దేవతలు నాట్యం చేస్తారు’ ఇది ఓ మహానుభావుని మాట. ‘స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ ఇది మహాత్మగాంధీ నినాదం. అదే కోవలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం రాజ్యాంగానికి పదును పెట్టారు. హిందూకోడ్ బిల్.. చట్టసభల్లో రిజర్వేషన్ మహిళలకు గౌరవం కల్పించారు. అంతేకాక రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ స్త్రీ స్వేచ్ఛకు పచ్చజెండా ఊపాయి. అయినా స్త్రీలపై హింస ఆగడం లేదు. భర్త రూపంలో... ప్రియుడి రూపంలో... అన్న... నాన్న... పక్కింటివాడు.. పొరుగింటివాడు... బస్సులో ఆకతాయిలు...రోడ్లపై రోమియోలు... స్కూళ్లలో కొందరు... ఇలా చెప్పుకుంటూపోతే మహిళా స్వేచ్ఛ అనేది ఎక్కడా కనిపించడం లేదు. బలహీనులైన అబలలపై బలవంతులైన మృగాళ్ల పెత్తనం నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలోనే మహిళా హక్కుల పరిరక్షణకు నిర్భయ లాంటి పదునైన చట్టాలు వచ్చాయి. మహిళల రక్షణకు రూపొందించిన చట్టాల గురించి తెలుసుకుందాం రండి.. – కళ్యాణదుర్గం రూరల్ రాజ్యాంగం ఏమంటోంది.. ► సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరాదు. ఈ విషయంపై రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్ ఉంది. ► ఆర్టికల్ 14 ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ సమానులే. ఇదే ఆర్టికల్ ప్రకారం సమాన రక్షణ పొందడానికి ఇద్దరూ అర్హులు. ► ఆర్టికల్ 15/1 ప్రకారం స్త్రీగా ఆమెపై ఎవరూ వివక్ష చూపకూడదు. దుకాణాల్లో, ప్రదర్శనశాలల్లో, ఫలహారశాలల్లో, వినోదం కలిగించే ప్రదేశాలలో వారిని వెళ్లకుండా అడ్డుకోవడానికి వీలులేదు. ► స్త్రీలతో గనుల్లో పని చేయించకూడదు. జీవించేందుకు సంపూర్ణ హక్కు ► స్త్రీ తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటే.. దానిని హక్కుగా గౌరవించాలి. ► ఈ హక్కును కుటుంబంలోని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అడ్డుకోలేరు. 18 సంత్సరాలు నిండిన స్త్రీ తన ఇష్టం వచ్చిన పురుషున్ని పెళ్లాడవచ్చు. అయితే నిషేధింపబడిన దగ్గర బంధువైనప్పుడు, భార్య ఉన్న పురుషుడిని పెళ్లాడడానికి వీలులేదు. ► హిందూ స్త్రీ తనకు 18 ఏళ్లు నిండే వరకూ వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. ముస్లిం మహిళ తన 15 లేదా 18 సంవత్సరాలు నిండేలోపు జరిగిన వివాహాన్ని తిరస్కరించవచ్చు. ఈ హక్కును వాడుకోవాలనుకుంటే ఆమె తన భర్తతో లైంగిక సంబంధం కలిగి ఉండరాదు. ► స్త్రీని బలవంతంగా కాపురానికి తీసుకెళ్లే హక్కు ఎవ్వరికీ లేదు. ►18 సంవత్సరాలు నిండని బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకుంటే, సెక్షన్ 366 ప్రకారం యువకునికి పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ► ఏ స్త్రీ అయినా భర్త బతికి ఉండగా మరో వ్యక్తిని పెళ్లాడడానికి వీలు లేదు. అలా పెళ్లాడితే నేరమే. ముస్లిం స్త్రీల విషయంలో ఈ నిబంధన చెల్లదు. ► వివాహమైన (ఏ మతానికి చెందిన మహిళైనా) స్త్రీ భర్తతో కాక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోకూడదు. ► హేతుబద్ధ సమయాల్లో... ఆర్యోగానికి, సభ్యతకు భంగం కలుగని రీతిలో, ఇబ్బంది కలుగని సమయాల్లో, భార్య, భర్త లైంగిక పరమైన కోర్కెలు తీర్చుకోనివ్వాలి. ‘నిర్భయ’ంగా యావత్ దేశాన్ని నిర్భయ ఉదంతం కలిచివేసింది. రోడ్డుపై వెళుతున్న నిర్భయను బస్సులో తిప్పుతూ అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, మృతికి కారణమైన ఘటన యావత్ ప్రపంచాన్నే కదిలించింది. ఆమె ఆత్మకు శాంతి కలిగేలా... మహిళలకు మరింత రక్షణ కల్పించేలా 2013 మార్చి 19న నిర్భయ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్ట ప్రకారం స్త్రీ పట్ల ఏ పురుషుడైనా అసభ్యంగా ప్రవర్థించినా, అవమాన పరిచినా, వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా సెక్షన్ 354 కింద కేసు నమోదు చేయవచ్చు. ముస్లిం స్త్రీలకు ప్రత్యేక హక్కులు ► భర్త మరణించిన తర్వాత (ఇద్దతు కాలంలో) మళ్లీ వివాహం కుదరదు. ► భర్త ఉన్న చోటే కాపురం చేయాలి. సహేతుకమైన కారణముంటే తప్ప వేరుగా జీవించేందుకు అవకాశం లేదు. ► ముస్లిం స్త్రీలకు మెహరు హక్కు. భర్త చేత నిరాదరణకు గురైనా, విడాకులు ఇచ్చినా... భరణం పొందే హక్కు, పోషణ హక్కు, భర్తను తనతో కాపురం చేయమనే హక్కు తనకు తన భర్తకు వేరే గది (వీలైనంతవరకూ) కావాలనే హక్కు, బంధువులను చూసి వచ్చే హక్కు, వారు ఆమెను చూసిపోయే హక్కు ఉంటుంది. నిరక్షరాస్యతే ఓ కారణం దేశంలో మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. అయితే వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చట్టాల గురించి వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మహిళల్లో అక్షరాస్యత తక్కువ. ఈ కారణంతోనే తమ రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన లేకుండా పోయింది. వేధింపులకు సంపూర్ణ అక్షరాస్యతతో అడ్డుకట్ట వేయవచ్చు. – నిర్మల, కేజీబీవీ ఎస్ఓ, శెట్టూరు చట్టాలు వినియోగించుకోగలగాలి అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళలు నలిగిపోతున్నారు. తమపై జరుగుతున్న లైంగిక దాడులు, గృహహింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించలేకపోతున్నారు. కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకుని చట్టాలను సమర్థవంతంగా వినియోగించుకోగలగాలి. అప్పుడే గృహ హింసను నిర్మూలించేందుకు వీలవుతుంది. – సంధ్యారాణి, ఆర్ఎంపీ వైద్యురాలు, ములకలేడు, కళ్యాణదుర్గం మం. -
చట్టం తన పని తాను చేసుకుపోతుందా?
హైదరాబాద్: చట్టం తనపని తాను చేసుకుపోతుందని అంటారు కానీ అది ఎప్పటికీ జరగడం లేదని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగబద్ధ సంస్థలు– చట్టబద్ధ పాలన’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. అవినీతి నేరాలను పరిశోధించటం కోసం ఏర్పాటుచేసిన సంస్థపైనే ఆరోపణలు వస్తే ఇక అవినీతిని నిరోధించడం ఎలా అని ప్రశ్నించారు. సమాచార చట్టం కింద సీబీఐని ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. సీబీఐలో ఉన్న 11 మందిని తీసేశారని, వారిని ఎక్కడికి బదిలీ చేశారో ఇంతవరకు తెలియదన్నారు. సీబీఐ డైరెక్టర్‌ను ఒక్కసారిగా తీసివేస్తే ఉన్న కేసు విషయాలు ఎవరు విచారణ చేపట్టాలని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టర్‌ను నియమించే సెలక్షన్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఇక సీబీఐ కన్నా గొప్ప సంస్థ ఆర్బీఐ అని, సీబీఐలో దొంగలు కనపడతారు కానీ ఆర్బీఐలో కనబడరని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చి పారదర్శకత కోసం మా సమాచారం ఇస్తామని ముందుకు రాదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పాలిస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయటం లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఎస్.వినయ్‌కుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లాకి కొత్త అర్థం చెప్పారు
‘‘లా’ టైటిల్ చాలా బాగుంది. ‘లా’కి ‘లవ్ అండ్ వార్’ అని కొత్త అర్థం చెప్పారు గగన్ గోపాల్. ఈ చిత్రంతో కమల్ కామరాజు, మౌర్యాణిలకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా. ‘లా’ సినిమా హిట్ అవుతుంది. 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఏపీలో సినిమా తీస్తే పన్నులన్నీ రద్దు చేస్తాం. లొకేషన్లు ఫ్రీగా ఇస్తాం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎఫ్.డి.సి. చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. కమల్ కామరాజు, మౌర్యాణి, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా గగన్ గోపాల్ ముల్కా డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘లా’ (లవ్ అండ్ వార్). రమేష్ బాబు మున్నా, మద్దిపాటి శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. సత్య కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను విజయవాడలో విడుదల చేశారు. కమల్ కామరాజు మట్లాడుతూ– ‘‘గగన్ రాసిన స్క్రీన్ ప్లే మా సినిమాకు ప్రధాన బలం. నేను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కథే. ఈ చిత్రానికి కథే హీరో. మంచి ట్విస్టులు ఉంటాయి. రమేష్ బాబు మున్నా, మద్దిపాటి శివ లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు. ‘‘లా’ సినిమా కథను అందరు ఆర్టిస్టులు ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశారు. కమల్ కామరాజు, మౌర్యాణి, పూజ చాలా సహకరించారు’’ అని గగన్ గోపాల్ అన్నారు. రమేష్ బాబు, మౌర్యాణి, పూజా రామచంద్రన్, సత్య కశ్యప్, నటి మంజు భార్గవి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలు.. శిక్షలు
సాక్షి, వరంగల్:ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలే ప్రధాన భూమిక. ఈ ఎన్నికల నియమావళిని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ వీటిని కరపత్రం రూపంలో ముద్రించగా అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ దానిని విడుదల చేశారు. ఆ చట్టాలేంటో ...వాటికేసే శిక్షలేంటో...ఓసారి పరిశీలిద్దాం.. 123 - ఆర్పీ యాక్ట్ లంచగొండితనం, అనుచిత ఒత్తిడి, మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపాదికపై వర్గాల పౌరుల మధ్య ద్వేషాన్ని çశత్రుత్వాన్ని పెంపొందించుట లేక ప్రయతించుట శిక్షకు అర్హులు. 125 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించినట్లయితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 125అ - ఆర్పీ యాక్ట్ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అర్హులు. 126 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగంగా సభలు నిర్వహించినా శిక్ష అర్హులే. అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 127 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరిపినా ఏ పోలీస్ అధికారి అయినా యూఎస్ 42 సీఆర్పీసీ ప్రకారం ఆ వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 127అ - ఆర్పీ యాక్ట్ ఎవరైనా తన పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 128 - ఆర్పీ యాక్ట్ బహిరంగంగా ఓటేస్తే 3 నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అవకాశం. 129 - ఆర్పీ యాక్ట్ ఎన్నికలకు సంబంధించిన అధికారులు లేదా పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించిన లేదా ప్రభావం కలిగించుట శిక్షా అర్హులు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 130 - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయకూడదు. ఒక వేళ ప్రచారం చేస్తే రూ.250 జరిమానా విధిస్తారు. 131 - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్‌కు దగ్గరలో నియమాలకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 132 - ఆర్పీ యాక్ట్ ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 133 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు అక్రమంగా వాహనాలు సమకూర్చుకొనుట లేదా అద్దెకు తీసుకొనుట శిక్షార్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్షా లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 134 - ఆర్పీ యాక్ట్ ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షా అర్హులే. అందుకు రూ.500 వరకు జరిమానా వేయవచ్చు. 134అ - ఆర్పీ యాక్ట్ ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్‌గా గానీ, పోలింగ్ ఏజెంట్‌గా గానీ లేదా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్‌గా వ్యవహరించినా శిక్షకు అర్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 134ఆ - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు మార ణాయుధాలు కలిగి వెల్లుట నిషేధం.అతిక్రమించి వెళితే రెండు నెలల జైలు శిక్షా లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 135 - ఆర్పీ యాక్ట్ పోలింగ్ స్టేషన్ నుంచి బ్యాలెట్ పత్రం (ఈవీఎం) అపహరించినా శిక్ష పడుతుంది. సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 135అ - ఆర్పీ యాక్ట్ పోలింగ్ బూత్ స్వాధీన పరుచుట, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ నేరం చేస్తే శిక్ష పడుతుంది. అందుకు సంవత్సరం తగ్గకుండా ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలుచేయొచ్చు. 135ఆ - ఆర్పీ యాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతనపు సెలవుగా మంజూరు చేసినా శిక్ష. అందుకు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. 135ఇ - ఆర్పీ యాక్ట్ పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు మద్యం అమ్ముట, పంచిపెట్టుట నేరం. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. -
లవ్ అండ్ వార్
కమల్ కామరాజ్, మౌర్యాణి, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘లా’ (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్క దర్శకత్వంలో రమేష్ బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘కమల్ హీరోగానే కాదు.. కథ బాగా రావడానికి సహకరించారు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి.. బాగోకపోతే వందమందికి చెప్పండి... కానీ సినిమాని చూడండి’’ అన్నారు గగన్ గోపాల్. ‘‘లా’తో హీరోగా నేను రీ లాంచ్ అంటున్నారు. అవేమీ పెద్దగా నమ్మను. ఈ సినిమాకి మొదటి హీరో స్క్రీన్‌ప్లే. ‘లా’ని ఫాలో చేయకపోవడం హీరోయిజం అనుకుంటాం. బేసిక్ కామన్ సెన్స్ వాడితే అందరూ ‘లా’ని ఫాలో అయినట్లే’’ అని కమల్ కామరాజ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సంగీతం: సత్య కశ్యప్, సహ నిర్మాత: మద్దిపాటి శివ. -
ఒక నేరం.. 2 చట్టాలు.. ఒక శిక్ష
న్యూఢిల్లీ: ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించొచ్చని, కానీ రెండుసార్లు శిక్ష విధించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. గుట్కా అక్రమ రవాణా కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహారాష్ట్ర పోలీసులు దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. గుట్కా, పాన్ మసాలా అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలపై ఆహార భద్రతా ప్రమాణాల(ఎఫ్ఎస్ఎస్) చట్టం కింద కేసు పెట్టాలని, ఐపీసీ వర్తించదని గతంలో బాంబే హైకోర్టు తెలిపింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెడుతూ ‘ఏదైనా ఒక చర్య లేదా ఉల్లంఘనను రెండు వేర్వేరు చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తే, నేరస్తుడిని రెండు లేదా ఒకే చట్టం ప్రకారం విచారించొచ్చు. కానీ అదే నేరానికి రెండుసార్లు శిక్ష విధించకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో మహారాష్ట్ర పోలీసులు ఐపీసీ ప్రకారం కూడా విచారణ ప్రారంభించడానికి అనుమతిచ్చింది. ఒకే నేరాన్ని రెండు వేర్వేరు చట్టాల ప్రకారం విచారించడానికి ఎలాంటి పరిమితులు లేవని, రెండుసార్లు శిక్ష విధించడమే ఆమోదయోగ్యం కాదని స్పష్టతనిచ్చింది. ఐపీసీ విస్తృతిని నిర్వచించడంలో బాంబే హైకోర్టు పొరబడిందని పేర్కొంది. మరోవైపు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలు వివాదాస్పదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఆధార్ ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ నందన్ నిలేకని సాయం కోరింది. -
పిల్లల పాలిట ‘యమకూపం’
అభం శుభం ఎరుగని పసిపిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమాజంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనాతీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసి వాళ్లపై జరుగుతున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమయం వచ్చింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనో వేదన నిరంతరం పచ్చిపుండే. ఈ దేశ అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షక పాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విషయంలో దోషులే. ‘‘మనిషిగా తలెత్తి బతక లేను మానవత లేని లోకాన్ని స్తుతించలేను’’ అంటారు ప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్. నాలుగు సంవత్సరాల పాప లేత చేతులపై వాతలు. ఏడేళ్ల బిడ్డలపై... మరిగే నీళ్లు పోయడం, వాతలు పెట్టడం, కొట్టడం... తిట్టడం.. ఇలాంటివి చెప్పనక్కర లేదు. ఈ ఆడపిల్లలకు ఈడు రాలేదు! పాపం... కోరికంటే తెలియదు. బలవం తంగా చేసిన ఇంజెక్షన్ల కారణంగా ఈ పిల్లలు ‘పెద్ద వాళ్లయ్యారు’. అంతేకాదు, ఎందరి చేతుల్లోనో నలిగి పోయారు. ఎందుకంటే, ఈ చిన్న ఆడపిల్లలకే డిమాండ్. విటుల వికృత కోర్కెలకు వారు బలైపో తున్నారు. ఎంత చిన్న అమ్మాయి అయితే అంత ఎక్కువ రేటు. ఇలాంటి కోర్కెలున్న వాళ్లు నిజంగా మనుషులేనా? ప్రత్యేక జాతా? ఎవరీ పిల్లలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరీ కూనలు? ఎక్కడి నుంచి ఈ నరకానికి చేరారు? ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకు వచ్చిన వాళ్లు. ఆడుకుంటూ అమాయకంగా చాక్లెట్ల కోసం వచ్చి జీవితాలు కోల్పోయినవాళ్లే ఈ ఆడపిల్లలు. ప్రధానంగా పేదల పిల్లలు. వలస కూలీల పిల్లలు. వారి అమ్మానాన్నలకు పనికి వెళ్లక తప్పదు. ఇలాంటి కూలీల బిడ్డలకు కేర్ సెంటర్లు ఉండవు. రోడ్ల మీదే అలా తిరుగుతుంటారు. దుర్మార్గులకు దొరికిపో తారు. అయినా వారి విషయం ఎవరూ పట్టించు కోరు. పోలీసులతో సహా.. వీళ్లేమైనా ధనవంతుల బిడ్డలా? అధికారం ఉన్న వారి కడుపున పుట్టారా? గ్లామర్ ఉన్న ప్రముఖుల పిల్లలా? వారి ‘అదృశ్యం’ సంచలన వార్త అవుతుందా? కాదు గదా! చూద్దాంలే అంటారు చట్టాలు అమలు చేయాల్సినవాళ్లు. రోజూ 194 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు భారతదే శంలో. అందులో జాడ దొరికేది సగం మంది మాత్రమే. ఈ ముక్కుపచ్చలారని పిల్లల్లో 51 శాతం మంది అపహరణకుగురయినవారే. ఈ పిల్లలందరినీ వేరే దేశాల వ్యభిచార గృహాలకు, మన దేశంలోని వ్యభిచార కూపాలకు, బూతు సినిమాలు తీయడా నికి, వెట్టి చాకిరి చేయడానికి దుండగులు తరలిస్తు న్నారు. ఇలా మాయమవుతూ దుర్భర జీవితం గడుపుతున్న పిల్లల గురించి సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు ప్రభుత్వాలు సహా ఎవరూ పట్టించు కున్న దాఖలాలు లేవు. ఫోన్లు, వాట్సాప్ ద్వారానే మొత్తం వ్యాపారం! ఈ అమాయక ఆడపిల్లలను ఎత్తుకొచ్చినవాళ్లు, మధ్య దళారులు, వారిని కొనేవాళ్లు–వీరందరూ చాలా తెలివిగా వ్యవహారం నడుపుతుంటారు. మొత్తం వ్యాపారం ఇప్పుడు ఫోను సంభాషణలు, వాట్సాప్ ఫొటోలతో నడుస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్ల వయసు ఎంత? ఇప్పటికి ఎంత వ్యాపారం చేయడానికి ఉపయోగప డింది? ఇలా అన్నింటికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు వారితో వ్యాపారం చేసేవారి దగ్గర ఉంటాయి. ఈ ఆడపిల్లలతో వ్యాపారం చేసే అసలు సూత్రధారులు ఇలాంటి వివరాలతోనే బేరాలు కుదుర్చుకుంటారు. గత సంవత్సరం లక్షా పదకొండు వేల మందికి పైగా పిల్లలు కనపడకుండా పోయారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఏటా 50 వేల మంది స్త్రీలు, పిల్లలు భారతదేశంలోకి అక్రమ రవాణా అవుతు న్నారు. దేశంలో ఈ వృత్తిలో ఉన్న రెండు కోట్ల మందిలో కోటీ అరవై లక్షల మంది అక్రమ రవాణా ద్వారా ఇతరుల బలవంతంతో వచ్చినవాళ్లే. అంటే ఎనభై శాతం మంది మహిళలు ఇలా వ్యభిచారకూపా లకు అక్రమ రవాణా కారణంగా చేరుకున్నవారే. భారీ ప్రభుత్వ వ్యవస్థ ఉన్న ఈ దేశంలో బాలల అక్రమ రవాణా అరికట్టడానికి ఇంత వరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదు. నిర్ణీత కాంట్రాక్టు పద్ధతిలో పిల్లల తరలింపు కాంట్రాక్టు పద్ధతిలో పిల్లలను వ్యభిచార గృహాలకు ఇవ్వడం, ముందే నిర్ణయించిన గడువు తీరగానే మళ్లీ మరో ప్రదేశానికి తరలించడం చాలా ఏళ్లుగా జరుగు తోంది. ఇలా పిల్లలను అనేక చోట్లకు తరలించడం వల్ల వారి జాడ తెలుసుకోవడం చాలా కష్టమౌతోంది. ఇలా తీసుకొచ్చిన పిల్లలను బడి పిల్లల్లాగే తయారు చేశాక అపార్ట్మెంట్లలో నివాసాల మధ్య ఈ దుర్మా ర్గపు వృత్తి చేయిస్తున్నారు. అవసరాన్ని బట్టి వారిని నేలమాళిగల్లో దాచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ పిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమా జంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ అక్రమ సెక్స్ వ్యాపారంలో ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా గిరాకీ పెరిగిపోతున్నది. ఈ పిల్లలతో ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి? అసహజమైన బూతు దృశ్యాలు విపరీతంగా చూసి రెచ్చిపోవడం, వయసు మీరుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మా యిలు దొరకకపోవడం మాత్రమే కారణాలా? లేక ఎవరూ తాకని పసి కన్యలు కావాలనే మోజా? ఇలాంటి పిల్లలతో శారీరక సంబంధం పెట్టుకుంటే అప్పటికే ఉన్న రోగాలు పోతాయనే మూఢనమ్మ కమా? ముక్కుపచ్చలారని ఈ పిల్లలను ఎంతగా హింసించినా, ఎలాంటి వికృత లైంగిక చర్యలకు పాల్పడినా వారు అడ్డుచెప్పలేరనే నమ్మకమా? నిస్స హాయ స్థితిలో ఉండే అమ్మాయిలపై కామం పేరుతో శాడిజానికి పాల్పడి ఆనందించే రాక్షస లక్షణమా? ఇంకే కారణాలు మనుషులను మృగాలను మించి పోయేలా చేస్తున్నాయి? ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనా తీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసివాళ్లపై జరుగు తున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమ యం వచ్చింది. బిహార్ అనాథ గృహాల కథనాలు దారుణం ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌లోని అనాథ గృహాల కథ నాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఆయన రాజ కీయ నాయకుడు. మూడు పత్రికల యజమాని. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. ఆయన ఏడేళ్ల మూగ చెవిటి అమ్మాయిని కూడా వదల్లేదు. 34 మంది చిన్న బిడ్డలకు మత్తుమందులు ఇచ్చి అత్యాచారాలు చేసిన ఘటనలు ఇక్కడే జరుగుతున్నాయి. బిహార్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మంజూ వర్మ (ఈమె బుధ వారం పదవికి రాజీనామా చేశారు) భర్త ముజఫర్ పూర్ అనాథ బాలికల గృహంలో అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడమేగాక తానే స్వయంగా అత్యాచారం చేశాడు. అనాథ గృహంలోని ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై ఎవరో ఇచ్చిన నివేదిక ఎనిమిది నెలలపాటు అతీగతీ లేకుండా మంత్రి ఆఫీసులో పడి ఉంది. ఈ పిల్లల ఆక్రందనలు ఎవరూ వినలేదు. బయటకు ఈ పిల్లల అరుపులు, ఏడుపులు వినపడుతున్నా, బాలికలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నా చుట్టూ ఉన్న జనం మాట్లాడలేదు. ఎందుకంటే వారికి భయం. ఈ దుర్మార్గాలకు సూత్రధారి అయిన బ్రజేష్ ఠాకూర్ తనను అరెస్ట్ చేశాక భయపడలేదు. పోలీసులు తీసు కుపోతున్నప్పుడు అతను నవ్వుకుంటూ ‘ఇదంతా రాజకీయ కుట్ర’ అని మీడియాకు ధైర్యంగా చెప్పా డంటే, అతనికి రాజకీయంపై ఎంత నమ్మకం? అతని నమ్మకం వమ్ముకాలేదు. జైలు ఆస్పత్రిలో ఠాకూర్‌కు రాజభోగాలందుతున్నాయి. అనాథ పిల్ల లంతా మానసిక, శారీరక గాయాలతో కునారి ల్లుతున్నారు. బ్రజేష్ ఠాకూర్ నడిపే మరో అనాథగృ హంలో 11 మంది పిల్లల ఆచూకీ లేదు. గువాహటీ మసాజ్ సెంటర్లో... ఇలాంటి అక్రమాలకే నిలయమైన గువాహటీ మసాజ్ సెంటర్ గురించి స్థానికులు ఫిర్యాదు చేసినా చాలా కాలం పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడి తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు 110 మంది అమ్మా యిలను రక్షించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో బ్లాక్ లిస్టులో ఉండి, అనుమతి లేని షెల్టర్ హోమ్‌కు పోలీ సులు అమ్మాయిలను ఇస్తూనే ఉన్నారు. ఈ అనాథ కేంద్రాల నుంచి రోజూ వ్యాన్లలో మైనారిటీ తీరని అమ్మాయిలను విటుల దగ్గరకు పంపడం పోలీసు లకు తెలుసు. మరి ఈ విటులు అధికారులా? రాజ కీయ నాయకులా? అనే విషయంపై పోలీసులు ఆరా తీయడం లేదు. విటులందరిపైనా పోక్సో చట్టం కింద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? ఈ ఘటనలన్నింటికీ అక్రమ రవాణా చట్టం, వ్యభిచార నిరోధక చట్టంతోపాటు పోక్సో చట్టం కూడా వర్తి స్తుంది. వ్యభిచార కూపాల్లో మాదిరే ఈ గృహాలకు చేరిన పిల్లలు వాటి నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిందే. ఈ హోమ్‌ల యజమానులకు రాజ కీయ పార్టీలు, అధికారుల అండదండలున్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా అక్రమ రవాణా బాధి తులను ఈ పునరావాస కేంద్రాలకు తరలిస్తూనే ఉన్నారు. వీటిలో పునరావాసం కల్పించేవి ఎన్ని? వ్యాపారం నడిపేవి ఎన్ని? ఎక్కడా పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు కూడా జవా బుదారీతనం లేదు. వేటిపైనా నిఘా లేదు. ‘పునరా వాసం’ మంచి లాభదాయక వ్యాపారంగా మారింది. అందుకే సుప్రీంకోర్టు ‘‘పసి పిల్లలపై అకృత్యాలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇస్తున్నదా? ఎందుకు సరైన తనిఖీ లేదు’’ అని ప్రభుత్వాన్ని నిల దీసింది. కనీసం అత్యాచార బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్నయినా ఎందుకు ఇవ్వలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనోవేదన నిరంతరం పచ్చిపుండే. ఈ పిల్లలు మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు భరోసా ఇవ్వాలని ఎవరూ అనుకోవడం లేదు. వారి మానసిక కల్లోలం సమసిపోవడానికి చికిత్స అందిం చాల్సిన బాధ్యత మనపై ఉందని ఎవరూ భావిం చడం లేదు. ఒక గృహంలో అకృత్యాలు జరిగినట్టు తేలితే పిల్లలను మరో గృహానికి తరలించి అధికా రులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ దేశ అధి కార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షకపాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విష యంలో దోషులే. నిర్లజ్జగా, బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అసలు నేరస్తులు. వ్యాసకర్త : పి. దేవి, సాంస్కృతిక కార్యకర్త ఈ–మెయిల్ : pa_devi@rediffmail.com -
వ్యభిచార వ్యతిరేక చట్టం ఉండాల్సిందే
న్యూఢిల్లీ: అక్రమ సంబంధాలను నేరంగా పరిగణిస్తున్న చట్టాన్ని రద్దుచేస్తే వివాహ పవిత్రత దెబ్బతింటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడు శిక్షార్హుడవుతాడు. ఈ సెక్షన్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోరింది. సెక్షన్ 497 వివాహ వ్యవస్థను కాపాడుతోందని అఫిడవిట్లో పేర్కొంది. ‘ఐపీసీ సెక్షన్ 497, సీఆర్పీసీ సెక్షన్ 198(2)ల రద్దు.. వైవాహిక వ్యవస్థ, పవిత్రతకు ప్రాధాన్యమిస్తున్న భారతీయ సంప్రదాయ విలువలకు కీడు చేస్తుంది. భారతీయ సమాజం, విశిష్టతలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని రూపొందించారు’ అని తెలిపింది. -
ఆ విత్తనం ఓ మహా విస్ఫోటనం
మా నాయిన సోలిపేట రామకృష్ణారెడ్డి 12 ఎక రాలకు ఆసామి. పంట విత్తనంలోనే ఉంది’ అని నమ్మే రైతు. కోతకొచ్చిన పంట చేలోంచి మెండైన కంకులు ఏరించి మరుసటి ఏడాదికి విత్తనంగా దాచి పెట్టేవారు. మా నాయిన పండించిన వరి విత్తనాలను మా ఊరు రైతులు ఎగబడి ఎగబడి కొనేటోళ్లు. ఇçప్పుడీ పద్ధతి పల్లెల్లో చూద్దామన్నా కనిపించటం లేదు. సాంప్రదాయ విత్తనాల స్థానంలోకి అధికో త్పత్తి హైబ్రీడ్, జన్యుమార్పిడి విత్తనాలు చొర బడ్డాయి. ఇవ్వాళ పంట పొలంలో నాటుతున్న ఒక్కొక్క జన్యు మార్పిడి విత్తనం భవిష్యత్తులో మందు పాతరను మించిన మహా విస్ఫోటనమై మహా విపత్తును సృష్టించబోతున్నాయి. పత్తితో పాటు, మనుషులు ఆహారంగా తీసుకునే మిరప, వంగ, టమాట, నువ్వులు, వేరుశెనగ వంటి కూర గాయలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో జన్యు మార్పిడి విత్తనాలు వచ్చేశాయి. పర్యావరణ విఘాతం ఏర్పడుతుందనే కారణంతో వాణిజ్యప రంగా ఉత్పత్తి చేయటాన్ని దేశంలో నిషేధించారు. యూరోపియన్ దేశాలు కూడా బీజీ3ని నిషేధిం చాయి. జీవ వైవిధ్యాన్ని ఎలాంటి రూపంలోనైనా ప్రభావితం చేసే విత్తనాలకు దేశంలోకి అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ గత ఏడాది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 50 లక్షల ఎకరాల్లో బోల్‌గార్డు 3 విత్తనాలు సాగైనట్లు తేలటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు పరిశోధనలు చేసిన విత్తనా లను సర్టిఫై చేసి వాణిజ్యపరంగా ఉత్ప త్తికి విడుదల చేసేవాళ్లు, గ్లోబలైజేషన్‌తో వచ్చిన సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విత్తన రంగం బాధ్యతల నుంచి తప్పుకొని బహుళజాతి సంస్థ లçకు అప్పగించాయి. ఫలితంగానే నేడు విత్తనంపై బహుళజాతి సంస్థల పెత్త నమే కొనసాగుతున్నది. ఇప్పటికీ మనం 1955, 1966 నాటి సరళమైన పాత విత్తన చట్టాలనే వాడుతున్నాం. 52 ఏళ్లు గడిచిపోయినా కొత్త విత్తన చట్టాలను రూపొందించు కోవాల్సిన అవసరం లేదా? 1966 విత్తన చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ రూపొందించిన విత్తన చట్టం– 2004 ముసాయిదా నేటికీ పార్లమెంటులో పెండింగ్‌లోనే ఉంది. దేశంలోని 75 శాతం మంది రైతాంగం కోరుకుంటున్న సమగ్ర విత్తన చట్టాలు అమల్లోకి రాకుండా ఆపు తున్నది ఎవరో బహిరంగ రహస్యమే. ప్రస్తుతం రాష్ట్రంలో మోన్శాంటో, డూపా యింట్, కార్గిల్, సింజెంటా కంపెనీలు 60 శాతం విత్తనాలపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. మరో 9 సంస్థలు మిగిలిన మార్కెట్‌ను గుప్పిట పట్టాయి. ఇప్పటి వరకు లభించిన వ్యవసాయ శాఖ నివే దికల ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు 31.06 కోట్ల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 9.80 కోట్ల ఎకరాల్లో, నూనె గింజలు 6.62 కోట్ల ఎకరాల్లో, పత్తి 5.45 కోట్ల ఎకరాల్లో సాగు అవుతున్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 397 విత్త నోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్‌లో 20 లక్షల క్వింటాళ్ళు ఆహార, పప్పు, నూనె గింజల విత్తనాలు, ఒక కోటికి పైగా పత్తి విత్తనాలు, రబీలో 8 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం. కొత్త విత్తన చట్టాలు అమల్లోకి రాకపోగా.. బహుళ జాతి సంస్థలు పాత విత్తన చట్టాల్లో ఉన్న కొన్ని కఠినమైన క్లాజుల్లో మార్పులు తెచ్చేవిధంగా ప్రభు త్వంపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా ఉత్పత్తి చేసే కంపెనీయే తన విత్తనానికి ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ ఇచ్చు కునే వెసులుబాటు కల్పించారు. దీంతో పత్తి విత్త నాల అక్రమసాగుకు అడ్డు లేకుండాపోయింది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేసే పత్తి పంటలోకి నిషేధిత బీజీ3 విత్తనాలను చొప్పించటానికి ఓ రాచ మార్గం ఏర్పడింది. ఫలితంగా ఆ పంటలను మేసిన పశువులు మరణించడం, చేలో పనిచేసిన వారికి గర్భస్రావాలు, చర్మవ్యాధులు సోకినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన బీజీ3 విత్తనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రస్థాయిలో ఒక సమగ్రమైన విత్తన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చే పనిలో నిమగ్నమ యింది. నకిలీ విత్తనాలు విక్రయించే వాళ్లపై పీడీ యాక్టు ప్రయోగించే విధంగా నిబంధ నలు అమల్లోకి తెచ్చారు. సోలిపేట రామలింగారెడ్డి , వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141 -
ఉదారుడు... ఉద్దండుడు
‘మన క్లేశం విభజనతో అంతం కాదన్న వాస్తవం భయపెడుతున్నది. పైగా అది కొత్త కష్టాలకు ఆరంభమే అవుతుంది. ఇక ఆ కష్టాలు తొలగడానికి పాతికేళ్లయినా చాలవని గుబులుగా కూడా ఉంది.’ తేజ్ బహదూర్ సప్రూ, మహమ్మదలీ జిన్నా – ఈ ఇద్దరు దక్షిణాసియాలోనే గొప్ప న్యాయవాదులని అనేవారు గాంధీజీ. ఆ ఇద్దరు ఆప్తమిత్రులు. వారిలో జిన్నా దేశ విభజన కోరి, సాధించాడు. సప్రూ దేశ విభజనను నిరాకరించాడు. స్వాతంత్య్రం రావడానికి రెండు మాసాల ముందు ఒక ఉత్తరంలో సప్రూ (డిసెంబర్ 8, 1875 – జనవరి 20, 1949) రాసినవే పై వాక్యాలు. భారత్–పాకిస్తాన్ విభజన ఫలితం గురించి ఇంత స్పష్టంగా ఆలోచించిన కొద్దిమందిలో సప్రూ ఒకరు. సప్రూ స్వాతంత్య్ర సమరయోధుడు, ది లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రముఖుడు, పండితుడు. న్యాయశాస్త్రంతో పాటు ఇంగ్లిష్ సాహిత్యం విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. పర్షియన్, ఉర్దూ పట్ల ఆయన అభిరుచి ఎనలేనది. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున, తన పార్టీ తరఫున సైమన్ కమిషన్ సహా ఎన్నోసార్లు బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిన మేధావి సప్రూ. ఏ పోరాటమైనా రాజ్యాంగ బద్ధంగా జరగాలనే కానిస్టిట్యూషనలిస్టుల వర్గానికి చెందినవారాయన. నిజానికి జిన్నా కూడా తొలి దినాలలో అలాంటి భావాలు కలిగినవారే. కానీ వీరంతా తొలి దశ స్వాతంత్య్ర పోరాటంలో తిరుగులేని జాతీయవాదులు. సప్రూ అలీగఢ్‌కు తరలివచ్చిన ఒక కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఆగ్రాలో న్యాయశాస్త్రం చదువుకున్న తరువాత అలహాబాద్ హైకోర్టు న్యాయవాది అయ్యారు. అలహాబాద్ అంటేనే స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖులకు ఆలవాలం. తరువాతి కాలాలలో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన పురుషోత్తమదాస్ టాండన్ సప్రూ వద్ద సహాయకుడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం డీన్‌గా కూడా సప్రూ పనిచేశారు. నాటి జాతీయవాదులందరి మాదిరిగానే సప్రూ కూడా మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. గోపాలకృష్ణ గోఖలే ఆయనకు ఆదర్శం. చిత్రం ఏమిటంటే– సప్రూయే కాదు, ఆయన కంటే ముందు గోఖలేను రాజకీయ గురువుగా ఆరాధించిన వ్యక్తి జిన్నా. తాను ముస్లిం గోఖలేగా ఖ్యాతి గాంచాలని ఆకాంక్షించాడు. తరువాత వచ్చిన గాంధీ కూడా గోఖలేనే తన రాజకీయ గురువుగా భావించారు. కానీ ఈ ముగ్గురు వేర్వేరు దారులలోనే ప్రయాణించారు. జిన్నా ముస్లిం లీగ్ వైపు నడిచాడు. సప్రూ లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాలో (తరువాత ఇదే ది నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అయింది) చేరడానికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. భారతీయులకు విస్తృత రాజకీయ హక్కులు ఉండాలన్నది సప్రూ వాదన. స్వాతంత్య్రం కూడా ఉండాలి. కానీ అది చర్చల ద్వారా సాధించుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. ఇందుకోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రాంతీయ లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఉపయోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవి. ఎవరో కొందరు భారతీయులు తప్ప మిగిలినవారు ఆంగ్ల ప్రభుత్వం నామినేట్ చేసినవారే. అందుకే వీటిలోని సభ్యులను వైస్రాయ్ ఆడించే బొమ్మలనీ రబ్బరు స్టాంపులనీ విమర్శ ఉండేది. అయినా వలస ప్రభుత్వం ఇచ్చిన ఆ కొద్ది అవకాశాన్నే ఆసరాగా చేసుకుని హక్కుల సాధనకు పోరాటం చేయాలని సప్రూ అభిమతం. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోను, యుౖ¯ð టెడ్ ప్రావిన్స్ ప్రాంతీయ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోను కూడా ఆయన పనిచేశారు. వైస్రాయ్ కౌన్సిల్లో న్యాయ విభాగ సభ్యుడు. దేశ విభజనను నిస్సంశయంగా నిరాకరిస్తూనే మైనారిటీల హక్కుల కోసం పోరాడిన హిందువులు ఉన్నారు. అందులో అగ్రగణ్యుడు సప్రూ. సప్రూ మొదట గాంధీజీ నాయకత్వంలోనే పనిచేశారు. శాసనోల్లంఘన, దండి సత్యాగ్రహం, క్విట్ఇండియా ఉద్యమాలు అహింసాయుతంగా జరగాలని గాంధీజీ పిలుపునిచ్చారు. అందుకే వీటిని సప్రూ (1918లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా కూడా) బలపరిచారు. 1892లోనే సప్రూ జాతీయ కాంగ్రెస్ సభలకు మొదటిసారి హాజరయ్యారు. అప్పుడే అందులో సభ్యత్వం తీసుకుని, కార్యదర్శి అయ్యారు. సెంట్రల్ ప్రావిన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్‌ను వీడినప్పటికీ సప్రూను గొప్ప న్యాయ నిపుణుడిగా ఆ సంస్థ గౌరవించేది. చరిత్రాత్మక గాంధీ–ఇర్విన్ ఒప్పందంలో కీలక పాత్ర ఆయనదే. దీనితోనే ఉప్పు సత్యాగ్రహం ముగిసింది. అంటరాని కులాల వారికి ప్రత్యేక నియోజక వర్గాల కేటాయింపు అంశంలో కూడా గాంధీ, అంబేడ్కర్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య రాయబారం నడిపిన వ్యక్తి కూడా సప్రూయే. పూనా ఒప్పందంతో ఇది సాధ్యమైంది. తన లిబరల్ పార్టీ తరఫున సప్రూ రౌంట్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. అప్పుడు సప్రూకు పార్టీ సహచరునిగా ఉన్నవారు ఎంఆర్ జయకర్. తరువాత హిందూ మహాసభలో కీలకపాత్ర వహించారు. భారతీయులకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించే అంశాన్ని చర్చిండానికి ఉద్దేశించినవే రౌండ్ టేబుల్ సమావేశాలు. సైమన్ కమిషన్ తదనంతర పరిణామాలలో సప్రూ నిర్వహించిన పాత్ర నిర్మాణాత్మకమైనది. రాజ్యాంగ సంస్కరణలను రూపొందించడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపినదే సైమన్ కమిషన్. సర్ జాన్ అల్సేబ్రూక్ సైమన్ దీని అధ్యక్షుడు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ ప్రధాని పదవి చేపట్టి, భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించడంలో కీలక పాత్ర పోషించిన క్లెమెంట్ అట్లీ ఈ కమిషన్‌లోనే సభ్యుడు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు. కానీ ఎవరూ భారతీయులు కారు. అందుకే దీనిని భారతీయులు తిరస్కరించారు. అలా అయితే భారతీయులే ఒక రాజ్యాంగం రాసుకోవాలని బ్రిటిష్ కార్యదర్శి సవాలు విసిరాడు. ఫలితమే నెహ్రూ 14 సూత్రాలు. వీటినే నెహ్రూ ప్రణాళిక అని కూడా అంటారు. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘంలో నిజానికి ప్రముఖ పాత్ర వహించినవారు సప్రూయే. కానీ ఈ ప్రణాళికను జిన్నా వ్యతిరేకించారు. లక్నో కాంగ్రెస్ (1916) ముస్లింలకు ఇచ్చిన హామీలు ఇందులో లేవన్నది జిన్నా ఆరోపణ. భారత స్వాతంత్య్రోద్యమానికి అనేక పార్శా్వలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కావచ్చు. రాజ్యాంగ సంస్కరణల కోసం పోరాటం అందులో భాగమే. దేశానికి అవసరమైన రాజ్యాంగ సంస్కరణల ప్రక్రియ కొనసాగడం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినవారు కొందరు ఉన్నారు. దేశంలో రాజ్యాంగబద్ధత కోసం, భారతీయులు రాజకీయంగా అభివృద్ధి చెందడం కోసం వీరు చేసిన కృషి గొప్పది. కాబట్టి భారత స్వాతంత్య్ర పోరాటమంటే రాజ్యాంగ సంస్కరణల క్రమం కూడా. ఈ సంస్కరణల ప్రక్రియ భారత పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అనుగుణంగా ఉన్నదో లేదో, హక్కులను కాపాడేదో కాదో పరిశీలించే కొందరు మేధావులు కూడా ప్రతి మలుపులోను కనిపిస్తారు. అలాంటి వారిలో సప్రూ ప్రథముడు. 1928–1942 మధ్య రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి కనీసం ఐదు పర్యాయాలు సప్రూ కీలక పాత్ర పోషించారు. భారత న్యాయశాస్త్ర చరిత్రలో అద్వితీయుడు సప్రూ. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ పత్రికల మీద, వాటి సంపాదకుల మీద, స్వాతంత్య్రం సమరయోధుల మీద పెట్టిన అనేక కేసులను సప్రూ వాదించారు. 1944 రంజాన్ మాసంలో (సెప్టెంబర్ 9 నుంచి) జిన్నా–గాంధీ మధ్య 18 రోజుల పాటు చర్చలు జరిగాయి. ద్విజాతి సిద్ధాంతం వాదన నుంచి జిన్నాను వెనక్కి తీసుకురావడం గాంధీజీ ఉద్దేశం. అది జరగలేదు. అయినా మరొక దఫా ఆ ఇద్దరి మధ్య జరగాలని గట్టిగా కోరినవారు సప్రూ. న్యాయశాస్త్రంలో అపార నైపుణ్యంతో పాటు సప్రూకు ఉన్న మరొక కోణం సాహిత్యాభిమానం. సాహిత్యం, కవిత్వంతో తడిసిన సాయంత్రాలను ఆస్వాదించడం ఆయన జీవితమంతా కనిపిస్తుంది. అలహాబాద్‌లోని 19 అల్బర్ట్ వీధిలోని ఆయన ఇల్లు సాయంత్రం అయ్యే సరికి కవులు, నాయకులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఆచార్యులు, జూనియర్ లాయర్లు వంటి వారితో నిండిపోయేది. కవితా పఠనం, స్వాతంత్య్రోద్యమం మీద చర్చ, సరదా సంగతులు, హాస్యోక్తులతో ఆ ‘దర్బార్’లు రసవత్తరంగా సాగేవి. ఇది నిత్య కృత్యం. పర్షియన్, ఉర్దూ భాషలలో ఆయన పాండిత్యం అసాధారణమైనది. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ తాను రాసిన ఒక వ్యాసాల సంకలనానికి సప్రూ చేతనే ముందుమాట రాయించారు. ఉర్దూలో ఆయనకు ఉన్న పాండిత్యం అంతటిది. అలాగే ఆయన కశ్మీర్, యూరోపియన్, అరేబియన్ వంటలు చేయడానికి ముగ్గురు వంటవాళ్లను నియమించుకుని ఎవరికి కావలసిన రీతిలో వారికి భోజనాలు ఏర్పాటు చేయించేవారు. సప్రూ విలాసవంతమైన జీవితం గడిపారు. అయితే అది అర్థవంతమైన జీవితం. తాను ఆనందంగా, ఉల్లాసంగా ఉండేవారు. అవతలి వారిని కూడా సంతోషపెట్టేవారు. జిన్నాకూ, సప్రూకూ ఒక కోర్టు కేసు విషయంలో వాస్తవంగా జరిగిన ఉదంతాన్ని ఇక్కడ ఉదహరించడం అసందర్భం కాదు. ఒక ఆస్తి తగాదాలో ఒకవైపు సప్రూ, మరొకవైపు జిన్నా న్యాయవాదులుగా పనిచేశారు. వాదోపవాదాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఆ ఆస్తికి సంబంధించిన అసలు పత్రం తీసుకురమ్మని ఆంగ్ల న్యాయమూర్తి ఆదేశించాడు. దానిని తీసుకురాగానే న్యాయమూర్తి చేసిన పని, పైకి చదివేపనిని జిన్నాకు అప్పగించడం. ఎందుకంటే జిన్నా ముస్లిం. అది పర్షియన్లో రాసి ఉంది. జిన్నా ఆ పత్రం తీసుకున్నాడే కానీ, అక్షరం కూడా చదవలేకపోయాడు. వెంటనే సప్రూ ఆ పత్రాన్ని తీసుకుని చదివి వినిపించాడు. మరునాడు ఇదే విషయం పత్రికలలో వచ్చింది. దానికి ఒక పత్రిక పెట్టిన శీర్షిక– ‘పండిట్ జిన్నా, మౌల్వీ సప్రూ’. మరొక సంగతి కూడా చెప్పుకోవాలి. సారే జహాసె అచ్చా గీతం (1904) రాసిన డాక్టర్ ఇక్బాల్ లేదా అల్లామా ఇక్బాల్; డాక్టర్ తేజ్‌బహదూర్ సప్రూ వరసకు (కజిన్స్) అన్నదమ్ములే. - డా. గోపరాజు నారాయణరావు -
లవ్ అండ్ వార్
సమాజంలో ప్రతి మనిషి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవించకుంటే ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లా’. ‘లవ్ అండ్ వార్’ అనేది ఉపశీర్షిక. కమల్ కామరాజ్, మౌర్యాణి జంటగా గగన్ గోపాల్ దర్శకత్వంలో రమేశ్‌బాబు మున్నా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కమల్ కామరాజ్ మాట్లాడుతూ –‘‘హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను. కానీ, గగన్ గోపాల్ చాలా డీటైల్డ్‌గా కథ చెప్పాడు. ఇది పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. సినిమా కథనం చాలా సీరియస్‌గా సాగుతుంది. ఈ సినిమాను ఎక్కువ భాగం విజయవాడలో తీశాం’’ అన్నారు. ‘‘మంచి ట్వస్ట్లతో, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనాలతో ‘లా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. సత్య కశ్యప్ మ్యూజిక్ సినిమాకి ప్రధానం బలం’’ అన్నారు గగన్ గోపాల్ ముల్క. నిర్మాతలు, మౌర్యాణి పాల్గొన్నారు. పూజా రామచంద్రన్, మంజు భార్గవి, ఛత్రపతి శేఖర్, రవి మల్లాడి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సహనిర్మాత: మద్దిపాటి శివ. -
తప్పుడు వార్తలు రాస్తే.. పదేళ్లు జైలు!
కౌలాలంపూర్ : తప్పుడు వార్తలపై చర్యలకు మలేషియా ప్రభుత్వం ఉపక్రమించింది. నకిలీ వార్తలు రాసేవారికి, ప్రచారం చేసేవారికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఈ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఇప్పటికే తనపై అవినీతి ఆరోపణలు చేస్తోన్నవారిని టార్గెట్ చేశారు. ఆగస్టులో జరిగే ఎన్నికల్లో గెలుపోందడానికే రజాక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష ఎంపీ చార్లెస్ సాంటిగో మాట్లాడుతూ.. అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం అతిపెద్ద ఆయుధాన్ని వాడుతోందన్నారు.రాబోయే ఎన్నికల్లో నజీబ్ రజాక్ హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకురానుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం ప్రజా భద్రత కోసమే తాము ఈ చట్టాన్ని తీసుకు రానున్నామని చెబుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది ఏ మాత్రం ఆటంకం కాబోదని పేర్కొంది. ఈ చట్టాన్ని అనుసరించి తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్లు జైలు శిక్ష లేదా 5,00,000 రింగిట్లు(దాదాపు 84 లక్షల రూపాయలు) జరిమానా విధించనున్నారు. ఈ చట్టాన్ని బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఉల్లఘించినా, వారు మలేషియాలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ నివేదిక ప్రకారం ‘రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్స్’ జాబితాలో మలేషియా 144వ స్థానంలో ఉంది. -
‘చట్టం’తో కొత్త పట్నం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 63 నగర పంచాయతీలు, 5 మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణతో పనిలేకుండా.. నేరుగా చట్ట సవరణ ద్వారా పురపాలికలను ఏర్పాటు చేసేదిశగా కసరత్తు చేస్తోంది. కొత్త, పాత పురపాలక సంస్థల్లో 350 గ్రామ పంచాయతీలు, ఆవాసాలను విలీనం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం, రాష్ట్ర మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ చట్టాలను సవరిస్తూ ముసాయిదా బిల్లులు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తోంది. 141కి చేరనున్న పురపాలికలు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 68 కొత్త పురపాలికలు ఏర్పాటైతే.. రాష్ట్రంలో మొత్తం పురపాలికల సంఖ్య 141కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1,24,90,739 కాగా.. కొత్త పురపాలికలతో ఈ సంఖ్య 1,46,47,857కు పెరగనుంది. శాతాల వారీగా చూస్తే.. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 శాతం నుంచి 45 శాతానికి పెరగనుంది. ఇప్పుడున్న చట్టాలకే సవరణలు! కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పేర్లతో పాటు ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేసే గ్రామ పంచాయతీల పేర్లను చేర్చుతూ రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని సవరించనున్నారు. అటు జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనమయ్యే గ్రామాల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చుతూ సవరణలు చేయనున్నారు. సంబంధిత గ్రామ పంచాయతీల ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే.. వాటికి మున్సిపాలిటీ/నగర పంచాయతీ హోదా అమల్లోకి రానుంది. తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే.. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్, పురపాలక చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడం, లేదా ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ముందు ఆయా స్థానిక సంస్థల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై సంబంధిత గ్రామ ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను పరిష్కరించి రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. అనంతరం గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాలి. అప్పుడు సంబంధిత గ్రామానికి పంచాయతీ హోదాను ఉపసంహరిస్తూ.. పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అదే సమయంలో ఆ గ్రామాని మున్సిపాలిటీ హోదా/మున్సిపాలిటీలో విలీనం చేస్తూ పురపాలక శాఖ జీవో జారీ చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకుండానే కొత్త పురపాలికల ఏర్పాటుకు ముందుకు వెళ్లడం, దానిపై ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తుండడంతో కొత్త పురపాలికల ఏర్పాటు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రక్రియలేమీ లేకుండా నేరుగా పురపాలికల ఏర్పాటు కోసం ప్రభుత్వం చట్టాల సవరణకు నిర్ణయం తీసుకుంది. -
చూచిరాత ఇ'లా'
న్యాయశాస్త్రం డిగ్రీ అంగట్లో సరుకులా మారింది. సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందుకుగాను కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించా ల్సిన యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ కళాశాలకు దాసోహమనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూచిరాతల అవకాశం ఉండడంతోనే తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు న్యాయశాస్త్రం అభ్యసించేందుకు పుత్తూరును ఎంచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పుత్తూరు: విశ్వసనీయ వర్గాల సమాచారం మండల పరిధిలోని ఒక ప్రైవేట్ లా డిగ్రీ కళాశాల విద్యార్థులు గత వారం రోజుల నుంచి మరో ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. యథేచ్ఛగా పుస్తకాలు ముందర పెట్టుకుని పక్కపక్కనే కూర్చొని పరీక్షలను రాస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇందుకు పరీక్షా కేంద్రం యాజమాన్యం సహకరిస్తుండడం, యూనివర్సిటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చూచిరాతల కోసం లా విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యం ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో పరీక్షా కేంద్రం యాజమాన్యాలకు, యూనివర్సిటీ అధికారులకు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు విద్యార్థుల క్యూ.. ప్రత్యేకించి పుత్తూరులో లా డిగ్రీ చదివేందుకు తమిళనాడుకు చెందిన వందలాది మంది విద్యార్థులు కొన్నేళ్లుగా క్యూ కడుతున్నారు. గతంలో తమిళ సినీ యాక్టర్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా పుత్తూరులోని ప్రైవేట్ లా కళాశాల విద్యార్థిగానే డిగ్రీ పరీక్షలకు హాజరుకావడం అప్పట్లో సంచలనమైంది. తమిళనాడులో లా డిగ్రీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తుండడంతో చూచిరాతలకు అనుకూలంగా ఉన్న పుత్తూరును ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర పట్టణాల నుంచే కాకుండా కేరళ నుంచి కూడా లా డిగ్రీ కోసం విద్యార్థులు పుత్తూరులోని ప్రైవేట్ కళాశాలను ఆశ్రయిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా పరీక్షల అబ్జర్వర్ అందుబాటులోకి రాలేదు. -
వినియోగదారులకు కొత్త చట్టం
న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించేలా త్వరలోనే కొత్త వినియోగదారుల చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ‘వినియోగదారుల హక్కులను కాపాడటం మాత్రమే కాదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లపై డబ్బులను ఆదాచేసుకోవటం ముఖ్యమే’ అని గురువారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సులో మోదీఅన్నారు. ‘వినియోగదారులకు మరింత మేలు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నాం. వ్యాపార పద్ధతులు, దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. ఇది వినియోగదారుల సాధికారతను మరింత పెంచేలా ఉంటుంది’ అని మోదీ వెల్లడించారు. ఎల్ఈడీ బల్బులు, స్టెంట్లు, మందులు.. తమ ప్రభుత్వ చర్యల వల్ల స్టెంట్ల రేట్లు, మోకాలిచిప్పల ఆపరేషన్లు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. ‘ఉజాలా పథకం ద్వారా రూ.350 ఉన్న ఎల్ఈడీ బల్బును రూ.40–45కే ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా రూ.20వేల కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయి’ అని పేర్కొన్నారు. జన ఔషధి పరియోజనలో భాగంగా దాదాపు 500 మందుల ధరలను భారీగా తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పలు రాష్ట్ర, కేంద్ర పన్నుల ఒత్తిడిని ప్రజలపై తగ్గించేందుకు జీఎస్టీని తీసుకొచ్చాం. దీని ద్వారా దేశంలో కొత్త వ్యాపార సంస్కృతి అభివృద్ధి అవుతోంది. ఇది దీర్ఘకాలంలో లబ్ధిదారులకు భారీ మేలు చేకూర్చనుంది. జీఎస్టీతో కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారునికి తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఇది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుంది’ అని మోదీ వెల్లడించారు. పాలనపై అధ్యయనం చేయండి ముస్సోరి(ఉత్తరాఖండ్): ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేయాలని, అప్పుడే వాటిని పూర్తిగా అర్థం చేసుకుంటారని ట్రైనీ ఐఏఎస్ అధికారులకు మోదీ సూచించారు. లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీలో 360 మంది యువ అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలన, సాంకేతికత వినియోగం, విధానాల రూపకల్పన తదితర అంశాలు ప్రస్తావనకొచ్చినట్లు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. లీకేజీని అరికట్టాం గత ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం కారణంగా రేట్లు పెరిగిపోయాయని.. దీంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని మోదీ విమర్శించారు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు చేరటం ద్వారా ప్రభుత్వానికి రూ.57వేల కోట్ల రూపాయల లీకేజీని ఆపగలిగామన్నారు.రెరా (రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం) సొంతిల్లు కావాలనుకునే వినియోగదారుడికి ఓ వరమన్నారు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లు, బీఐఎస్ చట్టాలు, ఉజాలా, ఉజ్వల, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారులు తమ డబ్బులను ఆదా చేసుకునేలా కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రపంచమంతా ఒకే మార్కెట్‌గా మారుతున్న నేపథ్యంలో వినియోగదారుని హక్కుల భద్రతకు ప్రాంతీయ సంకీర్ణం ఏర్పాటు అవసరమ న్నారు. ఇందుకోసం ప్రతిదేశంలో బలమైన నియంత్రణ, సమాచార మార్పిడి వ్యవస్థ అవసరమని మోదీ సూచించారు. -
పటిష్ట చట్టంతో పల్లెకు పట్టం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీలను పటిష్టపరిచేందుకు ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతోపాటు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ఆదివారం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఐటీ టవర్స్, వరంగల్ ఔటర్ రింగురోడ్డు, కాజీపేట ఆర్వోబీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. పంచాయతీలకు సంబంధించి తీసుకోనున్న చర్యలను వివరించారు. ‘‘ఓరుగల్లు పోరుగల్లు కాబట్టి.. విప్లవాలకు నాంది పలికే జిల్లా కాబట్టి.. ఈ రోజు ఇక్కడ్నుంచే మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నా. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెలకొల్పే దిశలో పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక చట్టాన్ని తెస్తాం. ఇందుకు రాబోయే శాసనసభలోనే బిల్లు ప్రవేశపెడతాం. ప్రభుత్వాలు పిరికిపందలుగా పారిపోతుంటాయి. రాజకీయ పార్టీలు పారిపోతుంటాయి. నేను ప్రతి విషయాన్ని రాజకీయంగా ఆలోచించను. గ్రామపంచాయతీల ఎన్నికలు కచ్చితంగా సమయంలోనే నిర్వహించి తీరుతాం. ఆ లోపు గిరిజన గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం. మధిర గ్రామాలను పంచాయతీలుగా మారుస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాలుగైదు వందల జనాభాను ప్రామాణికంగా తీసుకుని కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తాం. దీంతో మరో నాలుగైదు వేల గ్రామ పంచాయతీలు కొత్తగా వస్తాయి. ఈ పక్రియపై రేపు కేబినెట్ సమావేశంలో డిసైడ్ చేస్తాం. తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం. ఆ వెంటనే అమలు చేస్తాం. చట్టాలతోనే ఆగిపోం. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం. ఇన్ని దశాబ్దాలు గడిచినా గ్రామాలు మురికి కూపాలుగా ఉన్నాయి. వందశాతం ఆత్మవిశ్వాసంతో హామీ ఇస్తున్నా. స్వచ్ఛమైన అద్దాల్లాంటి గ్రామాలను ప్రజలకు పరిచయం చేయబోతున్నాం. గ్రామాల వికాసం కోసం రాబోయే బడ్జెట్లో రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు కేటాయిస్తాం. అతి చిన్న గ్రామానికి రూ.10 లక్షల నుంచి జనాభా ప్రతిపాదికగా రూ.25 లక్షల దాకా నిధులు కేటాయిస్తాం. వీటితో గ్రామాల్లో అద్భుతమైన క్రాంతి, గ్రామస్వరాజ్యం వస్తుంది. బాధ్యతాయుతమైన పంచాయతీరాజ్ వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది’’అని కేసీఆర్ అన్నారు. టీఎస్ఐపాస్తో అద్భుతాలు తెలంగాణ వచ్చిన తర్వాత పారిశ్రామిక విధానానికి కొత్త రూపు తెచ్చేందుకు టీఎస్ ఐపాస్ విధానం అమల్లోకి తెచ్చామని సీఎం తెలిపారు. ‘‘ఇది తేంగనే ఇది జరుగతదా సార్.. ఐతదా సార్.. అని చాలా మంది మాట్లాడిళ్లు. కానీ ఈ రోజు అద్భుతాలు జరుగుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్, నీరు, కాలుష్యం తదితర 57 రకాల అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఇప్పటివరకు 5,017 పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినా అనుమతులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’’అని అన్నారు. ఇప్పటిదాకా లక్షా ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరాయని తెలిపారు. పరిశ్రమల శాఖ అధికారులకు, ఆ శాఖ మంత్రి రామరావుకు సెల్యుట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. టీఎస్ ఐపాస్ కారణంగానే వరంగల్‌లో టెక్స్టైల్స్ పార్కు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీలు వచ్చాయన్నారు. ‘‘వరంగల్ ప్రజల రక్తం మీద ఉన్న విశ్వాసంతో చెబుతున్నా. వందకు వందశాతం అద్భుతమైన పార్కుగా వరంగల్ టెక్స్టైల్ పార్కు రూపుదిద్దుకుంటది. పెట్టుకున్న పేరు కాకతీయ రాజులది. కాబట్టి బర్కత్ ఉంటది. సూరత్‌లో చీరలు, సోలాపూర్‌లో దుప్పట్లు, తిర్పూరులో బనీన్లు దొరుకుతాయి. కానీ వరంగల్‌లో ఒకేచోట అన్ని దొరికేలా రూపకల్పన చేశాం’’అని సీఎం చెప్పారు. తొలిరోజు రూ.3,900 కోట్లు కాకతీయ టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన జరిగిన రోజు 22 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వీటి ద్వారా 3,900 కోట్లు పెట్టుబడులు రాబోతున్నట్లు వివరించారు. 27,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పార్కు కోసం భూములు కోల్పోయిన వారికి తప్పకుండా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘‘నిట్ వరంగల్, నిఫ్ట్ హైదరాబాద్, తిర్పూర్ విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. దీని ప్రకారం త్వరలో టెక్స్టైల్ పార్కు ప్రాంగణంలో వస్త్ర పరిశ్రమకు సంబం«ధించిన కాలేజీ ఏర్పాటు కాబోతోంది. టెక్స్టైల్ పార్కు అందుబాటులోకి రాబోతున్నందున ఇతర రాష్ట్రాలకు వలస పోయి ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులు తిరిగి వరంగల్‌కు రావాలి’’అని పిలుపునిచ్చారు. దేశంలోనే అసంఘటిత రంగంలో ఉన్న రైతులను తొలిసారిగా సంఘటిత రంగంలోకి తెచ్చేందుకు రైతు సమితులను నెలకొల్పామని, పెట్టుబడికి ఏటా రూ.8 వేల చొప్పున అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఎంతో సాహసంతో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. గొల్లకుర్మలకు 25 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. అలాగే వివిధ వర్గాలను ఆదుకుంటున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 50కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదాయం పరంగా రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. మామునూర్ ఎయిర్‌పోర్టు పునరుద్ధరిస్తాం తెలంగాణ రైతులు దేశంలోనే అత్యంత ధనిక రైతులు కావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘దేవాదుల ప్రాజెక్టు ఇక్కడే ఉంది. రాబోయే జూన్ లేదా ఆగస్టు వరకు కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయి. చాలు సార్ అనేదాకా నీళ్లు అందిస్తాం. దమ్మున్న రైతులు మూడు పంటలు పండించుకోవచ్చు. బంగారు వరంగల్ తర్వాతే బంగారు తెలంగాణ వస్తుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మామునూర్ ఎయిర్‌పోర్టును పునరుద్ధరిస్తాం. పూర్తి స్థాయిలో విమానాశ్రయం ఏర్పాటు కాకున్నా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సౌలభ్యంగా పునర్నిర్మిస్తాం’’అని తెలిపారు. పెట్టుబడులు.. ఉద్యోగాలు.. టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. వరంగల్‌లో ఆదివారం హరిత హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇందులో కొరియాకు చెందిన యున్‌గోనే కార్పొరేషన్ ఉంది. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమల వివరాలివీ.. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో.. కంపెనీ పెట్టుబడి(రూ.కోట్లలో) ఉద్యోగాలు సూర్యవంశి స్పిన్నింగ్ మిల్స్ 25 150 సూర్యోదయ స్పిన్నింగ్ మిల్స్ 10 100 శ్రీనాథ్ స్పిన్నింగ్ మిల్స్ 50 200 అర్భాక్నిట్ ఫ్యాబ్స్ 125 200 శివాని గ్రూప్ 120 1200 గిన్ని ఫిలమెంట్స్ 100 500 ది స్వయంవర్ గ్రూప్ 50 500 వెల్స్పన్ గ్రూప్ 750 1000 యున్‌గోనే కార్పొరేషన్ 1000 13000 గోకల్దాస్ ఇమేజెస్ 10 1000 నందన్ డెనిమ్ (చిల్పూరు గ్రూప్) 700 2000 శాహి ఎక్స్పోర్ 45 2250 జయకోట్ ఇండస్ట్రీస్ 20 150 జి.కె.థ్రెడ్స్ కంపెనీ 15 100 ––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 3,020 22,350 ––––––––––––––––––––––––––––––––––––––––––– ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు.. సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ 100 500 సీతారాం టెక్స్టైల్స్ 100 200 సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ 50 200 శ్రీరాం స్పిన్నింగ్ మిల్స్ 15 50 జీఎంఆర్ స్పింటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25 200 విజయలక్ష్మి స్పిన్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 100 అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ 50 100 జీటీఎన్ ఇండస్ట్రీస్ కంపెనీ 25 100 ––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 380 1,450 ––––––––––––––––––––––––––––––––––––––––––– ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారు: కడియం కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఉద్యమంలో వెన్నంటి నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా, రాష్ట్రంలో రెండో పెద్ద నగరం వరంగల్ నగరాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వరంగల్ నగరాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. పారిశ్రామికంగా ఐటీ రంగంలోనూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. నీటిపారుదల రంగంలోనూ ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్ శంకుస్థాపన రోజే 22 కంపెనీలతో ఒప్పందం, 3,900 కోట్ల పెట్టుబడులు రావడం టెక్స్టైల్ పార్కు ఉజ్వల భవిష్యత్‌ను సూచిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మెగా టెక్స్టైల్ పార్కులో భూమిని కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎలాంటి కాలుష్యం లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్కుకు భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ దండం పెడుతూ కృతజ్ఞతలు తెలిపారు. -
దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు
– తెలుగులో అనువదించిన దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ కర్నూలు: దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దివ్యాంగుల జేఏసీ సభ్యులు ఎస్పీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దివ్యాంగుల చట్టం–2016 తెలుగు అనువాద పుస్తకాన్ని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల జేఏసీ నాయకులు మధుబాబు, గోపాల్, అభిలాష్, వినోద్, లీలప్ప తదితరులు మాట్లాడుతూ.. తమకు రక్షణ కల్పించి కించపరిచేలా మాట్లాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపిస్తానని, దివ్యాంగులకు భద్రత కల్పించేలా సిబ్బందికి సూచనలిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల చట్టం–2016లో వారి రక్షణకు పొందుపరచిన కొన్ని ముఖ్యాంశాలు... సెక్షన్ 92 ప్రకారం వికలాంగులను కించపరచినా, అవమానించినా, భయపెట్టినా, మాన మర్యాదలు భంగపరచినా, పెత్తనం చేసినా, లైంగిక దాడి చేసినా, లైంగికంగా వాడుకున్నా, గాయపరచినా, భావజాలంపై దాడి చేసినా, సహాయ పరికరాన్ని ధ్వంసం చేసినా ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష. సెక్షన్ 7/4 ఎ, బి, సి, డి ప్రకారం వికలాంగులపై వేధింపులు, హింస, దోపిడీ, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే చట్టప్రకారం తీసుకునే బాధ్యతల నుంచి పోలీసు అధికారి తప్పించుకునే అవకాశం లేదు. సెక్షన్ 20/5 ప్రకారం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వికలాంగులకు న్యాయం, హక్కుల కోసం ప్రభుత్వం అధిక మద్దతు ఇవ్వాలి. సెక్షన్ 29హెచ్ సైగల భాషలో అనువాదంతో సబ్‌టైటిల్స్‌తో టీవీ కార్యక్రమాలు రూపొందించి బధిరులు పాల్గొనేటట్లు చూడాలి. -
ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదనడం అవాస్తవం
-పర్సనల్‌లా జాగృతిసభలో ముస్లిం ప్రముఖులు రాజమహేంద్రవరం కల్చరల్ : ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లేదనడం వాస్తవదూరమని జమాతె ఇస్లామీ హింద్ జాతీయ సలహామండలి సభ్యుడు సయ్యద్ అమీనుల్ హసన్ పేర్కొన్నారు. జమాతె ఇస్లామీ హింద్, నగర శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆనం కళాకేంద్రంలో జరిగిన ముస్లిం పర్సనల్‌లా జాగృతిసభలో ఆయన ప్రసంగిస్తూ ముస్లిం వివాహాలలో వరుడు వధువుకు వివాహసమయంలో అందరి ఎదుటా ‘మెహెర్’ రూపేణా పెద్ద మొత్తాన్ని ఇవ్వవలసి ఉంటుందన్నారు. నాటినుంచి భార్య సంరక్షణ బాధ్యత తనదేనని భర్త అందరిఎదుటా చెప్పడం ఒక లక్ష్యమైతే, ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు విడిపోతే, మెహెర్ ఒక విధమైన సామాజిక భద్రతను కలిగించడం మరోలక్ష్యమని అన్నారు. వివాహానికి ముందు వధువు తండ్రి కుమార్తెకు వివాహం సమ్మతమవునో, కాదో తెలుసుకోవాలని ముస్లిం పర్సనల్ లా చెబుతుందన్నారు. 2011 సెన్సస్ ప్రకారం ముస్లింలలో తలాఖ్ ద్వారా విడాకులు పొందినవారి శాతం 0.5 శాతం కాగా, హిందువులలో ఇది 3.7 శాతం ఉందన్నారు. భార్యాభర్తలమధ్య తేడాలు వస్తే, ముస్లిం పెద్దలు పరిష్కారం చేస్తారని, ఇందులో ఇతరుల జోక్యం అవసరం లేదని అన్నారు. మహిళావిభాగం జాతీయ కార్యదర్శి డాక్టర్ అతియా సిద్ధిఖి సాహెబా మాట్లాడుతూ ముస్లిం పర్సనల్ లాపై అవగాహన కలిగించేందుకు గతనెల 23నుంచి ఈనెల 7 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామన్నారు. దివ్యఖురాన్లో ప్రవక్త చెప్పిన అంశాలను మార్చడం తగని పని అని అన్నారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం నాయకుడు మహ్మద్ అరీఫ్ మాట్లాడుతూ భర్త మద్యానికి బానిస అయినా, కనపడకపోయినా, ఖులా ద్వారా భార్య కూడా విడాకులు పొందే వెసులుబాటు ఇస్లాం కల్పించిందని తెలిపారు. మహమ్మద్ రఫీక్, ఇందాదుల్లాహుస్సేన్, అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఇంతజార్ అహమ్మద్, రిజ్వాన్ఖాస్మిసాహెబ్, మెహఫిజ్ రెహమాన్, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. -
నేటినుంచి ‘ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం’
రాజమహేంద్రవరం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమం ఆదివారం నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జమాతె ఇస్లామీ హింద్ నాయకుడు మహ్మద్ రఫీద్ వెల్లడించారు. ఇటీవల తరచు ముస్లిం పర్సనల్ లా, తలాక్ వంటి విషయాల్లో రాద్ధాంతాలు చేస్తున్నారని శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో మొసలికన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు ఈ జాగృతి ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు. మేధావులను, మానతావాదులను కలసి పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. బహిరంగసభలు, కరపత్రాలు, ప్రసారమాధ్యమాల ద్వారా ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. ముస్లింలు వివాహం, విడాకులు, ఆస్తిపంపకాలు, మనోవర్తి తదితర అంశాలకు ప్రాతిపదిక బ్రిటిష్ ప్రభుత్వం 1937లో చేసిన షరీయత్ అప్లికేషన్ చట్టమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగ నిర్మాతలు ఈ చట్టం విషయంలో జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. ముస్లిం పర్సనల్ లాలోని అంశాలకు మూలం మానవనిర్మిత చట్టాలు కావని, సృష్టికర్త ఉపదేశం ప్రకారమే రూపొందించనవని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 44వ అధికరణంలో పేర్కొన్న ఉమ్మడిపౌరసత్వం గురించి పెద్దలు పదేపదే మాట్లాడుతున్నారు, కానీ రాజ్యాంగం 25,26 అధికరణాలలో ఇచ్చిన సమానత్వం గురించి, మత స్వేచ్ఛను గురించి మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అంశంతో జరిగిన విడాకులు మొత్తం విడాకులలో 0.05 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు మే 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో జమాతె ఇస్లామీ హింద్ జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. పర్సనల్‌లాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను, ముస్లిం పర్సనల్ లాపై సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని ముస్లిం ప్రముఖులు ఆవిష్కరించారు. ముస్లిం పర్సనల్‌లా విషయంలో ఇతరుల జోక్యాన్ని అంగీకరించబోమని విలేకరుల సమావేశంలో ముస్లిం మహిళలు తెలిపారు. జమాతె ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు ముస్తాఫా షరీఫ్, ఉద్యమ కన్వీనర్ అన్సార్ అహమ్మద్, ది యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాదర్‌ఖాన్, వివిధ మసీదుల అధ్యక్షులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. -
దశ తిరిగేనా?
► న్యాయానికి దూరంగా బీసీలు ► మూడేళ్లుగా నీరసిస్తున్న సంక్షేమం ► సమన్యాయం, సరిపడా నిధుల శూన్యం ► బీసీ శాఖ మంత్రి అచ్చెన్న పైన జిల్లావాసుల ఆశలు వెనుకబడిన జిల్లాల జాబితాలో శ్రీకాకుళం పేరు ప్రథమంగా ఉంటుంది. సుమారు 80 శాతం ప్రజలు బీసీ కుటుంబాలకు చెందిన వారే. అయితే వారికి న్యాయం మాత్రం జరగడంలేదు. అన్ని జిల్లాలతో పాటే ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది తప్పా.. బీసీ జిల్లాగా, బీసీ జనాభా ప్రాతిపదికన మాత్రం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. గడచిన మూడేళ్లుగా బీసీ సంక్షేమం కుంటుపడింది. సంక్షేమ రుణాలు, వసతి గృహాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, బీసీ సబ్ ప్లాన్ ఇతర నిధులు సరిపడినంతగా లేక జిల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ మత్రివర్గ విస్తరణ, మార్పుల్లో భాగంగా జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడుకి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. ఈ నేపథ్యంలో జిల్లా వాసిగా బీసీ కుటుంబాలకు మేలు జరిగేలా నిధులు కురిపిస్తారా..లేదా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు మంత్రి అచ్చెన్నపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తమ ఆశలు నెరవేరుస్తారని కలలుగంటున్నారు. అయితే వీరి ఆశలు ఎంతవరకూ నెరవేరుతాయో అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వెనుకబడిన జిల్లాలో సమస్యలు అనేకం పేరుకుపోయి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ సందర్భంగా ప్రస్తావించుకుందాం. ► బీసీ స్టడీ సర్కిల్ వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు శాశ్వత భవనం లేదు. దీంతో అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు. వీటికి ప్రత్యేక స్థలం, భవనం కల్పించాల్సి ఉంది. ► జ్యోతిరావు పూలే పేరిట బీసీ సంక్షేమ ఆడిటోరియం నిర్మాణం చేయాల్సి ఉంది. స్థలంతో పాటు నిధులు కూడా కావాలి. వీటి కోసం జిల్లా బీసీ సంఘాలు పోరాటాలు చేస్తున్న ఇప్పటికీ చర్యలు లేవు. ► బీసీ సబ్ ప్లాన్ నిధులు జిల్లాకు అధికంగా కేటాయించలేదు. రాష్ట్రంలో 8,600 కోట్లు కేటాయించినా, బీసీ జనాభా ప్రాతిపదికన జిల్లాకు చేటాయించడం లేదు. అన్ని జిల్లాలకు ఒకే రీతిలో కేటాయింపులు చేయడంతో జిల్లాలో బీసీ అభివృద్ధి కుంటుపడుతుంది. ► బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో అధికార పార్టీ జోక్యం పెరగడంతో వాస్తవ లబ్ధిదారులు నష్టపోతున్నారు. వచ్చిన రుణ యునిట్లు జన్మభూమి కమిటీల పెత్తనంతో వారి అనుయాయులకు సిఫార్సు చేస్తుండడం, బ్యాంకర్లు కూడా సహకరించకపోడవంతో రుణ లక్ష్యాలు నెరవేరని పరిస్థితి. ► జిల్లాలో 78 శాతం బీసీలు న్నారు. వీరిలో 75 శాతం మంది కూలి పనులు, వలస కూలీలుగానే జీవనం సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా..అందులో జిల్లాకు చెందిన బీసీలు ఉంటారు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అటువంటి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిఉంది. ► బీసీ సంక్షేమానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వసతి గృహాలను ఎత్తివేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 12 వసతి గృహాలను గడచిన రెండేళ్లలో ఎత్తివేశారు. వీటి స్థానంలో గురుకులాలు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చినా, ఇప్పటి వరకు చర్యల్లేవు. బీసీ జనాభా ప్రతిపదికన ప్రతి మండలంలోనూ రెండు గురుకులాలకు తక్కువ లేకుండా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ గురుకులాలు ఇంటరీ్మడియెట్ వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► జిల్లా కేంద్రంతో పాటు కళాశాల వసతి గృహాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని వసతి గృహాలు పెంచాలి. వాటిలో అన్ని కార్పొరేట్ సదుపాయాలు కల్పించాలి. ► బీసీ కుల సంఘాలకు ఎటువంటి బ్యాంకు సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలి. ప్రతి కులానికి కనీసం వందకు తక్కువ లేకుండా సంఘాలు ఉండాలి. దీనికి కావాలి్సన నిధులు జనాభా ప్రాతిపదికగా కేటాయించాల్సి ఉంది. ► బీసీ విద్యార్థులకు ప్రభుత్వ కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచాలి. జనాభా ప్రతిపదికగా జిల్లాకు కనీసం వెయ్యి మందికి కార్పొరేట్ చదువుల అవకాశం ప్రతి సంవత్సరం కల్పించాలి. ► ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు చెందిన శాసనసభ్యుడు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన నేపథ్యంలో వెనుకబడిన సామాజిక వర్గం పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో చూడాలి. జనాభా ప్రతిపదికన నిధులు కేటాయించాలి జిల్లాలో బీసీ కులాలు ఎక్కువగా ఉన్నారు. అన్ని జిల్లాలతో కాకుండా వెనుబడిన జాతులు ఉన్న ఈ జిల్లాకు అదనంగా బీసీ సంక్షేమా నిధులు, రుణాలకు ఎక్కువ యూనిట్లు, సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలి, జిల్లాలో బీసీలు దారిద్య్రరేఖకు తక్కువగా సుమారుగా 70 శాతం వరకు ఉన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకొవాల్సి ఉంది. జిల్లాకు చెందిన వ్యక్తి ఈ శాఖకు మంత్రి అయినందున మరిన్ని నిధులు తెచ్చి బీసీలను ఆదుకోవాలి. –బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు–పి చంద్రపతిరావు వలసలు నివారించాలి మన జిల్లాకు చెందిన బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్తున్నారు. వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గడిచిన మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం బీసీ వలస కూలీల దుర్భర జీవితాలను పట్టించుకొలేదు. ఈసారి జిల్లాకు చెందిన మంత్రికి బీసీల సంక్షేమం చూసే అవకాశం వచ్చింది. బీసీ కులాల వారు పోట్టకూటి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించి నివారణ చర్యలు చేపట్టాలి. –డీపీ దేవ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ముఖ్యకార్యదర్శి -
ప్రత్యేక చట్టాల అమలుకు డిమాండ్
- యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడి డిమాండ్ -శంకరాస్ డిగ్రీ కాలేజీలో డైరీ ఆవిష్కరణ కర్నూలు(అర్బన్): ఎస్సీ, ఎస్టీల తరహాలోనే యాదవులకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2017 డైరీని స్థానిక శకరాస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్నయాదవ్ మాట్లాడుతూ దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యాదవులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ బీసీ కులాలకు ఏర్పాటు చేసిన విధంగా ప్రత్యేక ఫైనాన్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో యాదవ సొసైటీలకు పదెకరాల భూమిని కేటాయించాలన్నారు. త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో యాదవులకు మేయర్ పదవిని కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్యయాదవ్, ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత డా.బాలమద్దయ్య, వైహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సోమేష్‌యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
మైనర్లకు ఉచిత న్యాయ సహాయం
– లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ కర్నూలు(అర్బన్): మైనర్ చిన్నారులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్‌లోని మున్సిపల్ హైస్కూల్లో డా.జె. యధుభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ నివారణకు ఉచిత హోమియా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సోమశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు, స్కూల్ టీచర్లు హోమియో మందులను తప్పక వాడాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. న్యాయ పరంగా ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహనను పెంచుకోవాలన్నారు. పిల్లలతో పాటు మహిళలకు కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. బాలల హక్కులు, అనాథ పిల్లలకు ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ నేపథ్యంలోనే హాజరైన విద్యార్థులు, టీచర్లకు హోమియో మందులను అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి. ఆదినారాయణరెడ్డి, పి. నిర్మల, ఎంఏ తిరుపతయ్య, శివసుదర్శన్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ
కర్నూలు : కర్నూలు శివారులోని పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని పరిసరాలను, గదులను ఖైదీలకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేనివారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, పి.నిర్మల, నాగమణి, జైలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి కాల్వశ్రీరాంపూర్: పౌరులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి అన్నారు. మండలంలోని పెగడపల్లిలో న్యాయవిజ్ఞాన సదస్సును ఆదివారం నిర్వహించారు. సందర్భంగా చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు లోక్‌అదాలత్‌లతో సత్వర పరిష్కారం, న్యాయసేవాధికారి సంస్థ ద్వారా ఉచిత న్యాయసలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో న్యాయసేవాధికార సంస్థ ద్వారా అవసరమైన సలహాలు అందించేందుకు ప్రతీ ఆదివారం న్యాయప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. గిప్టుడీడీ, వీలునామా, సేల్‌డీడీ, పార్ట్నర్షిప్ డీడీ, సివిల్, క్రిమినల్ కేసులపై వివరించారు. పట్టింపులకు పోకుండా రాజీ మార్గమే ఉత్తమని తద్వారా చాలా కేసులు సత్వర పరిష్కారం పొందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారయ్య గౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచు గొడ్గు లక్ష్మి రాజకొమురయ్య, ఎస్సై ఉమాసాగర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రత్యేక గుర్తింపు ఉంటేనే న్యాయవాదికి భవిష్యత్తు
నాగార్జున వర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్ జయశ్రీ కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : న్యాయ విద్యార్థిగా పట్టా పొందడం గొప్పకాదని, న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నవారికే భవిష్యత్తు ఉంటుందని నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్ జయశ్రీ అన్నారు. జేఎన్టీయూకే ఆడిటోరియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ–ఐలు) జిల్లా అధ్యక్షుడు మేడపాటి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ క్లాస్‌లకు హాజరుకాకుండా పరీక్షలు రాసేవారికి లా పట్టా వస్తుందే తప్ప ‘లా’ రాదన్నారు. ఇంటర్నెట్పై కంటే టెక్టŠస్బుక్ను చదివితేనే అవగాహన వస్తుందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఐలు రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుం దన్నారు. అనంతపురం ఎస్కేడీ వర్సిటీ ప్రొఫెసర్ ఎస్వీ పుల్లారెడ్డి మాట్లాడుతూ లా విద్యకు పెట్టిన వయసు నిబంధన మంచిదేనన్నారు. బార్ కౌన్సిల్ మెంబర్ గోకుల్‌కృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాలపై అవగాహన ఉంటేనే కేసును వాదించగలరన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు రాజేష్ మాట్లాడుతూ సంపద ఆశించకుంటే భవిష్యత్తు ఉంటుందన్నారు. రాజీవ్ గాంధీ లా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చిన్నస్థాయి లా కళాశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులే చేరతారని, వారిని దృష్టిలో పెట్టుకుని వెసులుబాటు కల్పించాలన్నారు. ఐలు జిల్లా అధ్యక్షుడు ధర్మారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక, కేరళ రాష్ట్రాల మాదిరిగా జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాలని కోరతామన్నారు. కాకినాడ సీనియర్ న్యాయవాది జవహర్‌ఆలీ మాట్లాడుతూ న్యాయవాదికి సేవాదృక్పథం ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు సదస్సులో పాల్గొన్నారు. -
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
– లోక్ అదాలత్ జడ్జి కర్నూలు: చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సంతోష్‌నగర్‌లోని ఉమామాధవ ఇంగ్లిషు మీడియం స్కూలులో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సోమశేఖర్ హాజరయ్యారు. ప్రాథమిక హక్కులు, వాటి బాధ్యతల గురించి సోమశేఖర్ విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆదినారాయణ రెడ్డి, నాగముని, వరలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ మాధవకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
11న జాతీయ లోక్ అదాలత్
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి కర్నూలు(లీగల్): ఫిబ్రవరి 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్‌లో ప్యానల్ అడ్వకేట్స్, రీటైనర్స్, జువైనల్ బోర్డు అడ్వకేట్స్, లీగల్ ఎయిడ్ అడ్వకేట్స్, పారాలీగల్ వాలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 11న నిర్వహించే లోక్ అదాలత్‌లో రాజీ కాగల క్రిమినల్ కేసులు, అన్ని సివిల్ కేసులు, ప్రిలిటిగేషన్ కేసులు, రోడ్డు ప్రమాద కేసులు పరిష్కారం చేస్తారన్నారు. కక్షిదారులకు వీలైనంత వరకు ప్రచారం కల్పించి పాత కేసులకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
స్త్రీ సాధికార చట్టాలపై వర్క్‌షాప్
కర్నూలు: కర్నూలు శివారులోని పుల్లయ్య ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో స్త్రీ సాధికార చట్టాలపై మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎస్పీ ఆకే రవికృష్ణ, జూనియర్ సివిల్ జడ్జి గంగాభవాని, సీనియర్ న్యాయవాది వి.నాగలక్ష్మి తదితరులు పాల్గొని కుటుంబ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించటం –2005, వివాహిత మహిళలపై హింస, హిందూ వివాహ చట్టం–1955, విడాకులు తదితర అంశాలతో పాటు ఉచిత న్యాయం గురించి వివరించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు నడుచుకోవాల్సిన పద్ధతులు, నిర్భయ చట్టం గురించి అవగాహన కల్పించారు. -
'లా' చదవడానికి బెస్ట్ యూనివర్సిటీలివే..
లండన్: ప్రపంచవ్యాప్తంగా న్యాయ వృత్తికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. లా చదవడం ఒక ఎత్తైతే అందుకు తగ్గా ఉద్యోగాన్ని సాధించడం మరో సవాలుగా మారింది. టాప్ యూనివర్సిటీల్లో లా పట్టా తీసుకొని కెరీర్లో సెట్ అవ్వాలని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో మెరుగైన విద్యా ప్రమాణాలతో లా డిగ్రీని అందిస్తున్న టాప్ యూనివర్సిటీలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వివిధ ప్రామాణికాల ఆధారంగా ఉత్తమ విద్యా సంస్థలకు ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న యూరోప్ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టిన క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) తాజాగా సర్వే చేసింది. 2016-17కు సంబంధించి విడుదల చేసిన యూరోప్ టాప్ లా యూనివర్సిటీలు.. యూరోప్ లోని టాప్ లా యూనివర్సిటీలు..అవరోహణ క్రమంలో(బ్రాకెట్ లో గ్లోబల్ ర్యాంకులు, పక్కనే క్యూఎస్ ఇచ్చిన మార్కులు) 13 యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ (41)- 71.7 13 దర్హమ్ యూనివర్సిటీ (41) -71.7 11 రుప్రెచ్ట్ కార్ల్స్ యూనివర్సిటాట్ హిడెల్ బెర్గ్ (39)- 72.3 10 క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ (35) -73.4 9 కతోలికె యూనివర్సిటీట్ లీవెన్ (33) -73.6 8 యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ (28) -77.1 7 లీడెన్ యూనివర్సిటీ(24)- 77.6 6 యూనివర్సిటీ పారిస్ 1 పాంథియన్-సోర్బోన్నె(20)- 78.6 5 కింగ్స్ కాలేజ్ లండన్(17) -80.5 4 యూనివర్సిటీ కాలేజ్ లండన్(14)- 83.4 3 లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (7)- 90.1 2 యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (3)- 96.0 1 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ (2)- 96.7 ఆరు ప్రామాణికాల ఆధారంగా ర్యాంకులు క్యూఎస్.. యూనివర్సిటీలు/విద్యా సంస్థలకు ర్యాంకులిచ్చే క్రమంలో ఆరు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంది. అవి.. 1)సంబంధిత విద్యా సంస్థకు అకడమిక్‌గా ఉన్న గుర్తింపు 2)ఉద్యోగ నియామక సంస్థల గుర్తింపు 3)ఫ్యాకల్టీ - విద్యార్థి నిష్పత్తి 4)అంతర్జాతీయ ఫ్యాకల్టీ నిష్పత్తి 5)అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తి 6)ఫ్యాకల్టీ సైటేషన్స్ -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : విద్యార్థులు చట్టాలు, రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ పేర్కొన్నారు. బుధవారం న్యాయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా బీఈడీ కళాశాల, శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేధింపులు, దాడులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు గృహహింస, ఇతర చట్టాలపై అవగాహన పెంచుకుంటే మంచిదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్‌బాషా, రంగారవికుమార్, తిరుపతయ్య, పాపరావు, భరత్‌భూషన్, రాంపులయ్య, ప్రిన్సిపాళ్లు ఖరీముల్లాఖాన్, చంద్రిక నిర్మల పాల్గొన్నారు. వృద్ధులకు పండ్ల పంపిణీ.. నందికొట్కూరు రోడ్డులోని మాతా అన్నపూర్ణేశ్వరి వృద్ధాశ్రమంలో జడ్జి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వృద్ధులకు ఉచిత న్యాయ సేవలను అందిజేస్తామని తెలిపారు. న్యాయవాదులు వెంకట్రావు, చెన్నయ్య పాల్గొన్నారు. -
‘న్యాయశాస్త్రం వైపు ఆకర్షితులవడం శుభపరిణామం’
* న్యాయశాస్త్ర అధ్యయనం వైపు భారతీయ యువత ఆకర్షణ ముదావహం * వాషింగ్టన్ డీసీ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకప్పుడు ఇంజినీరింగ్, వైద్య విద్యల వైపు ఉరకలేసిన భారతీయ యువత ప్రస్తుత తరుణంలో న్యాయవాద వృత్తి, న్యాయశాస్త్ర అధ్యయనాల పట్ల ఆకర్షితులవడం దేశ భవితకు శుభ పరిణామం అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం నాడు వర్జీనియా రాష్ట్ర యాష్‌బర్న్ నగరంలోని సితార సమావేశ మందిరంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లు సంయుక్తంగా స్థానిక ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నవరక్తం నిండిన యువతరం న్యాయవాద వృత్తి వైపు ఆకర్షితులు కావడం, మౌలిక వసతులు, జవాబుదారీతనం వృద్ధిలోకి రావడం తీర్పులను త్వరితరగతిన అందించేందుకు ఆరోగ్యకర ఆచ్ఛాదనను కల్పిస్తుందని జాస్తి పేర్కొన్నారు. ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం కలిగించినప్పుడే అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వత అడ్డుకట్ట వేయగలిగి తద్వారా దేశ సురుచిర లక్ష్యాలను అందుకునేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ప్రవాసులు మాతృదేశానికి చేస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. భారత పార్లమెంట్ ప్రజాస్వామ్యబద్ధమైన శాసనాల ద్వారా కక్షిదారులకు న్యాయం మరింత సత్వరంగా, సమర్థంగా సాంత్వన చేకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ఆ దేశ అధ్యక్షుడి ద్వారా పారదర్శకంగా నిర్వహింపబడుతున్నట్లే భారత రాజ్యాంగ వ్యవస్థ కూడా ఆ పద్ధతిని ఆకళింపు చేసుకోవాలని ఆయన సూచించారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రసంగిస్తూ ఒబామా వంటి అగ్రరాజ్య అధ్యక్షుడికి కూడా జాతిపిత మహాత్ముడే ఆదర్శమని అటువంటి దేశంలో పుట్టిన మనమంతా దానికి ఎల్లవేళలా సేవ చేస్తూ ఋణపడి ఉండాలని కోరారు. ప్రవాస తెలుగు చిన్నారులకు తెలుగు నేర్పించడం వరకు బాగానే ఉన్నా "అభ్యాసం కూసు విద్య" అనే సామెతను ప్రవాసులు మరవకూడదని అన్నారు. పిల్లలు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టేందుకు తల్లిదండృలు వారిని మాతృభాషలోనే రాయడం, పలకడం, మాట్లాడటం వంటి వాటి వైపు ప్రోత్సహించవల్సిందిగా సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆంగ్ల భాష వ్యాప్తి మర్రిచెట్టును తలిపిస్తుండంపై ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు దంగేటి కిషోర్, ఉపాధ్యక్షుడు మన్నే సత్యనారాయణ, ప్రవాస ప్రముఖులు డాక్టర్ యడ్ల హేమప్రసాద్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, డాక్టర్.నరేన్ కొడాలి, ఏపీ ఎన్.ఆర్.టీ ప్రతినిధి కలపటపు బుచ్చిరాంప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు డా.నరిశెట్టి ఇన్నయ్య, కోయా రమాకాంత్, కుక్కట్ల శ్రీనివాస్, ఉప్పుటూరి రాంచౌదరి, మేరీల్యాండ్ తెలుగు సంఘం, తెలంగాణా అభివృద్ధి మండలి(టీడీఎఫ్) ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.