లా ప్రవేశ పరీక్షలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)
ఇంజనీరింగ్ కోర్సులకు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్; మేనేజ్‌మెంట్ కోర్సులకు క్యాట్, ఈ కోవలోనే లా కోర్సులకు క్లాట్. దేశవ్యాప్తంగా 14 న్యాయ విద్యాలయాలు, యూనివర్సిటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యు ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి క్లాట్‌ను నిర్వహిస్తారు.
అర్హతలు: 45 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 20 ఏళ్ల లోపు వయసును కలిగి ఉండాలి.
పరీక్ష: రెండు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 200. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్‌లపై ప్రశ్నలుంటాయి.
ఎంపిక: క్లాట్ ర్యాంకు ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014, పరీక్ష తేదీ: మే 11, 2014
వెబ్‌సైట్: www.clat.ac.in
ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ)
ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఏటా ఏఐఎల్‌ఈటీని నిర్వహిస్తోంది.
సీట్లు: 80,
అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 21 ఏళ్ల లోపు ఉండాలి.
పరీక్ష: గంటన్నర వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 150 మార్కులుంటాయి. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ (కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్), లీగల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ల నుంచి ప్రశ్నలడుగుతారు.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014
ప్రవేశపరీక్ష తేదీ: మే 4, 2014
వెబ్‌సైట్: http://nludelhi.ac.in
లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్) -ఇండియా
ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎల్‌శాట్ ప్రామాణిక పరీక్ష విధానాన్ని అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్(ఎల్‌ఎస్‌ఏసీ) రూపొందించింది.
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: పేపర్-పెన్సిల్ విధానంలో నిర్వహించే పరీక్షలో ఎనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ (1, 2), రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటల 20 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2014
పరీక్ష తేదీ: మే 18, 2014
వెబ్‌సైట్: www.pearsonvueindia.com/isatindia
లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్)
మన రాష్ట్రంలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఏటా లాసెట్‌ను నిర్వహిస్తారు.
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 20 ఏళ్లు మించరాదు.
పరీక్ష విధానం: గంటన్నర వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా (60 ప్రశ్నలు).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014
పరీక్ష తేదీ: జూన్ 8, 2014, వెబ్‌సైట్: www.aplawcet.org