ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు.. | Engineering Entrance .. | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు..

Published Sun, Apr 6 2014 11:43 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు.. - Sakshi

ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు..

జేఈఈ మెయిన్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలోనూ ర్యాంక్ సాధించాలి.
 
అర్హత: 2012, 2013లో కనీసం 45 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. 2014 మార్చిలో పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ అర్హులే.
 
వయోపరిమితి: అక్టోబర్ 1, 1989 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు వయో పరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
 
ప్రవేశం కల్పిస్తున్న సంస్థలు: 30 ఎన్‌ఐటీలు, 5 కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మెయిన్ ర్యాంకింగ్‌ను పరిగణనలోకి తీసుకొంటున్నాయి. ఇవేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (తిరువనంతపురం) జేఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
 
పరీక్ష విధానం: పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. బీఈ/బీటెక్ కోర్సుల కోసం పేపర్-1 రాయాలి. ఇది ఆన్‌లైన్/పెన్-పేపర్ విధానాల్లో ఉంటుంది. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల కోసం పేపర్-2 రాయాలి. ఇది కేవలం పేపర్- పెన్ ఆధారిత పరీక్ష. పేపర్-1లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మూడు విభాగాలపై సమాన స్థాయిలో ప్రశ్నలుంటాయి. పేపర్-2లో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.
 
ప్రవేశం: ర్యాంక్ ఆధారంగా. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ ర్యాంక్‌కు 60 శాతం వెయిటేజ్, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.
 
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 9, 11, 12, 19
 
వెబ్‌సైట్: http://jeemain.nic.in
 
జేఈఈ అడ్వాన్స్‌డ్
16 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతోపాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ - ధన్‌బాద్‌లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశించాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్ పేపర్-1లో మొదటి 1,50,000 మంది ర్యాంకర్‌లలో చోటు దక్కించుకోవాలి. ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంక్‌తోపాటు ఆయా రాష్ట్రాల ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలి.
 
వయో పరిమితి: అక్టోబర్ 1, 1989 తర్వాత జన్మించి ఉండాలి.
 
పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి మూడు గంటలు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. అభ్యర్థి విషయావగాహన శక్తిని, తార్కిక, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తుల ప్రారంభం: మే 4 నుంచి మే 9 వరకు
 
పరీక్ష తేదీ: మే 25, 2014,

వెబ్‌సైట్: www.jeeadv.iitd.ac.in
 
ఎంసెట్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ/ప్రైవేట్ కళాశాలల్లో బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీఎస్సీ (అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీఎస్సీ (హార్టికల్చర్), బీఫార్మసీ ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ నిర్వహిస్తారు.
 
అర్హత: ఇంజనీరింగ్ విభాగానికి 45 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ ఎంపీసీ, మెడికల్ విభాగానికి 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
 
పరీక్ష: ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష రాసేవారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై 160 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ నుంచి 80, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. మెడికల్/అగ్రికల్చర్ విభాగంలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలపై ప్రశ్నలుంటాయి. ప్రతి భాగంలో 40 ప్రశ్నల చొప్పున మొత్తం ప్రశ్నలు 160. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వ్యవధి మూడు గంటలు.
 
అపరాధ రుసుంతో ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2014
 
పరీక్ష తేదీ:
మే 22, 2014, వెబ్‌సైట్: www.apeamcet.org
 
సీవోఎంఈడీకే
కర్ణాటకలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ కోర్సుల్లో ప్రవేశానికి  కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (సీవోఎంఈడీకే) యూజీఈటీ నిర్వహిస్తోంది.
 
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
 
పరీక్ష: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లపై మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014
 
పరీక్ష తేదీ: మే 11, 2014,

వెబ్‌సైట్: www.comedk.org
 
బిట్‌శాట్
పిలానీ, హైదరాబాద్, గోవాలో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్‌ల్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి బిట్‌శాట్ నిర్వహిస్తారు.
 
అర్హతలు: 75 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. ఒక్కో సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులుండాలి.
 
పరీక్ష: మూడు గంటల వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్‌లపై మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.

ఎంపిక: మెరిట్ ఆధారంగా..

పరీక్ష తేదీలు: మే 14 నుంచి మే 29 వరకు
 
వెబ్‌సైట్: www.bitsadmission.com
 
ఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
కాంచీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ బీటెక్ కోర్సులో ప్రవేశానికి ప్రతిఏటా ప్రవేశ పరీక్ష (ఎస్‌ఆర్‌ఎంఈఈ)ను నిర్వహిస్తోంది.

అర్హతలు: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
 
ఎంపిక: ఎస్‌ఆర్‌ఎంఈఈ ర్యాంక్ ఆధారంగా.
 
పేపర్-పెన్సిల్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 27, 2014
 
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 22 వరకు
 
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
 
వీఐటీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
విశ్వవిద్యాలయ హోదా పొందిన వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి వీఐటీఈఈఈను నిర్వహిస్తోంది.

అర్హతలు:  60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
 
పరీక్ష: కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.

ఎంపిక: వీఐటీఈఈఈ ర్యాంక్ ఆధారంగా.

పరీక్ష తేదీలు: ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 20 వరకు
 
వెబ్‌సైట్: www.vit.ac.in
 
నాటా
దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సుల్లో ప్రవేశాలకు నాటా (నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్) రాయాలి. దీన్ని న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది.
 
అర్హత: మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్‌గా 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
 
పరీక్ష విధానం:
పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం పేపర్ బేస్డ్ డ్రాయింగ్ టెస్ట్ కాగా, రెండో భాగం ఆన్‌లైన్ టెస్ట్. పరీక్షలో అభ్యర్థి డ్రాయింగ్ స్కిల్స్, పరిశీలన దృక్పథం, సెన్స్ ఆఫ్ ప్రొపర్షన్, యాస్థటిక్ సెన్సివిటీ, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీని పరీక్షిస్తారు.
 
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
  ఆగస్టు 31.
 
పరీక్ష తేదీలు: మొదటి దశ  మార్చి 14 - మే 25 వరకు, రెండో దశ జూన్ 1 - ఆగస్టు 31 వరకు.
 
వెబ్‌సైట్: www.nata.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement