కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్‌ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment