న్యూఢిల్లీ: అక్రమ సంబంధాలను నేరంగా పరిగణిస్తున్న చట్టాన్ని రద్దుచేస్తే వివాహ పవిత్రత దెబ్బతింటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడు శిక్షార్హుడవుతాడు. ఈ సెక్షన్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోరింది. సెక్షన్ 497 వివాహ వ్యవస్థను కాపాడుతోందని అఫిడవిట్‌లో పేర్కొంది. ‘ఐపీసీ సెక్షన్ 497, సీఆర్‌పీసీ సెక్షన్ 198(2)ల రద్దు.. వైవాహిక వ్యవస్థ, పవిత్రతకు ప్రాధాన్యమిస్తున్న భారతీయ సంప్రదాయ విలువలకు కీడు చేస్తుంది. భారతీయ సమాజం, విశిష్టతలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని రూపొందించారు’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment