manjunathan
-
పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు
కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్‌ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
దేవుడా ఎంత ఘోరం! మిన్నంటిన ఆర్తనాదాలు
అర్ధరాత్రి, డ్రైవర్ తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. మరో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంట్లో ఉంటారు. కానీ విధి మరోలా తలచింది. పాల ట్యాంకర్ రాంగ్ రూట్లో మృత్యు శకటంలా వచ్చింది. యాత్రికుల టెంపో ట్రావెలర్ గమనించేలోపే ఢీ కొట్టారు. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు, మహిళలతో సహా 9 మంది దుర్మరణం చెందారు. దేవుని దర్శనానికి వెళ్లి వస్తుంటే ఎంత దారుణం జరిగింది దేవుడా అని మృతుల బంధువులు విలపించారు. బనశంకరి: టెంపో ట్రావెలర్‌కు ముందు పాల ట్యాంకర్, వెనుక నుంచి కేఎస్ఆర్టీసీ బస్ తాకిడితో భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోలోని నలుగురు పిల్లలతో పాటు 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె తాలూకా బాణావర పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ధర్మస్థల, హాసనాంబ దర్శనం చేసుకుని వివరాలు.. అరసికెరె తాలూకా బాణవార హొబళి హళ్లికెరె గ్రామానికి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది టెంపో ట్రావెలర్ వాహనంలో శనివారం ధర్మస్థల క్షేత్రానికి వెళ్లారు. మంజునాథ స్వామికి దర్శించుకుని తరువాత సాయంత్రం హాసన్‌కు బయలుదేరారు. హాసనాంబ మాతను దర్శించుకుని చేసుకుని హళ్లికెరె గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మరో 10 నిమిషాల్లో క్షేమంగా సొంతూరికి చేరుకునేవారు. రాంగ్ రూట్లో పాల ట్యాంకర్ అరసికెరె–శివమొగ్గ హైవే – 69 బాణావర వద్ద వెళుతుండగా శివమొగ్గ నుంచి చెన్నరాయపట్టణ వైపునకు వస్తున్న పాల ట్యాంకర్ డ్రైవరుకు మలుపు తెలియకపోవడంతో టెంపోకి ఎదురుగా వెళ్లాడు. ఈ సమయంలో వేగంగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనం, పాల ట్యాంకర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఆ సమయంలో వెనుక వస్తున్న బెంగళూరు–శివమొగ్గ కేఎస్ ఆర్టీసీ బస్సు టెంపోను ఢీకొట్టింది. రెండు వైపులా ప్రమాదంతో టెంపోలోని యాత్రికులు విలవిలలాడారు. మృతులు వీరే..: తీవ్ర గాయాలతో లీలావతి (50), చైత్ర (33), సమర్థ (10), డింపి (12), తన్మయ్ (10), ధృవ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50) అనే 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టెంపో, బస్సులోని మరో 12 మందికి తీవ్రగాయాలు కావడంతో 10 మందిని హాసన్ జిల్లాసుపత్రికి, ఇద్దరిని అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. టెంపో నుజ్జునుజ్జుకావడంతో క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించారు. గాయపడిన వారిలో కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరుతో పాటు ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్యాంకర్ డ్రైవర్ అరెస్టు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే బాణవార పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాసన జిల్లాఆసుపత్రికి, అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. మతదేహాలకు శవపరీక్షల నిమిత్తం హాసన్ జిల్లాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పాలట్యాంకర్ డ్రైవరును అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. హైవే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదం విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారి అధికారులు మరమ్మతులు జరుగుతుండగా సక్రమంగా సూచిక బోర్డులు అమర్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు విగతజీవులయ్యారని తెలిపారు. రూ.2 లక్షల చొప్పున పరిహారం మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై ప్రకటించారు. ఈ సంఘటన దురదష్టకరమని సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విపక్ష నేతలు సిద్దరామయ్య, కుమారస్వామిలు కూడా సంతాపం తెలిపారు. మిన్నంటిన ఆర్తనాదాలు దేవునికి కళ్లు లేవు. దేవుని శాపమో, గ్రహచారమో అని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు విలపించారు. ఈ ప్రమాదంలో హళ్లికెరెలో పెద్ద కుటుంబానికి చెందిన 9 మంది మృత్యవాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. ప్రమాద స్థలంలో విలేకరులతో మాట్లాడిన మృతుల బంధువు రవికుమార్.. అందరూ శుక్రవారం ఇంటి వద్ద పెద్దల పూజ చేసుకుని శనివారం ఉదయం ధర్మస్థలకు వెళ్లారు. తరువాత హాసనాంబను దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తూ మరణించారని విలపించాడు. ఏ దేవునికి కళ్లు లేవు సార్. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబం«దీకులు. నా తమ్ముడు రెండేళ్ల కిందట కోవిడ్‌తో చనిపోయాడు. ఈ రోజు ప్రమాదంలో అతని ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని రోదిస్తూ చెప్పాడు. (చదవండి: విజయపురలో పరువు హత్య?) -
కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలి
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ ∙ పలు గ్రామాల్లో పర్యటన రంగంపేట : స్థానిక సమస్యలు, కులాల వారీగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ కోరారు. చైర్మన్ మంజునాథ, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణలు గురువారం జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించారు. స్థానిక సమస్యలు, భౌగోళిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంపేట మండలం పాత కోటపాడులో ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించారు. అన్ని తరగతులలోను ప్రథమ శ్రేణి మార్కులు వచ్చినా ఉద్యోగావకాశాలు లేవని ఎంబీఏ పట్టభద్రుడు గవరసాని వీరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెల్లమేకల దుర్గాప్రసాద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ –1 రాధాకృష్ణ, ఆర్డీవో విశ్వేశ్వరరావు, సర్పంచ్ బత్తిన వీరయమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ఐతి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల అధ్యయనం కోసమే రావులపాలెం : మంజునాథ కమిషన్ కేవలం కాపులను బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిషన్ కాదని రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన కులాల స్థితిగతులను అధ్యయం చేయడం కోసమేనని జస్టిస్ మంజునాథ స్పష్టం చేశారు. గురువా రం క్షేత్ర పర్యటనలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామా నికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన మంజునాథ బృందం ప్రజలతో ముఖాముఖి చర్చ నిర్వహించింది. కులాల మధ్య ఉన్న సఖ్యత, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన సరోజిని అనే కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ మాట్లాడుతూ తన తండ్రి మద్యానికి బానిస కావడంతో తమ కుటుంబ ఆర్థికంగా చితికిపోయిందని తాను ఉన్నత విద్యను అభ్యసించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మంజునాథ మాట్లాడుతూ తండ్రి ఎన్నో ఏళ్ళుగా మద్యానికి బానిసైతే ఎందుకు వ్యతిరేకించి మానిపించలేకపోయావని ప్రశ్నించారు. ప్రయత్నించి విఫలం అయ్యానని ఆమె చెప్పడంతో ఏ సమస్య అయినా వ్యక్తిగా పరిష్కరించుకోలేనప్పుడు సంఘటితంగా పోరాడాలని సూచించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ చినబాబు, సర్పంచ్ మాసాబత్తుల సుమతి, తహసీల్దార్ ఉదయభాస్కర్, సీఐ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ లంక అంకయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గురజనాపల్లిలో క్షేత్రస్థాయి పరిశీలన కరప : గురజనాపల్లి గ్రామంలో జస్టిస్ మంజునాథ, సభ్యులు పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. మంజునాథ మాట్లాడుతూ గ్రామ జనాభా ఎంత, సాగు విస్తీర్ణం ఎంత, ఎన్నికులాలు ఉన్నాయి. కులాలవారీగా వారి సామాజిక స్థితిగతులు, అక్షరాస్యత, నిరక్షరాస్యత, చదుకున్నవారు ఏఏ డిగ్రీలు చదివారు, వారి పరిస్థితుల అంశాలను వివరించాలని కోరారు. కరప సర్పంచ్ పంపన కన్నారావు, కార్యదర్శి సీహెచ్ ఇందిరలు గ్రామం వివరాలు తెలిపారు. మాజీ సర్పంచ్ పెంటపాటి సత్తిబాబు, పబ్బినీడి కృష్ణలు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కువగా ఉప్పు కార్మికులుంటారని, వీరికి ఆరు నెలలు పనులుంటే, ఆరు నెలలు ఖాళీగా ఉంటారన్నారని, వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఉపాధి పథకం ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. వివిధ కులాలవారు తమ సమస్యలను, బాధలను కమిషన్‌కు వివరించారు. ఉప్పు కార్మికులను దగ్గరకు పిలిపించి వారి ఆరోగ్య సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఆర్డీవో ఎల్.రఘుబాబు, తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఇన్చార్జి ఎంపీడీవో, భీమశంకరరావు, కులాలవారీగా సమీక్ష పెద్దాపురం : సామాజిక వెనుకబాటుపై స్పందించి అన్ని కులాలకు న్యాయం చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథకు పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కట్టమూరులో కులాల వారీగా జస్టిస్ మంజునాథ సమీక్ష జరిపారు. గ్రామానికి చెందిన రంగనాథం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు సుందరపల్లి శివనాగరాజు, మాదిరెడ్డి సత్తిబాబు, పెంటా విజయ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధరం, సర్పంచ్ దిమ్మల పుష్పరత్నంలు తమ తమ కులాలు వెనుకబడి ఉన్నాయని, అన్ని కులాల్లో కూడా సామాన్య కుటుంబాలు ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సామాజిక వెనుకబాటును గుర్తుంచుకుని రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్ వరహాలయ్య, ఎంపీడీవో వసంతమాధవి, ఈవోపీఆర్డీ హిమమహేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముద్రగడ దూత స్వామి వినతిపత్రం అందజేత గ్రామానికి వచ్చిన బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథకు కాపు జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనుచరుడు, కాపు నాయకులు గౌతు స్వామి ఆధ్వర్యంలో జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ మలకల చంటిబాబు, పట్టణ కన్వీనర్ జిగిని రాజుబాబుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని, కాపు కులస్తులు చాలా కుటుంబాలు ఇప్పటికీ వెనుకబాటుతనంలో ఉన్నాయన్నారు. కమిషన్ వాటిని గుర్తించాలని వారు కోరారు. -
ఇదేమి విచారణ?
ఇరుపక్షాల పెదవి విరుపు కాపు ఉద్యమాన్ని అణిచివేసినట్టే విచారణ కూడా అర్ధాంతరంగా ముగించేశారు కాపు నేతల వాదనలకు ప్రతిగా మా వాదనలు వినరేం : బీసీల ఆగ్రహం జాబితాలో పేరేలేని కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు అవకాశంపై విమర్శలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటైన మంజునాథ కమిషన్ విచారణ అర్థాంతరంగా ముగియడం వెనుక సర్కార్ కుట్ర దాగి ఉందని కాపులు అనుమానాన్ని వ్యక్తం చేయగా...తమ వాదనకు అడ్డుకట్ట వేశారని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను, తమ వాదనలను పూర్తిగా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లలేకపోయామనే ఆవేదన ఇరువర్గాల్లో కనిపించింది. కాపు నేతల వాదనలపై ప్రతి వాదనలను వినిపించకుండా కట్టడి చేయడాన్ని బీసీలు తప్పుపడుతున్నారు. రాష్ట్రం లోని 13 జిల్లాల్లో బీసీ, కాపుల మధ్య వాగ్వాదా లు, పరస్పర దూషణల మధ్య కమిషన్ విచారణ జరగ్గా ఈ జిల్లాకు వచ్చేసరికి అందుకు భిన్నంగా అర్ధాంతరంగా ముగించడంపై ఇరుపక్షాలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మొదటి నుంచీ కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నట్టే కమిషన్ విచారణ కూడా అర్ధాంతరంగా ముగించి కాపుల గొంతును నొక్కేశారని ధ్వజమెత్తారు. సుదీర్ఘ జాబితాపై కమిషన్ అభ్యంతరం... మంజునాథ కమిషన్ విచారణలో వాదనలు వినిపించే వారి జాబితా పరిమితంగా ఉండాలనుకున్నారు. అందుకు అనుగుణంగానే విచారణకు ఇరుపక్షాల నుంచి 175 మంది వంతున విచారణ జరుగుతున్న కాకినాడ రంగరాయ వైద్యకలాశాల ఆడిటోరియానికి అనుమతించాలని నిర్ణయించారు. విచారణ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే తొలుత వాదనలు వినిపించే అవకాశాన్ని బీసీలకు కల్పించారు. బీసీలలో ప్రధానమైన శెట్టిబలిజ సామాజిక వర్గంతోపాటు ఉపకులాల నుంచి ఒకరిద్దరు వంతున సుమారు 15 మంది నేతలు వాదనలు వినిపించారు. కాపు జేఏసీ నేతలు కాపుల నుంచి ఒక జాబితాను జస్టిస్ మంజునాథకు అందజేశారు. ఇంత మంది వాదనలు వినిపించడం అసాధ్యమన్న కమిషన్‌కు ఎంత మందిని అనుమతిస్తే అంత మందే మాట్లాడతారని కాపు జేఏసీ నేతలు విన్నవించారు. ప్రతివాదనలకు నో... ఉదయం నుంచి భోజన విరామ సమయం వరకు బీసీల్లో ఉపకులాల వారీగా వాదనలు వినిపించే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత కాపు జేఏసీ నేతలు తమ వాదనలు వినిపిస్తుండగా ప్రతి వాదనకు అవకాశం కల్పించాలని బీసీ నేతలు మంజునాథను కోరగా అందుకు ఆయన తిరస్కరించారు. కమిషన్ ఆదేశాలతో ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్ జోక్యం చేసుకున్నా తమకు అన్యాయం జరుగుతోందని బీసీలు విచారణను బహిష్కరించాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ప్రతి వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తే రాద్ధాంతం జరుగుతుందనే ముందుచూపుతోనే కమిషన్ ససేమిరా అని ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జాబితాలో పేరే లేని చలమశెట్టిని ఎందుకు అవకాశం ఇచ్చినట్టో...? అటు బీసీలు, ఇటు కాపుల నుంచి వాదనలు వినిపించేందుకు చాలా మంది ప్రయత్నించినా పరిమిత సంఖ్యలో ఓ వైపు అనుమతిసూ్త...జిల్లాతో సంబంధం లేని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయకు మరోవైపు మాట్లాడే అవకాశం ఏ ప్రాతిపదికన ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని పలువురు తప్పుపడుతున్నారు. ఎక్కడో గుంటూరు జిల్లాకు చెందిన రామానుజయ ఇంత దూరం జిల్లాకు రావడమే కాకుండా నేరుగా విచారణలో కమిషన్ ఎదుట సీఎం చంద్రబాబు బాకా ఊదే ప్రయత్నం చేసి భంగపడ్డారు. కాపుల ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కాపు జేఏసీ నేతలు ఇచ్చిన జాబితాలో కనీసం నలుగురైదుగురు కూడా మాట్లాడకుండానే జాబితాలో అసలు పేరే లేని రామానుజయకు అవకాశం ఇవ్వడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న∙కాపు నేతల నుంచి వినిపిస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాకు వెళ్లి కమిషన్ విచారణ చేపట్టినప్పుడు సొంత జిల్లాలో రామానుజయ ఏమి చేశారని, ఇంత దూరం రావడం వెనుక సర్కార్ ప్రమేయం లేకపోలేదనే అనుమానాన్ని కాపు జేఏసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పేద కాపులకు మంచి జరిగే రీతిలో రామానుజయ మాట్లాడి ఉంటే ఆయన రాకలో చిత్తశుద్ధి ఉందని నమ్మే వారమంటున్నారు. ఆ దిశగా ఆయన ఒక ముక్కైనా మాట్లాడకుండా సర్కారు డప్పు వాగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంతో నియమితమైన కార్పొరేషన్‌కు చైర్మన్ హోదాలో ఉండి కమిషన్ విచారణను అర్ధాంతరంగా ముగిసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కమిషన్ విచారణ ముగిసిన అనంతరం ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని కాపు కల్యాణ మండపంలో ముద్రగడ పద్మనాభం తదితర నేతలు సమావేశమై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ముద్రగడ సొంతజిల్లా కావడమే అర్ధాంతర ముగింపునకు కారణమా...? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సొంత జిల్లా కావడంతో ఇక్కడ కమిషన్ విచారణ సజావుగా సాగకూడదనే సర్కార్ పెద్దలు పక్కా ప్లా¯ŒS ప్రకారమే ఇదంతా సృష్టించినట్టుగా ఉందని ఆక్షేపిస్తున్నారు. లేదంటే కమిషన్ వాదనలు ఆలకించే సందర్భంలో బీసీలు, కాపుల మధ్య ఎటువంటి వివాదం తలెత్తకపోవడాన్ని వారు ఈ సందర్బంగా ఉదహరిస్తున్నారు. విచారణ సందర్భంగా మిగిలిన జిల్లాల్లో కాపు, బీసీ వర్గాల మధ్య రచ్చరచ్చయిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీరా ఆ రెండు సామాజిక వర్గాల మధ్య విచారణ సందర్భంగా స్వల్ప పొరపొచ్చాలు తలెత్తినా, రామానుజయ సీఎంకు భజన చేయడంతో తలెత్తిన వివాదం చివరకు కమిషన్ విచారణను సగంలోనే ముగిసేందుకు దారితీయడం విస్మయాన్ని కలిగించింది. బీసీలున్నంతలో తమ వాదనలు వినిపించే అవకాశం లభించగా భోజన విరామం అనంతరం తమకు పూర్తిస్థాయిలో అవకాశం దక్కలేదని కాపులు ఆవేదన చెందుతున్నారు. మొత్తంమీద కమిషన్ విచారణ సగంలోనే ముగిసిపోవడంపై ఇరుపక్షాలు పెదవి విరుస్తున్నాయి. -
సంయమనం పాటించాలి
- ప్రశాంతంగా విజ్ఞాపనలు అందజేయాలి - రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ - రెవెన్యూ, పోలీసు అధికారులతో సమీక్ష కాకినాడ సిటీ : వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాలను చేర్చడానికి, అలాగే బీసీ కులాల గ్రూపుల మార్పు అంశాలపై ఆయా కులాల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ తెలిపారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి, ప్రశాంతంగా తమ విజ్ఞాపనలు అందజేయాలని కోరారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన, కమిషన్ సభ్యులు మంగళవారం రాత్రి కాకినాడ చేరుకున్నారు. ప్రజల నుంచి విజ్ఞాపనల స్వీకరణకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, ఇతర అధికారులతో ఆర్అండ్బీ అతిథి గృహంలో సమీక్షించారు. జిల్లాలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం, పశుగణాభివృద్ధి, ఆక్వా రంగాల్లో అభివృద్ధిని జస్టిస్ మంజునాథ తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ కులాలు, వారి ఆర్థిక స్థితిగతులపై కూడా సమీక్షించారు. జిల్లాలో సాధికారత సర్వేలో వివిధ కులాల వివరాలను సేకరించామని, ఈ సర్వే 88 శాతం పూర్తయిందని చైర్మన్‌కు కలెక్టర్ వివరించారు. విజ్ఞాపనల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను ఎస్పీ రవిప్రకాష్ వివరించారు. జస్టిస్ మంజునాథ మాట్లాడుతూ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో వివిధ కులాల ప్రజలు, ఆయా కులాల నాయకుల నుంచి బుధవారం విజ్ఞాపనలు స్వీకరిస్తామని తెలిపారు. 23వ తేదీన జిల్లాలోని పలు గ్రామాల్లో వివిధ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ-2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్ఓ బీఎల్ చెన్నకేశవరావు పాల్గొన్నారు. -
టెన్షన్.. అటెన్షన్..!
- నేడు మంజునాథ కమిషన్ విచారణ - కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఇరువర్గాల నుంచి అభిప్రాయ సేకరణ - బల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సామాజిక వర్గాలు - సెక్షన్-30 అమలు.. ప్రదర్శనలపై నిషేధం - కాకినాడలో అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు - డ్రోన్, వీడియో కెమెరాల చిత్రీకరణ సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్ బుధవారం విచారణ జరపనున్న నేపథ్యంలో.. జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. విచారణకు వేదిక కానున్న కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంవద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి కాపు, బీసీ వర్గాల నుంచి, అభిప్రాయాలను, వినతులను కమిషన్ స్వీకరించనుంది. దీంతో తమతమ వాదనలు వినిపించేందుకు, అభిప్రాయాలు తెలిపేందుకు ఇటు కాపులు, అటు బీసీలు అధిక సంఖ్యలో కాకినాడకు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతోపాటు కాపు జేఏసీ నేతలు వీవై దాసు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ.. మరోవైపు బీసీల నుంచి కుడుపూడి సూర్యనారాయణరావు, కుడుపూడి చిట్టబ్బాయి తదితర నేతలు కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు, వినతులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న కీలక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సొంత జిల్లా కావడంతో.. జిల్లాలో పరిణామాలను చంద్రబాబు సర్కార్ సహజంగానే నిశితంగా పరిశీలిస్తోంది. ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. మరోపక్క కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథతోపాటు సభ్యులు ప్రొఫెసర్ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, సభ్య కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ప్రత్యేకాధికారి సి.రమేష్‌కుమార్, సీనియర్ అకౌంటెంట్ అనురాధ మంగళవారమే కాకినాడ చేరుకున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు తమకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోవాలని కాపు సామాజికవర్గం చాలాకాలంగా ఉద్యమిస్తుండగా.. కాపులను బీసీల్లో కలపడాన్ని బీసీ సామాజికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కడా ఎటువంటి కవ్వింపు చర్యలూ చోటుచేసుకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ జిల్లాలో మకాం వేసి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్ తదితర పోలీసు అధికారులతో కాకినాడలో పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే జిల్లా అంతటా సెక్షన్-30 అమలు చేస్తున్నారు. అవసరమైతే బుధవారం మరీ ఇబ్బందికర పరిణామాలు తలెత్తినచోట 144 సెక్షన్ అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే అమలాపురం, తుని, పిఠాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో రెండు సామాజిక వర్గాల నుంచి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీల పేరుతో అల్లర్లకు దిగుతారేమోనన్న అనుమానంతో ముందస్తుగా 149 సెక్షన్ ప్రకారం పెద్ద సంఖ్యలో నోటీసులు కూడా జారీ చేశారు. ఊరేగింపులు, ఇతర ఆందోళనలను నిషేధించారు. మద్యం దుకాణాలపైనా ఆంక్షలు కాకినాడకు వచ్చే ప్రధాన రోడ్ల పక్కన ఉండే మద్యం దుకాణాలను కూడా మూసివేసేందుకు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. రోడ్ల చెంత జిల్లాలో దాదాపు 40 కీలక ప్రదేశాల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి పంపించనున్నారు. ఆకాశంలో డ్రోన్ కెమెరాలతో.. నేలపై వీడియో కెమెరాలతో ప్రతి కదలికను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. బాడీ కెమెరాతో కూడా మఫ్టీలో ఉన్న పోలీసులు జనంలో సంచరించేలా బాధ్యతలు అప్పగించారు. కాకినాడలోని పలు ప్రాంతాల్లో సుమారు 1,715 మంది పోలీసులను వినియోగిస్తుండగా, జిల్లా అంతటా పోలీసులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఆడిటోరియంలోకి వెళ్లే ముందు మద్యం తాగినవారిని కనుగొనేందుకు బ్రీత్ ఎనలైజర్లు కూడా ఏర్పాటు చేశారు. చెరి 175 మందికే అనుమతి ఒక్కో వర్గం నుంచి 175 మందిని మాత్రమే వాదనలు వినిపించేందుకు కమిషన్ ముందుకు అనుమతిస్తారు. వారు బయటకు వచ్చాక మరో 175 మందిని వాదనలు వినిపించేందుకు అనుమతించనున్నారు. -
‘మంజునాథ కమిషన్ గో బ్యాక్’
కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : అర్హత లేని కులాలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. అధ్యయనం చేసేందుకు బుధవారం కాకినాడ వస్తున్న మంజునాథ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్ల సీతారత్నం ఆధ్వర్యంలో ‘మంజునాథ కమిషన్ గో బ్యాక్’ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు నుంచి దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని బైఠాయించారు. వెంకట మహేష్ మాట్లాడుతూ రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా బీసీ జాబితాలో చేర్చడాన్ని తమ సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం కంటే పైగా ఉన్న బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారని, దానిని 50 శాతానికి పెంచాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకే ఎసరు పెడుతున్నారన్నారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమాషా చేస్తోందన్నారు. రాష్ట్ర బీసీ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు లద్దిక మల్లేష్, బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్, నాయకులు రాయుడు రాకేష్, బండారు రాజేశ్వరరావు, గెడ్డం నాగరాజు, విత్తనాల శివ వెంకటేష్, విష్ణు, సాయిరాంసింగ్, ప్రశాంత్, కోటి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ ఆంక్షలు
మంజునాథ కమిషన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు 1,715 మందితో పోలీసు బందోబస్తు కాకినాడ క్రైం: మంజునాథ కమిషన్ ఆ«ధ్వర్యంలో బుధవారం రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను పురస్కరించుకుని కాకినాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కాకినాడ టూటౌన్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వచ్చే పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు నిర్దేశించిన రూట్లలో వచ్చి, పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపాలని కోరారు. జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో గుంపులు, ర్యాలీలు చేపట్ట వద్దన్నారు. బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ప్రయాణించే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. వాహనాలు వెళ్లాల్సిన మార్గాలు 1. విశాఖపట్నం, తుని నుంచి కాకినాడకు వచ్చే భారీ వాహనాలు అచ్చంపేట సెంటర్ నుంచి ఏడీబీ రోడ్డు బీచ్ రోడ్డు మీదుగా వాకలపూడి, పోర్టు నుంచి జగన్నాథపురం బ్రిడ్జి నుంచి వెళ్లాలి. 2. విశాఖ, తుని నుంచి కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే బస్సులు సర్పవరం జంక్షన్ నుంచి గంగరాజు నగర్, ఆర్టీసీ ఆఫీసు సెంటర్ నుంచి డీమార్టు, లక్ష్మి హాస్పిటల్స్, మదర్‌థెరిస్సా విగ్రహం, వైఎస్సార్ విగ్రహం సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. 3. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి తుని, విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సులు వైఎస్సార్ విగ్రహం సెంటర్ నుంచి మదర్‌థెరిస్సా సెంటర్, లక్ష్మీ హాస్పిటల్స్, ఆర్టీవో ఆఫీస్ సెంటర్, నాగమల్లితోట మీదుగా సర్పవరం సెంటర్ నుంచి వెళ్లాలి, 4. ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు వైఎస్సార్ బొమ్మ సెంటర్, వైఎస్సార్ బ్రిడ్జిపై నుంచి కల్పనా సెంటర్ మీదుగా మెయిన్‌రోడ్డు, బాలాజీచెరువు నుంచి ప్రభుత్వ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. 5. రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ, జగ్గంపేట నుంచి కాకినాడకు వచ్చే ఆర్టీసీ బస్సులు కల్పనా సెంటర్, వైఎస్సార్ బ్రిడ్జి మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాలి. 6. రావులపాలెం, అమలాపురం నుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలన్నీ అన్నమ్మఘాటీ జగన్నాథపురం, కొత్త వంతెన మీదుగా కమర్షియల్ రోడ్డు సెంటర్ నుంచి బీచ్‌రోడ్డు మీదుగా వాకలపూడి, అచ్చంపేట నుంచి వెళ్లాలి. వాహనాల పార్కింగ్ స్థలాలు మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఈ కింది విధంగా స్థలాలను కేటాయించారు. 1. తుని వైపు నుంచి కాకినాడకు వచ్చే భారీ వాహనాలు సర్పవరం సెంటర్, ఆశ్రమ పబ్లిక్ స్కూల్ నుంచి ద్వారంపూడి భాస్కరరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా గల ఖాళీ స్థలం, జేఎన్టీయూకే కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. 2. తుని వైపు నుంచి కాకినాడకు వచ్చే చిన్న వాహనాలు, మోటార్ సైకిళ్లు, ఆటోలు, చిన్నకారులను ఎగ్జిబిషన్ గ్రౌండ్లోను, ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. 3. రాజమహేంద్రవరం, రావులపాలెం, అమలాపురం నుంచి వచ్చే భారీ వాహనాలన్నీ పీఆర్ కళాశాల గ్రౌండ్, మెక్లారిన్ హైస్కూలు గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. 4. రాజమహేంద్రవరం, రావులపాలెం, అమలాపురం నుంచి వచ్చే చిన్న వాహనాలు మెటార్ సైకిళ్లు, చిన్నకారులు, ఆటోలు పోలీస్ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. 1,715 మందితో పోలీసు బందోబస్తు ప్రశాంత వాతావరణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగేందుకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ చర్యలు చేపట్టారు. రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడిటోరియం కెపాసిటీ 350 మంది ఉండేందుకు అవకాశం ఉండటంతో 175 మంది చొప్పున రెండు సామాజిక వర్గాల వారి ప్రతినిధులను పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అందరినీ ఒకేసారి ఆడిటోరియంలోకి పంపకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆడిటోరియం వద్ద, లోపల, సిటీ పరిధి, ముఖ్యమైన కూడళ్ల వద్ద ఇద్దరు ఏఎస్పీలతో 1,715 మందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 36 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 170 మంది ఎస్సైలు, 335 మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, 900 మంది కానిస్టేబుళ్లు, 200 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, 60 మంది హోమ్‌గార్డులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. ప్రత్యేక నిఘా నీడలో... ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ప్రత్యేక ఏర్పాటు చేశారు. బాడీ వార్న్ కెమెరాలను వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. మంజునాథ కమిషన్ సభ్యులు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ ఆడిటోరియంలోకి వెళ్లే సామాజిక వర్గాల ప్రతినిధులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే లోపలి అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రవేశద్వారం వద్ద బ్రీత్ ఎనలైజర్లను సిద్ధం చేశారు. మద్యం తాగొచ్చి గలాటా సృష్టించకుండా, కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేపట్టనున్నారు. -
మంజునాథ కమిషన్ ఎదుట శాంతియుతంగా వాదనలు వినిపించాలి
కాకినాడ సిటీ : జస్టిస్ మంజునాథ కమిషన్ ఎదుట ఆయా సంఘాలు శాంతియుతంగా వారి వాదనలు వినిపించాలని జిల్లా అదనపు ఎస్పీ దామోదర్ కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో కాపు, బీసీ నాయకులతో అధికారులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దామోదర్ మాట్లాడుతూ సమన్వయంతో వ్యవహరించి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్ ముందు ప్రతి ఒక్కరూ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. సెక్షన్-30 అమలులో ఉన్నందున ఎక్కడా ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని, బ్యానర్లు కూడా కట్టకూడదని స్పష్టం చేశారు. అల్లర్లు, గొడవలకు తావు లేకుండా శాంతియుతంగా వ్యవహరించాలని చెప్పారు. కమిషన్ విచారణ జరిగే రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియం లోపలికి పరిమిత సంఖ్యలో అనుమతించి, వారు బయటకు వచ్చాక మరికొంతమందిని లోపలకు పంపుతామన్నారు. విచారణ జరిగే ఆవరణలో హాలు బయట టెంట్ వేసి వేచి ఉండే అవకాశం కల్పిస్తామన్నారు. పిఠాపురంవైపు నుంచి వచ్చే కాపు వర్గాలకు ఐటీఐ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనూ, బీసీ వర్గాలకు జేఎన్టీయూకే ఆవరణలోను వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే జగన్నాథపురం, ఇంద్రపాలెం వైపు నుంచి వచ్చే కాపు వర్గాలకు పీఆర్ కళాశాల ఆవరణలోను, బీసీ వర్గాలకు మెక్లారిన్ హైస్కూల్ ఆవరణలోను పార్కింగ్ సౌకర్యం కల్పించామని అదనపు ఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో కాపు నాయకులు వీవై దాసు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, సంగిశెట్టి అశోక్; బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, పంపన రామకృష్ణ, కుడుపూడి సూర్యనారాయణ, కుండల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం టౌన్ : కాకినాడలో మంజునాథ కమిషన్ బీసీలు, కాపుల నుంచి బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ, వినతుల స్వీకరణ నిర్వహిస్తున్న క్రమంలో కోనసీమ నుంచి ఆయా సామాజిక వర్గాల వారు భారీ తరలి వెళ్లేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తకుండా, కాకినాడకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో వెళ్లాలని పోలీసులు సూచిస్తూనే ముందు జాగ్రత్తగా అమలాపురంలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన దాదాపు 500 మంది ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉందని, దానికి వ్యతిరేకంగా ఏ సంఘటనలోనైనా మీరు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని పాల్గొని శాంతి భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆ నోటీసులో హెచ్చరించారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ నుంచి పట్టణంలో 500 మంది బీసీ, కాపు ప్రతనిధులకు ఒకే రోజు అందడంతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్‌లు పట్టణంలోని బీసీ, కాపు నేతల ఇళ్లకు స్వయంగా వెళ్లి మంజునాథ కమిషన్ వద్ద శాంతియుతంగా వ్యవహరించాలని, నినాదాలు, ర్యాలీలతో వెళ్లవద్దని, భావోద్వేగాలకు, ఆవేశకావేశాలకు తావు లేకుండా ప్రశాంత, ఆత్మీయ వాతావరణంలో కమిషన్‌ను కలవాలని కోరారు. అమలాపురంలో బీసీ నేతలు కుడుపూడి చిట్టబ్బాయి, కుడుపూడి సూర్యనారాయణరావు, కాపు నేతలు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్, మిండగుదటి మోహన్, మెట్ల రమణబాబు తదితర నేతల ఇళ్లకు పోలీసు అధికారులు వెళ్లి బుధవారం కాకినాడ వెళ్లేటప్పుడు రంగరాయ మెడికల్ కళాశాలలో బీసీ కమిషన్‌ను కలిసినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. -
7నుంచి కోస్తా జిల్లాల్లో పర్యటన
– మహానందిలో మంజునాథన్ కమిటీ సభ్యుల పూజలు మహానంది: కోస్తా ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో నవంబరు 7 నుంచి పర్యటిస్తామని మంజునాథన్ కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, వెంకటసుబ్రమణ్యం, సత్యనారాయణ తెలిపారు. మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు బుధవారం మహానందికి వచ్చారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పర్యటించామన్నారు. కర్నూలు జిల్లాలో పాములపాడు మండలంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా తమ వాదనలు వినిపించాలన్నా, అభిప్రాయాలు చెప్పాలన్నా నేరుగా కలిసి వినిపించవచ్చని అన్నారు. -
‘మంజునాథన్’అనుకూలంగా లేకుంటే పోరాటమే
జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి బండారు చంద్రశేఖర్ చిలకలపూడి : కాపు సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథన్ కమిషన్ నివేదిక తమకు అనుకూలంగా లేకపోతే పోరాటం తప్పదని జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి బండారు చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం 31వ తేదీలోపు మంజునాథన్ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విధంగా కాపులను బీసీల్లో చేర్చాలని, సంవత్సరానికి వెయ్యి కోట్లు రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకోకపోతే సెప్టెంబరు నుంచి ముద్రగడ పద్మనాభం నిర్వహించే పోరాటానికి కాపు జాతి అంత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 13 జిల్లాలో కాపులు ఎంత మందికి రుణాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఎంత మందికి సబ్సిడీ రూపంలో నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారో వివరాలు తెలియపరచాల్సి ఉందన్నారు. వెల్లడించని పక్షంలో పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గం అంతా పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు.