కర్ణాటక: ఆయనో పెద్ద అధికారి, పైగా మాజీ ముఖ్యమంత్రి వద్ద పనిచేస్తున్నారు, కానీ న్యూడ్ కాల్‌లో చిక్కుకుపోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మాజీ సీఎం ఓఎస్‌డీ హనీట్రాప్‌లో ఇరుక్కున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు... బెంగళూరు మల్లేశ్వరం నివాసి ఓ మాజీ సీఎం వద్ద ప్రత్యేకాధికారిగా ఉన్నారు. పని మీద మహారాష్ట్ర నాసిక్ కు వెళ్లి అక్కడ అతిథి గృహంలో బసచేశారు.
గత నెల 12 తేదీ రాత్రి 8 గంటల సమయంలో స్నానం చేసి బాత్‌రూమ్ నుంచి బయటికి వస్తుండగా గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ మాట్లాడగా అపరిచిత మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. వారే కాల్ కట్ చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం మరో నంబర్‌నుంచి కాల్‌చేసి మహేంద్రసింగ్ అని పరిచయం చేసుకున్నాడు.
న్యూడ్ కాల్ చేశారని మహిళ ఫిర్యాదు చేసిందని, వీడియోను యూట్యూట్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. లేదంటే డబ్బివ్వాలని అడిగాడు, రత్నేశ్‌కుమార్ పేరుతో రెండు బ్యాంకు అకౌంట్లు పంపించి నగదు జమ చేయాలన్నాడు. ఓఎస్డీ మొత్తం రూ.4.80 లక్షలు పంపించాడు. మళ్లీ రూ.7.2 లక్షలకు డిమాండ్ చేయడంతో బాధితుడు బెంగళూరుకు చేరుకుని పోలీస్ కమిషనర్ దయానంద్‌ను కలిసి వివరించి సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment