
కర్ణాటక: పరీక్షల భయంతో ఒక విద్యార్థిని కొండమీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రామనగర తాలూకాలో జరిగింది. బెంగళూరులో బీఈఎంఎల్ నివాసి ఇషా ప్రసాద్ సైకాలజీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం నాడు రామదేవరకొండకు వచ్చి కొండపై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే చెట్టు కొమ్మపై చిక్కుకుని ఆర్తనాదాలు చేయగా స్థానిక పోలీసులు ఆమెను రక్షించి ప్రథమ చికిత్స అందించి అనంతరం బెంగళూరు లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షల భయంతో మానసికంగా కృంగిపోయి ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment