చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
Published Wed, Nov 9 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : విద్యార్థులు చట్టాలు, రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ పేర్కొన్నారు. బుధవారం న్యాయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా బీఈడీ కళాశాల, శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేధింపులు, దాడులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు గృహహింస, ఇతర చట్టాలపై అవగాహన పెంచుకుంటే మంచిదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్‌బాషా, రంగారవికుమార్, తిరుపతయ్య, పాపరావు, భరత్‌భూషన్, రాంపులయ్య, ప్రిన్సిపాళ్లు ఖరీముల్లాఖాన్, చంద్రిక నిర్మల పాల్గొన్నారు.
వృద్ధులకు పండ్ల పంపిణీ..
నందికొట్కూరు రోడ్డులోని మాతా అన్నపూర్ణేశ్వరి వృద్ధాశ్రమంలో జడ్జి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వృద్ధులకు ఉచిత న్యాయ సేవలను అందిజేస్తామని తెలిపారు. న్యాయవాదులు వెంకట్రావు, చెన్నయ్య పాల్గొన్నారు.
Advertisement