మహానందీశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన కమిటీ సభ్యులు
7నుంచి కోస్తా జిల్లాల్లో పర్యటన
Published Wed, Oct 26 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
– మహానందిలో మంజునాథన్ కమిటీ సభ్యుల పూజలు
మహానంది: కోస్తా ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో నవంబరు 7 నుంచి పర్యటిస్తామని మంజునాథన్ కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, వెంకటసుబ్రమణ్యం, సత్యనారాయణ తెలిపారు. మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు బుధవారం మహానందికి వచ్చారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పర్యటించామన్నారు. కర్నూలు జిల్లాలో పాములపాడు మండలంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా తమ వాదనలు వినిపించాలన్నా, అభిప్రాయాలు చెప్పాలన్నా నేరుగా కలిసి వినిపించవచ్చని అన్నారు.
Advertisement
Advertisement